
ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల సమస్యలు సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు, చీటింగ్, భూ సమస్యలపై అర్జీలు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, ఎస్‌ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
అనకాపల్లి టౌన్: జిల్లాలోని 19 కేంద్రాల్లో సోమవారం జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు 601 మంది విద్యార్థులకు గాను 411 మంది హాజరయ్యారని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో మూడు కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 65 మందికి గాను 50 మంది, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షకు 143 మందికిగాను 118 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం 22 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు.