
కూటమి కుట్ర
సచివాలయాలపై
నక్కపల్లి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సచివాలయాలను సగానికి సగం తగ్గించి ప్రభుత్వ పాలన ప్రజలకు దూరం చేసి మళ్లీ పాత రోజులను గుర్తుకు తెచ్చే ప్రయత్నాలకు తెరలేపింది. గుట్టుచప్పుడు కాకుండా సచివాలయాల విలీన ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారుల నుంచి సేకరిస్తోంది. ప్రభుత్వం సచివాలయాలను కుదిస్తే ప్రజలు వివిధ పనుల కోసం మళ్లీ 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం అనేక వ్యయ ప్రయాసలు పడి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు గత సర్కారు గ్రామాల్లో సచివాలయాలు నెలకొల్పి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 12 మంది సిబ్బందిని నియమించింది. రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కడమే కాక, కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సచివాలయ భవనాల నిర్మాణానికి రూ.40 లక్షల చొప్పున నిధులు వెచ్చించారు. ప్రభుత్వ పథకాలను దరఖాస్తు చేసిన 72 గంటల్లోగా మంజూరు చేసేందుకు పక్కా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
సేవల కుదింపు
జిల్లాలో 522 సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రస్తుతం 3844 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. తాజాగా ఈ సచివాలయాలను సగానికి కుదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు భోగట్టా. అంటే 261 సచివాలయాలే మిగులుతాయి. సిబ్బందిని సర్దుబాటు చేసి ఇతర ప్రభుత్వ శాఖలకు పంపించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే సచివాలయాల్లో పనిచేసే సిబ్బందిని మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్లు, వ్యవసాయ వెటర్నరీ ఆస్పత్రులకు పంపించి అక్కడ పనిచేయిస్తోంది. సచివాలయాల విలీన ప్రక్రియ అమలు చేస్తే మూడు నుంచి నాలుగు పంచాయతీలను కలిపి ఒక సచివాలయం కిందకు తీసుకు వచ్చే ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. నక్కపల్లి మండలంలో 32 పంచాయతీలకు 22 సచివాలయాలు ఉండేవి. విలీన ప్రక్రియలో భాగంగా వీటిని 11కు కుదిస్తూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు.
వేంపాడులో విలీనం కానున్న అమలాపురం సచివాలయం
బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిజమైంది. ప్రజల చెంతకే ప్రభుత్వం వచ్చింది. అన్ని రకాల సేవలను అందించింది. అది నిన్నటి మాట. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన స్వర్ణయుగం అది. వైఎస్ జగన్ సర్కారు నెలకొల్పిన సచివాలయ వ్యవస్థ విచ్ఛిన్నం. కార్యాలయాలు సగానికి సగం కుదింపు. చిత్తశుద్ధి శూన్యం. సేవలు బహుదూరం. ఇది నేటి చేదు వార్త. ఈ ప్రతిపాదనలు అమలైతే జనానికి మళ్లీ పాత కష్టాలు మొదలైనట్టే.
సగానికి సగం
కుదిస్తూ
ప్రతిపాదనలు
జిల్లాలో
ఇంతవరకు 522
సచివాలయాలు
ఇక ప్రభుత్వ
సేవలు ప్రజలకు
దూరమే..
విలీనం
అమలయితే
261కి కుదింపు
వేంపాడు వెళ్లాలంట..
మా గ్రామం మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేయడంతో అన్ని రకాల ప్రభుత్వ సేవలు ఇక్కడే అందేవి. ఇప్పుడు మా సచివాలయాన్ని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేంపాడులో విలీనం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇలా అయితే చాలా ఇబ్బంది పడతాం. ప్రభుత్వ నిర్ణయం సరికాదు.
– సూరాకాసుల గోవిందు, అమలాపురం, నక్కపల్లి మండలం
కుగ్రామానికి అన్యాయం
మా గ్రామంలో సచివాలయాన్ని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాగితలో విలీనం చేస్తారని తెలిసింది. సరైన రవాణా సదుపాయాలు లేని, ముస్లింలు ఎక్కువగా నివసించే మా గ్రామంలో జగనన్న ప్రభుత్వం సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం సచివాలయాన్ని కాగిత గ్రామానికి తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మా మారుమూల పల్లెకు మళ్లీ కష్టాలు మొదలైనట్టే. –గొర్ల గోవిందు, పెదదొడ్డిగల్లు
సచివాలయాల్లో సేవలివీ..
గ్రామ సచివాలయంలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, పశుసంవర్థకశాఖ, వ్యవసాయ, హార్టికల్చర్, ఫిషరీస్ కార్యదర్శులు, మహిళా పోలీస్, వుమెన్ వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, సర్వేయర్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, వీఆర్‌ఏ, కంప్యూటర్ ఆపరేటర్ తదితర సిబ్బందిని నియమించింది. సచివాలయాల ద్వారా దాదాపు 350 రకాల సేవలను ప్రభుత్వం అందించింది. కుల, ఆదాయ నివాస ధ్రువపత్రాలు, జనన మరణ ధ్రువపత్రాలు, రైతులకు అవసరమైన పట్టాదారు పాసుపుస్తకాల దరఖాస్తులు, మోతుబరి సర్టిఫికెట్, వన్ బి, అడంగల్, సర్వే సర్టిఫికెట్లు, మ్యారేజ్ సర్టిిఫికెట్లు, వాణిజ్య, వ్యాపారాలకు సంబంధించిన అనుమతులు, లైసెన్స్‌ల జారీ, డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్‌లు, అమ్మ ఒడి, రైతుభరోసా పథకాలకు దరఖాస్తులు, విద్యాదీవెన, విద్యావసతి, పోస్ట్‌మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు, కొత్తగా పింఛన్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు, ప్రధాన దేవాలయాల్లో దర్శనాలు, గదుల బుకింగ్ సదుపాయం, ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం దరఖాస్తులు, గృహ అవసరాలకు, వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తులు, రైతులకు విత్తనాలు, ఎరువుల కోసం దరఖాస్తులు ఇలా ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వ్యక్తిగత, సామాజిక అవసరాల కోసం దరఖాస్తు చేయడానికి, వాటిని మంజూరు చేయడానికి సచివాలయాలు ఉపయోగపడేవి.

కూటమి కుట్ర

కూటమి కుట్ర

కూటమి కుట్ర

కూటమి కుట్ర