
సాగరతీరంలోఅయోధ్య రామ మందిరం
● నేటి నుంచి సందర్శకులకు అనుమతి
ఏయూ క్యాంపస్: విశాఖ నగరవాసులకుసరికొత్త అనుభూతిని పంచేందుకు అయోధ్య రామ మందిరం నమూనా సిద్ధమయింది. బీచ్‌రోడ్డులోని పామ్‌బీచ్ హోటల్ పక్కన ఏర్పాటు చేసిన రామ మందిర నమూనాను గురువారం ఉదయం 8.48 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. వేదిక వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్ మాట్లాడుతూ విశాఖ వాసులకు అయోధ్య రామ మందిరం సందర్శించిన అనుభూతిన పంచేలా 90 అడుగుల ఎత్తు, 392 స్తంభాలు, 44 ద్వారాలతో నిర్మించినట్లు పేర్కొన్నారు. రెండు నెలలపాటు ప్రజల సందర్శనకు ఇది అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో పాలూరి శేషమాంబ, దుర్గా ప్రసాద్, బీజేపీ నాయకులు అశోక్, దిలీప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.