
ఏయూ వీసీకి ఎక్స్‌లెన్స్ అవార్డు
విశాఖ విద్య : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (హైదరాబాద్) అందించిన ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆదివారం హైదరాబాదులోని ఐఐసీటీలో జరిగిన నేషనల్ టెక్నాలజీ డే కార్యక్రమంలో అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆచార్య రాజశేఖర్ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందించడం పట్ల విశ్వవిద్యాలయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.