పోరాడే వారంటే పాలకులకు భయం
ఏయూక్యాంపస్ : సమానత్వం కోసం పోరాడుతున్న వారిని చూసి పాలకవర్గాలు భయపడుతున్నాయని సినీ నటి రోహిణి పేర్కొన్నారు. సీఐటీయూ జాతీయ 18వ మహాసభ సందర్భంగా ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏయూ ఎగ్జిబిషన్ మైదానంలో ‘శ్రామిక ఉత్సవ్‘ నాలుగో రోజు మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సీ్త్రల పట్ల సమాజం వైఖరి మార్చుకోవాలని, వారిని సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టుల పట్ల తనకు చాలా గౌరవభావముందన్నారు. పెరియార్, అంబేడ్కర్, కమ్యూనిస్టులు తమ భావాలతో తనను తీర్చిదిద్దారని తెలిపారు. సినీ నటిగా నాలుగు మంచి విషయాలు తన వాళ్లకు తెలపాలనేది తన ఉద్దేశమన్నారు. మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
శ్రామిక ఉత్సవ్‌లో సినీ నటి రోహిణి


