
40 మందికి చికిత్సలు, 10 మందికి రక్త పరీక్షలు
పెద గరువులో వైద్య శిబిరం
రోలుగుంట: అర్ల పంచాయతీ శివారు పెద గరువులో జ్వరాలపై సోమవారం పత్రికల్లో వచ్చిన వార్తపై వైద్య సిబ్బంది స్పందించారు. బుచ్చింపేట వైద్యుడు ఎస్.శ్రీనివాసరాజు ఫీల్డ్ సిబ్బందితో కలసి పెద గురువు గ్రామంలో సోమవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 62 మంది జనాభా గల ఇక్కడ 40 మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. పది మందికి రక్తపు పూతలు తీశారు. వారిలో కిలో ప్రవీణ్‌కుమార్(8)కి జ్వరమని నిర్ధారించి పీహెచ్‌సీకి రిఫర్ చేశారు. సిరిడి రాణి(7), కిలో ఆశ(5), కిలో పౌలి (ఏడాదిన్నర వయసు)కి దగ్గు, జలుబుగా గుర్తించి మందులు అందజేశారు. వైద్యాధికారి మాట్లాడుతూ గ్రామంలో పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. వాతావరణ మార్పులు, వేసవి ఎండలకు వైరల్ జ్వరాలు సాధారణమన్నారు. మరగకాచిన నీరు తాగాలని, నిల్వ ఆహారం తీసుకోకూడదని గ్రామస్తులకు సూచించారు.