
చౌడువాడలో ‘బీట్ ది హీట్’ కార్యక్రమం
కె.కోటపాడు : స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బీట్ ది హీట్ ప్రోగ్రాం నిర్వహించారు. చౌడువాడ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో సచివాలయం వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్‌సీ ఆవరణలో కమ్యూనిటీ సోప్ పిట్‌కు శంకుస్థాపన చేశారు. పక్షులు నీరు తాగడానికి, ఆహారం అందించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన పరికరాన్ని డ్వామా పీడీ పూర్ణిమాదేవి ప్రారంభించారు. గ్రామంలో 20 మందికి పక్షులకు నీళ్లు పెట్టడానికి మట్టి పాత్రలు పంపిణీ చేఽశారు. గ్రామ పరిశుధ్య సిబ్బందిని సత్కరించి బియ్యంతో పాటు కిరాణా సామాగ్రిని అందజేశారు. సర్పంచ్ చలివేంద్రం ప్రారంభించి మజ్జిగను ఉచితంగా అందజేశారు. ఎంపీపీ సూర్యనారాయణ,ఎంపీడీవో సాంబశివరావు, తహసీల్దార్ రమేష్‌బాబు, డిప్యుటీ ఎంపీడీవో రమణి, సర్పంచ్ ఎరువునాయడు, ఎంపీటీసీ అప్పలరాజు, పంచాయతీకార్యదర్శి సురేష్‌బాబు, గుమస్తా అప్పారావు పాల్గొన్నారు.