breaking news
OTT
-
థియేటర్స్‌లో రూ.2000 కోట్లు.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్!
హారర్ సినిమాకు థియేటర్స్‌లో మంచి ఆదరణ ఉంటుంది. ప్రేక్షకులను కాస్త భయపెట్టాలే కానీ.. ఆ చిత్రాలకు బ్రహ్మరథం పడతారు. అందుకే అన్నిభాషల్లోనూ ఈ జానర్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను అతిగా భయపెట్టే సినిమాలు పెద్దగా రాలేదు. చాలా రోజుల తర్వాత హాలీవుడ్లో ఓ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ వచ్చింది. అదే వెపన్స్. . జాక్ క్రెగర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, ఆస్టిన్ అబ్రామ్స్, కేరీ క్రిస్టోఫర్, టోబీ హస్ లాంటి స్టార్స్ నటించారు. ఆగస్ట్ 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం..తొలి రోజే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 23.5 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 2 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ చిత్రం.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చి సర్ప్రైజ్ చేసింది.ఒకేసారి నాలుగు ఓటీటీల్లోకి.. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ సెప్టెంబర్ 9 నుంచి నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు ఆపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లేలలోకి ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. అయితే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు వీల్లేదు. ఓటీటీలో చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే. థియేటర్స్‌లోకి వెళ్లి చూసేంత సమయం లేని హారర్ ప్రియుల కోసం రెంట్ విధానంలో ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. థియేటర్స్‌లో బాగా ఆడుతున్న ఈ సినిమాను అప్పుడే ఓటీటీలోకి తీసుకొచ్చి మేకర్స్ పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. ఓటీటీలోనూ అదే స్థాయి కలెక్షన్స్ రాబటితే ఇబ్బంది లేదు..కానీ ఏమాత్రం తేడా జరిగినా..అది మేకర్స్ స్వయంకృత అపరాధమే అవుతుంది. వెపన్స్ కథేంటంటే.. ఇదొక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్. ఒక రోజు తెల్లవారుజామున 2:17 గంటలకు ఒకే క్లాస్‌కు చెందిన ఒక్క స్టూడెంట్ తప్ప మిగిలిన వారంతా కనిపించకుండా పోతారు. వాళ్లు ఎలా వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? అనేది తెలుసుకోవడమే ఈ సినిమా కథ. రూ. 335 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 2 వేల కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. -
OTT: రొమాన్స్ కాదు.. బ్రొమాన్స్.. ఎలా ఉందంటే..?
టైటిల్ : బ్రొమాన్స్నటీనటులు: మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ తదితరులుదర్శకత్వం: అర్జున్ డి. జోస్ఓటీటీ: సోనీ లివ్ఓటీటీలు వచ్చాక ఎంటర్టైన్మెంట్ను ఆస్వాదించడం మరింత సులభతరం అయిపోయింది. ఏ కొత్త సినిమా వచ్చినా నెల రోజుల్లోపే ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నారు. ఓటీటీలు రావడంతో కంటెంట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కంటెంట్ బాగుంటే ఏ మూవీనైనా ఆడియన్స్ వదలడం లేదు. ఏ భాషలో వచ్చినా కథ బాగుంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఇక మలయాళ సినిమాలు థియేటర్ల కంటే ఓటీటీల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. క్రైమ్, కామెడీ జోనర్ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అలాంటి జోనర్లో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్ట్రీమింగ్కు వచ్చేసిన మలయాళ సినిమా బ్రొమాన్స్. టైటిల్‌తోనే ఆసక్తి పెంచేసిన బ్రొమాన్స్.. సినిమా ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..షింటో (శ్యామ్ మోహన్), బింటో (మాథ్యూ థామస్) ఇద్దరు అన్నదమ్ములు. అమ్మా, నాన్నతో కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. అయితే ప్రతి విషయంలో అన్నతో తమ్ముడు బింటోను పోలుస్తూ ఉంటారు. ఇది నచ్చని బింటో అన్న అంటే అంతగా ఇష్టముండదు. ఇద్దరు కలిసి అప్పుడప్పుడు చిల్ అవుతూ ఉంటారు. బింటో ఎప్పుడు రీల్స్ పిచ్చిలో పడి లైఫ్‌ను అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఊహించని విధంగా బింటో అన్న షింటో మిస్సింగ్ అవుతాడు. ఆ తర్వాత తనకు అంతగా ఇష్టం లేని అన్న కోసం తమ్ముడు ఏం చేశాడు? చివరికీ అన్న షింటోను కనిపెట్టాడా? లేదా? అన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..సాధారణంగా అన్నదమ్ముల స్టోరీ అనగానే సగటు ఆడియన్స్ ఎమోషనల్ డ్రామా అనుకుంటే పొరపాటే. కథ ప్రారంభంలో ఫ్యామిలీ లైఫ్, అన్నదమ్ముల అనుబంధం చూడగానే ఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ కథ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ డైరెక్టర్ ఇక్కడ తీసుకున్న పాయింట్ ఏంటంటే.. ఎమోషనల్ టచ్ ఇచ్చి.. కామెడీ పండించాడు. ఒకవైపు అన్న అంటే పడని తమ్ముడు.. అతను మిస్సింగ్ అయ్యాడని తెలిశాక జరిగే పరిణామాలు అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తుచేస్తాయి. ఆ తర్వాత అన్న కోసం ఆరా తీసే క్రమంలో షింటో స్నేహితుడు షబీర్ (అర్జున్ అశోకన్) బింటోకు సాయం చేస్తాడు. ఈ క్రమంలో వీరిద్దరికీ డాక్టర్ ఐశ్వర్య, ఎస్సై టోనీ నుంచి ఊహించని ట్విస్ట్‌లు ఎదురవుతాయి. ఈ సన్నివేశాలు సీరియస్‌గా అనిపించినా.. ప్రతి సీన్లో కామెడీ పండించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.అన్నదమ్ముల సెంటిమెంట్ అనే లైన్ తీసుకున్న డైరెక్టర్.. కథను పూర్తిగా కామెడీ యాంగిల్లోనే తీసుకెళ్లాడు. అన్న కోసం వెతుకుతున్న బింటో.. ఎథికల్ హ్యాకర్ హరిహరసుధన్ సాయం తీసుకుంటాడు వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్‌ను తెగ నవ్విస్తాయి. అలా బింటో అన్న కోసం వెతుకున్న టీమ్‌లో కీలక మెంబర్ పాత్ర పోషిస్తాడు. తన అన్నను ఏమైనా అంటే విపరీతమైన కోపంతో ఊగిపోయే బింటోకు కొరియర్ బాబు రూపంలో గట్టి షాక్ తగులుతుంది. ఆ తర్వాత ఎస్సై ఎంట్రీ ఇవ్వడంతో కథ కామెడీతో పాటు ఆసక్తికరంగా మారుతుంది. కేరళలో మొదలైన కథ.. కర్ణాటకకు షిప్ట్ అయ్యాక కథలో వచ్చే సీన్స్ ఆడియన్స్‌లో నవ్వులు పూయిస్తాయి. ప్రతి సీన్లో కామెడీని ఇరికించే ప్రయత్నం చేశాడు. ఎమోషనల్‌కు ముడిపెట్టి ఫుల్ కామెడీ వైపు నడిపించిన దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే కేవలం కామెడీపైనే దృష్టి పెట్టడంతో సగటు ప్రేక్షకుడికి కథతో ఎమోషనల్ టచ్ మిస్సయింది. ఆ విషయంలో డి జోస్ మరింత ఫోకస్ చేయాల్సింది. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే అక్కడ కూడా సీరియస్‌నెస్ ఉన్నప్పటికీ.. ఫైట్ సీన్ ఆద్యంతం నవ్వులు తెప్పించాడు. క్లైమాక్స్‌లో ఎమోషనల్ టచ్ ఇచ్చినా.. అంతగా ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో భావోద్వేగాలు పండించలేకపోయాడు. చివర్లో చిన్న ట్విస్ట్ ఇచ్చి.. నవ్విస్తూనే ఎండ్ కార్డ్ పడేశాడు. ఓవరాల్‌గా చూస్తే సీరియస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఈ వీకెండ్లో ఫుల్‌గా నవ్వుకోవాలంటే..ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. అభ్యంతరకర సన్నివేశాలు లేనందున ఫ్యామిలీతో చూసేయొచ్చు.ఎవరెలా చేశారంటే...ప్రేమలు మూవీతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన మాథ్యు థామస్ తన పాత్రలో మెప్పించాడు. షింటోగా శ్యామ్ మోహన్ తన పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఎథికల్ హ్యాకర్ హరిహరసుధన్గా సంగీత్ ప్రతాప్ పాత్ర కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, శ్యామ్ మోహన్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. గోవింద్ వసంత నేపథ్య సంగీతం బాగుంది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. చామన్ చాకో కొన్ని అనవసర సీన్స్‌ను కట్ చేయాల్సింది. నిర్మాణ విలువల పరంగా ఫర్వాలేదపించారు. -
ఓటీటీలో వెబ్ సిరీస్లదే హవా.. ఏ భాషలో ఎక్కువ చూస్తున్నారంటే..?
భారత్‌లో ఓవర్ ద టాప్ (ఓటీటీ) వేదికలు వైవిధ్యమైన కంటెంట్‌తో వీక్షకుల మది దోచుకుంటున్నాయి. ప్రధానంగా వెబ్ సిరీస్‌లకు జనం పట్టం కడుతున్నారు. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ మధ్య ప్రసారమైన ఒరిజినల్స్‌లో వెబ్ సిరీస్లదే హవా. వీక్షకుల పరంగా టాప్–50 ఒరిజినల్స్‌లో 80 శాతం వాటా వెబ్ సిరీస్‌లు కైవసం చేసుకోవడం విశేషం. అంతేగాక టాప్–10లో మొదటి తొమ్మిది స్థానాల్లోనూ ఇవే ఉండడం చూస్తుంటే వీక్షకుల ఆసక్తి ఇట్టే అర్థం అవుతోంది. ‘క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్’ హిందీ సిరీస్ ఏకంగా 2.77 కోట్ల మంది వ్యూయర్స్‌తో దేశంలో టాప్‌లో నిలిచింది. టాప్–50లో అయిదు సినిమాలు, అయిదు రియాలిటీ షోలు చోటు సంపాదించాయి. భాషల పరంగా చూస్తే హిందీ మొదటి స్థానంలో నిలిచింది. టాప్–50 జాబితాలో అత్యధికంగా 16 సిరీస్, సినిమాలు, రియాలిటీ షోలతో జియో హాట్‌స్టార్ ముందంజలో ఉంది. -
ఓటీటీల్లోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి వచ్చిన వాటిలో 'లిటిల్ హార్ట్స్' అనే చిన్న సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అనుష్క 'ఘాటీ'కి నెగిటివ్ టాక్ రాగా.. తమిళ డబ్బింగ్ 'మదరాసి' యావరేజ్ అనిపించుకుంది. మరోవైపు ఓటీటీల్లోనూ పలు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు-వెబ్ సిరీసులు వచ్చాయి. అవి కాకుండా మరో మూడు తెలుగు మూవీస్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి రావడం విశేషం. ఇంతకీ ఏంటా చిత్రాలు? ఎందులోకి వచ్చాయి?'ఆదిత్య విక్రమ వ్యూహ' పేరుతో తీసిన ఓ తెలుగు చిత్రం నేరుగా ఆహా ఓటీటీలోకి వచ్చింది. నిన్నటి (సెప్టెంబరు 05) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తొమ్మిది మందిని హత్య చేసి, జైలుకెళ్లిన ఓ ఖైదీ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. దీంతో వాడిని పట్టుకునేందుకు హీరోలిద్దరూ కలిసి ఓ మిషన్ చేపడతారు. తర్వాత ఏమైంది? హంతకుడిని పట్టుకున్నారా లేదా అనేదే మిగతా స్టోరీ. శ్రీ హర్ష, అరవింద్ ప్రధాన పాత్రలు పోషించగా.. శ్రీహర్షనే దర్శకత్వం కూడా వహించాడు.(ఇదీ చదవండి: ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్.. తొలిరోజు కలెక్షన్ ఎంతొచ్చాయ్?) అలానే 2021 డిసెంబరులో థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'బుల్లెట్ సత్యం'. దేవ్ రాజ్, సోనాక్షి వర్మ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పడు ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటీటీలో నిన్నటి (సెప్టెంబరు 05) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. బుల్లెట్ సత్యం చేసిన రాజకీయం ఏంటనేదే మూవీ స్టోరీ. కుటుంబ బంధాలతోపాటు రాజకీయ నేరాలు, థ్రిల్లర్ అంశాలు ఇందులో ఉన్నాయి.ఈ ఏడాది ఏప్రిల్ 18న రిలీజైన 'జగమెరిగిన సత్యం' సినిమా.. థియేటర్లలో పెద్దగా నిలబడలేదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు ఐదు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. హీరో రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ ఈ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. తెలంగాణలోని ఓ చిన్న ఊరిలో సత్యం (అవినాష్ వర్మ) అనే యువకుడి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? వాటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు అనే పాయింట్‌తో దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: 46 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న స్టార్ కమెడియన్) -
ఓటీటీలో అదరగొడుతున్న స్పై సిరీస్.. రెండు కథలు ఒకటే!
ఏ ఎండకాగొడుగు అన్న నానుడి వినే ఉంటారు. కాని ఇప్పుడు ఓటిటిల్లో దీనినే ఏ ట్రెండ్ కా స్టోరీ అన్న విధంగా నడుస్తోంది. ఆగష్టు 15 అనగానే , ఆ తేదీకి ముందు తరువాత నెలల్లో దేశభక్తి సినిమాలు రావడం పరిపాటే. ఇలా ప్రస్తుతం ఓటిటి సిరీస్ లు కూడా విడుదలవుతున్నాయి. ఇదే నేపధ్యంలో సరిగ్గా వారం రోజుల వ్యవధిలో రెండు దిగ్గజ ఓటిటిల్లో రెండు సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. వాటిలో జియో హాట్ స్టార్ వేదికగా సలాక్కార్ ఒకటి అయితే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సారే జహా సే అచ్చా మరొకటి. వీటిలో విశేషం ఏమిటంటే రెండు కథాంశాలు దాదాపు ఒకటే. పాత్రలు, కథను నడిపించిన తీరు తప్ప రెండూ అన్నిటికీ అన్నీ సమానమే.అంతలా వీటిలో ఉన్న కథాంశమేమిటో ఓ సారి చూద్దాం.1960 నుండి 1990 సంవత్సర కాలంలో భారతదేశానికి యుద్ధాలు, ఇతర దేశాల నుండి కవ్వింపు చర్యలు లాంటివి ఎన్నో జరిగాయి. సరిగ్గా పాకిస్తాన్ భారత్ తో యుద్ధం జరిగిన ఆ సమయంలో పాకిస్తాన్ దేశం న్యూక్లియార్ బాంబును తయారు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కాని ఆ ప్రయత్నాలన్నీ మన దేశానికి సంబంధించిన గూఢాచార సంస్థ రా నాశనం చేసింది. తమ సంస్థ ద్వారా పాకిస్తాన్ లోకి గూఢాచారులను పంపి పాకిస్తాన్ న్యూక్లియార్ బాంబు తయారీని సమర్ధవంతంగా ఎదుర్కుంది.ఇప్పుడు పైన చెప్పుకున్న రెండు టీవి సిరీస్ లలో ఇదే కథా నేపధ్యం. 1978 లో పాకిస్తాన్ దేశం జనరల్ జియా నేతృత్వంలో ఉంది. ఆ సమయంలో ఆదిర్ దయాళ్ అనే గూఢాచారి ఇండియన్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ గా పాకిస్తాన్ లో ప్రవేశిస్తాడు. పాకిస్తాన్ లోని ఓ ప్రాంతంలో న్యూక్లియార్ బాంబు తయారవుతుందని తెలుసుకోని ఆ ప్రయత్నాలను నాశనం చేయడమే జియో హాట్ స్టార్ లో 5 ఎపిసోడ్లతో స్ట్రీమ్ అవుతున్న సలాక్కార్ కథ.1972 లో పాకిస్తాన్ దేశం భారత్ తో షిమ్లా ఒప్పందం తరువాత ఆ దేశ నేత అయిన జుల్ఫికర్ అలీ భుట్టో వేరే దేశాల నుండి విడిభాగాలు తెప్పించి పాకిస్తాన్ లో న్యూక్లియార్ బాంబు తయారు చేయాలనుకుంటాడు. ఈ ఆపరేషన్ కి ఐయస్ఐ హెడ్ అయిన ముర్తజా మాలిక్ ని నియమిస్తాడు. మాలిక్ ఆపరేషన్ ని పాకిస్తాన్ లోనే ఉన్న భారత గూఢాచారి విష్టు సర్వనాశనం చేస్తాడు.ఇదే నెట్ ఫ్లిక్స్ లో 6 ఎపిసోడ్లతో స్ట్రీమ్ అవుతున్న సారే జహా సేఅచ్ఛా సిరీస్ కథ.రెండు సిరీస్ లు థ్రిల్లర్ జోనర్ తో వచ్చినవే.చూసే ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయనడంలో సందేహమే లేదు. చరిత్రలో కనమరుగైన మన గూఢాచారుల కథలు ఇవి. వర్త్ ఫుల్ వాచ్ -
ఓటీటీలో 'సు ఫ్రమ్ సో'.. అఫీషియల్ ప్రకటన
కన్నడ హిట్ సినిమా 'సు ఫ్రమ్ సో'(Su From So Movie) ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. షనీల్ గౌతమ్, సంధ్య, రాజ్ బి.శెట్టి తదితరులు నటించిన హారర్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని క్రియేట్ చేసింది. ఈ మూవీకి కథ, దర్శకత్వం జేపీ తుమినాడ్ అందించారు. తెలుగులో ఆగష్టు 8న మైత్రీ మూవీ మేకర్స్ వారు విడుదల చేశారు.కన్నడలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన 'సు ఫ్రమ్ సో' చిత్రం.. తెలుగులో కూడా ప్రేక్షకులను మెప్పించింది. అయితే, ఈ చిత్రం జియోహాట్‌స్టార్ (JioHotstar)లో సెప్టెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు ఆ ఓటీటీ సంస్థ అప్‌కమింగ్ సినిమా జాబితాలో 'సు ఫ్రమ్ సో'ను చేర్చింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్లో విడుదల కానుంది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఏకం రూ.40కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.కథేంటి?కర్ణాటక తీరప్రాంతంలోని ఓ పల్లెటూరు. అశోక్(జేపీ తుమినాడు) అనే కుర్రాడికి ఓ రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలోని సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యమే ఇతడికి ఆవహించిందని ఊరి ప్రజలందరూ అనుకుంటారు. దీంతో ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని వదిలించాలని ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్).. ఓ స్వామిజీని(రాజ్ బి శెట్టి) తీసుకొస్తాడు. ఆత్మని వదిలించే క్రమంలో ఇది కాస్త ఊరి సమస్యగా మారుతుంది. ఇంతకీ ఆ యువకుడికి నిజంగానే దెయ్యం పట్టిందా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఈ వీకెండ్ థియేటర్లలోకి ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్ సినిమాలు వచ్చాయి. వీటిలో లిటిల్ హార్ట్స్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు ఓటీటీల్లోనూ 20కి పైగా మూవీస్ వచ్చాయి. అయితే ఓ మూవీ మాత్రం థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే స్ట్రీమింగ్‌లోకి రావడం విశేషం. రొమాంటిక్ కామెడీ కథతో తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఎందులో అందుబాటులోకి వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ)రాజు జయమోహన్, ఆద్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ సినిమ 'బన్ బటర్ జామ్'. ప్రేమ, పెళ్లి, స్నేహం అనే కాన్సెప్ట్‌తో తీశారు. 'ప్రేమలో ఓడిపోతే అక్కడే ఆగిపోవాలా? తిరిగి లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి?' అనే పాయింట్ బాగా చెప్పారు. అలానే స్నేహం, నిజమైన ప్రేమ మధ్య తేడా చూపించిన విధానం కూడా బాగుంది. జూలై 18న ఈ చిత్రం తమిళంలో రిలీజ్ కాగా దాదాపు నెల తర్వాత అంటే ఆగస్టు 22న తెలుగులో థియేటర్లలో రిలీజ్ చేశారు.స్టార్స్ లేకపోవడం, ప్రచారం చేయకపోవడం వల్ల ఈ సినిమా అనేది ఒకటి తెలుగులో థియేటర్లలో రిలీజైందని విషయం కూడా ప్రేక్షకులకు రీచ్ కాలేదు. ఇప్పుడు రెండు వారాలు తిరిగేసరికల్లా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. 'బన్ బటర్ జామ్' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ)'బన్ బటర్ జామ్' విషయానికొస్తే.. చంద్రు (రాజు జయమోహన్), మధుమిత (ఆద్య ప్రసాద్) ఇంటర్ పూర్తి చేస్తారు. వీళ్ల తల్లిదండ్రులు ఓ పెళ్లిలో కలిసి క్లోజ్ అవుతారు. ప్రస్తుత జనరేషన్లో ప్రేమ, అరేంజ్డ్ పెళ్లిళ్లు నిలబడట్లేదని మాట్లాడుకున్న వీళ్లు ఓ ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలోనే చంద్రు పక్కింట్లో మధుమిత కుటుంబం దిగుతుంది. ఇంజినీరింగ్ చేరిన చంద్రు.. నందిని(భవ్య త్రిఖ)తో ప్రేమలో పడతాడు. నందినిని చంద్రు స్నేహితుడు శ్రీనివాస్ (మైఖేల్ తంగదురై) కూడా ప్రేమిస్తుంటాడు. మరోవైపు మధుమిత.. ఆకాష్ (వీజే పప్పు) అనే కుర్రాడిని ప్రేమిస్తుంది. ఒకరంటే ఒకరు పడని చందు, మధుమితలను కలిపేందుకు వాళ్ల తల్లిదండ్రులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చివరకు ఎవరి ప్రేమ సుఖాంతమైంది అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: అనుష్క శెట్టి ‘ఘాటి’ మూవీ రివ్యూ) -
ఓటీటీలో హారర్, కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘బకాసుర రెస్టారెంట్’.. ఆగష్టు 8న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఎస్జే శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటించాడు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ముఖ్యపాత్రల్లో నటించారు.‘బకాసుర రెస్టారెంట్’ హారర్, థ్రిల్లర్, మైథాలజీ కాన్సెప్ట్‌తో స్టోరీ ఉంటుంది. అయితే, ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ, ఓటీటీ ప్రేక్షకులకు నచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 12న 'సన్నెక్స్ట్' (Sun NXT)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది. మన స్నేహితుడు అనివార్య కారణాల వల్ల మనకు దూరమైతే ఎంతటి బాధ ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఆపై కామెడీ ఎటూ ఉండటంతో ఓటీటీ ప్రేక్షకులకు మంచి కాలక్షేపాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు.కథేంటంటే..పరమేశ్వర్(ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్‌కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తినేస్తుంది.ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్ రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
వరుసగా మూడు రోజుల సెలవులు.. ఓటీటీల్లో ఒక్కరోజే 15 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. అంతేకాకుండా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చేశాయి. దీంతో సినీ ప్రియులు కొత్త మూవీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక థియేటర్ల విషయానికొస్తే అనుష్క శెట్టి ఘాటి, శివ కార్తికేయన్ మదరాసితో పాటు లిటిల్ హార్ట్స్ లాంటి చిత్రాలు సందడి చేయనున్నాయి. వీటిలో అనుష్క ఘాటిపైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. ఇక వీటి సంగతి పక్కనపెడితే శుక్రవారం వచ్చిందంటే చాలు.. ఓటీటీలకు సినిమాలు క్యూ కడుతుంటాయి. ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఇప్పటికే కన్నప్ప ఓటీటీలో సందడి చేస్తుండగా.. మాలిక్, ఇన్స్పెక్టర్ జెండే లాంటి సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ఇన్స్పెక్టర్ జెండే (హిందీ మూవీ) - సెప్టెంబరు 05క్వీన్ మాంటిస్-(కొరియన్ మూవీ)- సెప్టెంబరు 05లవ్ కాన్ రివేంజ్-(డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబరు 05డాక్టర్ సెస్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్(యానిమేషన్ చిత్రం)- సెప్టెంబరు 05జియో హాట్స్టార్సు ఫ్రమ్ సో(సులోచన ఫ్రమ్ సోమేశ్వరం)- సెప్టెంబర్ 05(రూమర్ డేట్)ఎన్సీఐఎస్-టోని అండ్ జీవా(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05ఏ మైన్‌క్రాఫ్ట్ -(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05ది పేపర్- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05అమెజాన్ ప్రైమ్మాలిక్- (హిందీ మూవీ)- సెప్టెంబర్ 05డిష్ ఇట్ అవుట్-(ఒరిజినల్ సిరీస్)-సెప్టెంబర్ 05సన్ నెక్స్ట్ ఫుటేజ్ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 05జీ5 అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 05 కమ్మట్టం (మలయాళ సిరీస్) - సెప్టెంబరు 05ఆపిల్ ప్లస్ టీవీ హైయస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 05ఎమ్ఎక్స్ ప్లేయర్ రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 06లయన్స్ గేట్ ప్లేలాక్డ్- (హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబరు 05 -
అఫీషియల్: ఓటీటీలో 'కూలీ' రిలీజ్ ఎప్పుడంటే?
రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ (Coolie Movie). టాలీవుడ్ నుంచి నాగార్జున, బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్, మాలీవుడ్ నుంచి సౌబిన్ షాహిర్, సాండల్‌వుడ్ నుంచి ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. భారీ తారాగణంతో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను అందుకుంది. టాక్ సంగతి ఎలా ఉన్నా.. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓటీటీ డేట్ వచ్చేసిందిఅయితే వెయ్యికోట్ల మైలురాయి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. సెప్టెంబర్ 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ వదిలారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూలీ అందుబాటులోకి రానుందని తెలిపారు. అయితే హిందీ రిలీజ్ గురించి మాత్రం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అంటే కూలీ హిందీ వర్షన్ మరో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రానుందని తెలుస్తోంది.సినిమాకూలీ సినిమా విషయానికి వస్తే.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ హీరోగా నటించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు. శృతి హాసన్, సత్యరాజ్, రచిత రామ్ ముఖ్య పాత్రలు పోషించారు. హీరోయిన్ పూజా హెగ్డే మోనికా అనే స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) చదవండి: అల్లు అర్జున్ సినిమాలో యాక్ట్ చేశా.. నా భార్య తిట్టింది: నిర్మాత -
రూ. 9 వేల కోట్ల కలెక్షన్స్.. సడెన్‌గా తెలుగులో స్ట్రీమింగ్
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ హిట్ సినిమా 'లిలో అండ్ స్టిచ్' ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. మే 23న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు భారత అభిమానుల కోసం స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉండనుందని మొదట ప్రకటించారు. అయితే, ఇప్పుడు సడెన్‌గా తెలుగు వర్షన్ కూడా వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.'లిలో అండ్ స్టిచ్' చిత్రాన్ని వాల్ట్ డిస్నీ పిక్చర్స్, రైడ్బ్యాక్ సంయుక్తంగా నిర్మించాయి. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రంగా డీన్ ఫ్లీషర్ క్యాంప్ దర్శకత్వం వహించారు. 2002లో ఇదే టైటిల్‌తో విడుదలైన సినిమాకు లైవ్-యాక్షన్ రీమేక్‌గా తెరకెక్కించారు. సెప్టెంబర్ 3 నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రకటనలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ భాషలలో మాత్రమే విడుదల కానుందని జియోహాట్‌స్టార్ మొదట చెప్పింది. తన టాలీవుడ్ సబ్స్క్రైబర్లను నిరాశపరచకూడదని సడెన్‌గా తెలుగు వర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.'లిలో' జీవితం కోట్ల కలెక్షన్స్ రాబట్టిందిప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ. 8800 కోట్ల వసూళ్లను రాబట్టిన ‘లిలో అండ్ స్టిచ్’ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ యానిమేటెడ్ క్లాసిక్ లైవ్ యాక్షన్ సినిమాలో మైయా కీలోహా, సిడ్నీ అగుడాంగ్, క్రిస్ సౌండర్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కుటుంబ సమస్యలతో ఒంటరిగా బాధపడుతున్న లిలో అనే అమ్మాయి జీవితంలోకి స్టిచ్ అనే గ్రహాంతరవాసి ఎంటర్ అవుతుంది. వారిద్దరి మధ్య స్నేహం మొదలౌతుంది. దీంతో లిలో జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరి హృదయాన్ని తాకే చిత్రంగా ప్రశంసలు దక్కించుకుంది. -
ఓటీటీలో 'కన్నప్ప' స్ట్రీమింగ్..
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన 'కన్నప్ప' (Kannappa) సెప్టెంబర్ 4న ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే, అనుకున్న సమయానికి స్ట్రీమింగ్కు రాకపోడంతో నెటిజన్లు పోస్టులు షేర్ చేశారు. దీంతో కాస్త ఆసల్యంగా ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్ వంటి స్టార్స్ నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది.'కన్నప్ప' సెప్టెంబర్ 4నుంచి స్ట్రీమింగ్కు రానున్నట్లు సోషల్‌మీడియా ద్వారా మంచు విష్ణు ప్రకటించారు. అయితే, ఈ చిత్రం మొదట అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రాకపోడంతో నెటిజన్లు సదరు ఓటీటీ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. దీంతో కాస్త ఆలస్యంగా కన్నప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. ఈ క్రమంలో మరో పోస్టర్‌ను విడుదల చేశారు. థియేటర్లో చూడనివారు ఈ వీకెండ్లో చూసేయండి. -
ఓటీటీకి సూపర్ హిట్ దెయ్యం సినిమా.. పోస్టర్ వైరల్
కన్నడలో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన హిలారియస్ కామెడీ ఎంటర్టైనర్ సు ఫ్రమ్ సో(సులోచన ఫ్రమ్ సోమేశ్వరం). కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శాండల్‌వుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. ఈ హారర్ కామెడీ మూవీ ఆగస్టు 8న థియేటర్లలో సందడి చేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి రానుందని సోషల్‌మీడియాలో పలు పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. ఈ నెల ఐదో తేదీ నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి జేపీ తుమినాద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని లైటర్ బుద్ధ ఫిల్మ్స్ బ్యానర్‌పై శశిధర్ శెట్టి బరోడా, రాజ్ బీ శెట్టి, రవి రాయ్ కలిసి నిర్మించారు. సు ఫ్రమ్ సో కథేంటంటే?కర్ణాటక తీరప్రాంతంలోని ఓ పల్లెటూరు. అశోక్(జేపీ తుమినాడు) అనే కుర్రాడికి ఓ రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలోని సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యమే ఇతడికి ఆవహించిందని ఊరి ప్రజలందరూ అనుకుంటారు. దీంతో ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని వదిలించాలని ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్).. ఓ స్వామిజీని(రాజ్ బి శెట్టి) తీసుకొస్తాడు. ఆత్మని వదిలించే క్రమంలో ఇది కాస్త ఊరి సమస్యగా మారుతుంది. ఇంతకీ ఆ యువకుడికి నిజంగానే దెయ్యం పట్టిందా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
2 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటిలో థ్రిల్లర్, హారర్, యాక్షన్.. ఇలా వివిధ జానర్స్ ఉంటాయి. అయితే చాలామంది యాక్షన్ లేదా థ్రిల్లర్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)యాక్షన్ సినిమాలనగానే చాలామందికి హాలీవుడ్ గుర్తొస్తుంది. అందుకు తగ్గట్లే 2021లో వచ్చిన 'నోబడీ'.. ఈ జానర్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రాల్లో ఇది టాప్-10లో ఉండటం విశేషం. దీనికి సీక్వెల్ 'నోబడీ 2'.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్ వచ్చింది. మరి ఏమైందో ఏమో గానీ రెండు వారాలు తిరిగేసరికల్లా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు యూఎస్, యూకే లాంటి దేశాల్లో అందుబాటులో ఉంది. మరి వారం పదిరోజుల్లో మన దగ్గర కూడా రావొచ్చు.'నోబడీ 2' విషయానికొస్తే.. భార్య, పిల్లలతో కలిసి హీరో విహారయాత్రకు వెళ్తాడు. అక్కడ సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. కానీ పిల్లలు అనుకోకుండా చేసిన ఓ పని వల్ల చిన్న గొడవ జరుగుతుంది. అది కాస్త పెద్దది అయి.. ఓ కోటీశ్వరుడి సామ్రాజ్యాన్ని నేలకూల్చే వరకు వెళ్తుంది. మరి హీరో.. తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ప్రారంభం నుంచి చివరివరకు కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్ ఉంటాయి. చిన్న గ్యాప్ అనేది లేకుండా యమ స్పీడుగా వెళ్తుంది. నిడివి కూడా గంటన్నర కావడం ఇక్కడ విశేషం.(ఇదీ చదవండి: 'వీరమల్లు'కు జీఎస్టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?) -
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
రీసెంట్గా 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా రిలీజైంది. పాజిటిక్ టాక్ వచ్చినా సరే దీన్ని జనాలు పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స.. తన చిత్రం చూసేందుకు ఎవరూ థియేటర్లలోకి రావట్లేదని బాధపడుతూ చెప్పుతో కొట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు గతంలో తీసిన మరో మూవీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: 120 దేశాలు.. 100 కోట్ల మంది.. కెన్యా మంత్రితో రాజమౌళి)డైరెక్టర్ మోహన్ శ్రీవత్స 'బార్బరిక్' కంటే ముందు 'కరణ్ అర్జున్' అనే సినిమా తీశాడు. 2022 జూన్‌లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ లేకపోవడం, కంటెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో థియేటర్లలో పెద్దగా ఫెర్మార్మ్ చేయలేదు. జనాలు ఆ చిత్రం గురించి మర్చిపోయారు. అలాంటిది దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'కరణ్ అర్జున్' విషయానికొస్తే.. కరణ్ (నిఖిల్ కుమార్) తనకు కాబోయే భార్య వృషాలి(షిఫా)తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళ్తాడు. ఆ దారిలో అర్జున్ (అభిమన్యు) వీళ్లిద్దరినీ వెంటాడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఒకానొక సమయంలో అర్జున్ ఆ ఇద్దరిని షూట్ చేసి చంపాలనుకుంటాడు. అర్జున్ నుంచి తప్పించుకోవడానికి ఎడారి ప్రాంతంలో అనేక పాట్లు పడతారు కరణ్, వృషాలి. వీరిద్దరిని అర్జున్ ఎందుకు వెంబడించాడు? చివరకు ఏమైందనేదే మిగతా సినిమా.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే) -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ థ్రిల్లర్.. ఏకంగా టాప్-3లో ట్రెండింగ్!
కంటెంట్ బాగుంటే చాలు సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. మరికొన్ని చిత్రాలేమో థియేటర్లలో అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇక థియేటర్ల సంగతి పక్కనపెడితే.. ఓటీటీలో ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఆ జోనర్లో వచ్చిన చిత్రాలు డిజిటల్‌గా దూసుకెళ్తున్నాయి. ఇటీవల ఆర్కే సాగర్, మిషా నారంగ్ జోడీగా నటించిన టాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ది 100. ఈ మూవీలో ధన్యా బాలకృష్ణ కీలకపాత్రలో నటించింది. జూలై 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోలీస్ థ్రిల్లర్ మూవీకి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించారు.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ఇండియా వ్యాప్తంగా టాప్-3లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. కాగా.. ఈ చిత్రంలో ఆర్కే సాగర్ ఐపీఎల్ అధికారి విక్రాంత్ పాత్రలో మెప్పించారు.ఈ విషయాన్ని దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా సినిమా ది 100 అమెజాన్ ప్రైమ్‌లో భారతదేశంలో టాప్ -3లో ట్రెండింగ్ అవుతోంది. మా సినిమాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రేమ, ప్రోత్సాహమే ఈ ఘనతకు కారణమని సంతోషం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Sasidhar P (@raghavomkarsasidhar) -
ఓటీటీకి మంచు విష్ణు కన్నప్ప.. డేట్ ఫిక్స్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన చిత్రం 'కన్నప్ప'. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ నటించారు. అయితే ఈ మూవీ విడుదలై రెండు నెలల దాటినా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. దీంతో ఎప్పుడొస్తుందా అని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. ఈనెల నాలుగో తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ సినిమాను అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. థియేటర్లలో మిస్సయిన ఈ విజువల్ వండర్‌ను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.కన్నప్ప అసలు కథేంటంటే..తిన్నడు(మంచు విష్ణు) పరమ నాస్తికుడు. అతని తండ్రి నాథ నాథుడు(శరత్ కుమార్) మాటే ఆయనకు వేదం. గూడెం ప్రజలకే ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. పక్క గూడానికి చెందిన యువరాణి నెమలి(ప్రీతీ ముకుందన్)తో ప్రేమలో పడతాడు. ఓసారి గూడెంలో ఉన్న వాయు లింగం కోసం వచ్చిన కాల ముఖుడు (అర్పిత్ రాంకా) సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు. ఈ విషయం కాల ముఖుడికి తెలిసి.. గూడెంపై దండయాత్రకు బయలుదేరుతాడు. అదే సమయంలో ఓ కారణంగా తిన్నడు గూడాన్ని వీడాల్సి వస్తుంది. నెమలితో కలిసి అడవికి వెళ్తాడు. శివుడి పరమభక్తురాలైన నెమలి.. దేవుడినే నమ్మని తిన్నడు కలిసి జీవితం ఎలా సాగించాడు? వీరి జీవితంలోకి రుద్ర(ప్రభాస్) ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది? వాయు లింగం కోసం కాల ముఖుడు ఎందుకు వెతుకుతున్నాడు? పరమ నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడు పరమ భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే
మరోవారం వచ్చేసింది. గత వీకెండ్ చిన్న సినిమాలే థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో డబ్బింగ్ చిత్రం 'కొత్త లోక'.. ఉన్నంతలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మిగిలినవి తేలిపోయాయి. మరోవైపు ఈసారి అనుష్క శెట్టి చాన్నాళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన 'ఘాటీ' విడుదలకు సిద్దమైంది. దీనికి పోటీగా తమిళ డబ్బింగ్ మూవీ 'మదరాశి' రాబోతుంది. దీనిపై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే హీరో శివకార్తికేయన్ అయినాసరే దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కావడమే దీనికి కారణం. ఇది కాకుండా 'లిటిల్ హార్ట్స్' ఓ తెలుగు మూవీ కూడా విడుదల కానుంది.(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు)మరోవైపు ఓటీటీల్లోనూ మరీ ఎక్కువ సినిమాలేం రావట్లేదు. 10కి పైగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇన్స్పెక్టర్ జెండే, ద ఫాల్ గాయ్ చిత్రాలు ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు వీకెండ్ అయ్యేసరికి కొత్త చిత్రాలు సడన్ సర్ప్రైజ్ ఇవ్వొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్ద ఫాల్ గాయ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 03ఇన్స్పెక్టప్ జెండే (హిందీ మూవీ) - సెప్టెంబరు 05హాట్స్టార్ట్రేడ్ అప్ (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబరు 01లిలో అండ్ స్టిచ్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 03అమెజాన్ ప్రైమ్ఔట్ హౌస్ (హిందీ సినిమా) - సెప్టెంబరు 01సన్ నెక్స్ట్సరెండర్ (తమిళ మూవీ) - సెప్టెంబరు 04ఫుటేజ్ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 05జీ5అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 05కమ్మట్టం (మలయాళ సిరీస్) - సెప్టెంబరు 05ఆపిల్ ప్లస్ టీవీహైయస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 05ఎమ్ఎక్స్ ప్లేయర్రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 06(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు) -
కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి!
హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ, విలన్ ఎంట్రీ, నాలుగు ఫైట్లు, డ్యుయెట్లు.. శుభం పలికే క్లైమాక్స్.. దాదాపు అన్ని సినిమాల్లో ఇవే ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే సినిమాలో ఇవేవీ ఉండవు. అయినా ఎంతోమందిని ఈ చిత్రం కదిలించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ సినిమా చూసి నవ్వుతూనే ఏడ్చేశారు. అందుకే హీరోయిన్ అదితి బాలన్, దర్శకుడు అరుణ్ ప్రభును ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసులు బహుకరించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం సినిమా అద్భుతమని, చివరి పావుగంట నమ్మలేకుండా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఆ సినిమా పేరు అరువి. 2017లో వచ్చిన ఈ తమిళ చిత్రం రూ.1 కోటితో తెరకెక్కి రూ.35 కోట్లకు పైగా వసూలు చేసింది. దర్శకుడు అరుణ్ ప్రభుకు, హీరోయిన్గా అదితి బాలన్‌కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో ఏముందో చూద్దాం..కథఏ అమ్మాయికైనా తండ్రంటే పంచ ప్రాణాలు. తల్లి కోప్పడినా తండ్రి మాత్రం గారాబం చేస్తుంటాడు. అరువి అనే అమ్మాయి కూడా తండ్రి చేతిలో అల్లారుముద్దుగా పెరిగింది. కానీ ఓ యాక్సిడెంట్ వల్ల తన జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. తనకో సమస్య ఉందని ఇంట్లోవాళ్లే ఆమెను ఛీ కొడతారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినా ఎవరూ లెక్కచేయరు. ఇంట్లో నుంచి గెంటేస్తారు. కన్నీళ్లతో ఇంటినుంచి బయటకు వస్తుంది. (Aruvi Movie Review)హృదయ విదారక కథకానీ, ఆ కన్నీళ్లను చూసి సమాజం జాలిపడదు సరికదా! దాన్నే అలుసుగా తీసుకుంటుంది. అలా ముగ్గురు మగవారి చేతిలో మోసపోతుంది. ఎమిలీ అనే ట్రాన్స్‌జెండర్ స్నేహితురాలితో కలిసి ఈ విషయాన్ని ఓ టీవీ డిబేట్లో వెల్లడిస్తుంది. అక్కడి నుంచి సినిమా మరో మలుపు తిరుగుతుంది. అసలు అరువి జీవితాన్ని తలకిందులు చేసిన సమస్య ఏంటి? కంటిరెప్పలా చూసుకున్న కన్నతండ్రే ఆమెను ఎందుకు గెంటేశాడు? చావు తథ్యమని తెలిసి ఆమె ఏం చేసింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో అరువి చూడాల్సిందే!క్లైమాక్స్‌లో ఏడ్చేస్తారుసినిమా ప్రారంభంలో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ ఒక్క సంఘటన తర్వాత కథ ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. చేయని తప్పుకు అరువి జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది. ఎవరూ తనను నమ్మకపోవడమనేది ఆమెను మానసికంగా చిత్రవధ చేస్తుంది. సినిమా చివర్లో హీరోయిన్ మాట్లాడే మాటలు కంటతడి పెట్టిస్తాయి. ఐఎమ్‌డీబీలో 8.3 రేటింగ్ ఉన్న ఈ సినిమా తప్పకుండా చూడండి! -
ఓటీటీలో 'ట్వెల్త్ ఫెయిల్' హీరో కొత్త సినిమా
'ట్వెల్త్ ఫెయిల్' సినిమాతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విక్రాంత్ మాస్సే రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ చిత్రం తర్వాత ఆయన నటించిన 'ఆంఖో కి గుస్తాఖియాన్' మూవీ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ రాసిన "The Eyes Have It" అనే కథ ఆధారంగా ఈ సనిమాను దర్శకుడు సంతోష్ సింగ్ రూపొందించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది.'ఆంఖో కి గుస్తాఖియాన్' చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు జీ5 ప్రకటించింది. సెప్టెంబర్ 5నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె శనయా కపూర్ హీరోయిన్గా నటించింది. ఈమెకిదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో శనయా థియేటర్ ఆర్టిస్ట్‌గా నటించగా.. విక్రాంత్ అంధ సంగీతకారుడి పాత్రలో మెప్పించారు. భావోద్వేగపూరితమైన వారి ప్రేమకథకు యూత్ బాగానే కనెక్ట్ అయింది. -
'పోలీస్ పోలీస్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
ప్రముఖ ఓటీటీ సంస్థ 'జియో హాట్‌స్టార్' (Jio Hotstar) నుంచి కొత్తకొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ క్రమంలో తాజాగా 'పోలీస్ పోలీస్' (Police Police) అనే సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 19న స్ట్రీమింగ్ అవుతుందని ఒక ప్రోమోను పంచుకుంది. అయితే, ఈ వెబ్ సిరీస్ తమిళ్లో తెరకెక్కుతుంది. కానీ, తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు, లవ్, కామెడీ వంటి కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ ఉండనుంది. -
ఓటీటీలో తమన్నా 'బీర్' స్టోరీ.. ట్రైలర్ రిలీజ్
కొన్నేళ్ల ముందు వరకు హీరోయిన్గా తమన్నా వరస సినిమాలు చేసింది. తర్వాత ట్రెండ్‌కి తగ్గట్లు ఐటమ్ సాంగ్స్ చేసింది. ఓటీటీల్లో పలు సిరీస్‌లు కూడా చేసింది. ఇప్పుడు కూడా ఓ కొత్త సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. బీర్ తయారు చేయడం బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: హీరోయిన్ తో నిశ్చితార్థం చేసుకున్న హీరో విశాల్)పెద్ద కంపెనీలో పనిచేసే తమన్నా ఉద్యోగం ఊడిపోతుంది. ఈమె ఫ్రెండ్‌ది కూడా సేమ్ పరిస్థితి. దీంతో డబ్బు సంపాదించేందుకు బీర్ తయారు చేసి అమ్మాలని నిర్ణయించుకుంటారు. దీని కోసం బీర్ తయారు చేసే ఒకడిని వెతికిపట్టుకుంటారు. తయారు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీళ్లకు సమస్యలు ఎదురవుతుంటాయి. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.కామెడీ సిరీస్‌లా అనిపిస్తున్నప్పటికీ తమన్నా తన గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఈమెతో పాటు డయానీ పెంటీ, నకుల్ మెహతా, శ్వేత తివారీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కరణ జోహర్ నిర్మించిన ఈ సిరీస్.. సెప్టెంబరు 12 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: వినాయకుడి సాక్షిగా విడాకులపై హన్సిక క్లారిటీ) -
ఓటీటీలో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్.. ఉచితంగానే చూసేయండి
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ కీలక పాత్రలో నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘మాలిక్’ (Maalik). గతేడాది స్త్రీ-2తో సూపర్ హిట్ కొట్టిన నటుడు.. ఇటీవల భూల్ చుక్ మాఫ్ అనే మూవీతో ప్రేక్షకులను పలరించారు. ఈ క్రమంలోనే జులై 11న మాలిక్ చిత్రం విడుదలైంది. అయితే, ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దర్శకుడు పుల్కిత్ తెరకెక్కించిన ఈ మూవీలో మానుషి చిల్లర్ కథానాయికగా నటించారు.మాలిక్ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, సెప్టెంబర్ 5 నుంచి ఎలాంటి అద్దె చెల్లించకుండా ఈ చిత్రాన్ని చూడొచ్చని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. అమెజాన్ చందాదారుల ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా ఈ మూవీని చూడొచ్చు. పొలిటికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం కొన్ని వర్గాలను అయితే మెప్పించింది. 1988లో అలహాబాద్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. రాజ్‌కుమార్ రావు గ్యాంగ్‌స్టర్‌గా మెప్పించిన ఈ చిత్రాన్ని టిప్స్ ఫిల్మ్స్, నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై కుమార్ తౌరానీ, జే షెవాక్రమణి నిర్మించారు. -
బీఎస్ఎన్ఎల్ బైటీవీ ప్రీమియం ప్యాక్.. కేవలం రూ.151లకే..
ప్రభుత్వ టెలికమ్ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం బైటీవీ ప్రీమియం ప్యాక్‌ను ప్రారంభించింది. డిజిటల్ వినోదాన్ని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 25 పైగా ఓటీటీలు, 450 పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించే సౌలభ్యాన్ని రూ .151 లకే అందిస్తోంది.బైటీవీ ప్రీమియం ప్యాక్‌లో ప్రముఖ ఓటీటీ సేవలు ఉన్నాయి. జీ5, సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, ఆహా, షెమారూమీ, సన్ ఎన్ఎక్స్టీ, డిస్కవరీ, ఎపిక్ ఆన్, ఈటీవీ విన్, చౌపాల్ వంటి ఓటీటీలు ఇందులో ఉన్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ప్రాంతీయ కంటెంట్, లైవ్ టెలివిజన్‌ను వివిధ భాషలలో స్ట్రీమ్ చేయవచ్చు. ఇవన్నీ బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న బైటీవీ యాప్ ద్వారా వీక్షించవచ్చు.బైటీవీ ప్రీమియం ప్యాక్‌కు సంబంధించి బీఎస్ఎన్ఎల్ అధికారికంగా ఎలాంటి వ్యాలిడిటీని ధృవీకరించనప్పటికీ, రూ .151 ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుందని చాలా నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ఇందులో అనేక పాపులర్ ఓటీటీ సర్వీసలు ఉన్నప్పటికీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లను మాత్రం ఈ ఆఫర్లో చేర్చకపోవడం గమనార్హం.2025 ఫిబ్రవరిలో ఉచిత పైలట్‌గా ప్రారంభమైన బైటీవీ ఇప్పుడు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌గా రూపాంతరం చెంది ఓటీటీ అగ్రిగేషన్ స్పేస్‌లో బీఎస్ఎన్ఎల్ను గట్టి పోటీదారుగా నిలబెట్టింది.Stream 450+ Live TV Channels & 25+ OTTs with BSNL BiTV Premium Pack - All-In-One Entertainment at ₹151!Get it now: https://t.co/0lA2HY4IOJ#BSNL #BSNLIndia #DigitalIndia #BiTV #Entertainment pic.twitter.com/VQ6e946dWx— BSNL India (@BSNLCorporate) August 28, 2025 -
సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆర్కే సాగర్, మిషా నారంగ్ జోడీగా నటించిన చిత్రం ది 100. ఈ మూవీలో ధన్యా బాలకృష్ణ కీలకపాత్ర పోషించింది. జూలై 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. పోలీస్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీని రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించారు.తాజాగా ఈ చిత్రం సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అమెజాన్ ప్రైమ్‌తో పాటు లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోందని తెలిపారు. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఆర్కే సాగర్ ఐపీఎల్ అధికారి విక్రాంత్ పాత్రలో మెప్పించారు. పోలీస్ యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారు ది 100 చూసి ఎంజాయ్ చేయండి. (ఇది చదవండి: ‘ది 100’ మూవీ రివ్యూ)గతంలో దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ–'సమాజంలోని సవాళ్ల గురించి తీసిన సినిమా ఇది. ప్రతి ఇంట్లో విక్రాంత్‌లాంటి క్యారెక్టర్ ఉండాలని ప్రేక్షకులు కోరుకోవడం నాకు నచ్చింది. మా చిత్రానికి ముఖ్యంగా మహిళలు చాలా కనెక్ట్ అవుతున్నారు. ప్రేక్షకులు పతాక సన్నివేశాల్లో చప్పట్లు కొడుతుండటం సంతోషంగా ఉంది' అని అన్నారు. View this post on Instagram A post shared by Sasidhar P (@raghavomkarsasidhar) -
ఈ వీకెండ్ ఓటీటీల్లో పండగే.. శుక్రవారమే 18 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వినాయక చవితి పెద్ద సినిమాలేవీ రాలేదు. థియేటర్లలో సుందరకాండ, కన్యాకుమారి లాంచి చిన్న చిత్రాలు సందడి చేశాయి. ఈ శుక్రవారం కూడా తెలుగులో పెద్ద మూవీస్ రావడం లేదు. త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఇక వీకెండ్లో ఓటీటీ సినిమాలకు సైతం ఫుల్ డిమాండ్ ఉంటుంది. దాదాపు ఓటీటీల్లోనూ ఫ్రైడే రోజే ఎక్కువ చిత్రాలు స్ట్రీమింగ్కు వస్తుంటాయి. ఈ వారాంతంలో మిమ్మల్ని అలరించేందుకు పలు హిట్ సినిమాలు రెడీ అయిపోయాయి. బాలీవుడ్‌కు చెందిన మెట్రో ఇన్ డినో, సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ సినిమాలతో పాటు రాంబో ఇన్ లవ్ అనే తెలుగు వెబ్ సిరీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు సౌత్, హాలీవుడ్‌కు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేసేయండి.నెట్ఫ్లిక్స్మెట్రో ఇన్.. డైనో (హిందీ మూవీ) - ఆగస్టు 29టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 29అన్నోన్ నంబర్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 29లవ్ అన్ ట్యాంగిల్డ్(కొరియన్ మూవీ)- ఆగస్టు 29కరాటే కిడ్: లెజెండ్స్ (హాలీవుడ్ చిత్రం) - ఆగస్టు 30అమెజాన్ ప్రైమ్సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ సినిమా) - ఆగస్టు 29జియో హాట్స్టార్అటామిక్- వన్ హెల్ ఆఫ్ ఏ రైడ్(హాలీవుడ్ చిత్రం)- ఆగసటు 29హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 29జీ5శోధా (కన్నడ సిరీస్) - ఆగస్టు 29సోనీ లివ్సంభవ వివరణమ్ నలరసంఘం (మలయాళ సిరీస్) - ఆగస్టు 29ఆహాఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో) - ఆగస్టు 29లయన్స్ గేట్ ప్లేబెటర్ మ్యాన్ (హాలీవుడ్ మూవీ) - ఆగస్టు 29ఎరోటిక్ స్టోరీస్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 29ఆపిల్ టీవీ ప్లస్‌కే పాప్డ్(కొరియన్ సిరీస్)- ఆగస్టు 29క్రాప్డ్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 29షేర్ ఐలాండ్ సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 29మనోరమ మ్యాక్స్సార్కిట్- (మలయాళ సినిమా)- ఆగస్టు 29సైనా ప్లేరవీంద్ర నీ ఎవిడే-(మలయాళ సినిమా)- ఆగస్టు 29 -
ఓటీటీలోకి వచ్చేసిన 'కింగ్డమ్'.. కానీ అది మిస్
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల చివరలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత సీన్ మారిపోయింది. ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారు కానీ ఒకటి రెండు సీన్లు తప్పితే చిత్రంలో అస్సలు ఈమెని సరిగా ఉపయోగించుకోలేదు. సరే డిజిటల్ స్ట్రీమింగ్లోనైనా సరే హ్యాపీ అవుతుందనుకుంటే ఇక్కడా డిసప్పాయింట్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ)ఈ సినిమాలో 'హృదయం లోపల' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ఉంది. మూవీ రిలీజ్‌కి ముందే ఈ పాట వీడియో రిలీజ్ చేశారు. తీరా చూస్తే థియేటర్లలో ఈ గీతం కనిపించలేదు. దీనికి కారణాన్ని చెబుతూ స్టోరీలో సెట్ కాలేదు కాబట్టి తీసేశాం అని నిర్మాత నాగవంశీ చెప్పారు. సరే ఓటీటీలోకి వచ్చాక అయినా సరే ఉంటుందిలే అనుకుంటే ఇక్కడ కూడా తీసేశారు. దీంతో భాగ్యశ్రీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు.'కింగ్డమ్' మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ. దీనిపై విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ దీవిలో శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ) -
ఓటీటీలో భారీ యాక్షన్ సినిమా.. సడెన్‌గా తెలుగులో స్ట్రీమింగ్
హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమా 'థండర్ బోల్ట్స్' ఓటీటీలోకి వచ్చేసింది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం మే 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జేక్ ష్రియర్ (Jake Schreier) దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీకి న్యూ అవేంజర్స్ (New Avengers) అనే ట్యాగ్లన్ ఉండటంతో ఫ్యాన్స్‌లో కూడా ఆసక్తి పెరిగింది. అవెంజర్స్ లేని సమయంలో దేశాన్ని కాపాడేందుకు వాలంటీనా టీమ్ 'థండర్ బోల్ట్స్'ని రెడీ చేస్తుంది. ఈ పాయింట్‌తోనే సినిమా ప్రారంభమౌతుంది.'థండర్ బోల్ట్స్: న్యూ అవేంజర్స్' చిత్రాన్ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే తెరకెక్కించారు. మార్వెల్ కామిక్స్‌లోని సూపర్ విలన్లు ఒక టీమ్‌గా ఏర్పడటాన్ని ఇందులో చూపిస్తారు. అయితే, సడెన్‌గా జియోహాట్‌స్టార్ ((JioHotstar))లో ఈ చిత్రం ఆగష్టు 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. రెంట్ విధానంలో ఇప్పటికే జూలై 1 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఇతర దేశాల్లోని అభిమానులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఇండియాలోని ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.థండర్ బోల్ట్స్ చిత్రంలో ఫ్లోరెన్స్ పగ్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, వ్యాట్ రస్సెల్, హన్నా జాన్-కామెన్, గెరాల్డిన్ విశ్వనాథన్, లూయిస్ పుల్మాన్ వంటి హాలీవుడ్ స్టార్స్ నటించారు. -
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ
ఓటీటీలోకి మరో హిట్ సినిమా వచ్చేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని కొన్నిరోజుల క్రితం ఒరిజినల్ వెర్షన్ మాత్రమే డిజిటల్ రిలీజ్ చేశారు. దీంతో చాలామంది తెలుగు ఆడియెన్స్.. మన భాషలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు వినాయక చవితి కానుకగా తెలుగు, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.కమెడియన్ నుంచి హీరోగా మారిన తమిళ నటుడు సూరి.. ఈ ఏడాది 'మామన్' అనే సినిమా చేశాడు. మే నెలలో థియేటర్లలో రిలీజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రశాంత్ పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. కుటుంబ బంధాల్ని, మేనమామ రిలేషన్ గొప్పదనాన్ని చూపించిన ఈ చిత్రం జీ5 ఓటీటీలో ఆగస్టు తొలివారం రిలీజ్ చేశారు. అయితే అప్పుడు తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: బాలీవుడ్ స్టార్స్ 'భగ్న' ప్రేమకథ!)ఇప్పుడు తెలుగు, కన్నడ డబ్బింగ్ కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు. అక్కా తమ్ముడు బంధాన్ని చాలా ఎమోషనల్‌గా ఈ చిత్రంలో చూపించారు. అక్క బిడ్డల కోసం మేనమామగా చేయాల్సిన బాధ్యతలను నేటి సమాజానికి గుర్తుచేసేలా మూవీని తెరకెక్కించారు. తెలుగు, కన్నడ కూడా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఓ లుక్కేయండి.'మామన్' విషయానికొస్తే.. తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అక్కా తమ్ముడు. ఇన్బాకు అక్కంటే ప్రాణం. అక్కకు పెళ్ళైన చాలా కాలం తరువాత అతి కష్టం మీద ఓ బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు లడ్డూ. అక్క బిడ్డను ఇన్బా అపురూపంగా చూసుకుంటుంటాడు. ఎంతలా అంటే తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి రేఖకన్నా లడ్డూ మీదే మమకారం పెంచుకునేంతలా. అదే సమయంలో ఇన్బా తండ్రి అవుతాడు. ఇక అక్కడి నుండి అసలు సిసలైన కథ మొదలవుతుంది. అదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ) -
మిల్కీ బ్యూటీ తమన్నా లేటేస్ట్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. ఈ ఏడాది ఓదెల-2 మూవీతో అలరించిన ముద్దుగుమ్మ.. అంతకుముందు ఒకట్రెండు స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన తమన్నా ఆసక్తికర వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన కామెడీ-డ్రామా వెబ్ సిరీస్ 'డూ యు వన్నా పార్టనర్'. ఈ సిరీస్‌కు అర్చిత్ కుమార్, కాలిన్ డికున్హా దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగా కానుందని వెల్లడించారు. ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ ఆధారంగా ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ సొంత ఆల్కహాల్ వెంచర్‌ను స్థాపించాలనే సాహసోపేతమైన నిర్ణయం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ సిరీస్‌లో చూపించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో జావేద్ జాఫ్రే, నకుల్ మెహతా, సూఫీ మోతీవాలా, నీరజ్ కబీ, శ్వేతా తివారీ, రణ్విజయ్ సింఘా కీలక పాత్రల్లో నటించారు.raising a toast because they’re here with something brew-tiful 🍺#DoYouWannaPartnerOnPrime, New Series, September 12 pic.twitter.com/NM9tLCKPRG— prime video IN (@PrimeVideoIN) August 25, 2025 -
ఓటీటీలోకి దేవరకొండ 'కింగ్డమ్'.. అధికారిక ప్రకటన
విజయ్ దేవరకొండ గత నెలలో 'కింగ్డమ్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలుమార్లు వాయిదా పడిన చిత్రం.. గత నెల చివరలో థియేటర్లలోకి వచ్చింది. అయితే రిలీజైన ఒకటి రెండు రోజులు హడావుడి నడిచింది. కానీ తర్వాత నెగిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు. దీంతో నష్టాలు మూటగట్టుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏ ఓటీటీలోకి రానుందంటే?విజయ్ దేవరకొండ-భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన 'కింగ్డమ్' చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. నాగవంశీ నిర్మాత. జూలై 31న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పడు ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు) 'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలోనే పోలీస్ అధికారులతో సూరికి గొడవ జరుగుతుంది. అయితే ఉద్యోగం నుంచి తీసేయకుండా ఓ సీక్రెట్ మిషన్ అప్పజెబుతారు. శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు.అన్న కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమైన సూరి.. శ్రీలంకలో అడుగుపెడతాడు. మరి సూరికి తన అన్న శివ దొరికాడా లేదా? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తోంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓం రౌత్ నిర్మాతగా ఓటీటీ సినిమా.. ట్రైలర్ రిలీజ్)Bangaram tho, raktham tho, nippu tho kattina ee Kingdom ni yelladaniki oka naayakudu osthunnadu!🤴🔥 pic.twitter.com/F7NKRYwXEg— Netflix India South (@Netflix_INSouth) August 25, 2025 -
ఓం రౌత్ నిర్మాతగా ఓటీటీ సినిమా.. ట్రైలర్ రిలీజ్
తెలుగులో తక్కువ గానీ బాలీవుడ్లో కొత్త సినిమాల్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఓ మూవీని అలానే స్ట్రీమింగ్కి సిద్ధం చేశారు. 'ఆదిపరుష్' దర్శకుడు ఓం రౌత్.. మరో ఇద్దరితో కలిసి నిర్మించిన కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు)'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ బాజ్‌పాయ్.. 'ఇన్స్పెక్టర్ జెండే' పేరుతో తీసిన ఈ చిత్రంలో పోలీసుగా నటించాడు. ముంబైకి చెందిన పోలీస్ అధికారి మాధవ్ జెండే జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. 1970-80ల్లో మాధవ్ జెండే పనిచేస్తున్న టైంలో ఛార్లెస్ శోభరాజ్ సీరియల్ కిల్లర్‌గా వార్తల్లో నిలిచాడు. అయితే మాధవ్.. శోభరాజ్‌ని రెండుసార్లు పట్టుకున్నాడు. 1971లో తొలిసారి అరెస్ట్ చేయగా 1986లో తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. తర్వాత మళ్లీ గోవాలో అదుపులోకి తీసుకున్నారు.ఇప్పుడు ఈ స్టోరీని కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీశారు. డైరెక్టర్ ఓం రౌత్.. దీనికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. అయితే థియేటర్లలోకి కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 05 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే మంచి మూవీ చూడబోతున్నామనే ఫీల్ అయితే కలిగించారు. ఇది తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో ఛార్లెస్ శోభరాజ్ పాత్రలో 'కుబేర' ఫేమ్ జిమ్ షర్బ్ నటించడం విశేషం.(ఇదీ చదవండి: విషాదం.. 'కేజీఎఫ్' నటుడు కన్నుమూత) -
'తమన్నా' వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రముఖ నటి తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'డు యూ వనా పార్ట్నర్' వెబ్ సిరీస్ విడుదలపై తాజాగా ప్రకటన వచ్చేసింది. ఇందులో బాలీవుడ్ నటి డయానా పేంటీ కూడా నటిస్తుంది. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను నిర్మాత కరణ్ జోహార్ నిన్మించారు. తమన్నాలోని మరో కొత్త కోణాన్ని ఈ మూవీలో చూపించే అవకాశం ఉంది. ఆమె అభిమానులకు ఈ ప్రాజెక్ట్ తప్పకుండా నచ్చుతుందని మేకర్స్ చెబుతున్నారు.అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్స్‌లో భాగంగా సెప్టెంబర్ 12న 'డు యూ వనా పార్ట్నర్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇద్దరు స్నేహితులు ఆల్కహాల్ స్టార్టప్‌తో భాగస్వాములుగా మారి కొనసాగిన వారి జీవిత ప్రయాణాన్ని ఇందులో చూపించారు. పురుష ఆదిపత్యం ఉన్న ఈ పరిశ్రమలో ఇద్దరు మహిళలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో తమన్నా ప్రధాన పాత్రలో మెప్పించనుంది. -
ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి వినాయక చవితి పండగ కూడా ఉంది. కానీ థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. 'సుందరకాండ', 'త్రిబాణధారి బార్బరిక్', 'అర్జున్ చక్రవర్తి', 'కన్యాకుమారి' లాంటి చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. జాన్వీ కపూర్ హిందీ మూవీ 'పరమ్ సుందరి' కూడా ఇదే వీకెండ్లో బిగ్ స్క్రీన్‌పైకి రానుంది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 27 వరకు కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: జీవిత కోసం రాజశేఖర్ ఓవరాక్టింగ్.. కావాలనే గొడవ : డైరెక్టర్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఉన్నంతలో మెట్రో ఇన్ డైనో అనే హిందీ మూవీ ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు అబిగైల్, కరాటే కిడ్స్ లెజెండ్స్, సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ చిత్రాలతో పాటు రాంబో ఇన్ లవ్ అనే తెలుగు సిరీస్, ఇండియన్ ఐడల్ 4 కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం రిలీజయ్యే సినిమాల జాబితా (ఆగస్టు 25 నుంచి 31 వరకు)నెట్ఫ్లిక్స్అబిగైల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 26క్రిస్టోఫర్ (డానిష్ మూవీ) - ఆగస్టు 27కత్రినా: కమ్ హెల్ అండ్ హై వాటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28ద థర్స్డే మర్డర్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28మెట్రో ఇన్.. డైనో (హిందీ మూవీ) - ఆగస్టు 29టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 29అన్నోన్ నంబర్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 29కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 30అమెజాన్ ప్రైమ్సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ సినిమా) - ఆగస్టు 29హాట్స్టార్మాల్డిటొస్ (ఫ్రెంచ్ సిరీస్) - ఆగస్టు 25పటి సీజన్ 2 (పొలిష్ సిరీస్) - ఆగస్టు 26థండర్ బోల్ట్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 27డే ఆఫ్ రెకనింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28మై డెడ్ ఫ్రెండ్ జో (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 29సన్ నెక్స్ట్మాయకూతు (తమిళ సినిమా) - ఆగస్టు 27గెవి (తమిళ మూవీ) - ఆగస్టు 27జీ5సోదా (కన్నడ సిరీస్) - ఆగస్టు 29సోనీ లివ్సంభవ వివరణమ్ నలరసంఘం (మలయాళ సిరీస్) - ఆగస్టు 29ఆహాఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో) - ఆగస్టు 29లయన్స్ గేట్ ప్లేబెటర్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 29ఎరోటిక్ స్టోరీస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29ఆపిల్ ప్లస్ టీవీక్రాప్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29షేర్ ఐలాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29ఎమ్ఎక్స్ ప్లేయర్హాఫ్ సీఏ సీజన్ 2 (హిందీ సిరీస్) - ఆగస్టు 27(ఇదీ చదవండి: భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్‌బాస్‌లో ఛాన్స్: అంకిత నాయుడు) -
ఇది భావావేశాల అల
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో అరేబియా కడలి సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో కష్టాల్లేని మనుషులు ఉండరు. లేనివాడైనా, ఉన్నవాడికైనా కష్టమనేది ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఆ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని జీవించగలిగినవాడే హీరో. అలాంటి హీరోలను వెండితెర మీద మనం ఇప్పటికే ఎన్నోసార్లు చూసుంటాం, చూస్తున్నాం... అలాగే చూడబోతున్నాం. నిజానికి ఆ వెండితెర మీద హీరో పడే కష్టం మన జీవితాల నుండి తీసుకున్నదే. వెండితెర మీద హీరో పాత్రధారి తన కష్టాన్ని ఎదుర్కోవడం రెండు గంటలకు పైగా మన నిజమైన కష్టాన్ని మరిచి ఆనందంగా చూడడమే విడ్డూరం. అలాంటి కొందరి కష్టాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపే ప్రయత్నం చేశారు ‘అరేబియా కడలి’ అనే సీరీస్ ద్వారా. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అందించిన రచనకు దర్శకుడు వీవీ సూర్యకుమార్ తీర్చిదిద్దిన కళా కష్టమే ఈ ‘అరేబియా కడలి’. నేటి మేటి విలక్షణ కథానాయకుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో అలరించగా మరో పాత్రకు వర్ధమాన నటి ఆనంది ప్రాణం పోశారు. అంతలా ఆ కష్టం కథేంటో ఓసారి చూద్దాం. ముఖ్యంగా ఇది తీర ప్రాంతాలకు సంబంధించిన జాలర్ల కథ. సముద్రంలోకి తమ ప్రాణాలు పణంగా పెట్టి రోజుల తరబడి చేపల వేటకు వెళ్ళే జాలరుల కష్టాల ప్రతిరూపమే ఈ కథ. సముద్ర తీర ప్రాంతాలలో దగ్గరగా ఉన్న రెండు జాలర్ల గ్రామాలకు ఓ కారణంతో అస్సలు పడదు. కానీ మరో కారణంతో ఆ రెండూళ్ళ నుండి ఒకే పడవలో జాలర్లు వేటకు వెళ్ళవలసి వస్తుంది. అలా వెళ్ళిన ఆ ఓడ తుఫాను కారణంగా పాకిస్తాన్ తీర ప్రాంతానికి చేరుతుంది. అక్కడ ఈ జాలర్లందరినీ పాకిస్తాన్ దేశం బంధించి నానా హింసలు పెడుతుంది. మరి... వారి ఊళ్ళలోనే కలవని వీళ్ళు పరాయి దేశంలో బందీలై తిరిగి భారతదేశానికి వస్తారా? లేదా అన్నది సిరీస్‌లోనే చూడాలి. మొత్తం 8 ఎపిసోడ్లతో కథాంశం పక్కకి పోకుండా ఎంతో చక్కగా తీశారు దర్శకుడు. సముద్రంలో అల ఎంత ఉవ్వెత్తున ఎగసిపడుతుందో అంతకు మించి మనలోని కష్టం మన భావావేశాలను ప్రతిబింబిస్తుంది అని నొక్కి చెప్పే సన్నివేశాలు ఈ సిరీస్‌లో మెండుగా ఉన్నాయి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ మంచి కాలక్షేపం. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలో 'సూపర్ మ్యాన్'.. తెలుగులోనూ స్ట్రీమింగ్
హాలీవుడ్లో సూపర్ హీరో తరహా క్యారెక్టర్స్ ఇప్పుడు బోలెడన్ని కనిపిస్తున్నాయి. అయితే 90స్ కిడ్స్ ఇష్టమైన పాత్ర అంటే చాలామంది చెప్పే పేరు 'సూపర్ మ్యాన్'. 1984 నుంచి ఈ జానర్ మూవీస్.. ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజైన లేటెస్ట్ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఎందులో ఉంది?(ఇదీ చదవండి: రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ))డీసీ యూనివర్స్‌లోని లేటెస్ట్ మూవీ 'సూపర్ మ్యాన్'. గతనెల 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజైంది. మిగతా వాటితో పోలిస్తే యావరేజ్ టాక్ వచ్చింది. మన దేశంలోనూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజై ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీలోకి అద్దె విధానంలో తీసుకొచ్చేశారు. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఔట్ సైడ్ ఇండియాలో అందుబాటులో ఉంది.'సూపర్ మ్యాన్' విషయానికొస్తే.. జహ్రాన్పూర్పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా.. దాన్ని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్.. సూపర్ మ్యాన్‌పై వ్యతిరేకత వచ్చేలా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని మాయమాటలు చెబుతాడు. వీడియోలు చూపిస్తాడు. దీంతో సూపర్ మ్యాన్‌పై అందరికీ నమ్మకం పోతుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి అందరూ తనని నమ్మేలా ఎలా చేశాడు? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తండ్రయిన టాలీవుడ్ కమెడియన్.. ఫొటో వైరల్) -
ఓటీటీకి మరో హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీకి మరో హిట్ సినిమా వచ్చేందుకు సిద్ధమైంది. జూలై 18న విడుదలైన కోలీవుడ్ సోషల్ డ్రామా గెవి డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో షీలా, జాక్విలిన్ లిడియా ముఖ్య పాత్రల్లో నటించారు. కోలీవుడ్ డైరెక్టర్ దయాలన్ దర్శకత్వం వహించారు. తమిళంలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఐఎండీబీలో 9.2 రేటింగ్ సాధించింది.ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో వచ్చే బుధవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. న్యాయం కోసం పోరాటం అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆధవన్, చార్లెస్ వినోద్, జీవా సుబ్రమణియన్, గాయత్రి, వివేక్ మోహన్, ఉమర్ ఫరూక్, జగత్రామన్, అభిమన్యు మీనా కీలక పాత్రలు పోషించారు.Landslides may bury lives, but not courage.Gevi streams Aug 27 on SunNXT.#Gevi #SunNXT #StreamingFromAug27 #PoliticalDrama #MustWatch #FightForJustice pic.twitter.com/1HhqtYWDhJ— SUN NXT (@sunnxt) August 22, 2025 -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. మరోవైపు చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ ఓటీటీలోకి వస్తే మాత్రం టైమ్ పాస్ కోసం అలా చూస్తుంటారు. ఇప్పుడు సినీ ప్రేమికుల కోసం అలాంటి ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు ఏడాది తర్వాత స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా?గతేడాది ఆగస్టు 23న థియేటర్లలో రిలీజైన తెలుగు మూవీ 'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో'. గురు చరణ్, సూర్య శ్రీనివాస్, స్రవంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలోకి వచ్చినప్పుడు పర్లేదనిపించే రెస్పాన్స్ అందుకుంది. మరోవైపు స్టార్స్ ఎవరూ లేకపోవడంతో దీనికి పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయొచ్చు.(ఇదీ చదవండి: అనిరుధ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్)'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో' విషయానికొస్తే.. చైత్ర (స్రవంతి బెల్లంకొండ) అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. తాను ఇష్టపడటం కంటే తనని ప్రేమించే కుర్రాడు తనకు భర్తగా రావాలని కోరుకుంటుంది. సూర్యలో (సూర్య శ్రీనివాస్) అలా కనిపించేసరికి అతడితో ప్రేమలో పడుతుంది. గౌతమ్ (గురుచరణ్) ఓ జులాయి. ఇతడి తండ్రి పట్టాభి పోలీస్ కానిస్టేబుల్. తన కళ్ల ఎదుట తప్పు జరిగితే గౌతమ్ సహించలేడు.ఓ సందర్భంలో బ్రహ్మవరం ఎస్ఐని ఎదురించిన గౌతమ్.. అతడికి శత్రువుగా మారుతాడు. అనుకోకుండా ఓ రోజు బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఓ శవం దొరుకుతుంది. ఆ కేసు సంచలనంగా మారుతుంది. దీంతో పోలీసులు విచారణ మొదలుపెడతారు. సరిగ్గా అదే సమయంలో గౌతమ్‌ని కలవడం కోసం చైత్ర, అమెరికా నుంచి స్వదేశానికి వస్తుంది. ఆ శవానికి చైత్ర, గౌతమ్‌లకు సంబంధమేంటి? హంతుకుడు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?) -
ఓటీటీలో 'కుబేర' విలన్ మూవీ.. ఎక్కడంటే?
