దాతలు సహకరించినా దక్కని ప్రాణం
రావికమతం: తీవ్ర అనారోగ్యానికి గురైన విద్యార్థి మణికంఠ చికిత్స పొందతూ విశాఖలో మృతిచెందాడు. మండలంలో కన్నంపేట గ్రామానికి చెందిన సియాద్రి మణికంఠ కొత్తకోట హైస్కూల్‌లో పదోతరగతి చదివి, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మానవతా వాదులు స్పందించి సహాయం చేసి, విద్యార్థి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. విశాఖలోని కేజీహెచ్ లో చిక్సిత పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో కన్నంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు నాని, అమ్మాజీ గుండెలవిసేలా రోదించారు. స్నేహితులు, పాఠశాల ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.


