
సీబీఎస్‌ఈ ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత
పాయకరావుపేట: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్ మంగళవారం తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో ఎన్.సత్యసాయి 483/500, ఎమ్.యశ్వసి 482/500, పి.తరుణ్ 481/500, ఎస్.రఘునందన్ 478/500 మార్కులతో సత్తా చాటారని, ప్లస్ –2 ఫలితాల్లో జి.సాయి అనీష్ 469/500, ధాత్రి నిహారిక 466/500 మార్కులు సాధించారన్నారు. నూటికి నూరు శాతం ఉత్తీర్ణతతో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. మాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో తమ విద్యార్థులు 100/100 మార్కులు సాధించడం హర్షణీయమన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె. నరసింహారావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

సీబీఎస్‌ఈ ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత