
20న సిరివెన్నెల 70వ జయంతి
అనకాపల్లి (కశింకోట): సినీ రంగంలో రచయితగా ఉత్తమ సాహిత్యాన్ని అందించిన మహోన్నత వ్యక్తిత్వం సిరివెన్నెల సీతారామశాస్త్రిదని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. సిరి వెన్నెల కళా పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు సీతారామశాస్త్రి 70వ జయంతి వేడుకలు అనకాపల్లి సత్య గ్రౌండ్‌లో జరగనున్నాయి. దీన్ని పురస్కరించుకొని శనివారం జనసేన కార్యాలయంలో సిరివెన్నెల 70వ జయంతి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినీ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి హాజరు కానున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. గవర కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర, నూకాంబిక దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను, అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రవికుమార్, కొడుకుల శ్రీకాంత్, జోగినాయుడు, చదరం నాగేశ్వరరావు,ఈశ్వర్ పాల్గొన్నారు.