
బీసీ ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ సంఘం ఎన్నిక
అనకాపల్లి టౌన్: బీసీ ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా కొణతాల గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని గర్‌ల్స్ హైస్కూల్‌లో అసోసియేషన్ ఎన్నికలు శనివారం జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు గత్తుల వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిగా బి.వి.వి.ప్రసాద్, కోశాధికారిగా కె.జోగినాయుడు, అసోసియేషన్ అధ్యక్షునిగా బి.దేముడుబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పి.జగదీష్, ఆర్.అప్పలరాజు, గౌరవ సలహాదారునిగా రిటైర్డ్ ఎమ్మార్వో పి.వీరభద్రరావు ఎన్నికయ్యారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూషణరావు, న్యాయ సలహాదారులు పి.రామచంద్రరావు పాల్గొన్నారు.