అటు థియేటర్లో ఈ మధ్య అన్నీ పెద్ద సినిమాలే రిలీజవ్వగా ఇటు ఓటీటీ (OTT)లో చిన్నాపెద్ద తేడా లేకుండా అన్నిరకాల చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పాయ్, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఇన్స్పెక్టర్ జెండే (Inspector Zende). మనోజ్.. మధుకర్ జెండె అనే పోలీస్‌గా నటించగా జిమ్ సర్బ్.. కార్ల్ భోజ్‌రాజ్ అనే స్విమ్‌సూట్ కిల్లర్‌గా కనిపించనున్నాడు.ఓటీటీలోబాలచంద్ర కడం, సచిన్ ఖేడెకర్, గిరిజ, హరీశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిన్మయి మండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలింది. ఈ మూవీని ఓం రౌత్, జే షెవక్రమణి నిర్మించారు. ఇకపోతే మనోజ్ బాజ్‌పాయ్ చివరగా డిస్పాచ్ మూవీలో నటించాడు. ఓటీటీలో కిల్లర్ సూప్ సిరీస్‌లోనూ యాక్ట్ చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ చేస్తున్నాడు. జిమ్ సర్బ్ విషయానికి వస్తే.. ఇతడు చివరగా బ్లాక్‌బస్టర్ మూవీ కుబేరలో నటించాడు. ఇందులో విలన్‌గా నటించి మెప్పించాడు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)చదవండి: బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: నటుడి ఆగ్రహం -
ఓటీటీకి పరదా హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాల చూసే తీరు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగానే ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్‌తోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇక మలయాళ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలకు ఓటీటీల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.తాజాగా మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. పరదాలో నటించిన దర్శన రాజేంద్రన్ లీడ్ రోల్లో ఈ వెబ్ సిరీస్‌ను తెరెకెక్కించారు. క్రిషంద్ దర్శకత్వంలో వస్తోన్న ఈ 4.5 గ్యాంగ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆగస్టు 29 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.ట్రైలర్ చూస్తే క్రైమ్, కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌ను తిరువనంతపురంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. పరదా సినిమా హీరోయిన్ దర్శన రాజేంద్రన్ కీలక పాత్ర పోషించడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. ఆమె లేడీ విలన్‌గా కనిపించనుంది. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ
అనుపర పరమేశ్వరన్ వరస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన 'పరదా'.. ఈ రోజే(ఆగస్టు 22) థియేటర్లలోకి వచ్చింది. మరో మూడు వారాల్లో 'కిష్కిందకాండ' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇకపోతే కొన్నిరోజుల క్రితం ఈమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా.. పలు వివాదాల్లో చిక్కుకుంది. తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా?(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)కోర్ట్ రూమ్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన 'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ'.. గతవారం ఓటీటీలోకి వచ్చింది. అయితే మలయాళ, కన్నడ, తమిళ, హిందీ వెర్షన్స్ మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. దీంతో తెలుగు ఆడియెన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు వారం లేటుగా తెలుగు వెర్షన్ తీసుకొచ్చేశారు. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.'జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ' విషయానికొస్తే.. జానకి విద్యాధరన్(అనుపమ పరమేశ్వరన్) బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తుంటుంది. పండగ జరుపుకొనేందుకు కేరళలోని సొంతూరికి వస్తుంది. స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్లినప్పుడు ఈమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో పోలీసులని ఆశ్రయిస్తుంది. ఈ న్యాయ పోరాటంలో జానకి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? ఈ కేసులో అడ్వకేట్ డేవిడ్(సురేశ్ గోపి) ఎవరివైపు నిలిచారు? తన ప్రమేయం లేకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డని ప్రభుత్వమే చూడాలనే జానకి విజ్ఞప్తిపై కేరళ హైకోర్ట్ ఎలా స్పందించింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)JSK – Janaki V/s State of Kerala is now streaming on ZEE5. A powerful courtroom drama where truth takes the spotlight. Watch it now in Telugu! 🎬⚖️Don’t miss it!"#JanakiVsStateOfKeralaOnZEE5@TheSureshGopi @anupamahere @jsujithnair @DreamBig_film_s#PravinNarayanan pic.twitter.com/375xPZL7lm— ZEE5 Telugu (@ZEE5Telugu) August 22, 2025 -
హృతిక్ రోషన్ ప్రియురాలి మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్!
బాలీవుడ్ నటి, హృతిక్ రోషన్ ప్రియురాలు సబా ఆజాద్ నటించిన తాజా చిత్రం సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్. ఈ చిత్రాన్ని కశ్మీర్‌కు చెందిన ప్రముఖ సింగర్ రాజ్ బేగం జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డానిష్ రెంజు దర్శకత్వం వహించారు. ఆపిల్ ట్రీ పిక్చర్స్ ప్రొడక్షన్, రెంజు ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేకర్స్. ఆగస్టు 29 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో సోనీ రజ్దాన్ కీలక పాత్రలో కనిపించారు.సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ చిత్రం ద్వారా కాశ్మీర్‌కు చెందిన దిగ్గజ సింగర్ రాజ్ బేగం జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కశ్మీర్ లోయ నుంచి సంగీతంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళగా రాజ్ బేగం నిలిచింది. తన కెరీర్లో ఆమెకు ఎదురైన అడ్డంకులు, తను ఎలా విజయం సాధించన్నదే సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ కథ. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
థియేటర్లలో పరదా..ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పోటీలో లేవు. అనుపమ పరమేశ్వరన్ పరదా, సత్యరాజ్, ఉదయభాను ప్రధానపాత్రల్లో వచ్చిన త్రిబాణధారి బార్బరిక్ లాంచి సినిమాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. దీంతో ఈ వారంలో వీకెండ్లో పరదా మూవీ కోసం మాత్రమే సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ సినిమాలు సందడి చేస్తుంటాయి. ఎప్పటిలాగే ఈ వారంలో కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. వాటిలో తమిళ చిత్రం సార్ మేడమ్, బాలీవుడ్ మూవీ మా, మారీషన్ లాంటి డబ్బింగ్ సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. ఫ్రైడే ఒక్క రోజులోనే దాదాపు 16 చిత్రాలు సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. అమెజాన్ ప్రైమ్సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 22ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22నెట్ఫ్లిక్స్అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) - ఆగస్టు 22ఏయిమా (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22మా (హిందీ సినిమా) - ఆగస్టు 22మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23జియో హాట్స్టార్ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22పీస్ మేకర్ -సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22జీ5ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) - ఆగస్టు 22ఆపిల్ ప్లస్ టీవీఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - ఆగస్టు 22ఆహాకొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు సినిమా) - ఆగస్టు 22సన్ నెక్ట్స్కపటనాటక సూత్రధారి (కన్నడ సినిమా) - ఆగస్టు 22కోలాహాలం(మలయాళ సినిమా)- ఆగస్టు 22లయన్స్ గేట్ ప్లేఉడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22 -
సడన్ సర్ప్రైజ్.. ఓటీటీలోకి 'వీరమల్లు'
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు'.. థియేటర్లలో ఫ్లాప్ అయింది. సోషల్ మీడియాలో సీన్లపై బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి ట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఓటీటీలో స్ట్రీమింగ్ తేదీని సడన్ సర్ప్రైజ్ అన్నట్లు వదిలారు. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఈ సినిమా రానుంది? ఏంటి సంగతి అనేది ఇప్పుడు చూద్దాం.దాదాపు ఐదేళ్ల పాటు అష్టకష్టాలు పడి థియేటర్లలోకి వచ్చిన సినిమా 'హరిహర వీరమల్లు'. గత నెల 24న థియేటర్లలోకి వచ్చింది. అయితే అప్పుడు కూడా రిలీజ్ అవుతుందా లేదా అనుకున్నారు గానీ ఎలాగోలా విడుదలైంది. తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ రావడంతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓటీటీలోకి రావడంపై గత కొన్నిరోజులుగా పలు రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది.'హరిహర వీరమల్లు' సినిమాని 20వ తేదీ అంటే రేపటి(బుధవారం) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ వదిలారు. మరి థియేటర్లలో వచ్చినప్పుడు అంతలా ట్రోల్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఇంకెంత ట్రోల్స్‌కి గురవుతుందో ఏంటో?'హరిహర వీరమల్లు' విషయానికొస్తే.. 16వ శతాబ్దంలో నదిలో కొట్టుకొచ్చిన ఓ పిల్లాడు ఓ అగ్రహారం వాసులకి దొరుకుతాడు. వాళ్లు ఆ బాలుడికి వీరమల్లు అని పేరు పెడతారు. పెద్దయ్యాక వజ్రాల దొంగ అవుతాడు. మచిలీపట్నంలో తాను చేసిన దొంగతనం గురించి విని దొర (శరత్ ఖేదేకర్).. ఓ వజ్రాల దొంగతనం కోసం తనని పిలిపిస్తాడు. ఆ దొర దగ్గర పంచమి (నిధి అగర్వాల్) ఉంటుంది. ఆమె వీరమల్లు ప్రేమలో పడుతుంది. వీరమల్లు కూడా ఆమెని ఇష్టపడతాడు. దొర చెప్పిన వజ్రాలని దొంగిలించడంతో పాటు పంచమిని తీసుకెళ్లిపోయే క్రమంలో గోల్కండ నవాబుకి వీరమల్లు చిక్కుతాడు. ఆ నవాబు (దలిప్ తాహిల్) వీరమల్లుకి ఓ పని అప్పజెబుతాడు. కొల్లూరులో దొరికి అలా అలా చేతులు మారి ఔరంగజేబు దగ్గరకు చేరిన కోహినూర్ వజ్రాన్ని తీసుకురమ్మని. మరి వీరమల్లు ఆ వజ్రాన్ని తీసుకొచ్చాడా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
అఫీషియల్ ప్రకటన.. ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీలు వచ్చాక సరికొత్త సినిమాలు, సిరీస్‌లు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్ జోనర్లో వచ్చే సిరీస్‌లకు ఓటీటీలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే ఆ జోనర్లో వచ్చిన చిత్రాలు, సిరీస్‌లు చాలా వరకు సూపర్ హిట్‌గా నిలిచాయి.తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ లీడ్ రోల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.రాఖ్ (Raakh) పేరుతో ఈ ఆసక్తికర వెబ్ సిరీస్‌ను ప్రొసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్‌లో సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను అనూష నందకుమార్, సందీప్ సాకేత్ నిర్మిస్తున్నారు. JUSTICE will rise from the ashes 🔥#RaakhOnPrime, New Original Series, Coming 2026#AliFazal #SonaliBendre @prosit_roy @EndemolShineIND @anusha_nkumar #AyushTrivedi #AamirBashir @sandeepsaket83 @deepak30000 @NegiR @sunandagj @BhaDiPa pic.twitter.com/mLulmaXj8X— prime video IN (@PrimeVideoIN) August 18, 2025 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి అనుపమ పరమేశ్వరన్ 'పరదా', 'మేఘాలు చెప్పిన ప్రేమకథ', 'త్రిబాణధారి బార్బరిక్' తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లో 31కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. సార్ మేడమ్, మిషన్ ఇంపాజిబుల్- ద ఫైనల్ రికనింగ్, మా, మారిషన్, కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా మరేవైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్‌లు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)అమెజాన్ ప్రైమ్మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 18సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 22ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22నెట్ఫ్లిక్స్కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 18ఎక్స్టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 18అమెరికాస్ టీమ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 19ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20రివర్స్ ఆఫ్ ఫేట్ (పోర్చుగీస్ సిరీస్) - ఆగస్టు 20డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21ఫాల్ ఫర్ మీ (జర్మన్ సినిమా) - ఆగస్టు 21గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ మూవీ) - ఆగస్టు 21హోస్టేజ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21వన్ హిట్ వండర్ (తగలాగ్ సినిమా) - ఆగస్టు 21ద 355 (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 21అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) - ఆగస్టు 22ఏయిమా (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22మా (హిందీ సినిమా) - ఆగస్టు 22మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23హాట్స్టార్స్టాకింగ్ సమంత (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 19ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22జీ5ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) - ఆగస్టు 22సోదా (కన్నడ సిరీస్) - ఆగస్టు 22ఆపిల్ ప్లస్ టీవీఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22ఆహాకొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు మూవీ) - ఆగస్టు 22సన్ నెక్స్ట్కపటనాటక సూత్రధారి (కన్నడ మూవీ) - ఆగస్టు 22లయన్స్ గేట్ ప్లేవుడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష.. ప్రోమో రిలీజ్) -
తండ్రి వేదన... తనయుడి ఆవేదన
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సర్ జమీన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనవాడు అనేవాడు మనకోసం ఎప్పటికీ నిలబడతాడు. పగవాడు మన పతనం కోసం ఆరాటపడతాడు. మంచిని దూరం చేసుకుని చెడు మార్గాన వెళుతూ మనవాడు కూడా పగవాడైతే... అదే ‘సర్ జమీన్’ సినిమా. ఇదో దేశభక్తి స్ఫూర్తిగా అల్లుకున్న కథ. దర్శకుడు కాయోజీ ఇరానీ తెరకెక్కించిన ఈ సినిమాలో ముఖ్యపాత్రధారులుగా మలయాళ నటుడు పృథ్వీరాజ్, బాలీవుడ్ నటి కాజోల్, నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ నటించారు. నాలుగు ముఖ్యపాత్రలు, రెండున్నర గంటల నిడివితో దేశ సరిహద్దు వివాదాంశంపై సైనిక నేపథ్యంలో కూడిన సినిమా తీయడం అంటే మాటలు కాదు. ఈ సినిమా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని ఉర్రూతలూగించారు దర్శకుడు. అంతలా ఏముందీ కథలో ఓసారి చూద్దాం. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కల్నల్ విజయ్ మీనన్పోస్టింగ్ జరుగుతుంది. విజయ్ మీనన్ మహా దేశభక్తుడు. అతనికి హర్మన్ అనే కొడుకుంటాడు. దేశమా,ప్రాణమా అంటే నిర్మొహమాటంగా దేశం అని ఎంచుకునే రకం విజయ్. ఈ విషయంలోనే తన తండ్రి విజయ్ పై ద్వేషం పెంచుకుంటాడు హర్మన్. పైగా తను భయస్తుడు కూడా. ఓసారి తీవ్రవాదుల ఘర్షణలో హర్మన్‌ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. తమ ముఖ్య అనుచరుడిని విడిపించాలని... లేదంటే నీ కొడుకుని చంపేస్తామని టెర్రరిస్టులు విజయ్‌ని హెచ్చరిస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా తాను బంధించిన టెర్రరిస్టులపై కాల్పులు జరుపుతాడు విజయ్. ఆ తరువాత విజయ్, అతని భార్య మెహర్ తమ బిడ్డ చనిపోయాడని భావిస్తారు. కానీ తీవ్రవాదులు హర్మన్‌కి తండ్రి మీదున్న ద్వేషాన్ని ఆయుధంగా చేసుకుని హర్మన్‌ని తీవ్రవాదిగా తయారు చేసి, మళ్ళీ విజయ్ దగ్గరకు పంపుతారు. ఆ తరువాత విజయ్, అతని భార్య తమ కొడుకు టెర్రరిస్ట్ అని కనిపెడతారా? లేదా అన్నదే సినిమా. దేశం మీద మమకారం పెంచుకున్న తండ్రి వేదన గెలుస్తుందా... లేక తండ్రి మీద తనయుడు పెంచుకున్న ద్వేషం గెలుస్తుందా? అన్నది హాట్ స్టార్‌లోనే చూడాలి. ఈ సినిమా ఓ సూపర్ పేట్రియాటిక్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్. మస్ట్ వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ... తెలుగులోనూ
సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలంటే అంతంత మాత్రంగానే వర్కౌట్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. అలా కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఓ హాలీవుడ్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించింది. రిలీజై దాదాపు నెలన్నర కావొస్తున్న ఇప్పటికీ ప్రేక్షకుల్ని రప్పిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?హాలీవుడ్ సినిమాలు అప్పుడప్పుడు చూసినా సరే నటుడు బ్రాడ్ పిట్ కాస్త పరిచయం ఉండే ఉంటాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఎఫ్ 1'. కార్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగులోనూ రిలీజ్ చేయగా.. మన ఆడియెన్స్ కూడా చూసి ప్రశంసించారు. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'ఎఫ్ 1' విషయానికొస్తే.. ఫార్ములా వన్ రేసులో డ్రైవర్‌గా అదరగొట్టిన సన్నీ హెయస్ (బ్రాడ్ పిట్).. కెరీర్‌కి రిటైర్మెంట్ ఇచ్చి, వ్యాన్ డ్రైవర్ పనిచేస్తుంటాడు. అలా వయసు పైబడిన సన్నీకి ఏపీఎక్స్‌జీపీ (APXGP) అనే టీమ్‌లో రేసర్‌గా పనిచేయాలని అవకాశం ఇస్తారు. అయితే రేసింగ్ నుంచి తప్పుకొని చాలారోజులు అయిపోవడంతో సన్నీకి ఇప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా తన జట్టులోని యువకుడైన జోషువా పియర్స్ (డామ్సన్ ఐడ్రీస్) దూకూడు తట్టుకోవడం, అతడి నుంచి ఎదురైన అవమానాలు భరించడం కష్టంగా ఉంటుంది.అసలు స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసింగ్ తర్వాత సన్నీ.. ఎందుకు రేసింగ్ నుంచి తప్పుకొన్నాడు? మళ్లీ ఫార్ములా వన్ రేసింగ్ ట్రాక్ పైకి వచ్చిన సన్నీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు విజేతగా నిలిచాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఫహాద్ ఫాజిల్ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా స్ట్రీమింగ్
కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), వడివేలు నటించిన చిత్రం 'మారీశన్'(Maareesan).. జులైలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ సుదీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్స్‌లో ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠతకు గురిచేసింది. కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితార, లివింగ్స్టన్, తీనప్పన్, రేణుక, శరవణన్ సుబ్బయ్య వంటి వారు నటించారు. సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు.ఆగష్టు 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మారీశన్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ,కన్నడ, మలయాళంలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ఫహాద్ ఫాజిల్‌కి మరో విభిన్న పాత్రను అందించగా, వడివేలు హాస్యంతో పాటు భావోద్వేగాన్ని కూడా చూపించారు. మీరు కామెడీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడితే.. మారీశన్ తప్పక చూడవచ్చు.దయాలన్ (ఫహాద్ ఫాజిల్) అనే దొంగ, వేలాయుధం పిళ్లై (వడివేలు) అనే అల్జీమర్స్ బాధితుడి వద్ద చాలా డబ్బు ఉందని తెలుసుకుంటాడు. వేలాయుధం తన స్నేహితుడిని కలవడానికి ఊరికి బయలుదేరుతాడు. దయాలన్ అతన్ని మాటలతో మాయ చేసి, తన బైక్‌పై తీసుకెళ్తాడు. ఆ ప్రయాణంలో ఏం జరిగింది? దయాలన్ దోచుకున్నాడా..? లేక వేలాయుధం పరిస్థితిని చూసి మారిపోయాడా..? అనే ప్రశ్నలకి సమాధానం ఈ సినిమాలో ఉంటుంది. -
ఓటీటీ సిరీస్‌లో లెస్బీయన్ లిప్‌లాక్.. అవసరమా?
సినిమాల్లో ఇప్పుడు లిప్‌లాక్ సీన్స్ కామన్ అయిపోయాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని చిత్రాల్లో ముద్దు సన్నివేశాలను జోడిస్తున్నారు. ఇక వెబ్ సిరీస్‌లలో అలాంటి సన్నివేశాలకు అడ్డూ అదుపే లేదు. ప్రేక్షకులు కూడా వాటిని రొటీన్ సీన్లలాగే ట్రీట్ చేస్తున్నారు. ఒకప్పటిలా ఆ సన్నివేశాలపై చర్చించడం.. ఖండించడం జరగట్లేదు. కానీ చాలాకాలం తర్వాత మళ్లీ ఓ ముద్దు సీన్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ వెబ్ సిరీస్‌లో లెస్బియన్ మధ్య కిస్ సీన్ పెట్టడం అవసరమా అని ఓ వర్గం ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అంధేరా’ ఆగస్ట్ 14న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో ప్రియా బాపట్, కరణ్వీర్ మల్హోత్రా, ప్రజక్తా కోలి, సుర్వీన్ చావ్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాఘవ్ ధర్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌కి మంచి టాక్ వచ్చినప్పటికీ.. ఇందులో ఇద్దరు నటీమణుల మధ్య వచ్చే లెస్బియన్ ముద్దు సన్నివేశంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కథలో భాగంగా సుర్వీన్ చావ్లా- ప్రియా బాపట్ మధ్య ముద్దు పెట్టుకోవాలి. ఇద్దరూ ఈ సీన్లో అద్భుతంగా నటించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా నేచురల్‌గా నటించారని కొంతమంది వారిపై ప్రశంసలు కురిపిస్తుంటుంటే.. మరికొంతమంది మాత్రం ఆ సీన్ అనవసరంగా పెట్టారని విమర్శిస్తున్నారు. అలాగే ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ షోల్లో ఇటువంటి సీన్స్ అవసరం లేదని వాదిస్తున్నారు. -
'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ రివ్యూ.. వివాదాల సినిమా ఎలా ఉందంటే?
కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి (Suresh Gopi), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించిన సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki vs State of Kerala).. కోర్ట్‌రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ తెరకెక్కించారు. అయితే, టైటిల్ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీతాదేవి మరో పేరు జానకి కావడం.. ఈ మూవీలో దాడికి గురైన మహిళా పాత్రకు ఆ పేరు పెట్టడంతో సెన్సార్ బోర్డు అడ్డుచెప్పింది. దీంతో టైటిల్లో చిన్న మార్పు చేసి (‘వి’ యాడ్ చేశారు) (Janaki v vs State of Kerala) కేవలం మలయాళంలో మాత్రమే జులైలో విడుదల చేశారు. అయితే, తాజాగా 'జీ 5'లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తమిళ్, హిందీ, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగులో త్వరలో విడుదల కావచ్చు. అయితే, సబ్‌టైటిల్స్‌తో చూసే ఛాన్స్ ఉంది.థ్రిల్లర్ కథాంశంతో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ రూపొందింది. న్యాయం కోసం పోరాడే యువతి కథే ఈ చిత్రం. జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తూ.. పండగ కోసం కేరళలోని తన సొంత ఊరికి వస్తుంది. అయితే, అక్కడ ఆమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో ఆమె న్యాయ పోరాటం చేస్తుంది. కానీ, నిందితుల తరఫున డేవిడ్ అనే ప్రముఖ లాయర్ (సురేశ్ గోపి) వాదిస్తాడు. దీంతో కేసు ఓడిపోవడం, తండ్రిని కోల్పోవడం, గర్భం దాల్చడం వంటి సంఘటనలు ఆమె జీవితాన్ని కుదిపేస్తాయి. జానకి ప్రభుత్వాన్ని తన బిడ్డను చూసుకోవాలని కోరుతుంది. దీనిపై కేరళ హైకోర్టు ఎలా స్పందించింది..? అనే అంశం కథలో కీలకం. ఒక కానిస్టేబుల్ సహాయంతో కేసు తిరిగి ఓపెన్ చేయడంతో కథ కొత్త మలుపులు తిరుగుతుంది. జానకి చేసిన న్యాయ పోరాటంలో ఫైనల్‌గా ఎవరు గెలిచారు..? నిందితుల పక్షాన సురేశ్ గోపి ఎందుకు వాదించాల్సి వచ్చింది. జానకికి జన్మించిన బిడ్డ బాధ్యతను చివరగా ఎవరు తీసుకుంటారు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఈ చిత్రం న్యాయ వ్యవస్థ, మహిళల హక్కులు, సామాజిక బాధ్యతలపై ప్రశ్నలు వేస్తూ.. భావోద్వేగంగా సాగుతుంది. మీరు లీగల్ డ్రామా సినిమాలు ఇష్టపడితే, ఇది తప్పక చూడవచ్చు. కథలో చెప్పిన అంశం చిన్నదైనా సరే చాలామందిని ఆలోచింపచేస్తుంది. అయితే, ఇలాంటి కథలు వెండితెరపై చాలానే కనిపించాయి. కానీ, ప్రవీణ్ నారాయణన్ తెరకెక్కించిన ఈ చిత్రం కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎక్కువ సమయం సాగదీశారనిపిస్తుంది. ఇలాంటి కథలకు కోర్టు రూమ్ ఎపిసోడ్స్ చాలా బలంగా ఉండాలి. కానీ, చాలా పేలవంగా దర్శకుడు చూపించాడు. అడ్వకేట్‌గా సురేశ్ గోపి వంటి స్టార్ నటుడు ఉన్నప్పటికీ బలమైన డైలాగ్స్ చెప్పించలేకపోయాడు.జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ స్టోరీ ప్రారంభం నుంచే నెమ్మదిగా సాగుతుంది. జానకి విద్యాధరన్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చాలా బాగా నటించింది. అయితే, ఆమె పాత్రను ఇంకా బలంగా చూపించాల్సి ఉంది. మరోవైపు జానకి కేసులో నిందితుల తరఫున వాదించేందుకు డేవిడ్ (సురేశ్ గోపి) ముందుకు రావడంతో కథలో కాస్త స్పీడ్ అందుకుంటుంది. అక్కడక్కడ జానకిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలతో ఆయన విసిగించినా ప్రేక్షకులకు నచ్చుతుంది. గర్భం దాల్చకుండానే ఆమె ఇలాంటి నేరం జరిగిందని ఆరోపణలు చేస్తుందా అనే ఫీల్ కలిగించేలా కొన్ని సీన్లు ఉంటాయి. అవి బాగానే కనెక్ట్ అవుతాయి. డేవిడ్ వంటి లాయర్ ఎంట్రీ ఇవ్వడంతో జానకి కేసును కోర్టు కొట్టివేస్తుంది. అయితే, ఇంటర్వెల్ నుంచి అసలు కథ మొదలౌతుంది. తండ్రిని కోల్పోయి ఆపై లైంగికి దాడికి గురై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు సాయంగా కానిస్టేబుల్ ఫిరోజ్ (అస్కర్ అలీ) ఎంట్రీ ఇస్తాడు. అతను చేసే ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠను రేకిత్తిస్తుంది. ఆ సమయంలో కేసును వాదించేందుకు డేవిడ్ కూతురు అడ్వకేట్ నివేదిత (శృతి రామచంద్రన్) రంగంలోకి దిగుతుంది. ఫైనల్‌గా కోర్టు రూమ్ డ్రామాలో జానకికి ఎలాంటి న్యాయం జరిగింది అనేది పెద్దగా ఉత్కంఠత లేకుండానే దర్శకుడు కథ ముగిస్తాడు. కానీ, కోర్టు డ్రామా సినిమాలు చూసేవారికి తప్పకుండా ఈ చిత్రం నచ్చుతుంది. జీ5లో అందుబాటులో ఉంది. అయితే, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. త్వరలో తెలుగులో కూడా విడుదల కావచ్చు. వీకెండ్లో కుటుంబంతో కలిసి చూసేయండి. ఎలాంటి అశ్లీలత లేదు. -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన 'కూలీ', 'వార్ 2'కి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వీకెండ్, సెలవులు కలిసి రావడంతో జనాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో చాలా వరకు డబ్బింగ్ చిత్రాలే ఉన్నాయి. అయితే ఎలాంటి ప్రకటన లేకుండా రెండు తెలుగు మూవీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ ఏంటవి? ఎందులో చూడొచ్చు?గత నెల తొలివారం థియేటర్లలోకి వచ్చిన 'వర్జిన్ బాయ్స్' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. కాకపోతే ఐఫోన్, డబ్బులు గిఫ్ట్స్ అనే ప్రమోషన్లతో వార్తల్లో నిలిచింది. అడల్ట్ కాన్సెప్ట్, యువతని టార్గెట్ చేసుకుని తీసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి వచ్చేసింది. తెలుగులోకి అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: విజయ్‌తో రొమాంటిక్ స్టిల్.. ‘చాలా స్పెషల్’ అంటూ రష్మిక పోస్ట్)మరోవైపు ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన 'సూర్యాపేట్ జంక్షన్' అనే తెలుగు సినిమా కూడా ఎలాంటి హడావుడి లేకుండానే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ విషయానికొస్తే.. అర్జున్ (ఈశ్వర్) కాలేజీలో చదువుతూ స్నేహితులతో జాలీ లైఫ్ గడుపుతుంటాడు. జ్యోతితో(నైనా సర్వర్) ప్రేమలో పడతాడు. మరోవైపు నరసింహ (అభిమన్యు సింగ్) ఎమ్మెల్యే అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు.అయితే అర్జున్ స్నేహితుల్లో ఒకడైన శీను.. ఓ రోజు హత్యకు గురవుతాడు. శీనుని ఎవరు చంపారు? ఆ ఘటన వెనకున్న రాజకీయ కుట్ర ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఈ రెండు సినిమాలతో పాటు వీకెండ్ ఓటీటీల్లో రిలీజైన వాటిలో 'జానకి.వి vs స్టేట్ ఆఫ్ కేరళ', 'గ్యాంబ్లర్స్', 'సూపర్ మ్యాన్' తదితర చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. (ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ) -
భార్యాభర్తల కొట్లాటే 'సార్ మేడమ్'.. వచ్చేవారమే ఓటీటీలో..
డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈయన నటించిన లేటెస్ట్ మూవీ సార్ మేడమ్ (Sir Madam Movie). నిత్యామీనన్ (Nithya Menen) కథానాయికగా యాక్ట్ చేసింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంలో తలైవాన్ తలైవి పేరిట జూలై 25న రిలీజైంది. సార్ మేడమ్ పేరిట తెలుగులో ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో సార్ మేడమ్దాదాపు నెల రోజుల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. సార్ మేడమ్ ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.భార్యాభర్తల స్టోరీఈ మూవీలో నిత్యామీనన్- విజయ్ భార్యాభర్తలుగా నటించారు. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలను ఫన్నీగా చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కించారు. పెళ్లి చేసుకునేవారు, చేసుకున్నవారు ఈ సినిమాను ఓసారి ఓటీటీలో చూడాల్సిందే! Get ready to fall in love with Aagasaveeran and Perarasi... twice 👀#ThalaivanThalaiviiOnPrime, Aug 22@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @SathyaJyothi @Lyricist_Vivek @studio9_suresh@Roshni_offl @kaaliactor @MynaNandhini @ActorMuthukumar pic.twitter.com/VqI3bn7zqP— prime video IN (@PrimeVideoIN) August 15, 2025చదవండి: పెళ్లిపందిట్లో టాలీవుడ్ హీరో చిరుదరహాసం.. ఆ చూపుల్లోనే..! -
కూలీ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఇదే!
రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా (Coolie Movie)కు భారీగా ప్రమోషన్లు చేశారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున తొలిసారి విలన్‌గా నటించడం.. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించడంతో ఈ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది.ఓటీటీ వివరాలుఇకపోతే ఈ సినిమా డిజటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్లకు ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే కూలీ ఓటీటీలోకి రానుంది. అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుందంటే మాత్రం ఇంకా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ -
మళ్లీ సెలవులొచ్చాయ్.. ఈ శుక్రవారం ఓటీటీల్లో 26 సినిమాలు!
చూస్తుండగానే వీకెండ్ వచ్చేస్తోంది. గతవారం లాగే ఈసారి కూడా వరుసగా మూడు రోజులు రావడం సినీ ప్రియులకు పండగే. ఈ వారం థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు కూలీ, వార్-2 ఇప్పటికే సందడి చేస్తున్నాయి. ఓకే రోజు రిలీజైన ఈ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ వారాంతంలో మూడు రోజుల పాటు సెలవులు రావడం ఈ చిత్రాలకు కలిసొచ్చే అవకాశముంది.మరోవైపు ఈ శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం, ఆ తర్వాత శ్రీ కృష్ణ జన్మాష్టమి, సండే సెలవులు కావడంతో ఓటీటీ ప్రియులు సైతం చిల్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ వారంలో వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఒక్క రోజే సందడి చేసేందుకు సిద్ధమైపోయాయి. ఈ ఫ్రైడే ఓటీటీ మూవీస్‌లో కాజోల్ నటించిన మా, అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ డ్రామా జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో సూపర్ మ్యాన్ హాలీవుడ్ మూవీ, పలు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. మీకు నచ్చిన సినిమా ఏయే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో చూసేయండి మరి.నెట్ఫ్లిక్స్రోల్ మోడల్స్(మూవీ)- ఆగస్టు 15అవుట్ ల్యాండర్(వెబ్ సిరీస్) సీజన్-7- ఆగస్టు 15ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15సెల్ఫ్ రిలయన్స్ (మూవీ)-ఆగస్టు 15లవ్ ఈజ్ బ్లైండ్ యూకే(సీజన్-2)- ఆగస్టు 15సాంగ్స్ ఫ్రమ్ ది హోల్(మూవీ)- ఆగస్టు 15ఫిక్స్డ్(మూవీ)- ఆగస్టు 15ఫిట్ ఫర్ టీవీ(రియాలిటీ షో)- ఆగస్టు 15మిస్ గవర్నర్- (సీజన్-1)- ఆగస్టు 15ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 15ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15మా(హిందీ మూవీ)- ఆగస్టు 15అమెజాన్ ప్రైమ్సూపర్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 15ఎంఎక్స్ ప్లేయర్సేనా గార్డియన్స్ ఆఫ్ ది నేషన్- ఆగస్టు 15జియో హాట్స్టార్కృష్ణ కో లవ్ స్టోరీ(మూవీ)- ఆగస్టు 15మోజావే డైమండ్స్ (మూవీ)- ఆగస్టు 15బ్యూటీఫుల్ డిజాస్టర్ (మూవీ)- ఆగస్టు 15ఏలియన్ ఎర్త్ (మూవీ)- ఆగస్టు 15లిమిట్లెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 17జీ5జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 15సన్ నెక్స్ట్..గుడ్ డే-(తమిళ మూవీ) ఆగస్టు-15గ్యాంబ్లర్స్ (తమిళ మూవీ)- ఆగస్టు 15అక్కేనామ్ (తమిళ మూవీ)- ఆగస్టు 15ఆహా తమిళం..యాదుమ్ అరియాన్- ఆగస్టు 15మూవీ సెయింట్స్ కట్లా కర్రీ (గుజరాతీ మూవీ) - ఆగస్టు 15ఆపిల్ ప్లస్ టీవీ స్నూపీ ప్రెజెంట్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15 -
'సితారే జమీన్ పర్' మూవీ ఆఫర్.. రెండు రోజులు మాత్రమే
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. యూట్యూబ్‌లో రన్ అవుతున్న ఈ సినిమాను చూడాలంటూ రూ. 100 చెల్లించాల్సి ఉంది. పే-పర్-వ్యూ (Pay-per-view) మోడల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం రెంట్ తాజాగా తగ్గించారు. థియేటర్లో ప్రదర్శన అనంతరం నేరుగా యూట్యూబ్‌లోనే ఈ మూవీని ఆయన విడుదల చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.ఇండిపెండెన్స్ డే కానుకగా సితారే జమీన్ పర్ సినిమాను కేవలం రూ. 50లకే చూడొచ్చని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ చిత్రాన్ని చూడాలని ఆసక్తి ఉంటే యూట్యూబ్‌లో కేవలం రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఈ ఆఫర్ కేవలం ఆగష్టు 15 నుంచి 17 వరకు మాత్రమే ఉంటుంది. ఇదే విషయాన్ని చెబుతూ ఆమిర్ ఖాన్ ఒక వీడియో విడుదల చేశారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామా మూవీ జూన్ 20న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం గురించి మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించారు. సితారే జమీన్ పర్ అందరి మనసులు దోచుకుంటోందని ఆయన అన్నారు. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుందని చెప్పారు. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారని ఆయన అన్నారు.సితారే జమీన్ పర్ మూవీలో ఆమిర్ ఖాన్, జెనీలియా జంటగా నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. -
జియో హాట్‌స్టార్ ఆ ఒక్క రోజు అందరికీ ఫ్రీ..
