
చోరీ కేసులో ముగ్గురు అరెస్టు
బుచ్చెయ్యపేట: మండలంలో గల వడ్డాది పోస్టాఫీసులో దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసినట్టు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. గత నెల 17వ తేదీన వడ్డాది పోస్టాఫీసు తాళాలు పగలగొట్టి రూ, 67,855 నగదును గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకుపోయారన్నారు. దీనిపై పోస్టాఫీసు బీఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు. క్లూస్ టీం, సీసీ పుటేజీ, టెక్నాలజీ ఆధారంగా చోరీకి పాల్పడ్డ వడ్డాది ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నామన్నారు. ఆ ముగ్గురిలో ఒకరు మైనర్ కాగా మిగిలిన ఇద్దరు 18 ఏళ్ల యువకులన్నారు. మైనర్ బాలుడిని జువైనల్‌కు, ఇద్దరిని రిమాండ్‌కి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు. దొంగలను చౌకచక్యంగా పట్టుకున్న సిబ్బంది అర్జున్, గణేష్, వెంకట్‌లను ఎస్‌ఐ అభినందించారు.