
జాబ్‌మేళాలో 450 మంది ఎంపిక
యలమంచిలి రూరల్: యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు నిరుద్యోగులు నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 25 కంపెనీల్లో ఉద్యోగాలకు 1,500 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. వీరిలో 450 మందిని ఆయా కంపెనీల సెలెక్టర్లు ప్రాథమికంగా ఎంపిక చేసుకున్నారు. అంతకుముందు ఉదయం జాబ్ మేళాను నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎ. గోవిందరావు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ పి. చంద్రశేఖర్, పీడీ పోలిరెడ్డి, వివిధ కంపెనీల హెచ్‌ఆర్‌లు పాల్గొన్నారు.

జాబ్‌మేళాలో 450 మంది ఎంపిక