ప్రముఖ ఓటీటీ జియో హాట్‌స్టార్‌ను ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా వీక్షించే అవకాశం.. అది కూడా జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్.. ఇలా ఏ యూజర్ అయినా పర్వాలేదు. అయితే ఈ ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తమ ఓటీటీ యాప్‌లోని కంటెంట్ మొత్తం ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది జియో హాట్‌స్టార్. జియో హాట్ స్టార్‌కు చెందిన అన్ని షోలు, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రోజంతా ఉచితంగా వీక్షించవచ్చు.ఈ బిగ్ అనౌన్స్మెంట్కు సంబంధించిన బ్యానర్ జియో హాట్‌స్టార్ యాప్‌లో కనిపిస్తోంది. ఈ బ్యానర్లలో "ప్రౌడ్ ఇండియన్ ప్రౌడ్లీ ఫ్రీ" అనే ట్యాగ్ లైన్ తో "ఫ్రీ" అని రాసి ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ జియో హాట్‌స్టార్ కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఇందుకోసం మొబైల్ లేదా టీవీ యాప్ లోకి లాగిన్ అవ్వాలి. ఆగస్టు 15న జియో హాట్‌స్టార్‌లో సలాకార్ అనే కొత్త సిరీస్ రాబోతోంది. ఇది ఒక డిటెక్టివ్ కథ. ఆగస్టు 15న ఉచితం కావడంతో ఈ సిరీస్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.ఈ ఆఫర్ అందరికీ..ఈ ఆఫర్ ప్రత్యేకత ఏమిటంటే జియో హాట్‌స్టార్‌ను చూడటానికి జియో యూజరే అయి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే జియో హాట్‌స్టార్ బండిల్ ఆఫర్ ఎయిర్టెల్, వీఐ ప్లాన్లలో కూడా అందుబాటులో ఉంది. మామూలుగా ఎంపిక చేసిన కొంత కంటెంట్ జియో హాట్‌స్టార్‌లో ఎప్పుడైనా ఉచితంగా చూడవచ్చు. కానీ ఆగస్టు 15న మాత్రం 24 గంటల పాటు మొత్తం కంటెంట్‌ను ఉచితంగా అందించనున్నారు. -
ఓటీటీలోకి 'సూపర్ మ్యాన్' లేటెస్ట్ సినిమా
ఇప్పుడంటే కాస్త తగ్గిపోయాయి గానీ అప్పట్లో హాలీవుడ్లో సూపర్ హీరో జానర్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ప్రత్యేకించి 'సూపర్ మ్యాన్' ఫ్రాంచైజీ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 1984 నుంచి ఈ మూవీస్ వస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజైన లేటెస్ట్ మూవీ ఇప్పుడు నెల అయ్యేసరికి ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ కానుంది? ఈ మూవీ సంగతేంటి?డీసీ యూనివర్స్‌లోని లేటెస్ట్ 'సూపర్ మ్యాన్' సినిమా జూలై 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే మరీ సూపర్ అనిపించేలా టాక్ తెచ్చుకోలేకపోయింది. మన దేశంలోనూ ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డైరెక్టర్ జేమ్స్ గన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, ఫాండంగో ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఏలియన్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'సూపర్ మ్యాన్' విషయానికొస్తే.. జహ్రాన్పూర్పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా.. దాన్ని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. అయితే టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్.. సూపర్ మ్యాన్‌పై వ్యతిరేకత వచ్చేలా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని మాయమాటలు చెబుతాడు. వీడియోలు చూపిస్తాడు. దీంతో సూపర్ మ్యాన్‌పై అందరికీ నమ్మకం పోతుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి అందరూ తనని నమ్మేలా ఎలా చేశాడు? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.సూపర్ మ్యాన్‌తో పాటు ఈ వారం 30కి పైగా సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ, గ్యాంబ్లర్స్, టెహ్రాన్ చిత్రాలతో పాటు సారే జహాసే అచ్చా, అంధేరా లాంటి సిరీసులు కూడా ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. వీటితోపాటే ఏమైనా సడన్ సర్ప్రైజ్ స్ట్రీమింగ్‌లు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?) -
ఓటీటీలోకి వచ్చేసిన ఏలియన్ సిరీస్.. తెలుగులోనూ
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా 30కి పైగా లేటెస్ట్ చిత్రాలు రానున్నాయి. వీటిలో కొన్ని తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఉండగా.. మరికొన్ని డబ్బింగ్ సినిమాలు, సిరీసులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ క్రేజీ సిరీస్ తెలుగు వెర్షన్.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటది? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: శ్రీదేవి జయంతి.. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ఆ రికార్డ్ ఈమెదే)హాలీవుడ్లో డైనోసార్లు, ఏలియన్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో సినిమాలు, సిరీసులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కొన్నిరోజుల క్రితమే 'జురాసిక్ వరల్డ్ రీ బర్త్' అనే మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు 'ఏలియన్: ఎర్త్' పేరుతో తీసిన ఓ సిరీస్ సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రావడం విశేషం.కొన్నాళ్ల క్రితం రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే.. 2120 సంవత్సరం. భూమ్మీదకు ఏలియన్స్ వస్తారు. మరోవైపు శాస్త్రవేత్తలు వాటిని కట్టడి చేసేందుకు ప్రయోగాలు కూడా చేస్తారు. మరి ఈ సమరంలో ఎవరు పైచేయి సాధించారు? చివరకు ఏమైందనేదే సిరీస్ స్టోరీలా అనిపిస్తుంది. ప్రస్తుతానికి రెండు ఎపిసోడ్స్‌ని హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. విజువల్స్, స్టోరీ టెల్లింగ్ అదిరిపోయిందని రివ్యూలు కూడా వస్తున్నాయి. ఆసక్తి ఉంటే ఈ సిరీస్‌పై లుక్కేయండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
ఓటీటీకి వచ్చేస్తోన్న రూ.500 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఇటీవలే విడుదలై లవ్ బర్డ్స్‌ను తెగ ఏడిపించేసిన సినిమా సయారా. జూలై 18న థియేటర్లలోకి వచ్చిన ఈ బాలీవుడ్ రొమాంటిక్ ఫీల్ గుడ్ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రేమకథ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటివరకు సయారా చిత్రానికి దాదాపు రూ.500 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓవర్సీస్లో అయితే ఏకంగా విక్కీ కౌశల్ ఛావా వసూళ్లు దాటేసింది. అంతలా సూపర్ హిట్‌గా ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేశారు. అహాన్ పాండే, అనీత్ పద్దా నటించిన ఈ రొమాంటిక్ చిత్రం వచ్చేనెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. సయారా మూవీ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే మేకర్స్ సైతం అఫీషియల్‌గా ప్రకటించే అవకాశముంది.కాగా.. ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో సయారాను తెరకెక్కించారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన రొమాంటిక్ చిత్రంగా సయారా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. భారతదేశంలో రూ. 320 కోట్లు వసూలు చేసింది. -
ఓటీటీకి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంటోంది. దీంతో ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. తాజాగా మరో థ్రిల్లర్ మూవీ బుల్లితెర ప్రియులను అలరించేందుకు వస్తోంది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కించిన గుడ్ డే (Good Day) మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది. ఓ తాగుబోతు క్రైమ్ ఇన్స్టిగేషన్లో ఎలా సాయపడ్డాడనే కోణంలో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. సన్ నెక్ట్స్‌లో ఓటీటీ ప్లే ప్రీమియం ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది జూన్ 27న గుడ్ డే థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పోర్ణా జేఎస్ మైఖేల్ కథ అందించగా.. ఈ సినిమాకు ఎన్ అరవిందన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ రామలింగం, మైనా నందిని, ఆదుకలం మురుగదాస్, కాళి వెంకట్, భగవతి పెరుమాల్, వేళ రామమూర్తి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి గోవింద్ వసంత గుడ్ డేకు సంగీతం అందించారు.Freedom to binge exactly what you want – Good Day, Gamblers, Akkenam. Why choose one when Ungal Screen, Ungal Choice on Ungal Sun NXT!! #UngalScreenUngaChoice #SunNXT #GoodDay #Gamblers #Akkenam #WeekendBinge #MovieDrop #IndependenceDayWeekend #FreedomToBinge,… pic.twitter.com/JEieC1LhJv— SUN NXT (@sunnxt) August 10, 2025 -
ఓటీటీలోకి 'మ్యాడ్' హీరో కొత్త సినిమా
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో ఆకట్టుకున్న నటుడు సంగీత్ శోభన్. ఇతడు ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్న ఓ మూవీలో హీరోగా లీడ్ రోల్ చేస్తున్నాడు. అయితే ఇతడు నటించిన ఓ చిత్రం ఇదే ఏడాది మరొకటి రిలీజైందని తెలుసా? అవునా ఏ సినిమా అది అని ఆశ్చర్యపోతున్నారా? అదే ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్ షికార్లు)డైరెక్టర్ శోభన్‌కి ఇద్దరు కొడుకులు. పెద్దోడు సంతోష్ శోభన్ ఇదివరకే తెలుగులో ఆడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. చిన్నోడు సంగీత్ శోభన్ మాత్రం తొలుత ఓ వెబ్ సిరీస్ చేశాడు. తర్వాత 'మ్యాడ్' రెండు చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో 'గ్యాంబ్లర్స్' అనే మూవీ చేశాడు. జూన్ 6న థియేటర్లలోకి కూడా వచ్చింది. కానీ కంటెంట్‌పైన నమ్మకం లేదో ఏమో గానీ ప్రమోషన్స్ చేయలేదు. దీంతో మూవీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.ఇప్పుడు ఈ చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఆగస్టు 14 అంటే ఈ గురువారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 'గ్యాంబ్లర్స్' విషయానికొస్తే.. కార్డ్ క్యాజిల్ క్లబ్లో చాలామంది పేకాట ఆడుతుంటారు. ఆంటోని(మధుసూధనరావు) అలానే ఆడి తన వంశ గౌరవమైన లేడీ బర్డ్ అనే డైమండ్ కోల్పోతాడు. ఆ లేడీ బర్డ్ తర్వాత మిస్ అవుతుంది. దీంతో ఆంటోని కొడుకు ఏంజిల్ (సంగీత్ శోభన్)ని చిదంబరం (శ్రీకాంత్ అయ్యంగర్) తన చెప్పచేతుల్లో పెట్టుకుంటాడు. ఇంతకీ కార్డ్ క్యాజిల్ క్లబ్ సంగతేంటి? ఆ డైమండ్ కథేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ధనుష్‌తో డేటింగ్? ఎట్టకేలకు స్పందించిన మృణాల్) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటికోసం అభిమానులు ఆత్రుతగానే ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వీకెండ్ ఏకంగా 30 వరకు కొత్త మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో తెలుగు డబ్బింగ్ చిత్రాలే కొన్ని ఉన్నాయి.(ఇదీ చదవండి: ఆయన దీవెనలు ఉన్నంత కాలం నన్నెవరూ ఆపలేరు: ఎన్టీఆర్)ఓటీటీల్లో రిలీజయ్యే కొత్త సినిమాల విషయానికొస్తే జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ, టెహ్రాన్ మూవీస్తోపాటు సారే జహాసే అచ్చా, అంధేరా సిరీస్‌లు ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపుతున్నాయి. కొత్త చిత్రాలు.. వీకెండ్లో ఏమైనా సడన్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (ఆగస్టు 11 నుంచి 17వరకు)జీ5టెహ్రాన్ (హిందీ సినిమా) - ఆగస్టు 14జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 15నెట్ఫ్లిక్స్సులివన్ క్రాసింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 11ఔట్ ల్యాండర్ సీజన్ 7 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 11ఫైనల్ డ్రాఫ్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12జిమ్ జెఫ్రీస్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 12ఫిక్స్డ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 13లవ్ ఈజ్ బ్లైండ్: యూకే సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13సారే జహాసే అచ్చా (హిందీ సిరీస్) - ఆగస్టు 13సాంగ్స్ ఫ్రమ్ ద హోల్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 13యంగ్ మిలీయనీర్స్ (ఫ్రెంచ్ సిరీస్) - ఆగస్టు 13ఇన్ ద మడ్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 14మోనోనొక్ మూవీ ద సెకండ్ ఛాప్టర్ (జపనీస్ సినిమా) - ఆగస్టు 14ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 15ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15అమెజాన్ ప్రైమ్అంధేరా (హిందీ సిరీస్) - ఆగస్టు 14హాట్స్టార్డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 11డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ యానిమేషన్ సినిమా) - ఆగస్టు 11ఐరన్ మ్యాన్ అండ్ హిజ్ ఆసమ్ ఫ్రెండ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12ఏలియన్: ఎర్త్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13లిమిట్లెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 17సోనీ లివ్కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 17 (రియాలిటీ షో) - ఆగస్టు 11కోర్ట్ కచేరి (హిందీ సిరీస్) - ఆగస్టు 13బుక్ మై షోఈజ్ లవ్ ఇనఫ్? సర్ (హిందీ సినిమా) - ఆగస్టు 11లయన్స్ గేట్ ప్లేద క్రో (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 14మనోరమ మ్యాక్స్వ్యసనసమేతం బంధుమిత్రధికళ్ (మలయాళ సినిమా) - ఆగస్టు 14మూవీ సెయింట్స్కట్లా కర్రీ (గుజరాతీ మూవీ) - ఆగస్టు 15ఆపిల్ ప్లస్ టీవీస్నూపీ ప్రెజెంట్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15(ఇదీ చదవండి: ఉపాసన పెట్టిన 'లవ్ టెస్ట్'.. చరణ్ ఏం చేశాడంటే?) -
ఓటీటీకి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో ఫుల్ డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే తెలుగులో డబ్బింగ్ అయిన పలు మలయాళ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియులను అలరించాయి. ఇలాంటి జోనర్లో ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ కావడంతో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సుదేవ్ నాయర్, జిన్స్, జియో బేబీ కీలక పాత్రల్లో ఈ సిరీస్‌ను రూపొందించారు.కేరళ త్రిస్సూర్‌లోని అత్యంత వివాదాస్పద కేసు ఆధారంగా కమ్మటం అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఈ కేసు చుట్టు జరిగిన పరిణామాలే కమ్మటం వెబ్ సిరీస్. యదార్థ సంఘటనలతో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉండనున్నాయి.ఈ క్రైమ్ ఇన్స్టిగేటివ్ వెబ్ సిరీస్ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఆగస్టు 29 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సిరీస్‌లో అజయ్ వాసుదేవ్, అఖిల్ కవలయూర్, అరుణ్ సోల్, శ్రీరేఖ, జోర్డీ పొంజా కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీలోకి డిఫరెంట్ స్టోరీతో తీసిన తెలుగు సినిమా
అప్పుడప్పుడు తెలుగులో డిఫరెంట్ కథలతో సినిమాలు వస్తుంటాయి. కాకపోతే స్టార్స్ లేకపోవడం వల్ల, మరేదైనా కారణం వల్లనో తెలియదు గానీ వాటికి పెద్దగా గుర్తింపు దక్కదు. అలాంటి ఓ మూవీనే 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రాబోతుంది?కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య సినిమాలని నిర్మించిన డాక్టర్ ప్రవీణ.. దర్శకురాలిగా మారి చేసిన తొలి మూవీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం జూలై 18న థియేటర్లలోకి వచ్చింది. డీసెంట్ ప్రయత్నం అనే పేరు తెచ్చుకుంది. కాకపోతే బిగ్ స్క్రీన్‌పై నిలబడలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీలో ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. 'దేవుడంటే నిజమో అబద్దమో కాదు ఒక నమ్మకం' అనే కాన్సెప్ట్‌తో తీసిన చిత్రమిది.(ఇదీ చదవండి: 'అరేబియా కడలి' తెలుగు సిరీస్ రివ్యూ)'కొత్తపల్లిలో ఒకప్పుడు' విషయానికొస్తే.. కొత్తపల్లిలో అప్పన్న(రవీంద్ర విజయ్) ఊరందరికీ అప్పులిచ్చి వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటూ ఉంటాడు. ఇతడి దగ్గరే రామకృష్ణ(మనోజ్ చంద్ర) సహాయకుడు. ఇదే ఊరిలో ఉండే రెడ్డి(బెనర్జీ) మనవరాలు సావిత్రిని(మౌనిక) రామకృష్ణ చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేయించే రామకృష్ణ.. సావిత్రితో పక్క ఊరిలో డ్యాన్స్ చేయించాలని అనుకుంటాడు. నేరుగా ఆమెతో మాట్లాడే ధైర్యం లేక సావిత్రి ఇంట్లో పనిచేసే అందం(ఉషా) సాయం తీసుకుంటాడు. కానీ అనుకోని సంఘటనల కారణంగా అందంని రామకృష్ణ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు అప్పన్న చనిపోతాడు. తర్వాత ఊరిలో జరిగిన పరిణామాలేంటి? చివరకు రామకృష్ణ సావిత్రి ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'సు ఫ్రమ్ సో' రివ్యూ.. కన్నడలో బ్లాక్‌బస్టర్ మరి తెలుగులో?) -
'అరేబియా కడలి' తెలుగు సిరీస్ రివ్యూ
ఈ మధ్యే వచ్చిన 'కింగ్డమ్' సినిమాతో నటుడిగా మరోసారి ఆకట్టుకున్న సత్యదేవ్.. ఓ తెలుగు వెబ్ సిరీస్ చేశాడు. అదే 'అరేబియా కడలి'. ఆనంది హీరోయిన్. ప్రముఖ దర్శకుడు క్రిష్.. షో రన్నర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో రిలీజైన 'తండేల్' సినిమాతో ఈ సిరీస్‌ని పోల్చి చూస్తున్నారు. మరి రెండు ఒకే కథతో తీశారా? ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?విశాఖ భీమిలిపట్నంలో మత్స్యవాడ, చేపలవాడ గ్రామాల ప్రజలు చాన్నాళ్లుగా గొడవపడుతుంటారు. జెట్టీలు లేకపోవడంతో చేపల వేటకు సరైన సదుపాయాలు ఉండవు. దీంతో బతుకు దెరువు కోసం గుజరాత్ వలస వెళ్తుంటారు. చేపలవాడ గ్రామానికి చెందిన బద్రి(సత్యదేవ్).. మత్స్యవాడకు చెందిన గంగని ప్రేమిస్తుంటాడు. మరోవైపు గుజరాత్ వెళ్లిన బద్రి.. తన బృందంతో కలిసి అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్తాడు. దీంతో ఆ దేశ ఆర్మీ.. వీళ్లని బంధిస్తుంది. మరి బద్రితో పాటు ఉన్నవాళ్లని తీసుకొచ్చేందుకు ఊరి ప్రజలు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ సిరీస్ చూస్తున్నంతసేపు నాగచైతన్య 'తండేల్' సినిమానే గుర్తొస్తుంది. ఆల్రెడీ తెలిసిన కథ అయినప్పటికీ.. బాగానే తీశారు. చూస్తున్నంతసేపు ఎంగేజ్ అయ్యేలా చేశారు. కాకపోతే సినిమా రెండు-రెండున్నర గంటల్లోనే చెప్పేయాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్ని అందులో సింపుల్‌గా చూపించేశారు. కానీ ఇది వెబ్ సిరీస్ కావడంతో చాలా డీటైల్డ్‌గా చూపించారు. అసలేం జరిగింది? జాలర్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది విడమరిచి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ప్రతి ఎమోషన్ని చూపించారు.మొదట్లో చేపలవాడ, మత్స్యవాడ గ్రామాల మధ్య గొడవలు.. తర్వాత వేటకు వెళ్లడం, బద్రి-గంగ మధ్య లవ్ స్టోరీ. జాలర్ల కుటుంబాల్లోని బాధలు చూపిస్తూ కథని నిదానంగా తీసుకెళ్లారు. సహజత్వానికి దగ్గరగా సీన్లు చూపించారు. సముద్రంలోని జరిగే సన్నివేశాలు ఆసక్తి రేపుతూనే, ఉత్కంఠగానూ అనిపించాయి. పాక్ పోలీసులకు దొరికిపోయి అక్కడి జైల్లో మన జాలర్లు పడే ఇబ్బందులు ఎమోషనల్ అయ్యేలా చేశాయి.'తండేల్'ని ప్రేమకథగా తీస్తే.. ఈ సిరీస్‌ని మాత్రం కాస్త డిఫరెంట్ యాంగిల్లో చూపించారు. ప్రేమించినవాడితో కలిసి ఊరికి మంచి చేయాలనుకోవడం, జెట్టీ వస్తే తమ ఊరిప్రజలు వలస వెళ్లాల్సిన అవసరం లేదని హీరో భావించడం.. ఇలా హీరోహీరోయిన్లకు ఓ కారణాన్ని చూపించడం.. సినిమాని ఈ సిరీస్‌ని వేరు చేసి చూపించిందని చెప్పొచ్చు.ఎవరెలా చేశారు?స్వతహాగా సత్యదేవ్ ఉత్తరాంధ్రకు చెందినవాడు కావడంతో బద్రి పాత్రలో విశాఖ యాసలో ఆకట్టుకున్నాడు. గంగ రోల్ చేసిన ఆనంది కూడా పూర్తి న్యాయం చేసింది. 'కోర్ట్' ఫేమ్ రోషన్, చింతకింది శ్రీనివాసరావు, నాజర్ తదితరులు తమ పాత్రల ఫరిది మేరకు నటించారు. ఇది సిరీస్ కావడంతో కమర్షియల్ హంగులు లేకుండానే తెరకెక్కించారు. స్టోరీ పరంగా కొత్తగా ఆశిస్తే మాత్రం అసంతృప్తికి గురయ్యే అవకాశముంది. టెక్నికల్ అంశాలు కూడా బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఈ సిరీస్ నచ్చేయొచ్చు. -
మూడు రోజుల వరుస సెలవులు.. ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. అంతేకాకుండా ఈ మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చిల్ అవ్వొచ్చు. ఈ హాలీడేస్‌లో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేందుకు సినిమాలు కూడా రెడీ వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం థియేటర్లలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీలవైపు చూస్తున్నారు. ఫ్రైడే రోజున బకాసుర రెస్టారెంట్, సు ఫ్రమ్ సో అనే డబ్బింగ్ చిత్రం థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఓటీటీ ప్రియుల కోసం సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ సిద్ధమైపోయాయి. ఈ శుక్రవారం స్ట్రీమింగ్కు వచ్చే వాటిలో తెలుగు వెబ్ సిరీస్‌లతో పాటు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ మూవీస్ అలరించేందుకు మీ ముందుకొస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం కుటుంబంతో కలిసి ఇంట్లోనే మీకు నచ్చిన సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఈ లిస్ట్ చదివేయండి.నెట్‌ఫ్లిక్స్..ఓహో ఎంతన్ బేబీ(తెలుగు డబ్బింగ్ సినిమా)- ఆగస్టు 08స్టోలెన్-హైయిస్ట్ ఆఫ్ ది సెంచరీ(హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 08మ్యారీ మీ- (హాలీవుడ్ మూవీ) - ఆగస్టు 10ది ఆక్యుపెంట్-(హాలీవుడ్) ఆగస్టు 09అమెజాన్ ప్రైమ్అరేబియా కడలి (తెలుగు వెబ్ సిరీస్)- ఆగస్టు 08జియో హాట్‌స్టార్..సలకార్(హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 08సోనీలివ్బ్లాక్ మాఫియా ఫ్యామిలీ-సీజన్-4(అమెరికన్ సిరీస్)- ఆగస్టు 08జీ5మామన్(తమిళ సినిమా)- ఆగస్టు 08మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు వెబ్ సిరీస్)- ఆగస్టు 08జరన్ (మరాఠీ సినిమా) - ఆగస్టు 08సన్ నెక్ట్స్..హెబ్బులి కట్(కన్నడ సినిమా)- ఆగస్టు 08లయన్స్ గేట్ ప్లేప్రెట్టి థింగ్ (హాలీవుడ్ మూవీ) - ఆగస్టు 08బ్లాక్ మాఫియా సీజన్ 4 (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్టు 08ఎమ్ఎక్స్ ప్లేయర్బిండియే కే బాహుబలి (హిందీ వెబ్ సిరీస్) - ఆగస్టు 08సైనా ప్లేనడికర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 08 -
ఓటీటీలో హారర్ వెబ్ సిరీస్.. ఎప్పటినుంచంటే?
హారర్ సినిమాలకు క్రేజ్ ఎప్పుడూ ఉండేదే! తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ హారర్ వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. అదే "అంధేరా" (Andhera). ఈ వెబ్ సిరీస్‌ను ఆగస్టు 14 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అంధేరా విషయానికి వస్తే.. ప్రియా బాపత్, కరణ్వీర్ మల్హోత్రా, ప్రజక్త కోలి, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. గౌరవ్ దేశాయ్ కథ అందించగా రాఘవ్ దర్ దర్శకత్వం వహించాడు. ఇది ఎనిమిది ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది. Brace yourself, this Andhera doesn’t just haunt, it hunts 🫣#AndheraOnPrime, New Series, Aug 14 pic.twitter.com/vg5IAB3TgX— prime video IN (@PrimeVideoIN) August 6, 2025 చదవండి: 'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్ -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన 'జురాసిక్' సినిమా
హాలీవుడ్లో డైనోసార్లు ఉండే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరీ ముఖ్యంగా జురాసిక్ పార్క్ పేరుతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ఆ జానర్లో తీసిన ఓ చిత్రం రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చింది. ఓకే పర్లేదు అనిపించుకునే టాక్ తెచ్చుకుంది. మన దేశంలోనూ ప్రేక్షకులు మూవీని చూశారు. ఇప్పుడు ఈ చిత్రం సరిగ్గా నెల రోజులు అయ్యేసరికి ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'జురాసిక్ వరల్డ్ రీ బర్త్'. స్కార్లెట్ జాన్సన్ లీడ్ రోల్ చేయగా, గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. 2022లో వచ్చిన 'జురాసిక్ వరల్డ్: డొమినియన్'కు సీక్వెల్‌గా తీసిన చిత్రం ఇది. అయితే అది ఆకట్టుకోలేకపోయింది. ఇది కూడా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేకపోయింది. దీంతో నెలరోజులు తిరగకుండానే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీల్లో వీడియో ఆన్ డిమాండ్(అద్దె విధానంలో) అందుబాటులోకి తీసుకొచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు)'జురాసిక్ వరల్డ్ రీబర్త్' విషయానికొస్తే.. గుండె జబ్బులు సహా మనిషి ఎదుర్కొంటున్న ఎన్నో వ్యాధులు నయమయ్యేలా చేసే శక్తి.. మూడు అరుదైన డైనోసార్ల రక్తంతో చేసిన ఔషదానికి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. కానీ బతికున్న వాటి నుంచి ఆ రక్తాన్ని సేకరిస్తేనే అది ప్రయోగానికి ఉపయోగపడుతుంది. దీంతో అడ్వెంచర్ ఆపరేషన్స్ చేసే జోరా బెన్నెట్‌తో (స్కార్లెట్ జాన్సన్) మార్టిన్ (రూపర్ట్ ఫ్రెండ్) అనే ఫార్మాస్యూటికల్స్ ప్రతినిధి ఒప్పందం చేసుకుంటాడు.ఈక్వెడార్‌లో మాత్రమే సంచరించే అరుదైన, డేంజరెస్ డైనోసార్లని గుర్తించి, వాటి రక్తాన్ని సేకరించేందుకు డాక్టర్ హెన్రీ (జొనాథన్ బెయిలీ), బోటు యజమాని, సాహసీకుడు డంకన్ (మహర్షలా అలీ) అందరూ కలిసి ప్రయాణిస్తారు. తర్వాత ఏమైంది? డైనోసార్ల నుంచి రక్తం సేకరించారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహ' ఓటీటీ బిగ్ డీల్) -
ఓటీటీకి అనుపమ కోర్ట్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన చిత్రం 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ మూవీ రిలీజ్‌కు ముందే వివాదానికి దారితీసింది. సినిమా టైటిల్లో జానకి పేరు ఉపయోగించడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవికి మరో పేరైన జానకి టైటిల్ మారిస్తేనే సెన్సార్ చేస్తామని నిర్మాతలకు సూచించింది. ఆ తర్వాత జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా పేరును మార్చారు. దీంతో సెన్సార్ బోర్డ్ విడుదలకు ఓకే చెప్పింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్తో పాటు సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటించారు.కోర్టు రూమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా జూలై 17న థియేటర్లలోకి రిలీజైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో కేవలం మలయాళంలోనే విడుదలైన ఈ సినిమా.. ఆగస్టు 15 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ..సిటీలో ఉద్యోగం చేసుకునే అమ్మాయి జానకి(అనుపమ). ఓ రోజు ఆమెపై అత్యాచారం జరుగుతుంది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆరోపణలతో ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున వాదించేందుకు లాయర్(సురేశ్ గోపి) వస్తాడు. దీంతో కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. చివరకు జానకికి న్యాయం దక్కిందా లేదా అనేదే అసలు స్టోరీ. -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో బకాసుర రెస్టారెంట్, రాజుగాని సవాల్, భళారే సిత్రం లాంటి తెలుగు సినిమాలతో పాటు కన్నడలో రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'సు ఫ్రమ్ సూ' చిత్రాన్ని ఈ వీకెండే రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ 20కి పైగా కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఈసారి తెలుగువి చాలానే ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ సినిమా)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఓహో ఎంథన్ బేబీ, పరందు పో, మామన్, నడికర్ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు అరేబియా కడలి, మోతెవరి లవ్ స్టోరీ తదితర తెలుగు వెబ్ సిరీసులు ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. వీటితో పాటు ఈ వీకెండ్లో 'జూనియర్' కూడా రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 04 నుంచి 10వ తేదీ వరకు)అమెజాన్ ప్రైమ్అరేబియా కడలి (తెలుగు సిరీస్) - ఆగస్టు 08నెట్ఫ్లిక్స్ఎస్ఈసీ ఫుట్‌బాల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05టైటాన్స్: ద రైజ్ ఆఫ్ హాలీవుడ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05వెన్స్ డే సీజన్ 2 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06ఓ ఎంథన్ బేబీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 08స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ద సెంచరీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 08మ్యారీ మీ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 10హాట్స్టార్ఇండియాస్ బిగ్గెస్ట్ ఫుడీ (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 04పరందు పో (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 05లవ్ హర్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07మిక్కీ 17 (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 07సలకార్ (హిందీ సిరీస్) - ఆగస్టు 08జీ5మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు సిరీస్) - ఆగస్టు 08మామన్ (తమిళ మూవీ) - ఆగస్టు 08జరన్ (మరాఠీ సినిమా) - ఆగస్టు 08సోనీ లివ్మయసభ (తెలుగు సిరీస్) - ఆగస్టు 07సన్ నెక్స్ట్హెబ్బులి కట్ (కన్నడ సినిమా) - ఆగస్టు 08ఆపిల్ ప్లస్ టీవీప్లాటోనిక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06ఎమ్ఎక్స్ ప్లేయర్బిండియే కే బాహుబలి (హిందీ సిరీస్) - ఆగస్టు 08సైనా ప్లేనడికర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 08లయన్స్ గేట్ ప్లేప్రెట్టీ థింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 08బ్లాక్ మాఫియా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు) -
ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ సినిమా
ఈ వీకెండ్లో దాదాపు 35కి పైగా కొత్త సినిమాలు,వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో తమ్ముడు, సితారే జమీన్ పర్, 3 బీహెచ్‌కే, ఓ భామ అయ్యో రామ, పాపా, కలియుగం 2064 ఉన్నంతలో చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటే రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా 'గార్డ్' కూడా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)విరాజ్ రెడ్డి, మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్ లీడ్ రోల్స్ చేసిన సినిమా 'గార్డ్'. జగ్గా పెద్ది దర్శకత్వం వహించారు. అనసూయ రెడ్డి నిర్మాత. ఈ ఏడాది ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజ్ కాగా.. గత నెలలో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి అత్యధిక వ్యూస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఆస్ట్రేలియాలో షూటింగ్ చేసిన హారర్ కామెడీ మూవీ ఇది. హాలీవుడ్ టెక్నీషియన్స్ పలువురు ఈ సినిమా కోసం పనిచేయడం విశేషం. 'గార్డ్' త్వరలో మరో రెండు ఓటీటీల్లోనూ ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. 'గార్డ్' విషయానికొస్తే.. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే హీరో. ఓ అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఓ సందర్భంలో నిషేధిత ల్యాబ్‌లోకి అడుగుపెట్టి ఓ అమ్మాయిని రక్షిస్తాడు. అప్పటినుంచి వింత వింత సంఘటనలన్నీ జరుగుతుంటాయి. ఓ అమ్మాయి దెయ్యం రూపంలో కనిపిస్తూ అందరికీ భయపెడుతూ ఉంటుంది. మరి చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన 'బిగ్‌బాస్' ఫేమ్ గౌతమ్) -
రొమాన్స్ ఇరుక్కు, ట్విస్ట్ ఇరుక్కు.. ఓటీటీలో లవ్ స్టోరీ.. ఎప్పుడంటే?
తమిళ హీరో విష్ణు విశాల్ నిర్మించిన చిత్రం "ఓహో ఎంతన్ బేబి" (Oho Enthan Baby Movie). రుద్ర, మిథిలా పాల్కర్ జంటగా నటించారు. కృష్ణ కుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా దాదాపు నెల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.ఓటీటీలో ఎప్పుడంటే?ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix).. ఓహో ఎంతన్ బేబీ చిత్రాన్ని ఆగస్టు 8న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. రొమాన్స్ ఇరుక్కు (ఉంది), ట్విస్ట్ ఇరుక్కు, డ్రామా ఇరుక్కు.. అంతా ఒకే.. హ్యాపీ ఎండింగ్ ఇరుక్కుమా? (ఉంటుందా?) అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించింది. మరి ఈ లవ్‌స్టోరీ చూడాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే! Open pannaa… oru love story. Romance irukku, twist irukku, drama irukku. Aana, happy ending irukkuma? 👀 pic.twitter.com/YF8H7YtVaG— Netflix India South (@Netflix_INSouth) August 3, 2025 చదవండి: రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో -
ఓటీటీలో 'హరి హర వీరమల్లు'.. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్!
పవన్ కల్యాణ్ నటించిన తొలి పాన్-ఇండియన్ సినిమ 'హరి హర వీరమల్లు' నెలరోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈమేరకు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. జులై 24న విడుదలైన ఈ చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుమారు రూ. 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు. అయితే, మొదటి ఆటతోనే భారీ డిజాస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో సుమారు రూ. 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.'హరి హర వీరమల్లు' ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆగష్టు 22న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని మొదట ఢీల్ సెట్ చేసుకున్నారట. అయితే, సినిమా డిజాస్టర్‌గా మిగలడంతో నిర్మాతలు తమ ప్లాన్‌లో మార్పులు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం వీరమల్లు డిజిటల్ విడుదల విషయంలో పరిశీలిస్తున్నారట.. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్ట్రీమింగ్కు తీసుకురావలనే ప్లాన్‌లో ఉన్నారట. అదే జరిగితే 30రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసినట్లు అవుతుంది. అయితే, ఓటీటీ విడుదల విషయంలో మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.'హరి హర వీరమల్లు' విడుదలతోపాటు వివాదాలను కూడా తీసుకొచ్చింది. కోహినూర్ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. అయితే, ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీయడంతో చాలామంది తప్పుబట్టారు. కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడనేది సినిమా కథగా చెప్పడం ఏంటంటూ విమర్శించారు. ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడం.. ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా ఉందంటూ కొందరు పేర్కొన్నారు. ఇలా అనేక కారణాల వల్ల సినిమాకు ఎక్కువ నష్టం జరిగింది.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. నాసర్, సునీల్, దలీప్ తాహిల్, ఆదిత్య, సచిన్ ఖేడేకర్ కూడా ఉన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. -
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన '3BHK' సినిమా
సిద్ధార్థ్ హీరోగా నటించిన '3BHK' సినిమా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. శ్రీగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 7న విడుదలైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్.. ఈ అంశం చుట్టూ 3BHK సినిమా ఉంటుంది. ఇందులో శరత్‌కుమార్, సిద్ధార్థ్ తండ్రికొడుకులుగా మెప్పించారు. దేవయాని, మీతా రంగనాథ్, చైత్ర, యోగిబాబు తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం తెలుగులో కాస్త నిరాశ పరిచినప్పటికీ కోలీవుడ్‌లో మంచి టాక్ తెచ్చుకుంది.'3BHK' సినిమా అమెజాన్ ప్రైమ్(amazon prime video)లో నేడు (ఆగష్టు 1)న సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉండటంతో ఈ వీకెండ్ కుటుంబంతో పాటు అందరూ చూడతగిన చిత్రమని చెప్పవచ్చు. కథ కాస్త నెమ్మదిగా రన్ అవుతుందని విమర్శలు వచ్చినా.. ఫైనల్‌గా ఒక మంచి చిత్రాన్ని చూశామనే ఫీల్ కలుగుతుంది.నేటి సమాజంలో సొంతిల్లు ఉండాలని అందరికీ కోరిక ఉంటుంది. దానిని ఒక గౌరవంగా అనుకుంటాం కూడా.. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ కలను సాధించుకోవడం అంత సులువు కాదని చెప్పవచ్చు. సొంత ఇంటి కోసం వారు చేసే త్యాగాలు, కష్టాలు ఇలా ఎన్నో మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఎంతో భావోద్వేంగా వారి ప్రయాణం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తోనే '3BHK' చిత్రాన్ని తెరకెక్కించారు. -
ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. ఓటీటీలన్నీ ఫ్రీ..
ఓటీటీ వినియోగదారుల కోసం టెలికాం కంపెనీలు అనేక ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్లాన్లలో చాలా వరకు ఖరీదైనవి లేదా ఒకటీ రెండు ఓటీటీ సర్వీసులకు మాత్రమే యాక్సెస్ కల్పిస్తాయి. కానీ ఎయిర్టెల్ ఓటీటీ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఒకటీ రెండు కాదు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సహా రెండు డజన్లకు పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో ఎంపిక చేసిన ఆల్-ఇన్-వన్ ఓటీటీ ప్లాన్లను చేర్చింది. అంటే ఒక్క రీఛార్జ్ లో ఒకటీ రెండు కాదు అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ల జాబితాలో రూ .279 రీఛార్జ్ టారిఫ్ ఉంది. పూర్తి నెల వాలిడిటీతో వస్తుంది. దీనితో రీఛార్జ్ చేస్తే నెల రోజుల పాటు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది.రూ.279తో ఆల్ ఇన్ వన్ ఓటీటీ ప్లాన్ఎయిర్టెల్ యూజర్లకు అందిస్తున్న ఈ ప్లాన్ డేటా బూస్టర్ లేదా డేటా ఓన్లీ ప్లాన్. కాబట్టి ఇందులో కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. అయితే ఒక నెల వ్యాలిడిటీతో 1 జీబీ అదనపు డేటా లభిస్తుంది. వినియోగదారులు ఏదైనా యాక్టివ్ ప్లాన్‌తో దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు.ఈ ప్లాన్ అందిస్తున్న ఓటీటీ సేవల జాబితాలో నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జియో హాట్‌స్టార్ సూపర్, జీ5 ప్రీమియం వంటి పెద్ద సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనితో వినియోగదారులు 25 కంటే ఎక్కువ ఓటీటీ సేవల కంటెంట్‌ను చూడవచ్చు. ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియంలో సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, ఆహా, చౌపాల్, హోయిచోయ్ వంటి ప్లాట్‌ఫామ్‌లను చేర్చారు. -
బిగ్‌బాస్ వచ్చేస్తున్నాడు.. డేట్ రివీల్ చేసిన ఓటీటీ సంస్థ
బుల్లితెర ప్రియులను అలరించే బిగ్‌బాస్ రియాలిటీ షోకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే హోస్ట్‌గా మరోసారి ఆ స్టార్ హీరోనే అలరించనున్నారు. ఈ బిగ్‌బాస్ షోకు ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఏ భాషలో వచ్చిన ఈ రియాలిటీ షో బుల్లితెర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిందీలో బిగ్‌బాస్ సీజన్-19కు సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ప్రకటించింది.ఆగస్టు 24 నుంచి బిగ్‌బాస్-19 సీజన్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఈ సీజన్ అభిమానులను అలరించనుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో జియో హాట్‌స్టార్‌తో పాటు కలర్స్ టీవీలో ప్రసారం కానుంది.రెమ్యునరేషన్ తగ్గించుకున్న సల్మాన్ ఖాన్..అయితే ఈ ఏడాది సీజన్‌కు సల్మాన్ ఖాన్ భారీగా పారితోషికం తగ్గించుకున్నారు. ఈ ఏడాది వీకెండ్‌కు రూ.8 - 10 కోట్ల మేర పారితోషికం తీసుకునేందుకు అంగీకరించాడు. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.120-150 కోట్లు అందుకోనున్నాడు. అయితే ఈ హీరో బిగ్‌బాస్ 17వ సీజన్‌కు రూ.200 కోట్లు, 18వ సీజన్‌కు ఏకంగా రూ.250 కోట్లు పుచ్చుకున్నాడు. అలాంటిదిప్పుడు సగానికి సగం తగ్గించుకోవడం గమనార్హం.Bhai ke saath laut aaya hai Bigg Boss ka naya season!Aur iss baar chalegi - Gharwalon Ki Sarkaar👑Dekhiye #BiggBoss19, 24th August se, sirf #JioHotstar aur @colorstv par.@BeingSalmanKhan @danubeprop #VaselineIndia#BiggBossOnJioHotstar#BB19OnJioHotstar pic.twitter.com/MxqX8s0Cor— JioHotstar (@JioHotstar) July 31, 2025 -
ఓటీటీకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ప్రస్తుత రోజుల్లో ఓటీటీలు సరికొత్త కంటెంట్‌తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. ఓటీటీ ప్రియుల అభిరుచికి తగ్గట్టుగానే డిఫరెంట్ కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు మరో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ నెట్వర్క్. ఈ సిరీస్‌కు సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహించారు. రమ్య సినిమా బ్యానర్‌పై లావణ్య యన్ఎస్, ఎంజి జంగం నిర్మించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆహా ఓటీటీలో ప్రసారమవుతోన్న ఈ వెబ్ సిరీస్‌ను ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయండి. -
'కింగ్డమ్' ఓటీటీ డీటైల్స్.. ఎప్పుడు రావొచ్చు?
