
నైపుణ్యతకు మెరుగు!
ఆర్ట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు
క్రాఫ్ట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు
ఉపాధి కోసం..
నా డిగ్రీ చదువు అనివార్య కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. నాకు ముగ్గురు పిల్లలు. క్రాఫ్ట్‌లో ఇప్పటికే లోయర్, హయ్యర్ కంప్లీట్ చేశాను. టీటీసీ పూర్తి చేస్తే ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నేను నేర్చుకున్న విద్యలో మరింత నైపుణ్యత పొందుతూ.. ఇంటి వద్ద మరి కొంతమందికి శిక్షణ ఇస్తున్నాను.
– కర్రి చంద్రిక, గవరపాలెం, అనకాపల్లి జిల్లా
విశాఖ విద్య: నిరుద్యోగ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తూనే.. సత్వర ఉపాధి లక్ష్యంగా నైపుణ్యతతో కూడిన స్వల్పకాలిక టెక్నికల్ కోర్సుల వైపు ఆసక్తి కనబరుస్తోంది. ఇటువంటివారి కోసం విద్యాశాఖ ఏటా వేసవిలో ‘టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్’(టీటీసీ) కోర్సులను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. 42 రోజుల వ్యవధి గల ఈ కోర్సుల్లో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 42 ఏళ్ల వరకు వయస్సు గల వారు అర్హులు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ కోర్సులను అభ్యసించేందుకు 180 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం నగరంలోని ప్రభుత్వ క్వీన్ మేరీ హైస్కూల్‌లో ప్రత్యేక క్యాంప్‌ను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు.
ఎన్‌ఈపీ అమలుతో టీటీసీకి డిమాండ్
విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏటా వేసవిలో టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉండేవి. జాతీయ విద్యావిధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో తప్పనిసరిగా ఆర్ట్, క్రాఫ్ట్ సబ్జెక్టు టీచర్లను నియమించాలనే నిబంధన పెట్టారు. టీటీసీ కోర్సు చేసిన వారు మాత్రమే ఆయా పోస్టులకు అర్హులు కావటంతో డిమాండ్ పెరిగింది. మానసిక, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే అంశాలతో కూడిన సబ్జెక్టులు కావటంతో వచ్చే ఏడాది నుంచి కోర్సు వ్యవధి 42 రోజులకు బదులుగా 6 నెలలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
నైపుణ్యతతో కూడిన శిక్షణ
ఈనెల ఒకటో తేదీన ప్రారంభమైన శిక్షణ తరగతులు జూన్ 11వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతీ రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఆరుగురు టీచర్లు.. సైకాలజీ, స్కూల్ అడ్మిస్ట్రేషన్ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు మరో ఇద్దరు టీచర్లను నియమించారు. వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నైపుణ్యతతో కూడిన శిక్షణ అందిస్తున్నారు.
స్వయం ఉపాధి వైపు అడుగు
టీటీసీ కోర్సుపై ఆసక్తి చూపుతున్న యువత
ఆర్ట్, క్రాఫ్ట్ శిక్షణతో ఉద్యోగ అవకాశాలు
వేసవిలో 42 రోజుల పాటు శిక్షణా తరగతులు
బొమ్మలు వేయడం ఇష్టం
నేను బీటెక్ కంప్యూటర్ సైన్సు పూర్తి చేశాను. ఎంటెక్‌లో చేరేందుకు ఎంట్రన్స్ రాస్తున్నాను. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే ఇష్టం. నాన్న ప్రోత్సాహంతో ఆర్ట్‌లో శిక్షణ పొందుతున్నాను. ఆర్ట్ కోర్సులో లోయర్, హయ్యర్ ఇప్పటికే పూర్తి చేశాను. మరింత నైపుణ్యత పొందేందుకు టీటీసీ శిక్షణ ఉపయోగపడుతుంది.
–ఎం.పీ.శ్లేఘన, సుజాతనగర్, విశాఖ జిల్లా

నైపుణ్యతకు మెరుగు!

నైపుణ్యతకు మెరుగు!

నైపుణ్యతకు మెరుగు!

నైపుణ్యతకు మెరుగు!