
జగ్గప్పారావుకు జ్ఞానీ జైల్‌సింగ్ పురస్కారం
మునగపాక: మండలంలోని గవర్ల అనకాపల్లికి చెందిన సామాజిక కార్యకర్త బొడ్డేడ జగ్గప్పారావు (జగన్) జ్ఞానీ జైల్‌సింగ్ అవార్డును దక్కించుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జరిగిన సత్కార కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షరీఫ్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే, ఏపీజేయూ 5 వసంతాల వార్షికోత్సవంలో భాగంగా జగన్‌ను సత్కరించారు. ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ , వివిధ స్వచ్ఛంద సంస్థల సంయుక్త నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో జగన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సహచట్టం, వినియోగదారుల హక్కు చట్టం తదితర కార్యక్రమాలపై జగ్గప్పారావు విస్తృత ప్రచారం చేస్తూ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.