
ఉప్పొంగిన దేశభక్తి
● నక్కపల్లిలో ఘనంగా తిరంగా ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న మంత్రి అనిత
నక్కపల్లి: వందేమాతరం.. భారత్ మాతాకీ జై.. నినాదాలతో నక్కపల్లి హోరెత్తింది. శుక్రవారం తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ఉపమాక ఆర్చ్ నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు జరిగిన ఈ ర్యాలీలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ.. ఇటీవల విజయవంతమైన ఆపరేషన్ సిందూర్‌కు అందరూ జేజేలు పలికారు. ప్రాణత్యాగం చేసిన వీర సైనికుడు మురళీ నాయక్‌కు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాజీ సైనికులను సన్మానించారు. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, తోట నగేష్, గెడ్డం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
నేడు ఐఐపీఈ స్నాతకోత్సవం
51 మందికి డాక్టరేట్‌లు ప్రదానం
విశాఖ విద్య: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) 5వ స్నాతకోత్సవం శనివారం నోవాటెల్‌లో జరగనుందని ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్య క్షుడు ప్రొఫెసర్ పి.కె.బానిక్, డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ తెలిపారు. ఐఐపీఈలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించా రు. స్నాతకోత్సవానికి హిందుస్థాన్ జింక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హోల్ టైమ్ డైరెక్టర్ అరు ణ్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరవుతారన్నా రు. 51 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో అకడమిక్ ప్రోగ్రామ్ నుంచి ఇద్దరు విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ ప్ర దానం చేస్తామన్నారు. అకడమిక్ సీజీపీఏ, ఎ క్స్‌ట్రా కరిక్యులర్ విజయాల ఆధారంగా ఓవరాల్ ఎక్స్‌లెన్స్ కోసం ఒక ఉత్తమ విద్యార్థికి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి బంగారు పతకం లభిస్తుందన్నారు.