
కనుల పండువగా వెంకన్నకు చక్రస్నానం
చోడవరం: స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈనెల 13న స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సోమవారం స్వామివారికి శ్రీ చక్ర స్నానం నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరపారు. ప్రత్యేకంగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామివారి ఉత్సవ విగ్రహాలకు శ్రీ చక్రస్నానం చేశారు. ఎమ్మెల్యే రాజుతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ వింజుమూరి శంకర్, దేవదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి, ఆలయ కమిటీ ప్రతినిధులు ఉపాధ్యాయుల శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి పూజలు చేశారు.