సైన్స్ రీసెర్చ్ చేస్తా..
పాలిసెట్‌లో 120 మార్కులకు గాను 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించాను. ఈ రోజే విడుదలైన ఏపీఆర్జేసీలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది. పదో తరగతిలో 595 మార్కులు వచ్చాయి. మా స్వస్థలం గుంటూరు కాగా మా నాన్న రాజేంద్రబాబు దివీస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. సంగివలసలో నివాసం ఉంటున్నాం. మా అమ్మ గృహిణి. ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతాను. ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేస్తాను. అనంతరం సైన్స్ రీసెర్చ్ చేస్తాను. –బాలినేని కల్యాణ్‌రామ్, 2వ ర్యాంకు


