
రాష్ట్రస్థాయి వుషు పోటీల్లో చోడవరం క్రీడాకారులకు పతకాలు
చోడవరం : రాష్ట్ర స్థాయి వుషు మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో చోడవరం క్రీడాకారులు పతకాలు సాధించారు. కర్నూల్‌లో ఈనెల 12నుంచి 14వ తేదీ వరకూ రాష్ట్రస్థాయి ఉషూ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో చోడవరం గణేష్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన క్రీడాకారులు పలు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. జూనియర్స్ 45 కేజీల విభాగంలో తేజ స్వరూప్ బంగారు పతకం సాధించారు. ఉమెన్స్ సీనియర్స్ 60 కేజీల విభాగంలో లావణ్య రజత పతకం, 65 కేజీల విభాగంలో సాయి లక్ష్మి కాంస్య పతకం సాధించారు. వీరు త్వరలో రాజస్థాన్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి పాల్గొంటారని కోచ్ పుల్లేటి గణేష్ తెలిపారు.

రాష్ట్రస్థాయి వుషు పోటీల్లో చోడవరం క్రీడాకారులకు పతకాలు