
హైవే పక్కన గ్యాస్ ట్యాంకర్ బోల్తా
యలమంచిలి రూరల్: యలమంచిలి మండలం రేగుపాలెం సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న టీఎస్ 06 యూసీ0645 నంబరు గల గ్యాస్ ట్యాంకర్ రేగుపాలెం సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోయింది. దీంతో ట్యాంకర్ నుంచి భారీగా గ్యాస్ లీకై ంది. తెల్లని గ్యాస్ పక్కనున్న పొలాలు, కాలువ వైపునకు వ్యాపించింది. ఇది చూసిన వాహనచోదకులు, చుట్టు పక్కల వారు భయంతో పరుగులు తీశారు. అయితే లీకై న వాయువు శీతల పానీయాల్లో ఉపయోగించే కార్బన్ డయాకై ్సడ్‌గా లారీ డ్రైవర్, క్లీనర్ చెప్పడంతో ప్రమాదకరం కాదని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలువురు వాహన చోదకులు లీకవుతున్న గ్యాస్‌కు ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. సంఘటన స్థలానికి వెళ్లిన హైవే పోలీసులు లీకవుతున్న గ్యాస్‌తో ఎవరికీ ప్రమాదం లేదని, భయపడవద్దని చెప్పారు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు.
భారీగా లీకై న గ్యాస్ పరుగులు తీసిన వాహనచోదకులు, స్థానికులు