
దేవరాపల్లి హైస్కూల్లో నాగుపాము కలకలం
దేవరాపల్లి: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం నాగుపాము హడావుడి సృష్టించింది. హైస్కూలు ఆవరణలో చేపడుతున్న బాలికల వసతి గృహ నిర్మాణ పనుల కోసం తీసిన గొయ్యిలో ఎలుకను మింగేసి కదలలేని స్థితిలో ఉన్న నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారుల ద్వారా స్నేక్ క్యాచర్ కృష్ణకు సమాచారం అందించారు. నిచ్చెన సహాయంతో గొయ్యిలోకి దిగిన స్నేక్ క్యాచర్ సుమారు అరగంటపాటు శ్రమించి మూడున్నర అడుగుల పొడవున్న నాగుపామును పట్టుకొని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.