
మహిళలకు, దివ్యాంగులకు సత్యసాయి సంస్థల వితరణ
అనకాపల్లి: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలని సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు అన్నారు. స్థానిక ఆర్టీసీ రహదారి సేవా సంస్థ కార్యాలయంలో దివ్యాంగులకు వీల్ చైర్లు, మహిళలకు కుట్టు మిషన్లు, రైతులకు స్ప్రేయింగ్ యూనిట్లు పంపిణీ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఏపీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ ఉపకరణాలను భగవాన్ బాబా వారి తల్లి ఈశ్వరమ్మ డే సందర్భంగా జిల్లాకు 22 మందికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఏడుగురు మహిళలకు కుట్టు మిషన్లు, ఇద్దరు మహిళలకు జ్యూట్ కుట్టుమిషన్లు, ఏడుగురుకు వ్యవసాయదారులకు స్ప్రేయర్లు, అరుగురు వికలాంగులకు వీల్ చైర్లు అందజేసినట్టు తెలిపారు. సంస్థ సభ్యులు రాజశేఖర్, కామరాజు, అప్పలనాయుడు తదితరులతో పాటు జోనల్ ఇంచార్జిలు రామారావు, ప్రసాదు, లోపరాజు, రవిశంకర్, మహిళా యూత్ కో–ఆర్డినేటర్ భారతి, జాయింట్ సర్వీస్ కో–ఆర్డినేటర్ సరోజ, కన్వీనరు నాగరాజు పాల్గొన్నారు.