విజయ్ దేవరకొండ హిట్ పడి చాలా కాలమైంది. దీంతో తన లేటెస్ట్ సినిమా 'కింగ్డమ్'పై బోలెడు ఆశలు పెట్టేసుకున్నాడు. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. కానీ ఒకటి రెండు రోజులు ఆగితే అసలు రిజల్ట్ ఏంటనేది బయటపడుతుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ మూవీ ఓటీటీ డీటైల్స్ ఏంటి? ఎప్పుడు రావొచ్చు?ఒకప్పటితో పోలిస్తే థియేటర్లకు జనాలు బాగానే వెళ్తున్నారు. ఆగస్టు 14 వరకు మరో పెద్ద మూవీ లేదు కాబట్టి.. 'కింగ్డమ్'కి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. కానీ ఏ మేరకు దాన్ని క్యాష్ చేసుకుంటుందనేది చూడాలి. అలానే కలెక్షన్ కూడా రాబట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నిర్మాణ సంస్థ ఎప్పుడో నెట్‌ఫ్లిక్స్ సంస్థకు విక్రయించింది. మరి ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రావొచ్చు?(కింగ్డమ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రీసెంట్ టైంలో సితార ఎంటర్టైన్మెంట్స్ తీసే సినిమాల్ని దాదాపుగా నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేస్తోంది. 'కింగ్డమ్' కూడా అలానే దక్కించుకుంది. అలానే ఈ చిత్రాలన్ని చాలావరకు నాలుగు వారాల గ్యాప్‌తోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఈ మూవీ కూడా అలానే రావొచ్చని తెలుస్తోంది. అంటే ఆగస్టు చివరి వారంలో లేదంటే సెప్టెంబరు తొలివారంలో 'కింగ్డమ్' ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ అవుతుంది. ఈ విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘కింగ్డమ్’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా!) -
లీగల్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. తెలుగు వర్షన్ రిలీజ్‌పై ప్రకటన
కోలీవుడ్‌లో ఓటీటీ వేదికగా విడుదలైన 'సట్టముం నీతియుం' వెబ్ సిరీస్‌పై పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగులోనూ రాబోతోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ జీ5 తమిళ్లో జులై 18న విడుదలై దూసుకెళ్తుంది. ఇందులో శరవణన్, నమ్రితా ఎంవీ ప్రధాన పాత్రలు పోషించారు.ఉత్కంఠభరితమైన కోర్టు సన్నివేశాలతో పాటు భావోద్వేగంతో కూడిన 'సట్టముం నీతియుం' వెబ్ సిరీస్ ఆగష్టు 1న తెలుగులో విడుదల కానుంది. జీ5 వేదికగా తెలుగు, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సిరీస్ సుందరమూర్తి (శరవణన్) అనే ఓ లాయర్ చుట్టూ తిరుగుతుంది. కోర్టులో పేదవారికి న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ చిత్రం ఉంటుంది. ఇది ఒక సామాన్యుడి ధైర్యాన్ని, న్యాయాన్ని సాధించేందుకు చేసే పోరాటాన్ని చూపించే కథగా రూపొందించబడింది. శక్తివంతమైన కోర్ట్ డ్రామా వెబ్ సిరీస్‌గా నిలుస్తుందని చాలామంది రివ్యూలు ఇచ్చారు.A battle, a long lost hope for justiceWatch #SattamumNeedhiyum – Premieres on 1st August Produced by: 18 CreatorsPrabha & Sasikala#Saravanan @namritha_mv @balajiselvaraj @soori_prathap@vibinbaskar @RamDasa2 @BhavnaGovardan@mariamila1930 @harihmusiq @srini_selvaraj pic.twitter.com/leCiC7erZG— ZEE5 Telugu (@ZEE5Telugu) July 30, 2025 -
'పెళ్లికి ముందే హద్దులు దాటితే'.. ఓటీటీకి సూపర్ హిట్ సినిమా
కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించిన తమిళ చిత్రం 'డా..డా'. గణేశ్ కె.బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని ‘పాపా’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. పెళ్లికి ముందే హద్దులు దాటిన ఒక జంట జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ సందడి చేసేందుకు వస్తోంది. ఈ అర్ధరాత్రి నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పాపా మూవీ పోస్టర్‌ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్, విటీవి గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన డా.. డా సినిమాను మూవీ నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ ఎంఎస్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో చూడలేని వారు ఓటీటీలో చూసేయండి. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ హాలీవుడ్ హారర్ మూవీ కూడా అందుబాటులోకి వచ్చేసింది. జాంబీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత, 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ డాని బోయెల్ దర్శకత్వం వహించాడు. జూన్‌లో ఇది థియేటర్లలోకి రాగా అలా నెల దాటిందో లేదో ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ హారర్ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.2002లో రిలీజైన '28 డేస్ లేటర్', 2007లో విడుదలైన '28 వీక్స్ లేటర్' చిత్రాలకు సీక్వెల్ '28 ఇయర్స్ లేటర్'. దీన్ని రెండు భాగాలుగా తీశారు. ఇందులోని తొలి పార్ట్ జూన్‌లో రిలీజైంది. కాకపోతే థియేటర్లలో అనుకున్నంతగా ఫెర్ఫార్మ్ చేయలేకపోయింది. మరి అందుకేనేమో ఇప్పుడు రెండు ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వీడియో అన్ డిమాండ్(రెంట్ విధానంలో) అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీల్లో ఈ మూవీ చూడొచ్చు. ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఒకరోజు గ్యాప్‌లో రెండు తెలుగు థ్రిల్లర్స్)'28 ఇయర్స్ లేటర్' విషయానికొస్తే.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం రేజ్ వైరస్ మహమ్మారిలా వ్యాపించేసరికి బ్రిటన్ ప్రజలందరూ జాంబీలుగా మారిపోతారు. వీళ్ల నుంచి తప్పించుకున్న కొందరు.. ఓ ఐలాండ్‌లో బతుకుతుంటారు. మరి అక్కడికి కూడా జాంబీలు ఎలా వచ్చేశారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. 'ఓపెన్‌హైమర్' నటుడు కిలియన్ మర్ఫీ.. జాంబీ పాత్ర చేశాడు. ఈ మూవీకి రెండో భాగం '28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్'.. వచ్చే జనవరిలో థియేటర్లలోకి రానుంది.ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి దాదాపు 25కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు కూడా ఉండటం విశేషం. 3 బీహెచ్‌కే, తమ్ముడు, నెట్వర్క్, జిన్ ద పెట్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని సర్ప్రైజ్ రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: 'కింగ్డమ్' సినిమా.. విజయ్-భాగ్యశ్రీ పారితోషికం ఎంత?) -
పృథ్విరాజ్ సుకుమారన్ ‘సర్ జమీన్’ మూవీ రివ్యూ
ఈ రోజుల్లో మంచి కోసం వెతకాలి, అయితే అదే చెడు గురించి ఆలోచిస్తే చాలు చుట్టూ చటుక్కున అల్లుకుపోతుంది. మనవాడు అనేవారు మనకోసం ఎప్పటికీ నిలబడతాడు, అలాగే పగవాడు మన పతనం కోసం ఆరాటపడతాడు. మంచిని దూరం చేసుకోని చెడు మార్గాన వెళుతూ మనవాడు కూడా పగవాడైతే అదే సర్ జమీన్ సినిమా.ఇదో దేశభక్తి స్ఫూర్తిగా అల్లుకున్న కథ. కాయోజీ ఇరానీ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులుగా వర్ధమాన మళయాళ నటుడు పృథ్విరాజ్, బాలీవుడ్ నటి కాజల్ వంటి హేమాహేమీలే కాక ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కొడకు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా నటించడం విశేషం.ఈ కథ ఓ ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. నాలుగంటే నాలుగు ముఖ్య పాత్రలు, రెండున్నర గంటల నిడివి తో దేశ సరిహద్దు వివాదాంశంపై సైనిక నేపధ్యంతో కూడిన సినిమా తీయడం అంటే మాటలు కాదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తాడు దర్శకుడు. అంతలా ఏముందీ కథలో ఓ సారి చూద్దాం. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కల్నల్ విజయ్ మీనన్ పోస్టింగ్ జరుగుతుంది. విజయ్ మీనన్ మహా దేశభక్తుడు. దేశమా, ప్రాణమా అంటేనే నిర్మొహమాటంగా దేశం అని ఎంచుకునే రకం. విజయ్ కి హర్మన్ అనే ఓ కొడుకుంటాడు. చిన్నప్పటి నుండి హర్మన్ చాలా భయస్తుడు. ఈ విషయంలోనే తన తండ్రి విజయ్ పై ద్వేషం పెంచుకుంటాడు హర్మన్. ఓ సారి తీవ్రవాదుల ఘర్షణలో హర్మన్ ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. తమ ముఖ్య అనుచరుడిని విడిపించాలని లేదంటే విజయ్ కొడుకుని చంపేస్తామని టెర్రరిస్టులు విజయ్ ని హెచ్చరిస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా తాను బంధించిన టెర్రరిస్టులపై కాల్పులు జరుపుతాడు విజయ్. ఆ తరువాత విజయ్, విజయ్ భార్య మెహర్ తమ బిడ్డ చనిపోయాడని భావిస్తారు. కాని తీవ్రవాదులు హర్మన్ కి తండ్రి మీదున్న ద్వేషాన్ని ఆయుధంగా చేసుకుని హర్మన్ ని తీవ్రవాదిగా తయారు చేసి మళ్ళీ విజయ్ దగ్గరకు పంపుతారు. ఆ తరువాత విజయ్ అతని భార్య తమ కొడుకు టెర్రరిస్ట్ అని కనిపెడతారా లేదా అన్నదే సినిమా. దేశం మీద మమకారం పెంచుకున్న తండ్రి వేదన గెలుస్తుందా... లేక తండ్రి మీద తనయుడు పెంచుకున్న ద్వేషం గెలుస్తుందా అన్నది హాట్ స్టార్ లోనే చూడాలి. ఈ సినిమా ఓ సూపర్ పేట్రియాటిక్ థ్రిల్లింగ్ ఫీలింగ్ఇస్తుంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్.మస్ట్ వాచ్.- హరికృష్ణ, ఇంటూరు -
ఓటీటీకి మౌనీ రాయ్ స్పై థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక డిఫరెంట్ కంటెంట్‌తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్‌తో పాటు క్రేజీ కంటెంట్‌తో ఓటీటీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త జానర్లతో వస్తోన్న వెబ్ సిరీస్‌లు ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర వెబ్ సిరీస్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. స్పై జానర్లో వస్తోన్న సలాకార్ అనే ఓటీటీలో సందడి చేయనుంది.దేశ భద్రత కోసం ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన స్పై మాస్టర్ కథగా ఈ వెబ్ సిరీస్‌ను ఫరూక్ కబీర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. రియల్ స్టోరీ ఆధారంగా వస్తోన్న ఈ సిరీస్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగస్టు 8వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేస్తూ.. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. సలకార్ వెబ్ సిరీస్‌ను హిందీతో పాట దక్షిణాది భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ వెబ్ సిరీస్‌లో మౌనీ రాయ్, నవీన్ కస్తూరియా ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఓటీటీలోకి ఒకరోజు గ్యాప్‌లో రెండు తెలుగు థ్రిల్లర్స్
ప్రతివారంలానే ఈసారి కూడా ఓటీటీల్లోకి దాదాపు 20కి పైగా సినిమాలు వస్తున్నాయి. వాటిలో తమ్ముడు, 3 బీహెచ్‌కే లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు ఈ వీకెండ్లోనే స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు వీటికి తోడు మరో రెండు తెలుగు థ్రిల్లర్స్ కూడా రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ చిత్రాలేంటి? ఎందులోకి రానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.కొన్నిరోజుల క్రితం తమిళ హారర్ ఫాంటసీ సినిమా 'జిన్ ద పెట్'.. సన్ నెక్స్ట్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుండగా.. ఆగస్టు 01 నుంచి తెలుగులోనూ చూడొచ్చని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా పోస్ట్ పెట్టింది. చిన్న వీడియో బిట్ కూడా రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)'జిన్ ద పెట్' విషయానికొస్తే.. జిన్ అనే దెయ్యం ఉన్న పెట్టెని శక్తి(ముగెన్ రావ్).. తన ఇంటికి తీసుకొస్తాడు. అయితే దీని వల్ల తన ఫ్యామిలీ కష్టాలపాలవుతుందని అనుకుంటాడు. కానీ బాక్స్‌లోని దెయ్యం వీళ్లకు సాయం చేస్తుంది. ఇంతకీ ఆ దెయ్యం సంగతేంటి? వీళ్లకు ఎందుకు సాయం చేస్తుందనేది మిగతా స్టోరీ.'నెట్వర్క్' అనే టెక్నో థ్రిల్లర్ సిరీస్.. నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. జూలై 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీరామ్ , శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటించారు. మనకు రోజువారీ ఫోన్ అనేది చాలా అలవాటు అయిపోయింది. ఒకవేళ మన ఫోన్లో సిగ్నల్ రోజంతా మిస్ అయితే? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇలా నలుగురికి జరిగితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన తెలుగు సిరీస్ ఇది. థ్రిల్లర్స్ కావాలనుకునేవాళ్లు వీటిపై ఓ లుక్కేయొచ్చు.(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా) View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
ఓటీటీలో 'సిద్ధార్థ్ ' సినిమా.. అఫీషియల్ ప్రకటన
సిద్ధార్థ్ హీరోగా నటించిన కొత్త సినిమా '3BHK' ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శ్రీగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 7న విడుదలైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో బాగా ఆకర్షించింది. కథ కాస్త నెమ్మదిగా రన్ అవుతుందని విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని, మీతా రంగనాథ్, చైత్ర, యోగిబాబు తదితరులు నటించారు.థియేటర్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న '3 బీహెచ్‌కే'.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగష్టు 1 నుంచి సింప్లీ సౌత్(Simply South) ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటన వచ్చేసింది. తమిళ్, తెలుగులో విడుదల కానుంది. కానీ, భారత్‌లో ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా చూసే ఛాన్స్ లేదు. కేవలం ఇతర దేశాల్లో ఉన్నవారికి మాత్రమే ఆ అవకాశం ఉంది. అయితే, అదేరోజున అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం భారత్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఒకవేళ ఆ తేదీన రాకుంటే.. ఆగష్టు 8న తప్పకుండా విడుదల కావచ్చని టాక్ ఉంది.నేటి సమాజంలో సొంతిల్లు ఉండాలని అందరికీ కోరిక ఉంటుంది. దానిని ఒక గౌరవంగా అనుకుంటాం కూడా.. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ కలను సాధించుకోవడం అంత సులువు కాదని చెప్పవచ్చు. సొంత ఇంటి కోసం వారు చేసే త్యాగాలు, కష్టాలు ఇలా ఎన్నో మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఎంతో భావోద్వేంగా వారి ప్రయాణం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తోనే '3BHK' చిత్రాన్ని తెరకెక్కించారు. కథ కాస్త నెమ్మదిగా సాగినా.. సినిమా అందరికీ నచ్చుతుంది. -
ఓటీటీలో హిట్ సినిమా.. ఎమోషనల్‌గా 'అక్కా-తమ్ముడి' అనుబంధం
కోలీవుడ్ నటుడు సూరి ప్రధాన పాత్రలో నటించిన 'మామన్' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 16న తమిళ్లో విడుదలైంది. అయితే, సమ్మర్ బ్లాక్‌బస్టర్ చిత్రంగా మామన్ నిలిచింది. ప్రతి కుటుంబంలో కనిపించే బాంధవ్యాలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించారు. మనందరి జీవితంలో మేనమామ బంధం గొప్పదని, అది తల్లి తర్వాతి స్థానమని ఈ చిత్రం ద్వారా వెల్లడించారు. స్వాసిక, ఐశ్వర్య లక్ష్మీ, రాజ్‌కిరణ్, రాజేంద్రన్ వంటి నటీనటులు నటించారు.మామన్ చిత్రం జీ5 తమిళ్లో విడుదల కానున్నట్లు ప్రకటించారు. రాఖీ పండుగ సందర్భంగా అగష్టు 8న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే, తమిళ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందరూ చూడొచ్చు. కానీ, తెలుగులో కూడా ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురావలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'అక్క తమ్ముడు' బంధాన్ని చాలా ఎమోషనల్‌గా ఈ చిత్రంలో చూపించారు. ఆపై అక్క బిడ్డల కోసం మేనమామగా చేయాల్సిన బాధ్యతలను నేటి సమాజానికి గుర్తుచేసేలా ఈ చిత్రం ఉంది. -
మరో ఓటీటీకి సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ కమెడియన్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం గరుడన్. విడుదలై మూవీతో హీరోగా ఆకట్టుకున్న కమెడియన్ సూరి లీడ్ రోల్లో నటించారు. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ రాసిన స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. అక్కడ హిట్ కావడంతో తెలుగులోనూ భైరవం పేరుతో రీమేక్ చేసి ఇటీవలే విడుదల చేశారు. తెలుగు వర్షన్లో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే గరుడన్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని మరో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సన్ నెక్ట్స్ వేదికగా గరుడన్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో సూరితో పాటు శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాకు ఆర్ఎస్ దురైసెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. Power, loyalty, betrayal – when friends turn foes, the fight becomes deadly.Garudan is coming to SunNXT on August 1. Are you ready for the storm?#GarudanOnSunNXT #Garudan #TamilCinema #PowerAndBetrayal #SunNXT #ActionDrama pic.twitter.com/wrcLo57YRF— SUN NXT (@sunnxt) July 28, 2025 -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో రాబోయే సినిమాల్లో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనితో పాటు విజయ్ సేతుపతి 'సార్ మేడమ్', ఉసురే లాంటి డబ్బింగ్ చిత్రాలు.. సన్ ఆఫ్ సర్దార్ 2 అనే హిందీ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. నితిన్ 'తమ్ముడు' ఈ వీకెండ్లోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికైతే ఇదొక్కటే స్ట్రెయిట్ తెలుగు మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. దీనితో పాటు బకైటి అనే హిందీ సిరీస్ కొంతలో కొంత ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. మరి శుక్రవారంనాడు సడన్‌గా ఓటీటీల్లో కొత్త మూవీస్ స్ట్రీమింగ్ అవుతాయేమో చూడాలి. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీల్లో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 28 నుంచి ఆగస్టు 03 వరకు)నెట్ఫ్లిక్స్ఇరాన్ చెఫ్ థాయ్ లాంట్ వర్సెస్ ఆసియా (రియాలిటీ సిరీస్) - జూలై 28ట్రైన్ రెక్: స్ట్రోమ్ ఏరియా 51 (ఇంగ్లీష్ మూవీ) - జూలై 29WWE: అన్ రియల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29కన్వర్జేషన్స్ విత్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 30అన్ స్పీకబుల్ సిన్స్ (స్పానిష్ సిరీస్) - జూలై 30యాన్ హానెస్ట్ లైఫ్ (స్పీడిష్ సినిమా) - జూలై 31గ్లాస్ హార్ట్ (జపనీస్ సిరీస్) - జూలై 31లియాన్నే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31మార్క్డ్ (జులు సిరీస్) - జూలై 31తమ్ముడు (తెలుగు సినిమా) - ఆగస్టు 01అమెజాన్ ప్రైమ్లోన్లీ ఇనఫ్ టూ లవ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 28చెక్ (తెలుగు సినిమా) - జూలై 28హాట్స్టార్అడ్డా ఎక్స్ట్రీమ్ బాటిల్ (రియాలిటీ సిరీస్) - జూలై 28క్యుంకీ సార్ బీ కబీ బహు థీ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 29బ్లాక్ బ్యాగ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 28పతీ పత్నీ ఔర్ పంగా (హిందీ సిరీస్) - ఆగస్టు 02సన్ నెక్స్ట్సురభిల సుందర స్వప్నం (మలయాళ సినిమా) - ఆగస్టు 01ఆపిల్ ప్లస్ టీవీచీఫ్ ఆఫ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01స్టిల్ వాటర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01జీ5బకైటి (హిందీ సిరీస్) - ఆగస్టు 01(ఇదీ చదవండి: చిరంజీవి 'విశ్వంభర' ప్లాన్ ఛేంజ్!) -
ఓటీటీలో క్రిష్ ప్రాజెక్ట్.. 'అరేబియా కడలి' రిలీజ్‌పై ప్రకటన
'అరేబియా కడలి' వెబ్ సిరీస్ విడుదలపై ప్రకటన వచ్చేసింది. అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌లో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ఆ సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో సత్యదేవ్, ఆనంది జంటగా నటించారు. ఈ సిరీస్‌లో రెండు గ్రామాల మత్స్యకారులు ఇతర దేశాల జలాల్లోకి పొరపాటున వెళ్లి, అక్కడ బంధీ అవ్వడం ఆపై వారు ఎలా తిరిగొచ్చారనేది కథాంశం. ఈ వెబ్ సిరీస్‌కు క్రిష్ జాగర్లమూడి రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. సూర్య కుమార్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు నిర్మించారు.'అరేబియా కడలి' వెబ్ సిరీస్ ఆగష్టు 8న విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం తండేల్ కాన్సెప్ట్‌లా ఉండబోతుందని తెలుస్తోంది. ఇదే స్టోరీ లైన్‌తో సినిమా తెరకెక్కించారని సమాచారం.time and tide wait for none, neither does their fate 🌊#ArabiaKadaliOnPrime, New Series, August 8@ActorSatyaDev @anandhiactress @DirKrish @DirectorSuryaVV @NagavelliV @firstframe_ent pic.twitter.com/5ACNKK4XHG— prime video IN (@PrimeVideoIN) July 28, 2025 -
ఓటీటీలోకి తెలంగాణ ప్రేమకథ.. ట్రైలర్ రిలీజ్
'మై విలేజ్ షో' పేరుతో యూట్యూబ్‌లో గుర్తింపు తెచ్చుకున్న టీమ్.. ఇప్పుడు సినీ అరంగేట్రానికి సిద్ధమైంది. అయితే థియేటర్లో కాకుండా ఓటీటీలో సందడి చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం టైటిల్, ఫస్ట్ లుక్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ వివరాల్ని కూడా వెల్లడించారు. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ సోనియా సీమంతం వేడుక)అనిల్, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ 'మోతెవరి లవ్ స్టోరీ'. శివకృష్ణ దర్శకుడు. ఆగస్టు 8 నుంచి జీ5 ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. గతంలో యూట్యూబ్‌లో 'విలేజ్ షో' టీమ్ అంతా ఎక్కువగా రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీలనే తీశారు. ఇప్పుడు సిరీస్ కోసం ఆ తరహా కథనే ఎంచుకున్నారు.పల్లెటూరిలో ఉంటే ఓ ఆకతాయి కుర్రాడు.. ఓ అమ్మాయితో లేచిపోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఎలాంటి తిప్పలు పడ్డాడు? చివరకు ఆ అమ్మాయితో ఒక్కటయ్యాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్, అందున రూరల్ స్టోరీతో తీసిన సిరీస్ కాబట్టి క్లిక్ కావొచ్చేమో చూడాలి?(ఇదీ చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మధుప్రియ) -
ఓటీటీలో ‘చౌర్యపాఠం’ నయా రికార్డు
థియేటర్స్‌లో ఆశించిన స్థాయిలో విజయం సాధించని ఓ చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఆ చిన్న సినిమానే చౌర్యపాఠం. ఇటీవల ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ చిత్రం 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఆడియన్స్‌ను కట్టిపడేసింది.ఇంతలా ప్రేక్షకాదరణ దక్కడానికి కారణం ఏంటంటే... కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి సాహసోపేతమైన దర్శకత్వం, కథలోని పచ్చి నిజాయితీ, నటీనటుల అద్భుతమైన సహజ నటన. ముఖ్యంగా, ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్ర రామ్, తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించారు. నక్కిన నరేటివ్స్ బ్యానర్‌పై త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలై, అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. -
OTT: 2025లో ఎక్కువ మంది చూసిన హిందీ వెబ్ సిరీస్, షోస్ లివే..!
2025లో ఇప్పటివరకు బాలీవుడ్ బాక్సాఫీస్ పెద్దగా సందడి చేయలేకపోయింది. అయితే ఇంటింటి థియేటర్‌గా అవతరించిన ఓటీటీ రంగం మాత్రం వరుస హిట్లు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న సిరీస్‌లతో జోరుగా సాగుతోంది. విశేషం ఏమిటంటే గొప్ప హైప్ ఉత్సాహంతో దూసుకొచ్చిన అనేక సిరీస్‌లు విఫలమైతే, తక్కువ మధ్యస్థపు అంచనాలతో వచ్చిన పలు షోలు వాటి ఆకర్షణీయమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకర్షించాయి. అటువంటివాటిలో కొన్ని...బ్లాక్ వారెంట్... వావ్ కంటెంట్...ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన్ బ్లాక్ వారెంట్ ఈ సంవత్సరం ఇప్పటివరకు విడుదలైన అత్యంత ఉత్కంఠభరితమైన షోలలో ఒకటిగా నిలిచింది. ఈ క్రై మ్ థ్రిల్లర్ ఇప్పటివరకు లైమ్‌లైట్‌లోనే ఉంది. ఈ సిరీస్‌లో జహాన్ కపూర్, రాహుల్ భట్ తదితరులు తమ అద్భుతమైన నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు.పాతాళ్‌లోక్...సూపర్ క్లిక్జైదీప్, అహ్లవత్ ప్రముఖ పాత్రల్లో నటించిన పాతాల్ లోక్ సీజన్ 2 కూడా మంచి విజయం సాధించింది. ప్రైమ్ వీడియో అందిస్తున్న ఈ సంవత్సరపు మరో హిట్ థ్రిల్లర్ గా నిలిచింది. హై ప్రొఫైల్ హత్య కేసు దర్యాప్తు అనుకోని రీతిలో అనేక ఇతర రహస్యాలను వెలుగులోకి తీసుకురావడాన్ని ఈ సిరీస్ ప్రదర్శిస్తుంది.రియలిస్టిక్ షేడ్స్‌తో...బ్లాక్ వైట్ అండ్ గ్రే.. లవ్కిల్స్నిజజీవిత సంఘటనల ఆధారంగా అంటూ నమ్మించేలా రూపొందిన బ్లాక్, వైట్ గ్రే కూడా ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సోనీలివ్ లో అందుబాటులో ఉన్న ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ప్రతీ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. హై–ప్రొఫైల్ వ్యక్తుల వరుస హత్యల నేపధ్యంలో ఇది నిజమైన సంఘటనల ఆధారంగా దీనిని పుష్కర్ సునీల్ మహాబల్, హేమల్ ఎ ఠక్కర్ లు రూపొందించారు.సైకలాజికల్ థ్రిల్...ఖాఫ్...ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఖాఫ్ కూడా సక్సెస్ జోరు కొనసాగిస్తోంది. గత ఏప్రిల్ నెలలో విడుదలైన ఈ సిరీస్‌లో... మోనికా పన్వర్, రజత్ కపూర్ ప్రముఖ పాత్రల్లో నటించిన ఖౌఫ్ భయానక శైలి కారణంగా చాలా సంచలనం సృష్టించింది, ప్రేక్షకులపై భారీ ప్రభావాన్ని చూపింది.ఈ ఓటీటీ షోలను అసాధారణంగా చేసింది దీర్ఘకాలం పాటు కొనసాగే ట్విస్టులతో కథ చెప్పడం, ఏదేమైనా భారతీయ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థ్రిల్లర్ల వైపు పూర్తిగా మొగ్గుతున్నారు మరోవైపు ఈ షోలు 2025లో బాలీవుడ్ బాక్సాఫీస్ కంటే ఓటీటీని రంగాన్ని సక్సెస్‌ఫుల్‌గా మార్చాయి ఈ ఏడాదిలో ఇదే విధంగా తన పైచేయిని కొనసాగిస్తుందా?చూడాలి. -
ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా
థ్రిల్లర్ సినిమాల్లో మీరు చూసిన బెస్ట్ అంటే ఏం చెబుతారు? తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది 'దృశ్యం' అంటారు! ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ చూపించింది మరి. ఒకవేళ దాన్ని మించిపోయే మూవీ ఉంటే?.. ఏంటి అలాంటి సినిమా ఉందా? ఎక్కడ చూడాలి? ఏ భాషలో ఉంది అని కచ్చితంగా అడుగుతారు. అందుకే మీ కోసం మెంటలెక్కించే ఓ కొరియన్ థ్రిల్లర్‌ని తీసుకొచ్చేశాం. అదే 2017లో వచ్చిన 'ఫర్గాటెన్'. ఇంతకీ దీని సంగతేంటి? అంత బాగుందా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?జిన్ సోక్ (కాంగ్ హా న్యుల్).. తన అమ్మ, నాన్న, అన్నయ్యతో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతాడు. కొన్నిరోజులకే కుటుంబమంతా ఇంట్లో సెట్ వాతావరణానికి సెట్ అయిపోతారు. జిన్‌కి మాత్రం ఇంట్లోని ఓ గది నుంచి వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. పీడకలలు వస్తుంటాయి. ఓ రోజు జిన్ అన్నయ్య యో సూక్(కిమ్ మ్యు యోల్)ని ఇతడి కళ్ల ముందే కొందరు కిడ్నాప్ చేస్తారు. పోలీస్ కేసు పెట్టినా లాభముండదు. కానీ 19 రోజుల తర్వాత యో సూక్ తిరిగి క్షేమంగా ఇంటికొచ్చేస్తాడు. తిరిగొచ్చిన అన్నయ్యతో పాటు తల్లిలోనూ జిన్ కొన్ని మార్పులు గమనిస్తాడు. భయమేసి ఇంట్లో వాళ్ల నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. విచారణ మొదలవుతుంది. అసలు ఇంతకీ జిన్ ఎవరు? ఇద్దర్ని హత్య చేసి గతాన్ని ఎందుకు మర్చిపోయాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు అనగానే చాలామందికి ఓ ఐడియా ఉంటుంది. కానీ 'ఫర్గాటెన్' అలాంటి వాటితో పోలిస్తే చాలా డిఫరెంట్. ఎందుకంటే సినిమా మొదలవడమే ఓ ఫ్యామిలీ స్టోరీలా అనిపిస్తుంది. చక్కని కుటుంబం. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు. ఏం జరుగుతుందా? ఎలాంటి థ్రిల్ ఇస్తుందా అని చిన్న ఆసక్తి. అలా చూస్తుండగానే కాసేపటికి హారర్ మూవీలా చిన్నగా భయపెడుతుంది. హీరో కుటుంబం ఏదో తేడాగా ఉందే అనిపిస్తుంది. దీంతో మన హీరో పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. ఇక అక్కడి మొత్తం సీన్ మారిపోతుంది.ఎక్కడైనా సినిమాలో ట్విస్టులు ఉంటాయి. 'ఫర్గాటెన్'లో మాత్రం ట్విస్టులు మధ్య సినిమా ఉందా అన్నట్లు సాగుతుంది. అప్పటివరకు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుడికి.. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తుంది. ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ చేస్తుంది. అదే టైంలో హత్యలు చేయడానికి దారితీసిన పరిస్థితులు, ఆ సంఘటనని మర్చిపోవడం.. ఇలా ఒక్కో సీన్ చూస్తుంటే ఇది కదా మనకు కావాల్సిన థ్రిల్లర్ అని కచ్చితంగా అనిపిస్తుంది.అదే టైంలో తొలుత చూపించిన సన్నివేశాల్ని, చివర్లో ఒక్కొక్కటిగా లింక్ చేసిన విధానం చూస్తే భలే ముచ్చటేస్తుంది. రెండు గంటల్లోపే ఉన్న ఈ సినిమా క్రేజీ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడం గ్యారంటీ. ఒకవేళ చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కాకపోతే కొరియన్ భాషలో మాత్రమే ఆడియో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు. తెలుగు లేదు కదా అని అనుకుని స్కిప్ చేస్తే మాత్రం ఓ మంచి సినిమా మిస్ అవుతారు.ఈ సినిమాలో స్టోరీని చూపించే విధానంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ కూడా అద్భుతం అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ అంతా కాస్త నెమ్మదిగా ఉంటుంది గానీ చివరికొచ్చేసరికి అవేం గుర్తుండవు. అదిరిపోయే సినిమా చూశాం ఈ రోజు అనే అనుభూతి మాత్రమే మిగులుతుంది. ఒకటి రెండు సన్నివేశాలు మినహా ఫ్యామిలీతోనూ చూడొచ్చు.- చందు డొంకాన -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ
సీనియర్ నటుడు శరత్ బాబు కొడుకు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'దక్ష'. హారర్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ చిత్రం రెండేళ్ల క్రితం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ మూవీకి వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. తాజాగా శుక్రవారం(జూలై 25) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె పద్ధతిలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు. 'దక్ష' స్టోరీ విషయానికొస్తే.. ఆరుగురు స్నేహితులు ఓ గెస్ట్ హౌస్‌లో పార్టీ చేసుకుంటూ 'చాసర్' అనే గేమ్ ఆడతారు. గేమ్ ఓడిపోయిన వారు చనిపోతారని తెలుసుకుంటారు. మరి చివరకు ఏమైంది? ఎవరు బతికారు అనేదే మిగతా స్టోరీ.ఈ మూవీనే కాదు ఈ వారం చాలా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు కూడా ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో 'రోంత్' అనే పోలీస్ డ్రామా హాట్‌స్టార్‌లో.. షో టైమ్, మార్గన్ మూవీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో.. సోలో బాయ్, సారథి చిత్రాలు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రోంత్, షో టైమ్, మార్గన్ కచ్చితంగా చూసే లిస్టులో ఉంటాయి. (ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా ఎలాంటి చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ ఇప్పటికే షో టైమ్, మార్గన్, సారథి తదితర తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు బిగ్‌బాస్ గౌతమ్ మూవీ కూడా కేవలం మూడు వారాలకే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడూ చూద్దాం.ప్రస్తుతం చిన్న సినిమాలని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. మరీ బాగుంది అనే టాక్ వస్తే తప్పితే థియేటర్లకు వెళ్లి వాటిని చూసేందుకు ఆసక్తి చూపించట్లేదు. అయినా సరే యంగ్ హీరోలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ.. ఈనెల 4న 'సోలో బాయ్' చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేశాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది గానీ స్టార్ నటీనటులు లేకపోవడంతో ఒకటి రెండు రోజులకే బిగ్ స్క్రీన్ నుంచి మాయమైపోయింది.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)ఇప్పుడు ఆహా ఓటీటీలోకి శుక్రవారం సాయంత్రం నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండా సడన్ అందుబాటులోకి వచ్చింది. వీలుంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు. బిగ్‌బాస్ 7, 8 సీజన్లలో పాల్గొన్న గౌతమ్ కృష్ణ.. అంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేశాడు. కానీ ఇది కాస్తోకూస్తో సందడి చేసింది.'సోలోబాయ్' విషయానికొస్తే.. కృష్ణమూర్తి(గౌతమ్ కృష్ణ) మిడిల్ క్లాస్ కుర్రాడు. ఇంజినీరింగ్ చదువుతూ ప్రియ(రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. ఓ సందర్భంలో ఆమె బ్రేకప్ చెప్పడంతో మందుకు బానిసైపోతాడు. తండ్రి ప్రోత్సాహంతో మళ్లీ మాములు మనిషిగా మారి ఉద్యోగంలో చేరతాడు. అక్కడ శ్రుతి(శ్వేత అవస్తి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితం సాఫీగా సాగుతుందన్న సమయంలో తండ్రి మరణిస్తాడు. మరోవైపు ఆర్థిక పరిస్థితుల వల్ల భార్య శ్రుతి విడాకులు ఇస్తుంది. ఓ పక్క తండ్రి చావు, మరోవైపు భార్య విడాకులు.. వీటన్నింటిని తట్టుకొని కృష్ణ మూర్తి మిలియనీర్‌గా ఎలా ఎదిగాడు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ)) -
సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో నిన్న(జూలై 24) రిలీజైన 'హరిహర వీరమల్లు'కి మిక్స్డ్ టాక్ వచ్చింది. హిట్ అని పవన్ అభిమానులు హడావుడి చేస్తున్నారు గానీ రెండు రోజులు ఆగితే అసలు ఫలితం ఏంటో తెలుస్తుంది. సరే దీని గురించి పక్కనబెడితే ఓటీటీల్లోనూ బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. షో టైమ్, మార్గన్ తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి రాగా.. మరో మూడు తెలుగు మూవీస్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇంతకీ ఏంటవి?సునీల్, చైతన్యరావు, శ్రద్దాదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''పారిజాత పర్వం'. గతేడాది ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. నెల తిరగకుండానే అప్పుడే ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి వచ్చేసింది. లయన్స్ గేట్ ప్లేలో తాజాగా స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా విషయానికొస్తే.. ఓ కుర్రాడు డైరెక్టర్ కావాలనుకుంటాడు. కానీ అడ్డంకులు వచ్చేసరికి ఓ నిర్మాతని కిడ్నాప్ చేయాలనుకుంటాడు. కానీ ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటనేది మూవీ స్టోరీ.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))'ఈగ', 'బాహుబలి' తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచమైన కన్నడ హీరో సుదీప్.. 2017లో చేసిన సినిమా 'హెబ్బులి'. దీన్ని ఇప్పుడు 'సారథి' పేరుతో తెలుగులో డబ్బింగ్ చేశారు. ఆహా ఓటీటీలోకి సడన్‌గా తీసుకొచ్చేశారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో సుదీప్ ఆర్మీ అధికారిగా నటించగా.. ఇతడి సరసన అమలాపాల్ హీరోయిన్గా చేసింది.2023లో వచ్చిన తెలుగు మూవీ 'దక్ష'. ఆయుష్ తేజస్, ఆర్య అను హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. హారర్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఆరుగురు స్నేహితులు ఓ గెస్ట్ హౌస్‌లో పార్టీ చేసుకుంటూ 'చాసర్' అనే గేమ్ ఆడతారు. గేమ్ ఓడిపోయిన వారు చనిపోతారని తెలుసుకుంటారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇలా ముందు ప్రకటించనవే కాకుండా కొత్తగా ఈ మూడు తెలుగు సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ) -
ఓటీటీలో 'మార్గన్'.. సడెన్‌గా తెలుగు స్ట్రీమింగ్
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని కొత్త సినిమా 'మార్గన్: ది బ్లాక్ డెవిల్' తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. చిత్రపరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, ఈ సారి నిర్మాతగా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘మార్గన్’ అనే చిత్రంతో తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి జూన్ 27న ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు.మార్గన్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. నేటి (జులై 25) నుంచి తెలుగు, తమిళ్ వర్షన్లో అందుబాటులో ఉంది. ఇప్పటికే కోలీవుడ్ ప్రముఖ ఓటీటీ సంస్థ 'టెంట్కొట్ట'లో ఈ చిత్రం రన్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించింది.కథ ఏంటి..?నగరంలో రమ్య అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఓ ఇంజక్షన్ ద్వారా ఆమెను హత్య చేస్తారు. ఆమె శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఓ చెత్త కుప్పలో కనుగొంటారు. సంచలనంగా మారిన ఆ కేసును చేధించేందుకు పోలీస్ ఆఫీసర్ ధృవ (విజయ్ ఆంటోనీ) రంగలోకి దిగుతాడు. సుమారు పదేళ్ల క్రితం తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురికావడంతో ఈ కేసును ఎలాగైనా పూర్తి చేయాలని ధృవ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. తన కూతురిలా ఇంకెవ్వరూ బలి కావొద్దని అనుకుంటాడు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో డి.అరవింద్ (అజయ్ దిశాన్) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తాడు.కానీ, అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రయ శక్తికి ధృవ ఆశ్చర్యపోతాడు. ఈ క్రమంలో అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని అనూహ్యమైన విషయాలను ధృవ తెలుసుకుంటాడు. ఈ హత్యలకు ఆరవింద్‌కు సంబంధం ఉందా. ధృవ కూతురిని చంపింది ఎవరు..? ఈ కేసును పరిష్కరించే క్రమంలో అఖిల, శ్రుతి (బ్రిగిడా), రమ్య (దీప్శిఖ), వెన్నెల, మేఘల పాత్ర ఏంటి..? ఫైనల్‌గా హంతకుడు ఎలా దొరికాడు..? అనేది తెలియాలంటే మార్గాన్ సినిమా చూడాల్సిందే. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారాంతంలో మిమ్మల్ని అలరించేందుకు బోలెడన్నీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమైపోయాయి. ప్రస్తుతం థియేటర్లలో పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సందడి చేస్తోంది. ఈ శుక్రవారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ప్రియులను అలరించేందుకు సరికొత్త థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వారాంతంలో తెలుగు సినిమా షో టైమ్‌తో పాటు విజయ్ ఆంటోనీ చిత్రం మార్గన్, హిందీలో సర్జామీన్ మూవీ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.అమెజాన్ ప్రైమ్నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 25రంగీన్ (హిందీ సిరీస్) - జూలై 25మార్గన్(తమిళ సినిమా)- జూలై 25సన్ నెక్స్ట్షో టైమ్ (తెలుగు మూవీ) - జూలై 25ఎక్స్ & వై (కన్నడ చిత్రం) - జూలై 25నెట్ఫ్లిక్స్మండల మర్డర్స్ (హిందీ సిరీస్) - జూలై 25ది విన్నింగ్ ట్రై- (కొరియన్ మూవీ)- జూలై 25ట్రిగ్గర్ (కొరియన్ సిరీస్) - జూలై 25హ్యాపీ గిల్మోర్-2- (హాలీవుడ్ కామెడీ చిత్రం) - జూలై 25ఆంటిక్ డాన్-(హాలీవుడ్ హారర్ మూవీ)- జూలై 25జీ5సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా) - జూలై 25లయన్స్ గేట్ ప్లేజానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్(ఇంగ్లీష్ సినిమా) - జూలై 25ద ప్లాట్ (కొరియన్ మూవీ) - జూలై 25ద సస్పెక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25 -
ఆ ఓటీటీలోకి హరి హర వీరమల్లు.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) నేడు(జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయితే ఈ చిత్రానికి తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని సీజీ వర్క్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలకు సైతం అద్భుతమైన వీఎఫెక్స్ వాడుతున్నారు. కానీ ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకు ఇంత పేవలమైన సీజీ వర్క్ చేయడం ఏంటని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. (చదవండి: హరి హర వీరమల్లు రివ్యూ)పవన్ ఫ్యాన్స్ సైతం ఆ సినిమా పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం ఈ సినిమా ఓటీటీ వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది అనేది గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ వెతుకున్నారు.విడుదలకు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ మంచి ధరకు డిజిటల్ రైట్స్ పొందింది. సినిమా రిలీజ్ అయినా 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించారట. ఈ లెక్కన సెప్టెంబర్ రెండో వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు అన్యూహ్యంగా నెగెటివ్ టాక్ రావడంతో ఓటీటీలో అనుకున్నదాని కంటే ముందే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. సినిమా హిట్ అయితే ఎనిమిది వారాల వరకు ఆగేవారు కానీ.. ఇప్పుడున్న టాక్ని బట్టి చూస్తే నెలలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఈ లెక్కన ఆగస్ట్ ఎండింగ్లోపే ఈ సినిమా డిజిటల్ తెరపై వచ్చే అవకాశం ఉంది. -
ఓటీటీలోకి 'టామ్ క్రూజ్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
హాలీవుడ్ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’ (Mission Impossible) ఓటీటీలోకి రానుంది.. సుమారు రెండు నెలల తర్వాత అధికారికంగా ప్రకటన వచ్చేసింది. హాలీవుడ్ ఫ్రాంఛైజీల్లో మిషన్ ఇంపాసిబుల్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సిరీస్‌లో భాగంగా 8వ సినిమాగా వచ్చిన ‘మిషన్ ఇంపాసిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో టామ్ క్రూజ్ చేసిన సాహసాలు అత్యంత ప్రమాధకరంగా ఉన్నాయని హాలీవుడ్ మీడియా కూడా కథనాలు రాసింది. ఆగష్టు 19న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్కు రానున్నట్లు ఒక పోస్టర్‌ను కూడా తాజాగా విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 6వేల కోట్ల వరకు ఈ చిత్రం కలెక్షన్స్ రాబట్టింది. సుమారు రూ. 3400 కోట్ల వరకు ఈ చిత్రం కోసం నిర్మాతలు ఖర్చు చేశారు. క్రిస్టోఫర్ మేక్‌క్వారీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సిరీస్ మొత్తం ఒకే పరమైన కథాంశంతో ఉంటుంది. కథానాయకుడు తన టీమ్‌తో కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి విలువైన డాక్యుమెంట్లు, ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి వెళ్ళకుండా చూడడమే మిషన్ ఇంపాజిబుల్. సిరీస్ మొదటినుంచి ఒకే టీమ్‌ను మెయింటైన్ చేస్తూ ఈ సినిమాలో మాత్రం టీమ్‌లోని ఓ మెంబరైన లూథర్ పాత్రను చంపేశారు. అదే ఆడియన్స్‌ను కొంచెం ఆలోచనలో పడేస్తుంది. ఓవరాల్‌గా ‘మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌ను ఇష్టపడేవాళ్ళకి... అలాగే ఈ సిరీస్‌ను ఫాలో అయ్యేవాళ్ళకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. -
మరో వారం రోజులే...నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్ సినిమాలు అవుట్..!
