
అక్రమ క్వారీలకు అండగా నాయకులు, అధికారులు
రోలుగుంట : మండలంలో అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీలపై అధికారుల జాప్యం వీడాలని చోడవరం జనసేన ఇన్‌చార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు డిమాండ్ చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎటువంటి అదికారిక అనుమతులు లేని క్వారీల నుంచి నిత్యం వందలాది లారీలతో బహిరంగంగానే మెటీరియల్ తరలింపు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు. అలాగే అనుమతులున్న క్వారీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్నారు. ఈ క్వారీ యజమానులు చేస్తున్న అక్రమాలకు అండాదండగా ఉంటూ వారి నుంచి నిత్యం డబ్బులు వసూలు చేస్తున్న రాజకీయనాయకులు, అధికారుల కు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రభుత్వ దృిష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన తెలిపారు.
వారి గుట్టు వివరాలతో బయటపెడతా..
చోడవరం జనసేన ఇన్‌చార్జిపి.వి.ఎస్.ఎన్.రాజు