100 రోజుల ప్రణాళికపై ఇతర శాఖల అధికారుల పర్యవేక్షణ తగదు
అనకాపల్లి : పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికను పర్యవేక్షించే పనిని విద్యాశాఖతో సంబంధం లేని ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు అప్పగించడం అభ్యంతరకరమని యుటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఉపాధ్యాయ వర్గాన్ని అవమానించడమేని అన్నారు. సెలవు రోజుల్లో కూడా పనిచేయాలనే నిబంధన పెట్టి, పండగ సెలవుల్లో ఈ ప్రణాళికను అమలు చేయమనడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రణాళిక అమలు చేస్తున్నప్పటికీ సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో ఒక స్లిప్ టెస్ట్ నిర్వహించి 24 గంటల్లో ఆ పరీక్ష పేపర్లను దిద్ది ఆన్‌లైన్‌లో మార్కులు అప్లోడ్ చేయమనడం విద్యార్థులు, ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తుందని తెలిపారు.
100 రోజుల ప్రణాళికపై ఇతర శాఖల అధికారుల పర్యవేక్షణ తగదు


