నాగులాపల్లి సొసైటీకి ఉత్తమ అవార్డు
అవార్డు అందుకుంటున్న పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి భాస్కరరావు, సీఈవో స్వామి
మునగపాక: నాగులాపల్లి పీఏసీఎస్ (సొసైటీ) జాతీయ సహకార అభివృద్ధి సంస్థ అందించే ఉత్తమ ప్రతిభ అవార్డుకు ఎంపికై ంది. ఈ మేరకు ఆదివారం సంఘ పర్సన్ ఇన్‌చార్జి యల్లపు వెంకట భాస్కరరావు, సీఈవో మళ్ల స్వామి పురస్కారం అందుకున్నారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సహకార ఉత్సవాల్లో ఈ అవార్డును ప్రదానం చేశారు. రైతులకు రుణ పంపిణీ, సంక్షేమ పథకాల అమలుతోపాటు సభ్య రైతులకు మెరుగైన సేవలు తదితర అంశాల్లో రాణిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న నాగులాపల్లి సొసైటీని ఉత్తమ సొసైటీగా గుర్తించి అవార్డుతోపాటు రూ.25 వేలను అందజేశారు. రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ జి.వీరాంజనేయులు, సహకార సంఘాల అడిషనల్ రిజిస్ట్రార్ ఆనంద్‌బాబు, కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు ఎన్.రఘురామ్, రాష్ట్ర సహకార బ్యాంక్ ఎండీ ఆర్‌వీ రామకృష్ణారావు, ఎన్‌సీబీసీ రీజనల్ మేనేజర్ గోస్వా చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని భాస్కరరావు, స్వామిలు తెలిపారు.


