
వికలాంగుడి భూమి కబ్జాకు యత్నం..
చీడికాడ మండలం చినగోగాడ గ్రామంలో ఉన్న తన భూమి రికార్డులు ట్యాంపరింగ్ చేసి భూ కబ్జాకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా గాజువాక మండలం నాతయ్యపాలెం గ్రామానికి చెందిన వికలాంగుడు అక్కిరెడ్డి అప్పారావు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. చినగోగాడ గ్రామం సర్వే నెం.10–6లో 35 సెంట్ల భూమిని 2006లో కొనుగోలు ద్వారా వచ్చిందని, సదరు భూమిని తానే సాగుచేసుకుంటున్నానని, తాను వికలాంగుడిని కావడం, విశాఖ జిల్లాలో నివాసముండడంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తనకు తెలియకుండా తన భూమిని వారి పేరున రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకుని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వారి నుంచి తమకు రక్షణ కల్పించి తమ భూమిని కాపాడాలని కోరారు.