
దస్తావేజు ఇవ్వకుండా వీఆర్వో వేధిస్తున్నారు...
ల్యాండ్‌పూలింగ్ ద్వారా సంపతిపురం గ్రామంలో సర్వే నెం.286/5లో 1.28 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుని బదులుగా సర్వే నెం.284/30లో 378 చదరపు గజాల ప్లాట్‌ను తమ పేరున దస్తావేజు – 8333/2023 లో రిజిస్ట్రేషన్ చేశారని, కానీ దస్తావేజులు ఇవ్వకుండా అప్పటి వీఆర్వో శ్రీనివాసరావు ఇబ్బందులకు గురి చేశారని అనకాపల్లి మండలం సంపతిపురం గ్రామానికి చెందిన ఈరుగుల పైడిరాజు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. బదిలీపై మరోచోటకు వెళ్లినప్పటికీ తన పేరున గల దస్తావేజులు ఇవ్వడం లేదని, అతని వద్ద ఉన్న దస్తావేజు పత్రాన్ని ఇప్పించడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.