
వైస్ ఎంపీపీలు ఏకగ్రీవం
వైఎస్సార్‌సీపీ
కై వసం
దేవరాపల్లిలో పంచాడ సింహాచలంనాయుడు..
దేవరాపల్లి: వైస్ ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మామిడిపల్లి ఎంపీటీసీ సభ్యుడు పంచాడ సింహాచలంనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఎస్.మంజులవాణి సమక్షంలో వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా జరిగింది. మండలంలోని 17 ఎంపీటీసీలకు గాను 12 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. సింహాచలంనాయుడు పేరునును ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి ప్రతిపాదించగా, ఎం.అలమండ ఎంపీటీసీ పోతల వెంకటరావు బలపరిచారు. ఎంపీటీసీలు సింహాచలంనాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.
మాడుగులలో విజయలక్ష్మి..
మాడుగుల: స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం వైస్ ఎంపీపీ–1 ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 21 మంది ఎంపీటీసీలకు గాను 15 మంది ఎన్నికలో పాల్గొన్నారు. మాడుగుల ఒకటవ సిగ్మెంట్‌లో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీగా కొనసాగుతున్న పొలిమేర విజయలక్ష్మిని 15 మంది ఎంపీటీసీలు చేతులెత్తి వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ప్రిసైడింగ్ అధికారి కె.వీరన్ననాయుడు నియామక పత్రం అందజేసి విజయలక్ష్మి చేత రిజిస్టర్‌లో సంతకం చేయించి, ప్రమాణ స్వీకారం చేయించారు.

వైస్ ఎంపీపీలు ఏకగ్రీవం