
ఏపీఆర్‌డీసీకి దిమిలి విద్యార్థి ఎంపిక
కోటవురట్ల: స్థానిక ప్రభుత్వ జానియర్ కళాశాలలో చదివిన విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాడు. ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షా ఫలితాలలో కళాశాలకు చెందిన దిమిలి భవానీ ప్రసాద్ రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించాడు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు ఎ.ఆర్.టి.సుజాత, అధ్యాపకులు విద్యార్థిని అభినందించారు. విద్యార్థి దిమిలి ప్రసాద్ మాట్లాడుతూ నాగార్జునసాగర్‌లో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో బీకాంలో చేరి భవిష్యత్‌లో మంచి ఉద్యోగం సాధించాలన్నది కోరికగా తెలిపాడు. కళాశాలలో లెక్చరర్లు మంచి సహకారం అందించారని వారికి కృతజ్ఞతలు తెలిపాడు.