
స్థానికులకు ఉద్యోగాలివ్వడం లేదు...
భూములు, ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు, స్థానికులకు, మత్స్యకారులకు చట్ట ప్రకారం ఉపాధి కల్పించాలి. ఏయే పరిశ్రమల్లో స్థానికులకు ఎంత మందికి ఉపాధి కల్పించారో పరిశ్రమ బయట బోర్డు పెట్టాలి. పరిశ్రమలోపల ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించట్లేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికై నా పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల అభ్యున్నతికి పాటు పడేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
–రొంగలి రాము, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు