
పోలీస్ కస్టడీకి గర్నికం హత్యకేసు నిందితులు
రావికమతం: మండలంలో మేడివాడ యువకుడు కొలిపాక పవన్‌కుమార్‌ను గత నెల 6 వ తేదీన గర్నికం తిరుమల ఫంక్షన్‌హాల్ దగ్గర స్నేహితులు వేపాడ నరేంద్ర కుమార్, దుర్గాప్రసాద్, మైనర్ బాలుడితో కలిసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసు, వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి సంబంధించి దుర్గా ప్రసాధ్, నరేంద్రకుమార్‌లను రెండు రోజులు పోలీసు కస్టడీకి తీసుకున్నామని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు తెలిపారు. దుర్గాప్రసాద్, నరేంద్రకుమార్ తూర్పుగోదావరి జిల్లాలో మూడు బైక్‌లు, కాకినాడ జిల్లాలో ఒక్కటి, గాజువాకలో ఒక్కటి, మొత్తం 5 బైకులను చోరీకి పాల్పడ్డారని, నిందితుల సమాచారం మేరకు వాటిని స్వాధీనం చేసుకుని, సంబంధిత పోలీసుస్టేషన్లకు అందజేశామని సీఐ కోటేశ్వరరావు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ రఘువర్మ పాల్గొన్నారు.