
పాలిసెట్, ఏపీఆర్‌జేసీ ఫలితాల్లో తిమిరాం విద్యార్థి సత్
దేవరాపల్లి: మండలంలోని తిమిరాం గ్రామానికి చెందిన ఎలిశెట్టి హేమ చంద్రకుమార్ పాలిసెట్, ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంక్‌లు సాధించి సత్తా చాటాడు. ఓ ప్రైవేటు విద్యా సంస్థలో పదో తరగతి చదివిన విద్యార్థి ఇటీవల సీబీఎస్‌ఈ ఫలితాల్లో 477 మార్కులు సాధించాడు. ఏపీఆర్‌జేసీలో 132 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 17వ ర్యాంక్ సాధించాడు. పాలిసెట్ ప్రవేశ పరీక్షలో 120కు 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్‌తో మెరిశాడు. హేమచంద్రకుమార్ తండ్రి సూరిబాబు ఆటో డ్రైవర్ కాగా.. తల్లి బహుమతి గృహిణి.