
మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
మాడుగుల : స్థానిక ఆర్‌టీసీ కాంప్లెక్స్‌లో పంచాయతీ వారు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ కళావతి, మాజీ సర్పంచ్ సూర్యారావు, ఉపసర్పంచ్ వరహాలు, మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పలరాజు ఎంపీడీవో అప్పారావు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి భజన పోటీలు
మాడుగుల రూరల్ : కేజేపురం జంక్షన్‌లో కల్యాణ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా ఈనెల 31న పెళ్లిరాట కార్యక్రమం నిర్వహిస్తారు. వచ్చే నెల 5న పుట్ట మట్టితో పూజలు, 6న కల్యాణోత్సవం, జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు.
ఉపాధి పనుల్లో నాణ్యత పాటించాలి
రోలుగుంట : పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రభుత్వం ఇస్తున్న పూర్తి కూలి పొందాలని ఉపాధి కూలీలకు మండల ప్రత్యేకాధికారి మనోహర్ సూచించారు. మండలంలో ఎన్‌ఆర్జీఎస్ ద్వారా పలు గ్రామాల్లో జరుగుతన్న ఉపాధి పనులను ఆయన ఎంపీడీవో వి.ఎస్.నాగేశ్వరరావుతో కలిసి సందర్శించారు.
‘రైతులందరికీ అన్నదాత సుఖీభవ’
నర్సీపట్నం: అర్హత కలిగిన రైతులందరికీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సహాయం కింద అందజేస్తుందని నర్సీపట్నం వ్యవసాయశాఖ ఏడీఏ శ్రీదేవి తెలిపారు. వెబ్‌ల్యాండ్ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌లో ఉన్న రైతుల వివరాలను రైతు సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. రైతులు తమ భూమి ఉన్న గ్రామంలో రైతు సేవ కేంద్రాన్ని సంప్రదించి వీలైనంత తొందరగా వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.
ప్రకృతి సేద్యంపై దృష్టి సారించండి
మాకవరపాలెం : ప్రకృతి సేద్యంపై రైతులు దృష్టి సారించాలని, ఈ విధానాన్ని ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్‌రావు సూచించారు. గిడుతూరులో శనివారం రైతులతో వ్యవసాయ, ప్రకృతి సేద్య అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం రైతులతో ర్యాలీ నిర్వహించి, నవధాన్య విత్తనాలను పంపిణీ చేశారు.
మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యత