
అవిశ్వాసం నోటీసు తిరస్కరణ
యలమంచిలి రూరల్: యలమంచిలి మున్సిపల్ వైస్ చైర్మన్లపై కూటమి నాయకులిచ్చిన అవిశ్వాసం నోటీసును కలెక్టర్ విజయ కృష్ణన్ తిరస్కరించినట్టు మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజు శుక్రవారం రాత్రి స్థానిక విలేకరులకు తెలిపారు. వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికై న వైస్ చైర్మన్లు బెజవాడ గోవిందరాజు నాగేశ్వరరావు, అర్రెపు నాగ త్రినాథ ఈశ్వర గుప్తాలపై మెజార్టీ లేకపోయినా కూటమి నాయకులు అవి శ్వాసం కోరుతూ జిల్లా కలెక్టరుకు ఈ నెల 8వ తేదీన నోటీసు అందజేశారు. నోటీసులో 16 మంది సంతకా లు ఉన్నాయి. సంతకాల్లో కొన్ని అసంపూర్తిగా, అనుమానాస్పదంగా ఉన్నాయి. నోటీసులో కింద ఇద్దరు వార్డు కౌన్సిలర్ల పూర్తి చిరునామాలు, సంతకాలు ఉండాలి. ఇవేవీ లేకుండానే అవిశ్వాసం కోరుతూ నోటీసు అందజేశారు. అర్రెపు నాగ త్రినాథ గుప్తా పదవీ బా ధ్యతలు చేపట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు పూర్తి కాలేదు. అయినప్పటికీ నోటీసులో గుప్తా పేరు కూడా చేర్చారు. పట్టణంలో 25 వార్డులుండగా వైఎస్సార్‌సీపీకి 23 మంది, టీడీపీకి ఒకరు, స్వతంత్రులు ఒకరు వార్డు సభ్యులుగా ఉన్నారు. మెజార్టీ లేకపోయినా అవిశ్వాసం కోరుతూ నోటీసు ఇచ్చి ప్రలోభాలతో గెలవాలని కూటమి నాయకులు భావించారు. నోటీసు ఇచ్చిన తర్వాత కూటమికి మద్దతునిస్తున్న వార్డు సభ్యులను ఊటీలో ప్రత్యేక శిబిరానికి సైతం తరలించారు. అయితే వైఎస్సార్‌సీపీకి చెందిన మెజార్టీ సభ్యులు కూటమి నేతల ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం నిజాయతీగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం వీగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
వేధింపుల పర్వం : వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలుస్తున్న కౌన్సిలర్లను పలు రకాలుగా బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈరిగిల గణేష్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సైతం వెనకాడలేదు. శుక్రవారం పట్టణంలోని ఎస్సీ కాలనీలో గణేష్ కొత్తగా నిర్మించుకుంటున్న ఇల్లు అక్రమ కట్టడమంటూ మున్సిపల్ అధికారులు నోటీ సు అతికించారు. అంతలోనే ఏమనుకున్నారో గోడకు అతికించిన నోటీసును మళ్లీ తొలగించి తమ వెంట తీసుకుపోయినట్టు గణేష్ బంధువులు సాక్షికి చెప్పా రు. శనివారం ఉదయం గణేష్ ఇంటిని కూల్చివేయడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పట్టణ పోలీసులను బందోబస్తు కల్పించాలని కోరినట్టు సమాచారం. ఇలాంటి కుట్రలను ఎదుర్కొంటామని వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు. పట్టణంలో పదుల సంఖ్యలో ఉన్న అక్రమ కట్టడాలన్నింటినీ తొలగించాలని, ఆ తర్వాతే తమ పార్టీకి చెందిన గణేష్ వార్డు సభ్యుని ఇంటికి రావాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అసంపూర్తిగా ఉందన్న కలెక్టర్
ఓటమి భయంతోనే తప్పుల తడకగా వేశారంటున్న వైఎస్సార్‌సీపీ