ఓటీటీలు అందుబాటులోకి వచ్చినంత వేగంగా ఏ సినిమాలు చూడాలి ఏ సినిమాలు చూడకూడదు అనే అవగాహన కూడా వచ్చి ఉంటే బాగుండేది. బాగుందని ఓ సినిమా గురించి తెలిసి చూసేలోగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోవడం మనకు అనుభవమే. అదే పరిస్థితి ఓటీటీల్లోని కొన్ని సినిమాల విషయంలోనూ మనకు ఎదురవుతుంటుంది. ఈ నేపధ్యంలో ఈ నెలాఖరులోగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ నుంచి నిష్క్రమించనున్న కొన్ని మంచి సినిమాల వివరాలివి.. వీటిలో మంచి ప్రశంసలు పొందిన ఆఫ్‌బీట్ కామెడీల నుంచి రోమాంచితం చేసే థ్రిల్లర్ల వరకు ఉన్నాయి ఈ జూలై 31లోగా చూడాలనుకుంటే తప్పక చూసేయండి. ఆ సినిమాలివే...రెడ్ ఐ (2005)వెస్ క్రావెన్ దర్శకత్వం వహించిన రెడ్ ఐ థ్రిల్లర్‌లో హోటల్ మేనేజర్ అయిన రాచెల్ మెక్ఆడమ్స్ ని పూర్తిగా అపరిచితుడైన సిలియన్ మర్ఫీని అర్థరాత్రి పూట ఓ లేట్ నైట్ ఫ్లైట్ లో కలుస్తుంది. వారిద్దరి పరిచయం స్నేహపూర్వక సంభాషణగా ప్రారంభమై ఎన్ని అనూహ్య మలుపులు తీసుకుంటుంది? రెడ్ ఐలో చూడొచ్చు. అనుక్షణం ఉత్కoఠ తో నడిచే ఈ సినిమా థ్రిల్లర్స్ ఇష్టపడే వారిని బాగా ఆకట్టుకుంటుందిఅవేకెనింగ్స్ (1990)పెన్నీ మార్షల్ దర్శకత్వం వహించిన హృదయాన్ని తాకే ఈ డ్రామా జోనర్ చిత్రంలో రాబిన్ విలియమ్స్ అంకితభావంతో కూడిన వైద్యుడిగా కనిపిస్తాడు. కాటటోనిక్ రోగుల కోసం ఒక విప్లవాత్మక చికిత్సను ఆవిష్కరించిన తర్వాత జరిగింది ఏమిటి? పలు నిజమైన సంఘటనల నుండి అల్లుకున్న ఈ కధలో రాబర్ట్ డి నీరో పాత్రధారిగా లియోనార్డ్ లోవ్ కనిపిస్తాడు. జీవితంలోని సంక్షిప్త, విలువైన క్షణాలకు సంబంధించిన శక్తివంతమైన కథగా ఈ సినిమాని చెప్పొచ్చు.అమెరికన్ బ్యూటీ (1999)సామ్ మెండిస్ దర్శకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు అందుకున్న ఈ డార్క్ కామెడీలో కెవిన్ స్పేసీ లెస్టర్ బర్న్హామ్గా నటించాడు, శివారు ప్రాంతాల్లోని రొటీన్ లో చిక్కుకున్న తన జీవితానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఈ పాత్ర ఆకట్టుకుంటుంది. అన్నెట్ బెనింగ్, థోరా బిర్చ్ మేనా సువారీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కాంక్ష, గుర్తింపులతో పాటు అమెరికన్ కలల తాలూకు భ్రమలను మనకు చూపిస్తుంది.అమెరికాస్ స్వీట్‌హార్ట్స్ (2001)జో రోత్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీలో ఒకనాటి స్టార్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ హాలీవుడ్ తారల మధ్య చిక్కుకున్న ప్రచారకర్తగా నటించారు, ఆమెతో పాటు కేథరీన్ జీటా జోన్స్ జాన్ కుసాక్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. బిల్లీ క్రిస్టల్ హాస్యాన్ని జోడిస్తూ, ఈ చిత్రం గ్లామర్ ప్రపంచంలో తెరవెనుక ప్రేమల గందరగోళాన్ని మనకు చూపిస్తుంది.పంచ్ డ్రంక్ లవ్ (2002)విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ నుంచి వచ్చిన ఈ ఆఫ్‌బీట్ రొమాంటిక్ డ్రామాలో ఆడమ్ సాండ్లర్ బారీ ఎగాన్ పాత్రలో నటించారు, కోపం అనే వ్యాధి తాలూకు సమస్యలతో ఉన్న ఒంటరి వ్యాపారి, అతను ఊహించని విధంగా ఎమిలీ వాట్సన్ తో ప్రేమలో పడతాడు. చమత్కారమైన, సున్నితమైన సన్నివేశాలతో ఆకట్టుకునే ఈ చిత్రం సాండ్లర్ అత్యంత ప్రసిద్ధ నటనల్లో ఒకటిగా నిలిచింది. -
ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలు అనగానే చాలామందికి మలయాళ సినిమాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలతో మూవీస్‌ని రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలా 'రోంత్' అనే చిత్రం తెలుగు డబ్బింగ్‌తో హాట్స్టార్లోకి వచ్చేసింది. రాత్రి గస్తీలో పోలీసులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు? వాళ్లకు ఎలాంటి రిస్కులు ఎదురవుతాయి అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇది. ఇంతకీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)కథేంటి?ధర్మశాల పోలీస్ స్టేషన్లో యోహన్నా(దిలీశో పోతన్) ఎస్సై. దిన్నాథ్(రోషన్ మ్యాథ్యూ) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారు. ఓ రోజు రాత్రి గస్తీ కోసం వీళ్లకు డ్యూటీ వేస్తారు. అలా పెట్రోలింగ్‌కి వెళ్లిన వీళ్లిద్దరికి ఓ చోట లవర్స్ లేచిపోవడం, మరోచోట ఓ సైకో కన్నబిడ్డని డబ్బా కింద దాచడం, మరోచోట ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం.. ఇలా రకరకలా సంఘటనలు ఎదురవుతాయి. చివరగా అనుకోకుండా జరిగిన ఓ మరణం వల్ల వీళ్లు సమస్యల్లో ఇరుక్కుంటారు. తర్వాత ఏమైంది అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మలయాళ సినిమాలు ఎందుకు చూస్తారు? అని అడిగితే.. సహజత్వానికి దగ్గరగా ఉంటాయని చాలామంది చెప్పేమాట. ఈ సినిమా కూడా సేమ్ అలాంటిదే. రోంత్ అంటే గస్తీ అని అర్థం. అందుకు తగ్గట్లే మూవీ అంతా ఇద్దరు పోలీసులు, జీప్‌లో తిరుగుతూ.. రాత్రి కాపల కాయడమే చూపిస్తారు. అదే టైంలో వాళ్ల జీవితంలో అనుకోని సంఘటనలు జరగడం, వాటి పరిణామాల వల్ల ఊహించని పరిస్థితులు ఎదుర్కోవడం లాంటివి కూడా చాలా రియలస్టిక్‌గా చూపించారు.ఈ సినిమాలో దాదాపు 80 శాతం రాత్రిపూట ఇద్దరు పోలీసులు పెట్రోలింగ్ చేయడమే చూపిస్తారు. వాళ్లకు ఎదురయ్యే సంఘటనలు.. ఈ విషయంలో వాళ్లు తీసుకునే నిర్ణయాలే కథని ముందుకు తీసుకెళ్తాయి. మధ్యమధ్యలో వచ్చే ఎమోషన్స్ కూడా బాగుంటాయి.స్టోరీ సాఫీగా సాగిపోతుందే అనుకునే టైంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. చివరి అరగంట ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కలిగిస్తుంది. ఊహించని క్లైమాక్స్ సర్ప్రైజ్ చేస్తుంది.సిన్సియర్‌గా పనిచేయడమే కాదు, మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించడం కూడా అవసరమే. లౌక్యం లేకపోతే ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగతంగానూ దెబ్బయిపోతాం అనే మెసేజ్ ఇచ్చిన స్టోరీ ఇది. పై స్థాయి అధికారులు అవసరమొస్తే కిందస్థాయి అధికారుల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తారనేది కూడా చాలా నేచురల్‌గా చూపించారు.అయితే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే రెండు గంటల సినిమా. అంతా పోలీసులు డ్యూటీ చేయడం లాంటి సీన్సే ఉంటాయి. ఒకవేళ పోలీస్ డ్రామాలు అంటే ఆసక్తి ఉంటేనే దీన్ని చూడండి. లేదంటే మాత్రం డిసప్పాయింట్ కావొచ్చు. సింపుల్ కథలానే అనిపిస్తుంది గానీ చివరకొచ్చేసరికి పోలీసుల జీవితం ఇలా కూడా ఉంటుందా అని అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?యోహన్నాగా చేసిన దిలీశ్ పోతన్, దిన్నాథ్గా చేసిన రోషన్ మ్యాథ్యూ చాలా నేచురల్‌గా నటించారు. సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతే వీళ్లతో పాటు మనం ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. మిగిలిన పాత్రధారులకు పెద్ద స్కోప్ లేదు. కానీ బాగానే చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. ఇందులో పెద్ద కథేం లేదు. కానీ డైరెక్టర్ షాహీ కబీర్ తనదైన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. ఈయనకు మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. పోలీసుల గురించి, రాత్రి పూట వాళ్లకు ఎదురయ్యే పరిస్థితుల గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీపై ఓ లుక్కేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'డీఎన్ఏ' మూవీ రివ్యూ.. మెప్పించేలా థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ) -
నవీన్ చంద్ర...ఓటీటీ సూపర్‌స్టార్.. మన హైదరాబాదీయే...
అనువు గాని చోట అధికులమనరాదని నాటి తరంలో చెప్పారు. అనువైన చోట అధికులమయ్యే అవకాశాన్ని వదులుకోరాదని నేటి తరం అంటోంది. తెలుగు నటుడు నవీన్ చంద్ర(Naveen Chandra ) నటుడిగా మారి దాదాపు 20ఏళ్లు అవుతోంది. ఎటువంటి సినీమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రంగానికి వచ్చి స్వయం కృషితో తన 2 దశాబ్ధాల ప్రయాణాన్ని కొనసాగించాడు. నిశ్శబ్ధంగా నిలకడగా సాగుతున్న నవీన్ చంద్ర అభినయ యానం కోవిడ్ తర్వాత అనూహ్య మలుపు తిరిగింది. ప్రస్తుతం ఆయన్ను ఓటీటీ సూపర్‌స్టార్‌గా గుర్తించే స్థాయికి చేర్చింది.సంభవామి యుగే యుగే అనే సినిమా ద్వారా 2006లో తెరంగేట్రం చేసిన నవీన్...ఆ తర్వాత అందాల రాక్షసితో డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు. హ్యాండ్సమ్ లుక్‌తో పాటు యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్న నటుడిగా ఆ సినిమా నవీన్ చంద్రకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత అతని కెరీర్ ఇక ఊపందుకుంటుంది అనుకున్నా అలా జరగలేదు. విభిన్న చిత్రాల్లో నటించినా..ఈ నటుడి స్థాయిని అమాంతం పెంచే చిత్రాలు మాత్రం రాలేదు. అదే సమయంలో కోవిడ్ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కు ఆదరణ అమాంతం పెరిగింది. దాంతో అటు దృష్టి మరల్చిన నవీన్ 2021లో జియో హాట్ స్టార్ లో విడుదలైన పరంపర సిరీస్ లో అవకాశం అందిపుచ్చుకున్నాడు. ఆ తర్వాత మంత్ ఆఫ్ మధు లాంటి నవీన్ చంద్ర సినిమాలు ధియేటర్ కన్నా మిన్నగా ఓటీటీలో చెప్పుకోదగ్గ స్థాయి విజయాలు సాధించాయి. దాంతో ఆయనకు వెబ్ సిరీస్‌లలో అవకాశాలు రావడం మొదలైంది.అలా వచ్చిన అవకాశాలను తెలివిగా అందిపుచ్చుకున్న నవీన్ ‘ఇన్స్పెక్టర్ రిషి‘ సిరీస్ విజయంతో తన స్థానాన్ని మరింతగా సుస్థిరపరచుకున్నాడు. వైవిధ్యాన్ని ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సిరీస్‌లో ఒంటికన్ను కధానాయకుడి పాత్ర పోషించి తన నటనకు నవీన్ మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత తక్కువ థియేటర్లలో విడుదలై ఎప్పుడొచ్చిందో పోయిందో తెలియని ‘ఎలెవెన్‘ ఓటీటీ మీద సూపర్ హిట్ అయింది. అత్యధిక వీక్షకులను అందుకుని రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇలా వైవిధ్య భరిత పాత్రలతో నవీన్ చంద్ర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల మీద సక్సెస్ కు అడ్రెస్ గా మారారు. బలమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుని, ప్రతిభావంతులైన చిత్రనిర్మాతలతో పనిచేస్తూ ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఓటీటీలో నవీన్ చంద్ర విజయ విహారం ఆయనకు తమిళ, తెలుగు సినిమా రంగాల్లోనూ అవకాశాలను పెంచుతోంది. ఓటీటీ ప్రేక్షకుల్లో నవీన్ కు ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకుని వెండితెర రూపకర్తలు ఆయన కోసం పాత్రలను సృష్టించే పనిలో పడ్డారు. మొత్తంగా చూస్తే అచ్చంగా డిజిటల్ రంగంలో నవీన్ స్థాయిలో రాణిస్తున్న మరో తెలుగు నటుడు లేరనేది నిస్సందేహం.కొసమెరుపు ఏమిటంటే... ప్రస్తుతం తమిళ, తెలుగు రెండు భాషల ప్రేక్షకుల్ని సమానంగా మెప్పిస్తున్న నవీన్ చంద్ర తల్లిదండ్రుల్లో తండ్రి తమిళనాడుకు, తల్లి తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం. జన్మతః హైదరాబాద్ వాసి అయిన నవీన్ చంద్ర తొలి దక్షిణాది ఓటీటీ సూపర్‌స్టార్ గా మారడం తెలుగువారికి గర్వకారణమేనని చెప్పాలి. -
OTT: ‘ది హంట్: రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ రివ్యూ
వెబ్‌సిరీస్: ది హంట్: రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్నటీనటులు: అమిత్ సియాల్, షాహిల్ వేద్, భగవతి పెరుమాళ్, గిరిష్ శర్మ, దానిష్ ఇక్బాల్, విద్యుత్ గార్గి తదితరులుదర్శకత్వం: నగేష్ కుకునూర్ఓటీటీ వేదిక: సోనీలివ్(7 ఎపిసోడ్స్)ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘ది హంట్–ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఎన్నో సంచలన ఘటనలకు సజీవ సాక్ష్యం చరిత్ర. కానీ సామాన్యులకు చరిత్ర ద్వారా ఆ ఘటనల గురించి తెలిసేది గోరంతే... తెలియాల్సింది కొండంత. అయితే ఇప్పుడు జరిగిపోయిన సంచలన ఘటనలను విశ్లేషించి వాటికో సజీవ రూపాన్ని అందించే ప్రయత్నం ఓటీటీ సిరీస్ రూపంలో జరుగుతోంది. సాధారణంగా ఏదైనా ఘటన అంటే అది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అన్న ఉత్సుకత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అటువంటి ఉత్సుకతను దృష్టిలో పెట్టుకునే ఓటీటీ నిర్మాతలు జరిగిపోయిన సంచలనాత్మక ఘటనలపై దృష్టి సారిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇటీవల సోనీ లివ్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న సిరీస్ ‘ది హంట్–ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ బాగా ప్రేక్షకాదరణ పొందుతోంది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని చెన్నై నగరంలోని పెరుంబుదూర్ ప్రాంతంలోని ఓ మీటింగ్‌లో ఎల్టీటీఈ తీవ్రవాదులు మానవబాంబుతో అతి కిరాతకంగా చంపడం మనందరికీ తెలుసు. అయితే ఆ చంపిన తీవ్రవాదులను సరిగ్గా 90 రోజుల్లోనే మన ఇంటెలిజెన్స్ బృందం మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్ ఇంత త్వరగా ఆ సంస్థ ఎలా చేసింది? అనేది 7 ఎపిసోడ్లలో అద్భుతంగా చిత్రీకరించారు. మొదటి ఎపిసోడ్లో జరిగిన ఘటనను చూపించి ఆ తదనంతర విచారణను చాలా స్పష్టంగా తీశారు దర్శకుడు. ఇటువంటి ఘటనలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన నగేశ్ కుకునూర్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇంట్లో ఏదైనా రహస్యం ఉంటేనే మనం దానిని కనుక్కోవాలని విపరీతంగా ఉబలాటపడతాం. అలాంటిది మన దేశ ప్రధాని హత్య వెనుక రహస్యాన్ని చూడడం ఇంకెంత ఆసక్తి రేపుతుందో చెప్పనక్కరలేదు. ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ తెలుగు భాషలో కూడా లభ్యమవుతోంది. మస్ట్ వాచ్ సిరీస్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. డైలాగ్స్ ఆడియో రిలీజ్
గత నెలలో థియేటర్లలో రిలీజైన '8 వసంతాలు' సినిమా.. కొందరికి నచ్చింది, ఇంకొందరికి నచ్చలేదు. ప్రేమకథ బాగుంది, డైలాగ్స్ సూపర్ అని కొందరు అంటుంటే.. మరికొందరేమో సీరియల్లా ఉందని అంటున్నారు. సరే ఇవన్నీ పక్కనబెడితే డైలాగ్స్, వాటిలోని సాహిత్యం చాలామందిని ఆకట్టుకున్నాయి. కొందరు బాగా కనెక్ట్ అయ్యారు కూడా. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు జ్యూక్ బాక్స్ వీడియోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కన్నప్ప'.. డేట్ ఫిక్సయిందా?)థియేటర్లలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమా నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. తర్వాత ట్రెండింగ్‌లోకి కూడా వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని బాగానే చూస్తున్నారు. కొందరు విజువల్స్, డైలాగ్స్‌కి ఫిదా అయిపోతున్నారు. ఇదే చిత్రంలోని 'అందం అంటే గుణం', 'సుఖాలే కాదు కలలు కూడా పంచుకోవాలి' ,'ఎవరి తలరాతలు వాళ్లే రాసుకోవాలి', 'ఎవరి తుపానులు వాళ్లకుంటాయి లోపల'.. ఇలా పలు సంభాషణలు అచ్చ తెలుగులో ఉంటూ మనసుని దోచేస్తున్నాయి. ఇలా దాదాపు 12 డైలాగ్స్‌ని ఆడియో రూపంలో యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉంటే వినేయండి.'8 వసంతాలు' విషయానికొస్తే.. శుద్ధి అయోధ్య(అనంతిక) మార్షల్ ఆర్ట్స్, కరాటే నేర్చుకుంటూ ఉంటుంది. తండ్రి దూరమైన బాధల్లోంచి రాసిన పుసక్తంతో గొప్ప రచయిత అవుతుంది. నదిలా ప్రవహిస్తున్న ఈమె జీవితంలోకి వరుణ్ (హను రెడ్డి) వస్తాడు. అప్పటివరకు తన ప్రపంచంలో తాను బతుకుతున్న శుద్దిని ప్రేమలోకి దించుతాడు. కొన్నాళ్ల తర్వాత తన స్వార్థం చూసుకుని శుద్ధిని నడిరోడ్డున వదిలేసి వెళ్లిపోతాడు. అప్పుడు ఈమె ఏం చేసింది? శుద్ధి జీవితంలో సంజయ్ (రవి దుగ్గిరాల) పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: వరలక్ష్మికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?) -
ఓటీటీలోకి 'కన్నప్ప'.. డేట్ ఫిక్సయిందా?
మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన లేటెస్ట్ సినిమా 'కన్నప్ప'. రిలీజ్‌కి ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. అదే ఊపులో థియేటర్లలోకి రాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ వీకెండ్ అయ్యేసరికే సైలెంట్ అయిపోయింది. ఇదంతా జరిగి దాదాపు నెల కావొస్తుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? ఎప్పుడు రావొచ్చు?'కన్నప్ప'లో విష్ణు హీరోగా కాగా.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రలు పోషించారు. కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితర ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇలా స్టార్ కాస్టింగ్ చాలామంది నటించిన ఈ సినిమాని 'భక్త కన్నప్ప' స్టోరీతోనే తీశారు. కాకపోతే కమర్షియల్ అంశాలు, యాక్షన్ కాస్త జోడించారు. ఇవన్నీ కాదు ప్రభాస్ ఇందులో అతిథి పాత్ర చేయడంతో ఆయన ఫ్యాన్స్ కాస్త ఆసక్తి చూపించారు.(ఇదీ చదవండి: వరలక్ష్మి శరత్ కుమార్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?)ఇలా ఓ మాదిరి అంచనాలతో గత నెల 27న 'కన్నప్ప' థియేటర్లలో రిలీజైంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు వార్తలు రాగా.. కేవలం రూ.40-50 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చినట్లు టాక్. ఇకపోతే రిలీజ్‌కి ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్ణు.. ఓటీటీ హక్కుల్ని అమ్మలేదని చెప్పాడు. కానీ ఇప్పుడేమో మూవీ డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని, ఈ వీకెండ్లో అంటే జూలై 27న స్ట్రీమింగ్ చేయబోతున్నారని అంటున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.'కన్నప్ప' విషయానికొస్తే.. గూడెంలో పుట్టి పెరిగిన తిన్నడు(విష్ణు).. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వల్ల నాస్తికుడిగా మారిపోతాడు. చుట్టుపక్కలా గూడేల్లో ఏ ఆపద వచ్చిన ముందుంటాడు. అలాంటి కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి బహిష్కరణకు గురవుతాడు. ప్రేయసి నెమలి(ప్రీతి ముకుందన్) కూడా ఇతడి వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు.. గొప్ప శివ భక్తుడిగా ఎలా మారాడు? ఇంతకీ రుద్ర ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు) -
ఓటీటీలో 'మార్గన్'.. ట్విస్ట్ ఇస్తూ ప్రకటన
కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని కొత్త సినిమా 'మార్గన్: ది బ్లాక్ డెవిల్' గురించి ఓటీటీ ప్రకటన వచ్చేసింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. చిత్రపరిశ్రమలో దర్శకుడిగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా ఇలా మల్టీ టాలెంట్‌ను ప్రదర్శించడంతో ఆయనకు తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, ఈ సారి నిర్మాతగా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘మార్గన్’ అనే చిత్రంతో తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు.మార్గన్ సినిమా జులై 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. కోలీవుడ్ ప్రముఖ ఓటీటీ సంస్థ 'టెంట్కొట్ట'లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో ఎక్కువగా తమిళ సినిమాలే ప్రదర్శనకు వస్తుంటాయి. ఇప్పుడు మార్గన్ చిత్రం కూడా తమిళ్ వర్షన్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే, తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. జులై 25 నుంచే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించింది.కథ ఏంటి..?నగరంలో రమ్య అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఓ ఇంజక్షన్ ద్వారా ఆమెను హత్య చేస్తారు. ఆమె శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఓ చెత్త కుప్పలో కనుగొంటారు. సంచలనంగా మారిన ఆ కేసును చేధించేందుకు పోలీస్ ఆఫీసర్ ధృవ (విజయ్ ఆంటోనీ) రంగలోకి దిగుతాడు. సుమారు పదేళ్ల క్రితం తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురికావడంతో ఈ కేసును ఎలాగైనా పూర్తి చేయాలని ధృవ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. తన కూతురిలా ఇంకెవ్వరూ బలి కావొద్దని అనుకుంటాడు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో డి.అరవింద్ (అజయ్ దిశాన్) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తాడు.కానీ, అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రయ శక్తికి ధృవ ఆశ్చర్యపోతాడు. ఈ క్రమంలో అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని అనూహ్యమైన విషయాలను ధృవ తెలుసుకుంటాడు. ఈ హత్యలకు ఆరవింద్‌కు సంబంధం ఉందా. ధృవ కూతురిని చంపింది ఎవరు..? ఈ కేసును పరిష్కరించే క్రమంలో అఖిల, శ్రుతి (బ్రిగిడా), రమ్య (దీప్శిఖ), వెన్నెల, మేఘల పాత్ర ఏంటి..? ఫైనల్‌గా హంతకుడు ఎలా దొరికాడు..? అనేది తెలియాలంటే మార్గాన్ సినిమా చూడాల్సిందే. -
మరో ఓటీటీకి టాలీవుడ్ థ్రిల్లర్.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర ఈ ఏడాది వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే ఎలెవన్, బ్లైండ్ స్పాట్ లాంటి థ్రిల్లర్ సినిమాలతో మెప్పించారు. ఆ తర్వాత నవీన్ చంద్ర నటించిన మరో చిత్రం 'షో టైమ్'. ఈ మూవీ జూలై 4న థియేటర్లలో రిలీజైంది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. దీంతో ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూలై 25 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.అయితే ఈ మూవీని మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు హీరో నవీన్ చంద్ర తెలిపారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుందని ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. అయితే స్ట్రీమింగ్ డేట్‌ను మాత్రం రివీల్ చేయలేదు. ఈ ప్రకటనతో షో టైమ్ రెండు ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది. సన్ నెక్స్ట్‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది.షో టైమ్ అసలు కథేంటంటే..'షో టైమ్' విషయానికొస్తే.. ఓ ఇంటిలో రాత్రి 11 గంటలప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్‌గా అక్కడికి వచ్చిన సీఐ లక్ష్మీకాంత్(రాజా రవీంద్ర).. అర్థరాత్రి న్యూసెన్స్ ఏంటని వార్నింగ్ ఇస్తాడు. దీంతో సూర్య(నవీన్ చంద్ర), శాంతి(కామాక్షి).. సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ ఏదైనా చేస్తాడేమో అని సూర్య భయపడుతున్న టైంలో ఓ సంఘటన జరుగుతుంది. స్టోరీ మలుపు తిరుగుతుంది. సూర్య-శాంతి ఓ కేసులో ఇరుక్కుంటారు. దీని నుంచి ఎలా బయడపడ్డారు. వీళ్లకు లాయర్ వరదరాజులు(వీకే నరేశ్) ఎలాంటి సాయం చేశాడనేదే మిగతా స్టోరీ.When the truth is too dangerous to reveal, how long can you keep running?#ShowTime, coming soon on Amazon Prime. @PrimeVideoIN#ShowTime #KamakshiBhaskarla @ItsActorNaresh @Rajaraveendar @AnilSunkara1 @kishore_Atv @aruvimadhan #ShekarChandra @sarath_edit @cinemakaran_dop… pic.twitter.com/Ptd0ilnxPG— Actor Naveen Chandra (@Naveenc212) July 21, 2025 -
భావోద్వేగ భరితం... నా ప్రయాణం: సమంత
గత కొన్నేళ్లలో తీసుకుంటే సినిమాలు చాలావరకు తగ్గించేసిన సమంత.. ఓటీటీలపై పూర్తిగా దృష్టి పెట్టింది. పలు వెబ్ సిరీసుల్లో నటించింది. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ ప్రైమ్ బ్రాండ్ క్యాంపెన్లో పాల్గొంది. తన ప్రయాణం అంతా రకరకాల భావోద్వేగాలతో నిండిందని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి:కొత్తగా బిజినెస్ మొదలుపెట్టిన రష్మిక)సమంత మాట్లాడుతూ.. ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ హనీ బన్నీ తదితర సిరీసుల్లో తను పోషించిన పాత్రలని గుర్తు చేసుకుంది. ప్రతి పాత్ర ప్రేక్షకులు అనుభూతి చెందేలా, ఆ పాత్ర తాలూకు భావొద్వేగాలతో మమేకమయ్యేలా ఉంటాయని అందుకే అవి అంతగా వారికి చేరువ అయ్యాయని చెప్పింది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సామ్ సహనటుడు మనోజ్ బాజ్ పాయ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలుచేశాడు. ఫ్యామిలీ మ్యాన్‌లో తను పోషించిన పాత్రలోని భిన్న కోణాలు తనపై ఎంత ప్రభావం చూపించాయో మనోజ్ బాజ్ పాయ్ గుర్తుచేసుకున్నాడు.(ఇదీ చదవండి: కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువ: పవన్ కల్యాణ్) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు
మరోవారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి 'హరిహర వీరమల్లు'తో పాటు 'మహావతార నరసింహా', 'ద ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్', 'సార్ మేడమ్' తదితర డబ్బింగ్ చిత్రాలు కూడా వస్తున్నాయి. వీటిలో పవన్ సినిమాపై చాలా తక్కువ హైప్ అయితే ఉంది. మిగతా వాటి గురించి జనాలకు పెద్దగా తెలియదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 25కి పైగా కొత్త మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: 'డీఎన్ఏ' మూవీ రివ్యూ.. మెప్పించేలా థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'షో టైమ్' (స్ట్రెయిట్ తెలుగు సినిమా), రోంత్ (డబ్బింగ్ మూవీ) మండల మర్డర్స్(హిందీ సిరీస్), ఎక్స్ & వై(కన్నడ చిత్రం) ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీకెండ్ వచ్చేసరికి ఏవైనా కొత్త చిత్రాలు సడన్ సర్ప్రైజ్ ఇస్తాయేమో చూడాలి? ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 21 నుంచి 27 వరకు)హాట్స్టార్ద సొసైటీ (హిందీ రియాలిటీ షో) - జూలై 21రోంత్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 22వాషింగ్టన్ బ్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23షర్జమీన్ (హిందీ మూవీ) - జూలై 25అమెజాన్ ప్రైమ్జస్టిస్ ఆన్ ట్రయల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 21టిన్ సోల్జర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 23హ్యాండ్సమ్ గాయ్స్ (కొరియన్ సినిమా) - జూలై 24నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 25రంగీన్ (హిందీ సిరీస్) - జూలై 25సన్ నెక్స్ట్షో టైమ్ (తెలుగు మూవీ) - జూలై 25ఎక్స్ & వై (కన్నడ చిత్రం) - జూలై 25నెట్ఫ్లిక్స్ద హంటింగ్ వైవ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 21ట్రైన్ రెక్: పీఐ మామ్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 22క్రిటికల్: బిట్విన్ లైఫ్ అండ్ డెత్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23లెటర్స్ ఫ్రమ్ ద పాస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23ఏ నార్మల్ ఉమన్ (ఇండోనేసియన్ సినిమా) - జూలై 24హిట్ మేకర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24మై మెలోడీ & కురోమి (జపనీస్ సిరీస్) - జూలై 24మండల మర్డర్స్ (హిందీ సిరీస్) - జూలై 25ట్రిగ్గర్ (కొరియన్ సిరీస్) - జూలై 25జీ5సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా) - జూలై 25లయన్స్ గేట్ ప్లేజానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్(ఇంగ్లీష్ సినిమా) - జూలై 25ద ప్లాట్ (కొరియన్ మూవీ) - జూలై 25ద సస్పెక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25ఆపిల్ ప్లస్ టీవీఅకపుల్కో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23ఎమ్ఎక్స్ ప్లేయర్హంటర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 24(ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా
మరో క్రేజీ తెలుగు థ్రిల్లర్ సినిమా ఓటీటీలో డేట్ ఫిక్స్ చేసుకుంది. థియేటర్లలో రిలీజైన మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. నవీన్ చంద్ర, కామాక్షిభాస్కర్ల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. స్టార్ కాస్టింగ్ లేకపోవడంతో ఎప్పుడు వచ్చివెళ్లిందో అని తెలియనంత వేగంగా థియేటర్ల నుంచి మాయమైంది. ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ అన్నట్లు ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?నవీన్ చంద్ర రీసెంట్ టైంలో 'ఎలెవన్', 'బ్లైండ్ స్పాట్' లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించాడు. ఇప్పుడు అదే జానర్లో చేసిన మరో చిత్రం 'షో టైమ్'. జూలై 4న థియేటర్లలో రిలీజైంది. కాకపోతే అదేరోజు నితిన్ 'తమ్ముడు' కూడా విడుదల కావడంతో దీనికి పెద్దగా బజ్ రాలేదు. థియేటర్లు దొరకలేదు. అలా ఒకటి రెండు రోజుల్లోనే మాయమైపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూలై 25 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు'.. ఏపీలో భారీగా టికెట్ రేట్ల పెంపు)'షో టైమ్' విషయానికొస్తే.. ఓ ఇంటిలో రాత్రి 11 గంటలప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్‌గా అక్కడికి వచ్చిన సీఐ లక్ష్మీకాంత్(రాజా రవీంద్ర).. అర్థరాత్రి న్యూసెన్స్ ఏంటని వార్నింగ్ ఇస్తాడు. దీంతో సూర్య(నవీన్ చంద్ర), శాంతి(కామాక్షి).. సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ ఏదైనా చేస్తాడేమో అని సూర్య భయపడుతున్న టైంలో ఓ సంఘటన జరుగుతుంది. స్టోరీ మలుపు తిరుగుతుంది. సూర్య-శాంతి ఓ కేసులో ఇరుక్కుంటారు. దీని నుంచి ఎలా బయడపడ్డారు. వీళ్లకు లాయర్ వరదరాజులు(వీకే నరేశ్) ఎలాంటి సాయం చేశాడనేదే మిగతా స్టోరీ.ఈ కథంతా ఒక రోజులోనే జరుగుతుంది. సింపుల్ కథని అంతే క్లియర్‌గా దర్శకుడు ప్రెజెంట్ చేశాడు. 45 నిమిషాల్లోనే ఫస్టాప్ ముగించేసి.. సెకండాఫ్‌లో అసలు స్టోరీ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సీన్లో లాయర్‌గా నరేష్ ఎంటర్ అవుతాడో అక్కడి నుండి అదిరిపోయేలా నవ్వించాడు. అదే టైంలో స్టోరీలో సస్పెన్స్ కూడా బాగా మెంటైన్ చేశారు. సాధారణంగా ఇలాంటి మూవీస్ మలయాళంలో ఎక్కువగా వస్తుంటాయి. అలాంటిది ఒక గదిలోనే సినిమాని తీసేసిన మదన్.. దర్శకుడిగా మెప్పించాడు. సస్పెన్స్ కామెడీ మిక్స్ చేయడం బాగుంది. రాజా రవీంద్ర, నరేష్ మధ్యలో ఉండే ఎపిసోడ్ హైలెట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ ఊహించిన దానికి భిన్నంగా ఉంటుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజులోనే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా) -
ఓటీటీలో కోర్ట్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
చట్టం, పోలీస్ వ్యవస్థ ఈ రెండూ శక్తివంతమైనవే. అయితే ఒక్కోసారి ఈ రెండూ డబ్బుకు అమ్ముడుపోతుంటాయి. అలాంటప్పడు సామాన్యుడికి న్యాయం లభించడమనేది గగనంగా మారుతుంది. అయితే న్యాయం కోసం అలుపెరగకుండా పోరాడే న్యాయవాదులు ఉంటారు. న్యాయాన్ని గెలిపించేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ఓడిపోయినా.. డబ్బు ఎక్కువై విర్రవీగేవారితో, అవినీతిపరులైన డిపాంర్ట్మెంట్ అధికారులతో అలుపెరుగని పోరాటం చేస్తుంటారు. చట్టముమ్ నీతియుమ్అందులో అవమానాలు, అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయరు. అలాంటి ఒక న్యాయవాది ఇతి వృత్తంతో రూపొందిన తమిళ వెబ్ సిరీస్ చట్టముమ్ నీతియుమ్ (Sattamum Needhiyum). నటుడు పరుత్తివీరన్ శరవణన్ ప్రధాన పాత్ర పోషించిన ఇందులో నటి నమ్రిత, అరుళ్ డీ.శంకర్, షణ్ముగం, తిరుసెల్వమ్, విజయశ్రీ, ఇనియరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బాలాజీ సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు. 18 క్రియేటర్స్ పతాకంపై శశికళ ప్రభాకరన్ నిర్మించారు. న్యాయాన్ని గెలిపించలేక..డబ్బుకు లోకం దాసోహం అవుతున్న తరుణంలో సామాన్యులకు న్యాయం అనేది అందని ద్రాక్షలాగే మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక అమాయకుడికి న్యాయస్థానంలో న్యాయాన్ని అందించలేకపోయిన ఒక నిజాయితీ పరుడైన న్యాయవాది అదే కోర్టు బయట నోటరీలు రాసుకుంటూ కాలం గడుపుకుంటాడు. దీంతో ఆయనకు ఇంటా బయట కనీస మర్యాద కూడా లేని పరిస్థితి. ఏ ఓటీటీలో అంటే?అలాంటి వ్యక్తి ఆవేశంతో, సమాజంపై కోపంతో.. తన కళ్ల ముందు జరిగిన దుర్ఘటనపై ప్రజావ్యాజ్యం వేస్తాడు. అప్పుడూ పరిహాసానికి గురవుతాడు. అతడు న్యాయం కోసం చేసే నిరంతర పోరాటమే చట్టముమ్ నీతియుమ్. పలు ఆసక్తికరమైన అంశాలతో సహజత్వానికి దగ్గరగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌లో పరుత్తివీరన్ శరవణన్ న్యాయవాదిగా ప్రధానపాత్ర పోషించారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం (జూలై 18) నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: హీరోయిన్ ఫామ్‌హౌస్‌లో దొంగతనం.. సీసీటీవీలు ధ్వంసం! -
5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఓటీటీలోకి కొత్త సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే తెలుగు మూవీస్‌ని చూసేందుకు మన ప్రేక్షకులు కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం రెండు మూడుకు మించి వచ్చేస్తుంటాయి. అలా వీకెండ్ టైమ్ పాస్ చేసేస్తుంటారు. ఈ వారం కూడా తెలుగు సినిమాలు చాలానే వచ్చాయి.(ఇదీ చదవండి: ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం)కుబేర, భైరవం మాత్రమే ఈ వీకెండ్ ఓటీటీలో రిలీజైన వాటిలో కొత్త సినిమాలు. వీటితో పాటు 'గార్డ్' అనే తెలుగు మూవీ కూడా సైలెంట్‌గా స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉంటే దీనిపై లుక్కేయొచ్చు.'గార్డ్' విషయానికొస్తే.. షూటింగ్ అంతా ఫారిన్లోనే తీశారు. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే హీరో. ఓ అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఓ సందర్భంలో నిషేధిత ల్యాబ్‌లోకి అడుగుపెట్టి ఓ అమ్మాయిని రక్షిస్తాడు. అప్పటినుంచి వింత వింత సంఘటనలన్నీ జరుగుతుంటాయి. ఓ అమ్మాయి దెయ్యం రూపంలో కనిపిస్తూ అందరికీ భయపెడుతూ ఉంటుంది. మరి చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో రిలీజయ్యే మలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఆయా సినిమాల్ని నేరుగా మన దగ్గర స్ట్రీమింగ్ చేస్తుంటారు. గత కొన్నాళ్లలో చూసుకుంటే నాయట్టు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ తదితర మూవీస్ ఇలానే ఓటీటీలోకి వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వీటి బాటలోనే మరో చిత్రం కూడా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం)దిలీష్ పోతన్, రోషన్ మ్యాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'రోంత్'. ఈ టైటిల్‌కి అర్థం 'రాత్రి గస్తీ'. పాట్రోలింగ్ చేసే ఇద్దరు పోలీసులు.. ఒకేరోజు జరిగే సంఘటనల వల్ల ఎలా ప్రభావితమయ్యారు? వీళ్లు ఆ క్షణంలో తీసుకునే నిర్ణయాలు వీళ్ల జీవితాల్ని ఎలా తలకిందులు చేశాయనే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పోలీస్ వ్యవస్థ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.పాము తన గుడ్లని తానే తినేసినట్లు.. అనుకోని పరిస్థితి వస్తే తోటి పోలీసుల్ని, పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తారు అనేది ఇందులో చక్కగా చూపించారు. సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ అయితే అస్సలు ఊహించలేరు. అలా ఉంటుంది. గత నెల 13న థియేటర్లలో చిత్రం రిలీజ్ కాగా.. ఈ నెల 22 నుంచి అంటే వచ్చే మంగళవారం నుంచి హాట్‌స్టార్‌లో 'రోంత్' స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చూడొచ్చు.(ఇదీ చదవండి: టీజర్‌ని టార్గెట్ చేశారు.. 'విశ్వంభర' స్టోరీ ఇదే: వశిష్ట) -
ఓటీటీలో 'హౌస్‌ఫుల్ 5'.. సడెన్‌గా స్ట్రీమింగ్
