
పెద్దేరు కాలువ వద్ద తప్పిన ప్రమాదం
బుచ్చెయ్యపేట : మేజర్ పంచాయతీ వడ్డాదిలో ప్రమాదం తప్పింది. శనివారం వడ్డాది ఎస్సీ కాలనీ నుంచి పెద్దేరు నది సిమెంట్ రోడ్డు మీదగా జంక్షన్‌కు వస్తున్న కారు అదుపు తప్పింది. శివాలయం, సచివాలయానికి వెళ్లే దారి మళ్లింపులో కారు వెనక చక్రం సిమెంటు రోడ్డు అంచు దిగి పెద్దేరు కాలువలోకి ఒరిగింది. ఏ మాత్రం కారు అదుపు తప్పిన పెద్దేరు కస్పా కాలువలోకి కారు పడిపోయి ప్రమాదం జరిగేది. స్థానికులు కారును లేపి సిమెంట్ రోడ్డుపై పెట్టడంతో ప్రమాదం తప్పింది. ఇరుకు రోడ్డులో కార్లు ఇతర వాహనాలు రాకుండా పంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.