
నునపర్తిలో అక్రమ గ్రావెల్ దందా
రాత్రిళ్లు భారీగా లారీల్లో తరలింపు
అచ్యుతాపురం రూరల్: మండలంలోని నునపర్తి శివారు నడింపల్లి కొండల్ని రాత్రికి రాత్రి గ్రావెల్ దొంగలు దోచేస్తున్నారు. రెండు జేసీబీలతో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టి సుమారు 20కుపైగా లారీలతో తరలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికంగా కొందరు యువకులు తెలిపారు. అక్రమ కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. రేయింబవళ్లు అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా చెట్లను నరికేయడం, కొండలను పిండి చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ ధనార్జన చేస్తున్నారు. ఎవరైనా అధికారులు తూతూమంత్రంగా ఆపినా ఒకట్రెండు రోజులు తర్వాత షరామామూలే అన్నట్టుగా గ్రావెల్ దందా చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

నునపర్తిలో అక్రమ గ్రావెల్ దందా