హిందీ చిత్రపరిశ్రమలో సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీస్‌లో ‘హౌస్‌ఫుల్’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఐదో సినిమా ‘హౌస్‌ఫుల్ 5’.. జూన్ 6న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్‌గా స్ట్రీమింగ్కు రావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి ప్రముఖ తారలు ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాలో నటించారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వంలో సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమాను నిర్మించారు.కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ‘హౌస్‌ఫుల్5’ బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ మూవీ చూడాలంటే రూ. 349 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ముందు భాగాలకు పూర్తి భిన్నంగా మరింత నవ్వులు పంచేలా సినిమా ఉండటంతో భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 250 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. హౌస్‌ఫుల్ 5 విమర్శకుల నుంచి మిశ్రమ-ప్రతికూల రివ్యూలను అందుకుంది. అయితే, ఇందులోని మహిళల పాత్రల గురించి కాస్త విమర్శలు వచ్చాయి. వారిని వస్తువు రూపంలో చూపించారనే అపవాదు వచ్చింది. ఈ చిత్రం హౌస్‌ఫుల్ 5A, హౌస్‌ఫుల్ 5B అనే రెండు వెర్షన్లలో విడుదలైంది. ఇందులో భిన్నమైన క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. -
వీకెండ్లో చిల్ అవ్వండి.. ఓటీటీల్లో ఒక్కరోజే 16 చిత్రాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు థియేటర్ల సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ఈ వారంలో శ్రీలీల- కిరీటి జంటగా నటించిన జూనియర్‌పై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు రానా సమర్పణలో వస్తోన్న కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ధనుశ్- నాగార్జున నటించిన కుబేర డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన భైరవం సైతం ఓటీటీలో అలరించనుంది. బాలీవుడ్ నుంచి స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, ద భూత్ని చిత్రం ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ శుక్రవారమే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ వీకెండ్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుందా? అయితే ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.అమెజాన్ ప్రైమ్కుబేర (తెలుగు మూవీ) - జూలై 18నెట్ఫ్లిక్స్వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18వాల్ టూ వాల్ - (కొరియన్ సినిమా)- జూలై 18డెరిలియమ్ - (వెబ్ సిరీస్)- జూలై 18ఆల్మోస్ట్ ఫ్యామిలీ(బ్రెజిలియన్ కామెడీ చిత్రం)- జూలై 18డిలైట్‌ఫుల్లీ డిసీట్ఫుల్(హాలీవుడ్ మూవీ)- జూలై 18జియో హాట్స్టార్స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 18స్టార్ ట్రెక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18జీ5భైరవం (తెలుగు సినిమా) - జూలై 18ద భూత్ని (హిందీ మూవీ) - జూలై 18సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) - జూలై 18లయన్స్ గేట్ ప్లేజానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18టేక్ పాయింట్ (కొరియన్ మూవీ) - జూలై 18ఆపిల్ ప్లస్ టీవీసమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 18మనోరమ మ్యాక్స్అస్త్ర(మలయాళ థ్రిల్లర్)- జూలై 18 -
ఓటీటీలో 8 వసంతాలు.. థియేటర్లో ఇప్పటికీ ఉందంటే.. అదే కారణం: దర్శకుడు
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రేమకథ చిత్రం '8 వసంతాలు'. గత నెలలో జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దగా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ సందడి చేస్తోంది. అయితే థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమా మాత్రం ఓటీటీలో అదరగొడుతోంది. పలువురు ఓటీటీ సినీ ప్రియులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇదిలా ఉండగా.. 8 వసంతాల డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి ఇటీవలే ఎనిమిది వసంతాల మూవీ స్క్రిప్ట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ చూసి కొందరు థియేటర్లలో ఈ సినిమాను మిస్సయ్యామని చాలామంది తనకు మేసేజ్‌లు చేస్తున్నారని దర్శకుడు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే అందుకు చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. జూలై 11న ఓటీటీకి వచ్చినప్పటికీ ఇప్పటికీ 8 వసంతాలు కూకట్‌పల్లిలోని పీవీఆర్ నెక్సస్ మాల్ థియేటర్లో అందుబాటులో ఉందని తెలిపారు. ఎవరైనా థియేటర్లో మిస్సయితే వెళ్లి చూడాలంటూ సలహా ఇచ్చారు.(ఇది చదవండి: ఓటీటీలో '8 వసంతాలు'.. నెలలోనే స్ట్రీమింగ్)అయితే ఇంటర్వ్యూల్లో నన్ను ఎవరైనా పొగిడినా, మా సినిమాకు మద్దతుగా మాట్లాడినా కొందరు నేను డబ్బులిచ్చారని అంటున్నారు. నెగెటివ్పై పెట్టిన శ్రద్ధ.. పాజిటివ్ వైపు పెడితే.. మీ జీవితంతో పాటు ప్రపంచం కూడా బాగుంటుందని దర్శకుడు అన్నారు. ఒక థియేటర్ ఓనర్ ఎవరో డబ్బులు ఇచ్చారని సినిమాను ఆడించడు.. అతనికి డబ్బులు వస్తున్నాయి కాబట్టే సినిమాను ఆడిస్తాడని తన పోస్ట్‌లో ప్రస్తావించారు. థియేటర్లే దొరకడం కష్టమైన ఈ రోజుల్లో పెద్ద సినిమాలు ఉన్నా.. నెగెటివిటీ ఉన్నా.. అన్నింటిని దాటుకుని మా సినిమా థియేటర్లో 27 రోజులు పూర్తి చేసుకుందంటే అందులో ఉన్న విషయం.. అది చేయగలుతున్న ఒంటరి పోరాటం.. మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ ఫణీంద్ర నర్సెట్టి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. -
ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం
ఓటీటీల రాకతో సినిమా చూసే ప్రేక్షకులకు సదుపాయం బాగా పెరిగిపోయింది. ఏ మూవీని థియేటర్లో చూడాలి? దేన్ని మొబైల్లో చూడాలనేది ముందే ఫిక్సయిపోతున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం థియేటర్లకు జనాలు రావట్లేదు అని గగ్గోలు పెడుతున్నారు. మరీ నెలలోపే కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తుండటం ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని డబ్బింగ్ చిత్రాల పరిస్థితి ఇంకా దారుణం.గత నెల 20న తమిళంలో 'డీఎన్ఏ' అనే సినిమా రిలీజైంది. పాజిటివ్ టాక్ అందుకుంది. 'గద్దలకొండ గణేష్'తో తెలుగులోనూ నటించిన అధర్వ మురళి ఇందులో హీరోగా నటించాడు. మలయాళ బ్యూటీ నిమిషా సజయన్ హీరోయిన్. 2014లో ఓ సాఫ్ట్వేర్, ఆర్టిటెక్ట్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. తమిళంలో మంచి టాక్ వచ్చింది. దీన్ని తెలుగులో 'మై బేబీ' పేరుతో ఈ నెల 18న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇక్కడివరకు బాగానే ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)ఇప్పుడు సడన్‌గా 'డీఎన్ఏ' ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ నెల 19 నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ ఇచ్చింది. అంటే తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైన ఒక్కరోజుకే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుందనమాట. ఇలా అయితే థియేటర్లకు వెళ్లాలనుకునే ఒకరు ఇద్దరు కూడా వెనకడుగు వేస్తారు. మరి ఓటీటీ డేట్ తెలియకుండా తెలుగులో రిలీజ్ ప్లాన్ చేసుకున్నారా? లేదంటే ఓటీటీ సంస్థ సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందా అనేది తెలియట్లేదు.'డీఎన్ఏ' విషయానికొస్తే.. ఆనంద్(అధర్వ మురళి) లవ్ ఫెయిలవడంతో తాగుబోతుగా మారతాడు. కొన్నాళ్లకు బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉన్న దివ్య(నిమిషా సజయన్)ని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆనంద్‌లో మార్పు వచ్చి భార్యతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్నాళ్లకు దివ్య ప్రెగ్నెంట్ అవుతుంది. డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్తారు. ప్రసవం అయిన కాసేపటికే ఈ బిడ్డ తన బిడ్డ కాదని, ఎవరో మార్చేశారని దివ్య, డాక్టర్లని నిలదీస్తుంది. ఇంతకీ దివ్య చెప్పింది నిజమేనా? చివరకు బిడ్డ దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ మూవీ) -
ఓటీటీ.. ఏమిటీ ట్రాప్!
అభిమాన తారలు నటించిన సినిమా ఎప్పుడు రిలీజవుతుందా.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే వీక్షకులు కోట్లలో ఉంటారు. ఓటీటీలోకి వస్తోందని, ఫలానా తేదీన స్ట్రీమింగ్ అవుతుందని తెలియగానే ఆరోజు కోసం ఎదురు చూసేవారెందెరో. ఆ సినిమా కోసమైనా ఓటీటీ యాప్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునేవారూ ఉన్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ ను రద్దు చేయాలంటే? సైన్ అప్ చేసినంత సులభం కాదని ఇటీవలి సర్వే వెల్లడించింది. అంతేకాదు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా యూజర్ ఇంటర్ఫేస్ ఉంటోందట.సినిమాలూ, వెబ్ సిరీస్‌ల వంటివి చూపే ఓవర్ ద టాప్ (ఓటీటీ) యాప్‌లలో సబ్స్క్రిప్షన్ ను (చందా) రద్దు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ సర్వేలో తేలింది. దేశంలోని డిజిటల్ వినియోగదారులలో డిజిటల్ సేవల సబ్స్క్రిప్షన్స్ ను రద్దు చేయడంలో సగం మంది తరచూ ఇబ్బంది పడుతున్నారట. చాలా సందర్భాల్లో రద్దు చేసే ఆప్షన్ అందుబాటులో ఉండడం లేదని సర్వేలో పాలుపంచుకున్నవారు తెలిపారు. యాప్ లేదా వెబ్సైట్లో ఆ ఆప్షన్ ఎక్కడో ఉండటం వల్ల దాన్ని కనుక్కోలేకపోయామని వినియోగదారులు చెబుతున్నారు.దేశవ్యాప్తంగా 353 జిల్లాల్లోని 95,000కుపైగా మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా లోకల్‌సర్కిల్స్ ఈ నివేదిక రూపొందించింది. చందా రద్దు ప్రక్రియ కష్టతరం చేయడానికి ప్లాట్‌ఫారాలు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఈ నివేదిక బహిర్గతం చేసింది. ‘డార్క్ ప్యాటర్న్స్’ అని పిలిచే ఈ ఉపాయాలు ఇప్పుడు వినియోగదారులు, నియంత్రణ సంస్థల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నాయని ఈ నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం 69 ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.ఆసక్తి లేకపోయినా..ఈ నివేదిక ద్వారా గుర్తించిన అత్యంత సాధారణ డార్క్ ప్యాటర్న్లలో సబ్స్క్రిప్షన్ ట్రాప్ ఒకటి. ఓటీటీలో సైన్ అప్ చేసే సమయంలోనే కంపెనీలు తమ ఉపాయాలను ప్రదర్శిస్తున్నాయి. ఫ్రీ ట్రయల్స్ ఆఫర్ చేసినా.. కాల పరిమితి ముగియగానే సులభంగా నిష్క్రమించే అవకాశం లేకుండా పోతోంది. అన్ సబ్స్క్రయిబ్ చేసే ఆప్షన్ గుర్తించడం కష్టంగా ఉంటోంది. దీంతో వినియోగదారులు వారు అనుకున్న దానికంటే ఎక్కువ కాలం సభ్యత్వాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ ఆప్షన్ ఉండడంతో కాల పరిమితి కాగానే ఖాతాలోంచి డబ్బులు కట్ అయిపోయి, సబ్స్క్రిప్షన్ రీచార్జ్ అయినట్టుగా చాలా మంది తెలిపారు. కొన్ని సందర్భాల్లో అదనపు యాప్‌లను ఇన్ స్టాల్ చేయడం, లేదా అవసరమైన దానికంటే ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని కూడా పంచుకోవాల్సి వస్తోంది. ఓటీటీ సేవలకు అవసరం లేని చర్యలను వినియోగదారులు పూర్తి చేయాల్సి ఉంటోంది. ముఖ్యం కాకపోయినా సబ్స్క్రిప్షన్ సమయంలో ఈ దశలను కంపెనీలు తప్పనిసరి అని చెప్పి పూర్తి చేయిస్తున్నాయి.లోపించిన పారదర్శకత..సబ్స్క్రిప్షన్ సమయంలో కంపెనీలు ఒక ధరను ముందుగా ప్రదర్శిస్తున్నాయి. చెక్ అవుట్ ప్రక్రియ సమయంలో తప్పనిసరి రుసుములు, ఛార్జీలను జోడిస్తున్నాయి. ఈ తరహా మోసానికి గురైనట్టు చందాదారులు చెబుతున్నారు. ఓటీటీ సేవలకు సబ్‌స్క్రైబ్ చేసుకునేటప్పుడు అదనపు ఛార్జీల గురించి ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని 53% మంది వినియోగదారులు వెల్లడించారు. చెల్లింపు చివరి దశలో మాత్రమే ఈ అదనపు ఖర్చులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కంపెనీల్లో పారదర్శకత లోపించిందనడానికి ఇది నిదర్శనమని నివేదిక వివరించింది. దృష్టి మరల్చడానికి.. వినియోగదారుల దృష్టి మరల్చడానికి లేదా తప్పుదారి పట్టించడానికి ఉద్దేశించిన గమ్మతై ్తన నేవిగేషన్, రంగు రంగుల సంకేతాలతో కూడిన ఇంటర్‌ఫేస్‌లను కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. ఆఫర్స్‌ను తిరస్కరించడం, ట్రయల్స్‌ను నిలిపివేయడం, చందా రద్దు (క్యాన్సిలేషన్) మార్గాన్ని కనుగొనడం కష్టతరం అయ్యే పరిస్థితులను ఎదుర్కొన్నామని 86% మంది వినియోగదారులు చెప్పారు. ‘కంపెనీలు ఒక ఆఫర్ లేదా సేవను ప్రమోట్ చేస్తున్నాయి. సైన్ అప్ చేసిన తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రకటనలు లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్నీ చూడండని ఊదరగొట్టి ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు. అదనంగా చెల్లించకపోతే ప్రకటనలను కొనసాగిస్తున్నాయి’ అని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు.రద్దు చేసినా చార్జీలు..సబ్స్క్రిప్షన్ ను రద్దు చేసిన తర్వాత కూడా కంపెనీలు ఛార్జ్ చేస్తున్నాయని వినియోగదారులు అంటున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 24% మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఎలాంటి అలర్ట్, వివరణ లేకుండానే ఈ ప్రక్రియ జరుగుతోందని వారు అంటున్నారు. సబ్స్క్రిప్షన్ గడువు అయిపోయిందని, ఇక డబ్బు చెల్లించనక్కర్లేదని భావించినప్పటికీ బ్యాంకు ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతోందని వారు చెబుతున్నారు.కంపెనీల ఈ డిజైన్ వ్యూహాలు స్వల్పకాలంలో ప్లాట్‌ఫామ్‌లకు ప్రయోజనం చేకూర్చినప్పటికీ వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతాయని లోకల్‌సర్కిల్స్ స్పష్టం చేసింది. సౌలభ్యం తగ్గిందని, ప్రకటనలు ఎక్కువయ్యాయని, గందరగోళమైన బిల్లింగ్ ఉంటోందన్నది కస్టమర్ల వాదన. సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేటప్పుడు కంపెనీల నుంచి సహాయం, స్పష్టత పొందలేకపోయామని వినియోగదారులు తెలిపారు.అయినా మారలేదు..ఈ సమస్యలను పరిష్కరించడానికి 2023లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ 13 రకాల డార్క్ ప్యాటర్న్స్ నివారణ, నియంత్రణ కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు డిజిటల్ పారదర్శకతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అవి ఈ–కామర్స్ సేవలకు మాత్రమే వర్తిస్తాయని వాదిస్తున్నాయి. అయితే కంపెనీల మోసపూరిత విధానాలపై కన్నెర్ర చేసిన సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 2023 నవంబర్‌లో ఓ హెచ్చరిక జారీ చేసింది. తప్పుదోవ పట్టించే ఇంటర్‌ఫేస్‌లను తొలగించడానికి కంపెనీలకు మూడు నెలల సమయం ఇచ్చింది. ఆ తరవాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదని లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. భారత్‌లో వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో స్పష్టమైన నియమాలు, బలమైన అమలు వ్యవస్థ ఉండాలని ఈ నివేదిక అభిప్రాయపడింది. -
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
ఓటీటీలో కంటెంట్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో మేకర్స్ సైతం సరికొత్త మిస్టరీ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటి వాణీ కపూర్ లీడ్‌రోల్ పోషించిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సిరీస్‌లో వాణీకపూర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని శతాబ్దాల కిందట చరణ్‌దాస్‌పూర్‌లో జరిగిన హత్యల నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించగా.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఈనెల 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ మూవీ
హాలీవుడ్ అడ్వెంచర్ సినిమాలంటే ఇష్టమా? మీ కోసమే రీసెంట్ హిట్ మూవీ లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. గత నెలలో థియేటర్లలో రిలీజై దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం)గతంలో యానిమేషన్ రూపంలో నాలుగైదు భాగాలుగా వచ్చి ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం 'హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్'. ఇప్పుడు దీన్ని లైవ్ యాక్షన్ మూవీగా తీశారు. ఇది ఇప్పుడు మంగళవారం నుంచి వీడియో ఆన్ డిమాండ్ అంటే రెంట్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.'హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్' విషయానికొస్తే.. బర్క్ అనే దీవిపై సమీపంలో ఉండే డ్రాగన్స్ ఎప్పటికప్పుడు దాడి చేస్తుంటాయి. పశువులని ఎత్తుకెళ్తుంటాయి. గ్రామస్థులు వాటిని చంపాలని చూస్తుంటారు కానీ కుదరదు. ఓ రోజు స్టాయిక్ ది వాస్ట్ అనే యోధుడి కుమారుడు హికప్ హాడక్ వల్ల అరుదైన నైట్ ఫ్యూరీ జాతికి చెందిన డ్రాగన్ తీవ్రంగా గాయపడుతుంది. దాన్ని రక్షించి, దానితోనే స్నేహం చేస్తాడు. మరి చివరకు డ్రాగన్స్ సమస్యని ఆ ఊరి ప్రజలు తీర్చారా లేదా అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్) -
ఐదేళ్ల తర్వాత సినిమాగా తెలుగు వెబ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?
టాలీవుడ్ ప్రియులను అలరించిన ఆసక్తికర వెబ్ సిరీస్ మస్తీస్. లాక్ డౌన్ టైమ్‌లో వచ్చిన ఈ సిరీస్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2020లో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సిరీస్‌కు క్రిష్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సిరీస్ సూపర్ హిట్ కావడంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ వెబ్ సిరీస్‌ను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని జూలై 16న ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా.. ఈ వెబ్ సిరీస్‌లో నవదీప్, హెబ్బా పటేల్, బిందు మాధవి, చాందిని చౌదరి, అక్షర గౌడ, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్
మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా చెప్పుకోదగ సినిమాలేం థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. ఉన్నంతలో 'జూనియర్' కాస్త ఆకట్టుకునేలా ఉంది. ఎందుకంటే గాలి జనార్ధనరెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఇది. శ్రీలీల హీరోయిన్ కావడంతో కాస్త హైప్ ఏర్పడింది. దీనితో పాటు కొత్తపల్లిలో ఒకప్పుడు, పోలీస్ వారి హెచ్చరిక అనే మరో రెండు చిత్రాలు కూడా ఈ వీకెండే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: లారెన్స్‌ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనన్నారు')మరోవైపు ఓటీటీలోనూ 15 చిత్రాలు-వెబ్ సిరీసులే స్ట్రీమింగ్ కానున్నప్పటికీ వీటిలో ఐదు కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. కుబేర, భైరవం లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్తోపాటు ద భూత్ని అనే హిందీ చిత్రం, స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, గుటర్ గూ సీజన్ 3 సిరీస్‌లు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ వచ్చిందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 14 నుంచి 20 వరకు)అమెజాన్ ప్రైమ్కుబేర (తెలుగు మూవీ) - జూలై 18నెట్ఫ్లిక్స్అపాకలిప్స్ ఇన్ ద ట్రాపిక్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 14ద ఫ్రాగ్రంట్ ఫ్లవర్ సీజన్ 1 (జపనీస్ ఎనిమీ సిరీస్) - జూలై 14వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18హాట్స్టార్కోయిటల్, హీరో అండ్ బీస్ట్ (స్పానిష్ సిరీస్) - జూలై 15స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 18స్టార్ ట్రెక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18జీ5భైరవం (తెలుగు సినిమా) - జూలై 18ద భూత్ని (హిందీ మూవీ) - జూలై 18సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) - జూలై 18లయన్స్ గేట్ ప్లేజానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18టేక్ పాయింట్ (కొరియన్ మూవీ) - జూలై 18ఆపిల్ ప్లస్ టీవీసమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 18ఎమ్ఎక్స్ ప్లేయర్గుటర్ గూ సీజన్ 3 (హిందీ సిరీస్) - జూలై 17(ఇదీ చదవండి: ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!') -
ఓటీటీలోకి కొత్త సినిమా.. అప్డేట్ ఇచ్చిన హీరో
ప్రస్తుతం చిన్న సినిమాలని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. మరీ బాగుంది అంటే తప్పితే థియేటర్లకు వెళ్లి వీటిని చూసేందుకు ఆసక్తి చూపించట్లేదు. అయినా సరే యంగ్ హీరోలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ కూడా రీసెంట్‌గానే తన కొత్త సినిమాతో వచ్చాడు. ఇప్పుడు ఇది థియేటర్లలో ఉండగానే ఓటీటీ రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చేశాడు.బిగ్‌బాస్ 7, 8 సీజన్లలో పాల్గొన్న గౌతమ్ కృష్ణ.. అంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేశాడు. కానీ 7వ సీజన్ పూర్తయిన తర్వాత ఈ మూవీ మొదలుపెట్టాడు. దాని షూటింగ్ అంతా పూర్తి చేసి ఈ నెల 4న థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్రమోషన్లు కాస్తోకూస్తో చేశారు. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది గానీ జనాలు పెద్దగా పట్టించుకోలేదు.(ఇదీ చదవండి: ఒక్క పాటతో పూజా హెగ్డే కంటే ఫేమస్.. ఎవరీ నటుడు?)ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమాని ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నట్లు హీరో గౌతమ్ కృష్ణ పోస్ట్ పెట్టాడు. త్వరలో స్ట్రీమింగ్ అప్డేట్ ఉంటుందని అన్నాడు. అంటే మరో వారంలో డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేస్తుందేమో?'సోలోబాయ్' విషయానికొస్తే.. కృష్ణమూర్తి(గౌతమ్ కృష్ణ) మిడిల్ క్లాస్ కుర్రాడు. ఇంజినీరింగ్ చదువుతూ ప్రియ(రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. కానీ ఓ సందర్భంలో ఆమె బ్రేకప్ చెప్పడంతో మద్యానికి బానిసైపోతాడు. తండ్రి ప్రోత్సాహంతో మళ్లీ మాములు మనిషిగా మారి ఉద్యోగంలో చేరతాడు. అక్కడ శ్రుతి(శ్వేత అవస్తి) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితం సాఫీగా సాగుతుందన్న సమయంలో తండ్రి మరణిస్తాడు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా భార్య శ్రుతి విడాకులు ఇస్తుంది. ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు భార్య విడాకులు.. వీటన్నింటిని తట్టుకొని కృష్ణ మూర్తి మిలియనీర్‌గా ఎలా ఎదిగాడు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) View this post on Instagram A post shared by D GAUTHAM KRISHNA (@actorgauthamkrishna) -
'ఆ గ్యాంగ్ రేపు 3' ఫస్ట్ లుక్ విడుదల
గతంలో యూట్యూబ్‌లో వైరల్ అయిన 'ఆ గ్యాంగ్ రేపు' షార్ట్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత 'ఆ గ్యాంగ్ రేపు 2' పేరుతోనూ షార్ట్ ఫిల్మ్ తీశారు. ఇప్పుడు ఈ టీమ్ నుంచి మూడో భాగం రాబోతుంది. త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు యోగి తొలి ఫీచర్ ఫిల్మ్ 'లవ్ యూ టూ' నేరుగా ఓటీటీలో రిలీజై ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈసారి 'ఆ గ్యాంగ్ రేపు 3'.. దర్శకుడిగా మరింత గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు. నరేన్ అన్నసాగరం, ప్రీతి సుందర్ హీరో హీరోయిన్లుగా నటించారు. నోక్షియస్ నాగ్స్ నిర్మించారు. కంటెంట్ ట్రైలర్ జూలై 16న విడుదల కానుంది. పూర్తి వివరాలు త్వరలో బయటపెట్టనున్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. అన్ని భాషల సినిమాలు థియేటర్లకు వెళ్లి చూడలేం కాబట్టి డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చిన తర్వాత చూసేయొచ్చు. అందుకు తగ్గట్లు ఓటీటీ సంస్థలు కూడా హాలీవుడ్‌తోపాటు విదేశీ భాషల్లో తెరకెక్కిన చిత్రాల్ని మన ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువాదం చేస్తున్నాయి. ఇప్పుడు అలానే ఓ హాలీవుడ్లో తీసిన కరాటే మూవీ సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)చైనీస్ నటుడు జాకీ చాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించాడు. 2010లో 'కరాటే కిడ్' అనే మూవీ చేశాడు. అది తెలుగులో కూడా డబ్ అయింది. ఇప్పుడు దాదాపు అలాంటి కాన్సెప్ట్‌తోనే తీసిన మూవీ 'కరాటే కిడ్: లెజెండ్స్'. మే 30న థియేటర్లలోకి వచ్చిన చిత్రం.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.సినిమా విషయానికొస్తే.. ఓ చైనీస్ కుర్రాడు తల్లితో కలిసి అమెరికా వచ్చేస్తాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన కంగ్ ఫూని కూడా పక్కనబెట్టేస్తాడు. అయితే కాలేజీలో ఓ ఆకతాయి కుర్రాడు.. ఇతడిని ఇబ్బంది పెడతాడు. దీంతో ఇద్దరు మాస్టర్స్ ఆధ్వర్యంలో మళ్లీ కంగ్ ఫూ ప్రాక్టీస్ చేయడంతో పాటు కరాటే నేర్చుకుంటాడు. మరి చివరకు ఏమైంది? ఆకతాయికి చైనీస్ కుర్రాడు కరాటేతో సమాధానమిచ్చాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన) -
ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన
రీసెంట్ టైంలో థియేటర్లలోకి వచ్చిన హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ 'కుబేర'. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. యునానిమస్‌గా ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. అయితేనేం ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై ఉండగానే డిజిటల్ తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: విశాఖలో 'అల్లు అర్జున్' మల్టీఫ్లెక్స్ పనులకు శ్రీకారం)విడుదలకు ముందు 'కుబేర' ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. 4 వారాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇప్పుడు నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో మిస్ కావొద్దు.'కుబేర' విషయానికొస్తే.. దీపక్ (నాగార్జున) సీబీఐ ఆఫీసర్. అక్రమ కేసు కారణంగా జైలులో ఉంటాడు. దేశంలో సంపన్నుడైన నీరజ్ మిత్రా(జిమ్ షర్బ్) ఇతడిని బయటకు తీసుకొస్తాడు. ఓ ఆయిల్ డీల్ విషయమై లక్ష కోట్ల రూపాయలని ప్రభుత్వంలో పెద్దలకు ఇవ్వడంలో భాగంగా దీపక్‌ని వాడుకోవాలనేది నీరజ్ ప్లాన్. ఈ క్రమంలోనే దేవా (ధనుష్)తో పాటు మరో ముగ్గురు అనాథల పేరుపై బినామీ కంపెనీలు సృష్టిస్తాడు దీపక్. వాళ్ల అకౌంట్స్ నుంచి ప్రభుత్వ పెద్దలకు డబ్బులు చేరవేయాలనేది ఆలోచన. అయితే... దీపక్, నీరజ్ మిత్రా గ్యాంగ్ నుంచి దేవా తప్పించుకుంటాడు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న నీరజ్ మిత్రాని ఓ బిచ్చగాడు ఎన్ని ఇబ్బందులకు పెట్టాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సినిమా టికెట్ లాటరీ.. ఐఫోన్ గెలుచుకున్న యువకుడు) -
ఓటీటీలో టేస్టీ తేజ సినిమా.. చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘6జర్నీ’. మే 9న విడుదలైన ఈ చిత్రం సుమారు రెండు నెలల తర్వాత సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బసీర్ ఆలూరి దర్శకత్వం వహించారు.'6జర్నీ' సినిమా సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఈ మూవీలో పెద్ద స్టార్లు ఎవరూ లేకపోవడంతో థియేటర్లలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదు. అయితే, ఈ సినిమాను చూడాలంటే రూ. 149 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కానీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడిలేని ఈ చిత్రానికి అదనంగా రెంట్ చెల్లించడం ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఆరుగురి జీవిత ప్రయాణం. గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి సూసైడ్ చేసుకోవాలని అనుకునే ఓ బ్యాచ్ కథే ‘6జర్నీ’. అలాంటి వారి ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథ. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా పూర్తిగా టెర్రరిజం మీదే నడుస్తుంది. -
'రాజాసాబ్' విలన్ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హారర్ సినిమా 'ద భూతిని' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. సంజయ్ దత్ (Sanjay Dutt) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మౌనీ రాయ్, సన్నీ సింగ్, పాలక్ తివారి కీలక పాత్రలు పోషించారు. సిద్దాంత్ కుమార్ సచ్దేవ్ దర్శకత్వం వహించాడు. సంజయ్ దత్తో పాటు దీపక్ ముకుత్ నిర్మించారు.నెలన్నర తర్వాతే ఓటీటీలో రిలీజ్మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తాజాగా జీ5 ద భూతిని ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించింది. జూలై 18న జీ5లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియో క్లిప్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. సినిమా బాలేదంటే నెల తిరిగేలోపే ఓటీటీలో రిలీజ్ చేస్తారు. కానీ ఈ చిత్రాన్ని మాత్రం నెలన్నర గ్యాప్ తర్వాతే డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తెస్తున్నారు.సినిమాలుసంజయ్ దత్ విషయానికి వస్తే.. బాలీవుడ్లో హీరోగా, విలన్‌గా అనేక సినిమాలు చేశాడు. డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అఖండ 2 మూవీ చేస్తున్నాడు. ఈయన కీలక పాత్రలో నటించిన ది రాజా సాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈయన హిందీలో యాక్ట్ చేసిన ధురంధర్ మూవీ కూడా అదే రోజు (డిసెంబర్ 5నే) రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో తన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కాకూడదని కోరుకుంటున్నాడు సంజయ్. Pyaar, panic, aur ek possessive bhootnii — jab bhootnii takrayegi baba se, shuru hoga full-on madness! #TheBhootnii premieres on 18th July, 8 pm, on #ZEE5 & #ZEECinema#TheBhootniiOnZEE5 pic.twitter.com/SmzceTDH6j— ZEE5Official (@ZEE5India) July 10, 2025 చదవండి: యాంకరింగ్‌లో సిండికేట్.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభాను -
ఈ వీకెండ్లో ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ ఫ్రైడే ఇప్పటికే థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. తెలుగులో సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీపైనే అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు తెలుగులో వర్జిన్ బాయ్స్, ద 100 సినిమాలు సందడి చేయనున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి మాలిక్.. హాలీవుడ్ నుంచి సూపర్ మ్యాన్ బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సుహాస్ మూవీ కోసమే ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీల్లోనూ చాలా సినిమాలు వచ్చేస్తుంటాయి. ఈ వీకెండ్లో కూడా మిమ్మల్ని అలరించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. వాటిలో ఇటీవలే విడుదలైన 8 వసంతాలు, ఆర్జీవీ తెరకెక్కించిన శారీ లాంటి తెలుగు మూవీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. వీటితో పాటు కలియుగం, డిటెక్టివ్ ఉజ్వలన్ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తిగా ఉన్నాయి. జూలై 11న ఒక్కరోజే దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఫ్యామిలీతో కలిసి మీకు నచ్చిన సినిమాను చూసి ఈ వీకెండ్లో ఎంజాయ్ చేయండి.జియో హాట్‌స్టార్..ద రియల్ హౌస్‌వైఫ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ (సీజన్ 9) - జూలై 11జాస్ ది డిఫినేటివ్ ఇన్సైడ్ వెడ్డింగ్- జూలై 11బరీడ్ ఇన్ ద బ్యాక్‌యార్డ్ (సీజన్ 6) - జూలై 13నెట్‌ఫ్లిక్స్8 వసంతాలు (తెలుగు సినిమా) -జులై 11ఆప్ జైసే కోయ్ - జూలై 11మడియాస్ డెస్టినేషన్ వెడ్డింగ్ - జూలై 11ఎమోస్ట్ కాప్స్ - జూలై 11డిటెక్టివ్ ఉజ్వలన్(మలయాళ సినిమా) -జులై 11ఆహాశారీ(తెలుగు సినిమా)- జూలై 11కలియుగం(తెలుగులో)- జూలై 11సన్నెక్స్ట్కలియుగం(తమిళంలో) - జూలై 11కర్కి(కన్నడ సినిమా)- జూలై 11మనోరమ మాక్స్మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్ - జూలై 11సోనీలివ్నరివెట్ట(మలయాళ సినిమా)- జూలై 11(స్ట్రీమింగ్ అవుతోంది)ఆపిల్ టీవీ ప్లస్ఫౌండేషన్ (సీజన్ ) - జూలై 11లయన్స్‌గేట్ ప్లేఫోర్ ఇయర్స్ లేటర్ - జూలై 11జాస్ @ 50: ద డెఫినిటివ్ ఇన్సైడ్ స్టోరీ (డాక్యుమెంటరీ)- జూలై 11మిస్టర్ రాణి - జూలై 11ద సైలెంట్ అవర్ - జూలై 11బుక్ మై షోపాల్ అండ్ పాలెట్ టేక్ ఎ బాత్ - జూలై 11 -
ఒక రోజు ముందుగానే ఓటీటీకి వచ్చిన సూపర్ హిట్ మూవీ
మలయాళీ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'నరివెట్ట'. ఈ చిత్రానికి అనురాగ్ మనోహర్ దర్శకత్వం వహించారు. తెలుగులో మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 2003లో జరిగిన ముతంగ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఐడెంటిటీ హిట్ తర్వాత టోవినో థామస్ మరో మూవీని సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. సోనీ లివ్ వేదికగా నరివెట్ట మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇంకేందుకు ఆలస్యం ఈ బ్లాక్‌బస్టర్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ చిత్రంలో వెంజరమూడు, చేరన్ కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ సినిమాలో టొవినో థామస్ పోలీస్ కానిస్టేబుల్‌గా నటించారు. ఈ ఏడాది మే 23న మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. తెలుగులోనూ మే 30న రిలీజైంది.Digital Premiere:Kannada Version Of Malayalam Film #Narivetta(2025) Now Streaming On @SonyLIVLink:https://t.co/l80BCRNHnNIMDb: 7/10Also Available In Telugu, Tamil & Hindi #KannadaDubbed pic.twitter.com/DnojlPyUrr— Shrikrishna (@Shrikrishna_13) July 10, 2025 -
ఓటీటీలో 'డిటెక్టివ్' సినిమా స్ట్రీమింగ్
మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా 'డిటెక్టివ్ ఉజ్వలన్'.. ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మిస్టరీ కామెడీ జానర్లో దర్శకులు ఇంద్రనీల్ గోపికృష్ణన్, రాహుల్ సంయుక్తంగా తెరకెక్కించారు. సోఫియా పాల్ వీకెండ్ బ్లాక్‌బస్టర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్, సిజు విల్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మే 23న విడుదలైన ఈ చిత్రం రూ. 4.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. ఈ చిత్రం మలయాళంలో రూ. 10 కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టింది.డిటెక్టివ్ ఉజ్వలన్ (Detective Ujjwalan) చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా జులై 11 నుంచి అందుబాటులోకి రానుందని ఆ సంస్థ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఎలాంటి నేరాలు జరగనటువంటి ప్రశాంతమైన ప్రాంతంలో ఓ సీరియల్ కిల్లర్ ఉంటే అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది. గ్రామ డిటెక్టివ్‌గా పనిచేస్తున్న ఉజ్వలన్ (ధ్యాన్ శ్రీనివాసన్) ఆ సీరియల్ కిల్లర్‌ను ఎలా కనిపెడితాడు..? అతన్ని పట్టించేందుకు పోలీసులకు ఎలాంటి సాయం చేశాడు..? ఆ సీరియల్ కిల్లర్ చేసిన హత్యలు ఏంటి..? వంటి అంశాలు ఈ చిత్రంలో ఆసక్తిగా తెరకెక్కించారు. -
ఆసక్తికర వెబ్ సిరీస్ వాయిదా.. కొత్త స్ట్రీమింగ్ ఇదే!
