
గోవాడ సుగర్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలి
చోడవరం : గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆదుకోవాలని ఫ్యాక్టరీ కార్మికుల సమావేశం కోరింది. గోవాడ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సుగర్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ కార్మిక సంఘం సమావేశం బుధవారం నిర్వహించారు. గుర్తింపు యూనియన్ ప్రధానకార్యదర్శి కె.వి. భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనేక సమస్యలు, ఫ్యాక్టరీ మనుగడ, రానున్న క్రషింగ్ సీజన్‌కు చేపట్టవలసిన చర్యలపై కార్మికులు చర్చించారు. 2024–25 క్రషింగ్ సీజన్‌లో తలెత్తిన అనేక సమస్యలు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వానికి తెలియజేసేందుకు రాజకీయాలకు అతీతంగా ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వేసిన కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను, మంత్రి లోకేష్‌ను అనేకసార్లు కలిసి వివరించడం జరిగిందని కార్యదర్శి భాస్కరరావు అన్నారు. ఫ్యాక్టరీని, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకూ ఎటువంటి సాయం అందలేదన్నారు. మరలా మరోసారి చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎంలను, అనకాపల్లి ఎంపీని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఫ్యాక్టరీ ఆస్తులను రీ వాల్యుయేషన్ చేయించి ప్రభుత్వ గ్యారంటీతో వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేయాలని, 2025–26 రానున్న క్రషింగ్ సీజన్‌కు వర్కింగ్ క్యాపిటల్ నిమిత్తం, ప్రస్తుతం రైతులకు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించుటకు అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేయాలని సమావేశంలో తీర్మాణించింది. వచ్చే సీజన్‌కు ఓవర్‌హాలింగ్ పనులు పూర్తిగా చేసి కోజనరేషన్ ఉత్పత్తి కూడా పూర్తిగా జరిగేలా ఫ్యాక్టరీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘం సమావేశంలో కోరింది. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు బండి శ్రీను, నూకరాజు, అల్లం రామఅప్పారావు, జగన్నాథరావు, సత్యనారాయణ, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
వచ్చే క్రషింగ్ సీజన్‌కు అవసరమైన గ్రాంటు ఇవ్వాలి
రైతులు, కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి
ఫ్యాక్టరీ కార్మిక సంఘం డిమాండ్