పరిసరాల పరిశుభ్రత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

May 19 2025 2:04 AM | Updated on May 19 2025 2:04 AM

పరిసర

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

దేవరాపల్లి : ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని మండల ప్రత్యేక అధికారి ఎస్‌.మంజులవాణి సూచించారు. దేవరాపల్లిలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో మానహారంగా ఏర్పడి, ప్రతిజ్ఞ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మండల ప్రత్యేక అధికారి ఎస్‌.మంజులవాణి, ఎంపీడీవో సువర్ణరాజు చీపర్లతో చెత్త ఊడ్చారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందశారు. సచివాలయం–1 వద్ద జరిగిన సమావేశంలో వేసవి ఎండ తీవ్రత నేపథ్యంలో వడ దెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కల్పించారు. బోయిలకింతాడలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు, సర్పంచ్‌ బాబురావు ఆధ్వర్యంలో సచివాలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు.

మాకవరపాలెం: గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు అన్నారు. మండలంలోని గిడుతూరులో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం వీధుల్లో చెత్తను తొలగించడంతోపాటు ర్యాలీ నిర్వహించారు.

నర్సీపట్నం : మున్సిపాలిటీలో స్వర్ణాంద్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్‌, ఆర్డీవో వి.వి.రమణ, కౌన్సిలర్లు సిహెచ్‌.పద్మావతి, కమిషనర్‌ జంపా సురేంద్ర, జిల్లా అదనపు వైద్యాధికారి జ్యోతి, మెప్మా, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. వీరంతా ర్యాలీ నిర్వహించి చెత్తను రోడ్లపై వేయకుండా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని నినాదాలు చేశారు. కౌన్సిలర్‌ పద్మావతి అందరిచే ప్రతిజ్ఞ చేయించారు.

బుచ్చెయ్యపేట : గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ సిబ్బంది కృషి చేయాలని మండల ప్రత్యేకాధికారి గోపాల్‌,ఎంపీడీవో విజయలక్మి తెలిపారు. శనివారం గ్రీవెన్స్‌లో భాగంగా దిబ్బిడిలో పర్యటించారు. అంగన్‌వాడీ కేంద్రం, సచివాయాలం, సంపద కేంద్రం, నీటి తొట్టెలను,గ్రామ వార్డులను తనిఖీ చేశారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండడమే కాక అపరిశుభ్ర వాతావరణం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించారు. ఎండాకాలం అవడంతో ముఖ్య కూడల్లో చలి వేంద్రాలు, నీటి తొట్టెలో పశువులకు నీళ్లు ఉండేలా చూడాలన్నారు.

ఎమ్మార్సీ భవనం వద్ద పారిశుధ్య చర్యలు

రోలుగుంట : మండలంలో గ్రామాల్లో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో గల విద్యాశాఖ మండల వనురుల కేంద్రం వద్ద ఎంఈవోలు జాను ప్రసాద్‌, జాగ్గారావు సిబ్బందితో కలిసి భవన్‌ చుట్టూ చెత్తను, ప్లాస్టిక్‌ వ్యర్థాలను ేతొలగించారు. ఆవరణలో గల పిచ్చి మొక్కలు తొలగించి కార్యాలయాన్ని సుందరంగా తయారు చేశారు. సీఆర్పీలు సతీష్‌, చిరంజీవి పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రత పాటించాలి1
1/1

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement