
నృత్యం అంటే మక్కువ...
చిన్నప్పటి నుంచి శాసీ్త్రయ నృత్యం అంటే ఇష్టం. గజముఖ నృత్య అకాడమీ ధనం మాస్టారు దగ్గర శాసీ్త్రయ నృత్యంలో తర్ఫీదు పొందాను. నేను నేర్చుకున్న కలను పలువురికి అందించాలనే తపనతో సొంతంగా శ్రీమృతేశ్వర నృత్య అకాడమీని స్థాపించాను. నా దగ్గర ప్రస్తుతం 47 మంది బాలబాలికలు శిక్షణ పొందుతున్నారు. శిక్షణకే పరిమితం కాకుండా బాలికలతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. ఉద్యోగం ఉన్నప్పటికీ కళ మీద మక్కువతో శిక్షణ ఇస్తున్నాను. తల్లిదండ్రులు పిల్లల అభిరుచికి అనుగుణంగా ప్రోత్సహించాలి.
–ఉమాదేవి, అకాడమీ శిక్షకురాలు, నర్సీపట్నం