పేటలో పోటాపోటీ
పాయకరావుపేట మెయిన్‌రోడ్డు లో ఆక్రమణలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నాయకుల అండతో ఒకరిని చూసి మరొకరు, పోటాపోటీగా ఆర్‌అండ్‌బీ స్థలాన్ని ఆక్రమించి బడ్డీలను ఏర్పాటుచేస్తున్నారు. ఆక్రమణల కారణంగా రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
మెయిన్‌రోడ్డులో యథేచ్ఛగా ఆక్రమణలు
తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం
పట్టించుకోని అధికారులు
తొలుత బడ్డీల
ఏర్పాటు.. తరువాత పక్కా షెడ్ల
నిర్మాణం
పాయకరావుపేట: నియోజకవర్గ కేంద్రమైన పాయకరావుపేటలో మెయిన్‌రోడ్డు ఆక్రమణదారుల చెరలో చిక్కుకుంది. పట్టణంలో తాండవ వంతెన నుంచి వై.జంక్షన్ వరకు రెండు కిలోమీటర్లు మెయిన్ రోడ్డు ఉంది. రోడ్డుకు ఇరు పక్కల స్థలాన్ని ఆక్రమించి పెద్ద ఎత్తునషెడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. ప్రతి రోజూ ఎక్కడోచోట ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో 100 అడుగులు ఉండాల్సిన రోడ్డు ఇరుకుగా మారి, నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ రోడ్డులో రెండువైపులా స్థలాలను ఆక్రమించి ఇప్పటికి సుమారు 120 బడ్డీలు, పాకలను ఏర్పాటు చేశారు.
శరవేగంగా అభివృద్ధి
పాయకరావుపేట పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. స్థానికులతోపాటు, పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో ఉన్న రసాయన పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులంతా పాయకరావుపేటలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. పిల్లల చదువులు, ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాలనుంచి పలువురు వచ్చి పట్ణణంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. చుట్టు పక్కల 40 గ్రామాల ప్రజలు వాణిజ్య అవసరాల కోసం నిత్యం ఇక్కడి వస్తుంటారు. దీంతో పట్టణం నిత్యం రద్దీగా ఉంటోంది. ముఖ్యంగా మెయిన్ రోడ్డుపై నిత్యం జనసంచారం ఉంటోంది. రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది.
పంచాయతీ స్థలాల్లోనూ పాగ
ముందు నాయకుల అండతో చిన్న స్థలాన్ని ఆక్రమించి బడ్డీ ఏర్పాటు చేసి, కొద్దిరోజుల తరువాత పర్మినెంట్‌గా షెడ్లు వేసేస్తున్నారు. మెయిన్‌రోడ్డుపై రాకపోకలు సాగించేవారు రోడ్డు దిగేందుకు అడుగు జాగా కూడా ఉండడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కోర్టు వివాదం కారణంగా మెయిన్ రోడ్డును విస్తరించకుండా డబుల్‌లైన్ రహదారిగా అభివృద్ధి చేశారు. అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు డబుల్ రోడ్డు నిర్మించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో నిధులు విడుదల చేయించినప్పటికీ కోర్టు వివాదం కారణంగా రూ.రెండు కోట్లతో పాతరోడ్డును అభివృద్ధి చేసే పరిస్థితి ఏర్పడింది. మెయిన్‌రోడ్డుతోపాటు పట్టణంలో పలు ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లలో కమ్యూనిటీ అవసరాల కోసం పంచాయతీకి కేటాయించిన స్థలాలు సైతం కబ్జాకు గురయ్యాయి. వీటి గురించి పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు.
తరలివస్తున్న మాల్స్
పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన షాపింగ్ మాల్స్ ఇప్పుడు పాయకరావుపేట పట్టణానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. వస్త్ర దుకాణలను ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక హంగులతోకూడిన మూడు సినిమా థియేటర్లు ఉన్నాయి. మూడు జూనియర్ కళాశాలలు, రైసు మిల్లులు, మోటారు సైకిళ్లషోరూములతో పట్టణం వాణిజ్యకేంద్రంగా మారింది. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో పాయకరావుపేటలో నివాసం ఏర్పర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో పాటు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. మెయిన్ రోడ్డును విస్తరిస్తేనే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు తెలిపారు.
సగానికి సగం
కుచించుకుపోయిన రోడ్డు
ఆక్రమణలు పెరిగిపోతున్నాయి
మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా రోజు రోజుకు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. సాయంత్రం అయితే తీవ్రమైన ట్రాఫిక్‌సమస్యలు ఎదుర్కొంటున్నాం. పాయకరావుపేటనుంచి తుని వెళ్లాలంటే చాలా సమయం పడుతోంది. బడ్డీలు ఏర్పాటు చేసి ఆ తరువాత పక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. డబుల్‌లైన్‌గా విస్తరిస్తే తప్ప రాకపోకలు సాగించడం కష్టం. చిరువ్యాపారుల సమస్యలు పరిష్కరించి రోడ్డు విస్తరణ చేపట్టాలి.
– జి.రాజశేఖర్‌రెడ్డి, పాయకరావుపేట
పేటలో పోటాపోటీ
పేటలో పోటాపోటీ
పేటలో పోటాపోటీ
పేటలో పోటాపోటీ


