అందమైన బంధం
సామరస్యతతోనే శాశ్వతం
భార్యాభర్తల సంబంధాలు చాలా సున్నితమైనవి. అందంగా అల్లుకున్న అనుబంధం చిన్నపాటి కలతలకే ఒక్కోసారి చెదిరిపోయే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో వారితో మాట్లాడి సమాధానపరిస్తే సమస్య ఇట్టే పరిష్కారం అయిపోతుంది. అలాంటి గురుతర బాధ్యతను నెరవేరుస్తోంది అనకాపల్లిలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్. ఆధునికీకరించిన కౌన్సెలింగ్ సెంటర్ భవనాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా గురువారం ప్రారంభించారు.
● సత్ఫలితాలను ఇస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్
● మూడు వంతుల కేసులు సుఖాంతం


