
మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
అక్కిరెడ్డిపాలెం: మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు యువకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి.. గాజువాకకు చెందిన చింతలపూడి లావణ్య వెంకటసత్యకుమార్, కొండపల్లి తరుణ్ వద్ద 2.4 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాలు ఉన్నాయని, వారు ఆటోనగర్ వద్ద ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు దాడి చేసి, వారి నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి మత్తు పదార్థాలను తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు విచారణలో యువకులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించారు.