
నేడు మాక్ ఎక్సర్‌సైజ్
తుమ్మపాల: శత్రువుల దాడులు చేసే సమయంలో తమను తాము రక్షించుకునే విధానంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 14న మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించనున్నట్టు ఇన్‌చార్జి కలెక్టర్, జేసి ఎం.జాహ్నవి తెలిపారు. మన దేశంపై శత్రువులు దాడిచేసే పరిస్థితి సంభవించినప్పుడు ఏర్పడిన అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు అనకాపల్లి బైపాస్ రోడ్డులోని జయభేరి మారుతీ షోరూం ఎదురుగా గల గ్రీన్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ వద్ద ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించే మాక్ ఎక్సర్‌సైజ్ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొని, జాగ్రత్తలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర సంసిద్ధతపై పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు.