
జనవాణికి అధికారులు ఎలా వెళ్తారు?
మునగపాక: జనసేన పార్టీ కార్యాలయంలో అధికారులు జనవాణి కార్యక్రమం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించారు. మునగపాకలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలే గాని జనసేన కార్యాలయంలో ప్రజల నుంచి దరఖాస్తులు ఎలా స్వీకరిస్తారన్నారు. అధికారులకు ఎటువంటి గైడెన్స్ లేకున్నా పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరుకావడం తప్పిదమన్నారు. అధికారులు జనసేనకు తొత్తుగా వ్యవహరించడం విచారకరమన్నారు. పార్టీ నాయకులతో కలిసి అధికారులు ప్రజా వాణిలో పాల్గొంటే భవిష్యత్‌లో ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆళ్ల మహేశ్వరరావు, ఎస్.బ్రహ్మాజీ, టెక్కలి జగ్గారావు, ఎంఎస్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం నాయకులు