మద్యాన్ని కంట్రోల్ చేయాలి సారూ..
● ఎకై ్సజ్ జిల్లా అధికారికి ఐద్వా వినతి
అనకాపల్లి: నూతన సంవత్సర వేడుకలను యువత, అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలంటే డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో మద్యం దుకాణాల్లో విక్రయాలు నిలిపివేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం అన్నారు. జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి సుధీర్‌కు మంగళవారం ఆమేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై తేదీల్లో మద్యం తాగి వాహనాలను దురుసుగా నడపడం, మహిళలను వేధించడం మొదలైన అనర్ధాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మద్యం విక్రయాలు నిలుపుదల చేయాలని తదితర డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి డి.వరలక్ష్మి, సహాయ కార్యదర్శులు ఆర్.లక్ష్మి, అన్నపూర్ణ, బంగారమ్మ పాల్గొన్నారు.


