వుషు పోటీల్లో అక్కిరెడ్డిపాలెం క్రీడాకారులకు పతకాలు
అనకాపల్లి టౌన్: మండలంలోని అక్కిరెడ్డి పాలెం ఫిట్‌నెస్, బాక్సింగ్ క్లబ్‌కు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి వుషు పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. కర్నూల్‌లో ఈ నెల 12 నుంచి 14 వరకు సబ్ జూనియర్,జూనియర్ బాలబాలికల చాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. సబ్ జూనియర్ కేటగిరీలో జిమ్ నుంచి ఎనిమిది మంది పాల్గొనగా 42 కిలోల విభాగంలో ఎన్.వార్షిక్, 48 కిలోల విభాగంలో గోవర్ధన్, 60 కిలోల విభాగంలో బి.దుర్గాప్రసాద్ బంగారు పతకాలు సాధించారు. జూనియర్ కేటగిరి 48 కిలోల విభాగంలో ఇ.లక్ష్మిత్, 60 కిలోల విభాగంలో ఎ.వరప్రసాద్ బంగారు పతకాలు సాధించగా , 52 కిలోల విభాగంలో ఎన్.తులసీరామ్ రజతం, 56 కిలోల విభాగంలో పి.శశి, 65 కిలోల విభాగంలో వై.వినయ్ కాంస్య పతకాలు సాధించారు. వీరందరూ ఈ నెల 26 నుంచి 31 వరకు తమిళనాడులో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు జిమ్ కోచ్‌లు అరుణ, హరీష్ తెలిపారు.


