
ఎస్‌బీఐ ఫీల్డ్ ఆఫీసర్ సతీష్‌కుమార్ హఠాన్మరణం
చింతపల్లి/రావికమతం: లంబసింగి గ్రామానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్, స్థానిక వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కంఠా జాహ్నవి భర్త సతీష్‌కుమార్(46)హఠాన్మరణం చెందారు. కుటుంబీకులు అందించిన వివరాలిలా ఉన్నాయి. సతీష్‌కుమార్ రావికమతం మండలం కొత్తకోట ఎస్‌బీఐ ఫీల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ నర్సీపట్నం శారదానగర్‌లో నివాసముంటున్నారు. గురువారం ఉద్యోగ రీత్యా సతీష్‌కుమార్, భార్య జాహ్నవి చింతపల్లి వచ్చి విధులు ముగించుకుని స్వగ్రామం చౌడుపల్లిలో బస చేశారు. శుక్రవారం ఉదయం బ్యాంకుకు బయలు దేరే సమయంలో చాతి నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయాడు. వాచ్‌మన్, స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే సతీష్‌కుమార్ మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామం లంబసింగికి తరలించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పిన్న వయస్సులో సతీష్ మృతి చెందడంతో ఇటు చౌడుపల్లి, లంబసింగిలో విషాదఛాయలు అలముకున్నాయి. సతీష్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమారై ఉన్నారు.