గతంలో ఓటీటీ ప్రియులను ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్. 2020 మార్చిలో తొలి సీజన్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 1.5 పేరుతో ఓ నాలుగు ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తున్నారు. ఇటీవలే స్పెషల్ ఓపీఎస్ సీజన్-2 ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ప్రకటించారు. జూలై 11 నుంచే స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.అయితే తాజాగా మేకర్స్ స్పెషల్ ఓపీఎస్-2 వెబ్ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేశారు. ఈ నెల 18 నుంచి వెబ్ సిరీస్ అందుబాటులోకి వస్తుందని మేకర్స్ వీడియో ద్వారా తెలిపారు. కొన్నిసార్లు అన్ని మనచేతుల్లో ఉండవని అందుకే వాయిదా వేయాల్సి వచ్చిందని నటుడు కేకే మేనన్ పేర్కొన్నారు. మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదని ఆడియన్స్‌ను కోరారు. ఈ సారి అన్ని ఎపిసోడ్స్ ఓకేసారి స్ట్రీమింగ్ చేస్తామని తెలిపారు.కాగా.. ఈ వెబ్ సిరీస్‌లో కేకే మేనన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త కీలక పాత్రలు పోషించారు. స్పై యాక్షన్ జోనర్లో వచ్చిన ఈ సిరీస్ రెండో భాగానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ వ్యవహరించారు. హిమ్మత్ సింగ్, అతని టీమ్ ఈసారి.. 'ఏఐ', 'సైబర్ క్రైమ్' నుంచి భారత్‌కు ఎదురయ్యే సవాళ్లతో పోరాటం చేయనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ జూలై 18 నుంచి జియోహాట్‌స్టార్‌లో సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రెండో సీజన్లో సయామీఖేర్, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు.We understand you're on the edge of your seat, but thoda aur intezar and it’s going to be worth all the wait! #HotstarSpecials #SpecialOps2, all episodes streaming from July 18, only on #JioHotstar#SpecialOps2OnJioHotstar pic.twitter.com/ky15pZPgnh— JioHotstar (@JioHotstar) July 8, 2025 -
ఓటీటీలోకి ముగ్గురు హీరోల మాస్ డ్రామా ‘భైరవం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు యువ హీరోలు కలిసి నటించిన చిత్రం భైరవం(Bhairavam). విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తమిళ బ్లాక్ బస్టర్ 'గరుడన్’ తెలుగు రీమేకే ఈ భైరవం. ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని మార్పులు చేసి ఈ ఏడాది మే 30న థియేటర్స్‌లో విడుదల చేయగా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. జులై 18 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 సంస్త అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ని విడుదల చేసింది.భైరవం కథేంటంటే..తూర్పు గోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి(మనోజ్), వరద(నారా రోహిత్),శీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ(జయసుధ) మరణించడంతో అనుకోకుండా ఆ ఆలయ ధర్మకర్త బాధ్యతలు శీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వెదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలను దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు.మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ(ఆనంది) ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శీను ఎలా రక్షించాడు. గజపతి గురించి శీనుకు తెలిసిన నిజం ఏంటి? మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి. అమ్మవారి పూనకం వచ్చే శీను.. న్యాయం కోసం చివరకు ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రానికి హరి కె వేదాంతం సినిమాటోగ్రఫర్‌గా, శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా పని చేశారు.Powerful. Intense. A story that leaves you with an afterthought - BHAIRAVAM Get ready for a high voltage thrillerPremieres 18th Jul@BSaiSreenivas @HeroManoj1 @IamRohithNara @DirVijayK @AditiShankarofl @anandhiactress @DivyaPillaioffl @KKRadhamohan @dophari @satyarshi4u pic.twitter.com/3i6s0aKJKI— ZEE5 Telugu (@ZEE5Telugu) July 8, 2025 -
ఓటీటీలో 'శారీ' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
ఆర్జీవీ డెన్ నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘శారీ’(Saaree Movie ) సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీలో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, 'ఆహా'లో కూడా ఈ చిత్రం విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటన వచ్చేసింది. జుల్లై 11 నుంచి ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ ఉవుతుందని ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆరాధ్య దేవి, సత్య యాదు జంటగా నటించారు.కథ ఏంటి..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ. -
సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఐదో సీజన్.. మేకర్స్ అఫీషియల్ ప్రకటన
ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌ల్లో పంచాయత్ ముందు వరుసలో ఉంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సిరీస్‌కు ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇటీవలే నాలుగో సీజన్ విడుదలై అభిమానులను అలరించింది. దీంతో మేకర్స్ మరో సీజన్‌కు రెడీ అయిపోయారు. త్వరలోనే మీ ముందుకు వస్తామంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాదిలో పంచాయత్ ఐదో సీజన్ రానుందని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ ప్రైమ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. 2026లో మీ ముందుకొస్తామని మేకర్స్ వెల్లడించారు.జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘువీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు దీపిక్ కుమార్ మిశ్రా, అక్షత్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2020లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2022, 2024లో రెండు, మూడు సీజన్లు వచ్చాయి. ఇటీవలే నాలుగో సీజన్ కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇది కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.Hi 5 👋 Phulera wapas aane ki taiyyaari shuru kar lijiye 😌#PanchayatOnPrime, New Season, Coming Soon@TheViralFever @StephenPoppins #ChandanKumar @Akshatspyro @uncle_sherry @vijaykoshy @Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77 @Sanvikka #DurgeshKumar… pic.twitter.com/59R6Xvj3R1— prime video IN (@PrimeVideoIN) July 7, 2025 -
ఓటీటీలో '8 వసంతాలు'.. నెలలోనే స్ట్రీమింగ్
అందమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం '8 వసంతాలు'.. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. అయితే, తాజాగా ఓటీటీ విడుదలపై ప్రకటన వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఒక వర్గం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీలో హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ మూవీ ఫణింద్ర(Phanindra Narsetti) దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.8 వసంతాలు చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. జులై 11న స్ట్రీమింగ్కు రానున్నట్లు అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. రొమాంటిక్ డ్రామా మూవీకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. '8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ వీకెండ్లో చూడతగిని చిత్రమేనని చెప్పొచ్చు.కథ ఏంటి..?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ. -
థియేటర్లో చిన్న చిత్రాలు.. ఓటీటీలో 26 సినిమాలు/ సిరీస్‌లు
జూలై మొదటివారంలో నితిన్ తమ్ముడు సినిమా రిలీజైంది. దీనికి పోటీగా పెద్ద సినిమాలేవీ లేవు. అయినా ఈ అవకాశాన్ని నితిన్ మిస్ చేసుకున్నాడు. తమ్ముడు కథలో బలం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ దిశగా సాగిపోతోంది. మరోవైపు పెద్ద సినిమాలన్నీ వాయిదా దిశగా వెళ్తుండటంతో ఈ వారం చిన్న సినిమాలు థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అటు ఓటీటీలోనూ కొత్త కంటెంట్ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయింది. మరి అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో చూసేద్దాం..థియేటర్ రిలీజయ్యే చిత్రాలుఓ భామ అయ్యో రామా - జూలై 11వర్జిన్ బాయ్స్ - జూలై 11ద 100 - జూలై 11మాలిక్ (బాలీవుడ్ మూవీ) - జూలై 11సూపర్ మ్యాన్ (హాలీవుడ్) - జూలై 11ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్లుజియో హాట్స్టార్మూన్ వాక్ - జూలై 8రీఫార్మ్‌డ్ - జూలై 9స్పెషల్ ఓపీఎస్ (వెబ్ సిరీస్, రెండో సీజన్) - జూలై 11ద రియల్ హౌస్‌వైఫ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ (సీజన్ 9) - జూలై 11బరీడ్ ఇన్ ద బ్యాక్‌యార్డ్ (సీజన్ 6) - జూలై 13నెట్ఫ్లిక్స్ట్రైన్వ్రెక్: ద రియల్ ప్రాజెక్ట్ ఎక్స్ - జూలై 8జియామ్ - జూలై 9అండర్ ఎ డార్క్ సన్ (వెబ్ సిరీస్) - జూలై 9సెవెన్ బియర్స్ (యానిమేషన్ సిరీస్) - జూలై 10టూమచ్ - జూలై 10బ్రిక్ - జూలై 10ఎ బ్రదర్ అండ్ 7 సిబ్లింగ్స్ - జూలై 10ఆప్ జైసే కోయ్ - జూలై 11మడియాస్ డెస్టినేషన్ వెడ్డింగ్ - జూలై 11ఎమోస్ట్ కాప్స్ - జూలై 11అమెజాన్ ప్రైమ్ వీడియోబల్లార్డ్ (వెబ్ సిరీస్)- జూలై 9సోనీలివ్నరివెట్ట - జూలై 11సన్నెక్స్ట్కలియుగం - జూలై 11మనోరమ మాక్స్మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్ - జూలై 11ఆపిల్ టీవీ ప్లస్ఫౌండేషన్ (సీజన్ ) - జూలై 11లయన్స్‌గేట్ ప్లేఫోర్ ఇయర్స్ లేటర్ - జూలై 11జాస్ @ 50: ద డెఫినిటివ్ ఇన్సైడ్ స్టోరీ (డాక్యుమెంటరీ)- జూలై 11మిస్టర్ రాణి - జూలై 11ద సైలెంట్ అవర్ - జూలై 11బుక్ మై షోగుడ్ వన్ (హాలీవుడ్) - జూలై 8పాల్ అండ్ పాలెట్ టేక్ ఎ బాత్ - జూలై 11చదవండి: నాలుగో భార్య వచ్చిన వేళావిశేషం.. లాటరీ గెలిచిన నటుడు -
ఓటీటీలోకి హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.. ‘క్లీనర్’ కథేంటి?
ఊహించని, ఊహకందని విషయాలను మనం చూడగలిగేది వెండితెర మీదే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సన్నివేశాలతో ప్రేక్షకులను రక్తి కట్టించే దర్శకుల ఊహ మాత్రం ఎవరి ఊహకూ అందనిది. అటువంటి ఊహతోనే అల్లుకున్న కథ ఈ క్లీనర్ సినిమా. ఈ కథ లైన్ ఎంత చిన్నది గా ఉంటుందో కథ నడిచే తీరు మాత్రం అందనంత ఎత్తులో ఉంటుంది. గంటన్నర నిడివితో ఉన్న సినిమా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. అంతలా ఏముందీ కథలో ఓ సారి చూద్దాం. జోయే తన తమ్ముడు మైఖేల్ తో లండన్ లో ఓ అపార్ట్ మెంట్లో ఉంటుంది. మైఖేల్ ఆటిజమ్ వ్యాధి బారిన పడ్డ స్పెషల్ ఛైల్డ్, కాని మంచి టాలెంటెడ్ కిడ్. జోయే ఆర్మీలో పని చేసిన అమ్మాయి ఇప్పుడు మాత్రం పోషణ కోసం ఆగ్నియన్ యనర్జీ సంస్థ కి సంబంధించన బిల్డింగ్ లో క్లీనర్ గా చేస్తుంటుంది. ఓ రోజు ఆ బిల్డింగ్ లో పెద్ద పార్టీ జరుగుతుంది. దాని కోసంగా వంద అంతస్తుల బిల్డింగ్ లోని పై ఫ్లోర్ అద్దాలు క్లీన్ చేయాలని జోయేకు టాస్క్ ఇస్తాడు మేనేజర్. తను ఆ పని చేస్తున్నపుడు తన తమ్ముడిని ఓ సూపర్ వైజర్ దగ్గర వదిలి పెట్టి జోయో గాల్లో వేలాడుతూ అద్దాలను క్లీన్ చేస్తుంటుంది. ఇంతలో బిల్డింగ్ లోకి కొందరు దుండగులు పెద్ద బాంబులు, తుపాకీలతో చొరబడి పార్టీలో ఉన్న విఐపీలనందరినీ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. జోయే అద్దాలను క్లీన్ చేస్తూనే ఇదంతా గమనిస్తూ తన తమ్ముడి గురించి బెంగపడుతుంది. జోయే గాల్లోనుండి బిల్డింగులోకి రావాలన్నా సూపర్ వైజర్ తన రోప్ ని ఆపరేట్ చేయాలి. కాని దుండగులు ఆ సూపర్ వైజర్ ని చంపేసుంటారు. మరి జోయే అక్కడి నుండి బయటపడి తనను తనతో పాటు తన తమ్ముడిని రక్షించుకోగలదా అన్నదే సినిమా. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. ముఖ్యంగా ఈ సినిమాలో జోయే చేసే స్టంట్స్ ఒళ్ళు గగుర్పొడిస్తాయి. అంతేకాదు కథలో చాలా ట్విస్టులతో నడుస్తూ ప్రేక్షకుడి మతి పోగొడుతుంది. ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా ఈ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ఈ వీకెండ్ కి మంచి టైంపాస్ మూవీ. ఎంజాయ్ ది క్లీనింగ్ డన్ బై జోయే. -
ఓటీటీలో 'అభిషేక్ బచ్చన్' కొత్త సినిమా రివ్యూ
టైటిల్ : కాళిధర్ లపతానటీనటులు: అభిషేక్ బచ్చన్, దైవిక్ భగేలా, జీషన్ అయూబ్, నిమ్రత్ కౌర్ఓటీటీ: జీ5దర్శకత్వం: మధుమితఇటీవల కొన్ని సినిమాలు ఎక్కువగా నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. చిన్న చిత్రాలు అయినా కంటెంట్ బాగుంటే ఓటీటీలో అదరగొట్టేస్తున్నాయి. ఇటీవల తెలుగులో 'ఉప్పు కప్పురంబు' డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేసింది. అదే రోజు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన మూవీ 'కాళిధర్ లపతా' సైతం ఓటీటీలోనే విడుదలైంది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కథ ఆధారంగా వచ్చిన చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. తమిళ చిత్రం 'కె.డి. ఎ. కరుప్పు దురై' సినిమాకు ఇది రీమేక్.కాళిధర్(అభిషేక్ బచ్చన్)ను మతిస్థిమితం లేని వ్యక్తి. ఇద్దరు తమ్ముళ్లు, ఒక సోదరితో కలిసి నివసిస్తూ ఉంటాడు. జ్ఞాపకశక్తి లోపంతో బాధపడుతున్న అతని వైద్య ఖర్ఛులు భరించలేక కుటుంబం వదిలించుకోవాలనుకుంటుంది. కంభమేళాలో వదిలించుకోవాలని తోబుట్టువులు ప్లాన్ చేస్తున్నారన్న విషయం అతనికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే అసలు కథ. కాళిధర్ (అభిషేక్ బచ్చన్)తోనే ఈ కథ ప్రారంభమవుతుంది. తన కుటుంబ సభ్యుల గురించి తెలుసుకున్న కాళిధర్ తానే దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఓ బస్సు ఎక్కి కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.ఓ గ్రామానికి చేరుకున్న కాళిధర్ అక్కడే ఉన్న ఆలయంలో రాత్రి నిద్రపోతాడు. అక్కడే అతనికి ఎనిమిదేళ్ల బాలుడు బల్లుతో(దైవిక్ భగేలా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత అతని జీవితం మలుపు తిరుగుతుంది. వీరిద్దరు వయస్సుతో సంబంధం లేకుండా స్నేహితులుగా ఉంటారు. అయితే కాళిధర్కు మతిస్థిమితం లేదని తెలుసుకున్న బల్లు.. అతన్ని ఇబ్బంది పెడుతుంటాడు. కాళిధర్ను కేడీ అని పిలుస్తూ ఆటపట్టిస్తుంటాడు. అలా వీరిద్దరు అనాథలే కావడంతో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ఈ కథ మొత్తం మధ్యప్రదేశ్‌లో గ్రామాల్లోనే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఇద్దరి పరిచయం, గ్రామాల్లో తిరగడం చుట్టే ఉంటుంది. కథ నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది.ఓ సారీ కేడీ(కాళిధర్) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు బల్లు వ్యవహరించిన తీరు ఆడియన్స్‌ను ఆలోచింపజేస్తుంది. ఎనిమిదేళ్ల పిల్లాడు మాట్లాడిన తీరు ఆడియన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మన కోణంలో చూస్తే వాస్తవానికి దూరంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కాళిధర్, బల్లు మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య భావోద్వేగ క్షణాలతో పాటు కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కుటుంబమే వద్దనుకున్న ఓ వ్యక్తి జీవితం ఎలా మలుపు తిరిగిందనే విషయాన్ని డైరెక్టర్ ఎమోషనల్‌గా ఆడియన్స్‌కు చూపించారు. వదిలించుకోవాలని చూసిన వాళ్లు సైతం అతని కోసం గ్రామాల వెంట తిరగడం చూస్తే మానవీయ కోణంలోనూ సందేశమిచ్చారు మధుమిత. అయితే కొన్ని సీన్స్ చాలా లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలు వర్కవుట్ కాలేదు. ఓవరాల్‌గా చూస్తే ఓ ఇద్దరు అనాథల ఎమోషనల్ స్టోరీనే కాళిధర్ లపతా. స్నేహానికి వయస్సు అడ్డంకి కాదని మరో సందేశం కూడా ఇచ్చాడు.ఈ సినిమాలో మతిస్థిమితం లేని వ్యక్తిగా తనపాత్రలో అభిషేక్ బచ్చన్ అలరించాడు. అమాయకంగా కనిపిస్తూ తన పాత్రకు న్యాయం చేశాడు.ఎనిమిదేళ్ల బాలుడి పాత్రలో దైవిక్ భగేలా మెప్పించాడు. అభిషేక్ బచ్చన్‌తో పోటీపడి మరి నటించాడు. కాళిధర్ను ప్రేమించే అమ్మాయిగా.. నిమ్రత్ కౌర్ తన పాత్ర పరిధిలో అలరించింది. కాళిధర్ను కనుగొనే పాత్రలో మొహమ్మద్ జీషన్ అయూబ్ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించాడు. సాంకేతికత విషయానికొస్తేఅమిత్ ద్వివేది నేపథ్యం సంగీతం ఫర్వాలేదు. అమితోష్ నాగ్‌పాల్ స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. -
OTT: ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్’ సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం. మనిషి మనుగడకు నమ్మకమే పునాది. మనం నమ్మిన సిద్ధాంతమే మనల్ని నడిపిస్తుంది. కానీ ఆ నమ్మకం మూఢ నమ్మకం కాకూడదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో కూడా మూఢనమ్మకాల వల్ల చాలా చోట్ల జరగరానివి జరుగుతుండడం ఆందోళనకరం. మూఢనమ్మకం మూర్ఖత్వమేనని చెప్పేదే ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్’(Viraatapalem PC Meena Reporting) సిరీస్. జీ5 వేదికగా స్ట్రీమ్ అవుతోన్న ఈ సిరీస్ కథాంశమంతా దాదాపు మూఢనమ్మకాల మీదే కొనసాగుతుంది. అలాగే సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ రేపుతుందనడంలో సందేహం లేదు. ఇక కథాంశంలోకి వస్తే... 1980 సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెటూరులో జరిగిన కథే ఈ సిరీస్. ఆ ఊరిలో పెళ్ళైన మొదటిరాత్రే పెళ్ళికూతుళ్ళు రక్తపు వాంతులు చేసుకుని చనిపోతుంటారు. దాదాపు పది సంవత్సరాల నుండి ఇలానే ఊళ్ళో జరగడం చూసి ఊళ్ళోని జనాలు తమ ఊరికి పెద్ద శాపం తగిలిందనుకుని కుమిలి΄ోతుంటారు. అంతేకాదు... ఆ ఊళ్ళో పెళ్ళి చేసుకోవడానికి కూడా జంకుతుంటారు. ఇదే సమయంలో ఆ ఊరికి కానిస్టేబుల్ మీనా కొత్తగా ట్రాన్స్ఫరై వస్తుంది. ఇలా పెళ్ళి కూతుళ్ళు చనిపోవడం చూసి మీనా దీనిపై విచారణ ప్రారంభిస్తుంది. ఒక దశలో విచారణ ఏదీ కొలిక్కి రానందున తానే పెళ్ళి పీటలెక్కి విచారణను వేగవంతం చేస్తుంది. పెళ్ళి చేసుకోబోతున్న మీనా కూడా తాళి కట్టించుకున్న తరువాత రక్తపు వాంతులు చేసుకుంటుంది. ఆ తరువాత కథ అనుకోని మలుపులు తిరుగుతుంది. మరి... పెళ్ళి కూతురు అయిన మీనా ఈ కేసును సాల్వ్ చేయగలిగిందా? అసలు ఈ పెళ్ళి కూతుళ్ళు చని΄ోవడానికి కారణం ఆ ఊరికి పట్టిన శాపమేనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘విరాట΄ాలెం–పీసీ మీనా రి΄ోర్టింగ్’ సిరీస్ చూడాల్సిందే. చిన్న కథతో ఉత్కంఠ రేపే ΄ాయింట్‌తో ఊహకందని ట్విస్టులతో ప్రేక్షకుడిని ఉర్రూతలూగించే ఈ సిరీస్ చూడదగినదే. పిల్లలు లేకుండా పెద్దలు చూడగలిగే ఈ సిరీస్ వాచబుల్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీకి శ్రద్ధా శ్రీనాథ్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'కలియుగం-2064'. ఈ సినిమాకు ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే మే 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ఆర్కే ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ బ్యానర్లపై కేఎస్ రామకృష్ణ, కే రామ్ చరణ్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. జూలై 11 నుంచి సన్ నెక్ట్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 2064లో మనుషులు పరిస్థితి ఏంటనే కోణంలోనే ఈ సినిమాకు రూపొందించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి డాన్ విన్సెంట్ సంగీతమందించారు. When the world ends, who do you become?Hope, fear, and survival collide in a future gone dark.Kaliyugam — streaming from 11th July on SunNXT.#KaliyugamOnSunNXT #DystopianDrama #StreamingFromJuly11 #EdgeOfDarkness #Kaliyugam #NewOnSunNXT #FutureUnraveled #WatchItOnSunNXT… pic.twitter.com/DX64AIVYZf— SUN NXT (@sunnxt) July 4, 2025 -
నితిన్ తమ్ముడు మూవీ.. ఏ ఓటీటీకి రానుందంటే?
రాబిన్‌హుడ్ తర్వాత నితిన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందకొచ్చారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళే థియేటర్లలో విడుదలంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. అయితే తొలి రోజే ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.అయితే మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న తమ్ముడు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీలో రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేసే అవకాశముంది. ఈ సినిమాను హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వచ్చే రెస్పాన్స్ చూస్తే కాస్తా త్వరగానే ఓటీటీలోకి సందడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది. -
ఓటీటీకి వచ్చేసిన ఫీల్ గుడ్ మూవీ.. ఓకేసారి నాలుగింటిలో స్ట్రీమింగ్!
కోలీవుడ్ నటుడు సత్యరాజ్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మద్రాస్ మ్యాట్నీ. ఈ సినిమాకు కార్తికేయన్ మణి దర్శకత్వం వహించారు. జూన్ 6న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ సమర్పణలో మెడ్రాస్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.ఎలాంటి ప్రకటన లేకుండానే ఏకంగా నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 4 తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌తో పాటు సన్ నెక్స్ట్, టెంట్కొట్టా, సింప్లీ సౌత్ ఫ్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది ఈ సినిమా. మద్రాస్ మ్యాట్నీ చిత్రంలో మిడిల్ క్లాస్ లైఫ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ కథను యథార్థంగా తెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రానికి బాలా సారంగన్ సంగీతం అందించారు. Recent Tamil Feel Good Movie ❤️✨ #MadrasMatinee streaming from Tonight on PrimeVideo, Tentkotta, Sunnxt & SimplySouth 🍿!!@kaaliactor @keyanmk@Roshni_offl @gk_anand@cinemapayyan#OTT_Trackers pic.twitter.com/TlyWKLW4Xv— OTT Trackers (@OTT_Trackers) July 3, 2025 -
మహేష్, రాజమౌళి సినిమా ఆ ఓటీటీలోనే...రికార్డ్స్ బద్ధలయ్యాయిగా...
దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎమ్బి29(SSMB29) సినిమా ఇప్పుడు మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ సినీ వర్గాలను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని విక్రయించారంటూ వస్తున్న వార్తలు కూడా సంచలనంగా మారాయి. దీనికి కారణం చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ సినిమా ఓటీటీ హక్కుల ధర పలకడమే.ఇప్పటి దాకా ఓటీటీలో అత్యధిక ధర పలికిన చిత్రంగా రాజమౌళి, రామ్‌చరణ్,ఎన్టీయార్ల సినిమా ఆర్ఆర్ఆర్ నిలుస్తోంది. ఆ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్‌ల పుష్ప 2, లోకేష్ కనగరాజ్ హీరో విజయ్‌ల తమిళ చిత్రం లియో, అట్లీ, షారూఖ్ఖాన్ల హిందీ చిత్రం జవాన్, ప్రశాంత్ నీల్, ప్రభాస్‌ల సలార్, ఓంరౌత్, ప్రభాస్‌ల ఆదిపురుష్, సిద్ధార్ధ్ ఆనంద్, షారూఖ్ ల పఠాన్ చిత్రాలు నిలుస్తున్నాయి ఇవన్నీ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మధ్య చెల్లించి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు స్వంతం చేసుకున్నట్టు సమాచారం. వీటిలో ఆదిపురుష్, పఠాన్, పుష్ప2 తప్ప మిగిలినవన్నీ నెట్‌ఫ్లిక్స్ ఖాతాలోనే పడ్డాయి. తద్వారా భారతీయ సినిమాలకు అత్యధిక రేట్లకు కొనుగోలు చేయడంలో ఎవరికీ అందనంత స్థాయిలో నెట్‌ఫ్లిక్స్ దూసుకుపోతోంది.అదే క్రమంలో మరోసారి తన సత్తా చాటిన నెట్‌ఫ్లిక్స్ ఎస్ఎస్ఎమ్బి 29 హక్కుల్ని కూడా దక్కించుకుందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మరే చిత్రానికి పెట్టనంత ధరను చెల్లించి ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. తద్వారా ఇది భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద నాన్–థియేట్రికల్ డీల్స్‌గా నిలుస్తోందని సమాచారం.రాజమౌళి మునుపటి చిత్రం ఆర్ఆర్ఆర్ సైతం నెట్‌ఫ్లిక్స్‌లోనే ఆ సినిమాను కూడా భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్ ప్రారంభంలోనే అద్భుతమైన వీక్షక విజయం అందుకుంది, అంతేకాక ఆ సినిమా పాట ఆస్కార్ అందుకోవడంతో నెట్‌ఫ్లిక్స్‌కు మరోసారి కాసుల పంట పండింది. ఆ అవార్డ్ ద్వారా వచ్చిన ప్రపంచవ్యాప్త గుర్తింపుతో ఓటీటీలో ఆ సినిమాకు వీక్షకులు వెల్లువెత్తారు. దాందో ఆర్ఆర్ఆర్కి భారీ ధర చెల్లించినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ భారీ లాభాలను ఆర్జించడానికి ఇదో కారణం.ఈ నేపధ్యంలో రాజమౌళి చిత్రాలపై గురి కుదిరిన నెట్‌ఫ్లిక్స్ చాలా ముందస్తుగానే ఓటీటీ హక్కులపై కన్నేసింది. అపజయాలు అంతే తెలియని దర్శకుడు రూపొందిస్తున్న ఎస్ఎస్ఎమ్బి 29 చిత్రంలో ప్రియాంక చోప్రా వంటి ఇంటర్నేషనల్ స్టార్ ఉండడం అంతర్జాతీయ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే అంశమే. అందుకే ఈ చిత్రం అత్యంత భారీ ధర పలికింది అనుకోవచ్చు. వచ్చే 2027లో విడుదల కానున్న ఈ భారీ చిత్రం ఇంకెన్నో సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. -
ఓటీటీలో 'నార్నే నితిన్' ఫస్ట్ సినిమా స్ట్రీమింగ్
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) నటించిన మొదటి సినిమా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru) ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసింది. వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న నార్నే నితిన్.. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో గుర్తింపు పొందాడు. అయితే, ఈ చిత్రాల కంటే ముందుగా ఆయన నటించిన చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'. ఈ ఏడాది జూన్ 6న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో సంపద హీరోయిన్గా నటించగా చింతపల్లి రామారావు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలు.'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మూవీ ఆహా(Aha) తెలుగులో సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆపై అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే జులై 4న ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2022లో ప్రారంభం అయిన ఈ మూవీ పలు కారణాల వల్ల విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. ఈ చిత్రానికి సతీశ్ వేగేశ్న(Satish Vegesna) దర్శకత్వం వహించారు. గతంలో ఆయన 'శతమానం భవతి' వంటి విజయవంతమైన సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఈ చిత్రం మెప్పించలేదు. నార్నే నితిన్ మొదటి సినిమా కావడంతో ఓపెనింగ్స్ కాస్త పర్వాలేదనిపించాయి.కథేంటంటే..మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. గోదావరి జిల్లా ఆత్రేయపురంలో ఈ కథ ప్రారంభం అవుతుంది. ఆ ఊరిలో సుబ్బరాజు (నరేశ్ వీకే), కృష్ణమూర్తి (రావు రమేశ్) మంచి స్నేహితులు. అయితే, పుట్టుకతోనే చలనం లేకుండా జన్మించిన జన్మించిన రాజా (నార్నే నితిన్) సిగరెట్ పొగతో ఊపిరి పోసుకుంటాడు. చనిపోయాడు అనుకున్న కుమారుడిలో తిరిగి చలనం కనిపించడంతో సుబ్బరాజు (నరేశ్ వీకే) చాలా సంతోషిస్తాడు. అయితే, తన కుమారుడు పెరిగే కొద్ది సిగరెట్‌కు బానిస కావడం తండ్రిగా సహించలేడు. రాజాకు ఉన్న సిగరెట్ అలవాటుతో అతన్ని ఊరి వాళ్లు అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు.కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) అంటే రాజాకి చాలా ఇష్టం. ఇద్దరూ ఒకరినిఒకరు విడిచిపెట్టలేనంత ప్రేమలో ఉంటారు. కానీ, ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. జులాయిగా తిరుగుతున్న రాజాకు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడం కృష్ణమూర్తికి ఇష్టం ఉండదు. కానీ, కూతురి కోసం పెళ్లికి ఓకే చెబుతాడు. అయితే, నిశ్చితార్థం నాడు రాజా చేసిన ఒక పొరపాటు వల్ల అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. దీంతో వారిద్దరి పెళ్లి ఆగిపోతుంది. ఆపై స్నేహితులుగా ఉన్న వారి తండ్రుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణమూర్తికి సుబ్బరాజు ఒక ఛాలెంజ్ ఇసురుతాడు. ఈ సవాల్లో తాను గెలిస్తే నిత్యను రాజాకి ఇచ్చి పెళ్లి చేయాలని కోరతాడు. అందుకు కృష్ణమూర్తి కూడా రెడీ అంటాడు. అయితే, ఫైనల్‌గా రాజా గెలుస్తాడా..? తను ప్రేమించిన నిత్యను పెళ్లి చేసుకుంటాడా..? ఛాలెంజ్ కోసం సిగరెట్ ఆపేస్తాడా..? నిశ్చతార్థంలో జరిగిన గొడవకు కారణం ఏంటి..? వంటి అంశాలు తెలియాలంటే శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా చూడాల్సిందే. -
'ఉప్పు కప్పురంబు' మూవీ రివ్యూ.. డిఫరెంట్ పాత్రలో కీర్తి సురేశ్
టైటిల్ : ఉప్పు కప్పురంబునటీనటులు: కీర్తి సురేశ్, సుహాస్, బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరినిర్మాణ సంస్థ: అమెజాన్ ప్రైమ్నిర్మాత: రాధిక లావుకథ: వసంత్ మురళీకృష్ణ దర్శకత్వం: ఐవీ శశివిడుదల తేది: జులై 4, 2025స్ట్రీమింగ్: అమెజాన్జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్(Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu). జులై 4న డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. నటుడు సుహాస్ కీలక పాత్ర పోషించారు. సెటైరికల్ కామెడీ డ్రామాగా దర్శకులు ఐవీ శశి రూపొందించగా.. రాధికా ఎల్ నిర్మించారు. ఈ చిత్రానికి వసంత్ మురళీకృష్ణ కథని అందించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఒక గ్రామంలో శ్మశాన వాటిక కోసం ఏర్పడిన సంక్షోభాన్ని.. అక్కడి ప్రజలు ఏవిధంగా పరిష్కరించుకుంటారనే కథనంతో ఈ సినిమా సిద్ధమైంది. 1990 నాటి బ్యాక్డ్రాస్ స్టోరీతో వచ్చిన ఉప్పు కప్పురంబు సినిమా ఎలా ఉంది తెలుసుకుందాం.కథేంటంటే..‘ఉప్పు కప్పురంబు’ సినిమాకు కథను పరిచయం చేస్తూ హీరో రానా వాయిస్ ఇచ్చారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ' చిట్టి జయపురం' అనే గ్రామానికి పెద్దగా (సుబ్బరాజు) శుభలేఖ సుధాకర్ ఉంటారు. అయితే, ఆయన మరణించడంతో అతని కుమార్తె అపూర్వ (కీర్తి సురేష్) గ్రామ పెద్దగా కొనసాగుతుంది. వయసులో చిన్నపిల్ల అయిన అపూర్య గ్రామ పెద్ద ఏంటి..? అంటూ భద్రయ్య (బాబు మోహన్), మధు (శత్రు) తీవ్రంగా వ్యతిరేఖిస్తారు. అయితే, ఇక్కడ వారిద్దరు కూడా ఒకరిపైమరోకరు ఆధిపత్యం కోసం పోరాడుతూనే అపూర్వను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అలా వారు రెండు వర్గాలుగా విడిపోయి ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. గ్రామ పెద్దగా ఉన్న అపూర్వకు ఒక సమస్య వచ్చి పడుతుంది.గ్రామంలో ఎవరు మరణించినా వారి ఆచారం ప్రకారం ఉత్తరాన మాత్రమే పాతిపెట్టడం ఆనవాయితీగా ఉంది. చాలా ఏళ్ల నుంచి వారు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఆ స్మశానం నిండిపోయిందని అక్కడి కాపరిగా ఉండే చిన్న (సుహాస్) తెలుపుతాడు. అయితే, నలుగురికి మాత్రమే అక్కడ చోటు ఉందని చిన్న చెబుతాడు. ఈ సమస్యను పరిష్కరించాలని అపూర్వను కోరుతాడు. గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ నలుగురిని లాటరీ పద్ధతి ద్వారా అపూర్వ ఎంపిక చేస్తుంది. అయితే, సడెన్‌గా జరిగిన ఒక ప్రమాదంలో అదేరోజు మరో నలుగురు మరణిస్తారు. తప్పని పరిస్థితిలో వారిని అక్కడ పాతిపెట్టాక శ్మశానం హౌస్‌ఫుల్ అని బోర్డు పెట్టేస్తారు. అయితే, ఆ శ్మాశనంలో ఇంకోకరికి చోటు ఉంటుంది. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా చిన్న దాచిపెడుతాడు. అలా అతను ఎందుకు చేశాడు..? గ్రామానికి తూర్పు దిక్కున మాత్రమే శ్మశానం ఎందుకు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు..? శ్మశాన కాపరిగా ఉన్న చిన్న చేసిన మోసం వల్ల అపూర్వకు ఎదురైన చిక్కులు ఏంటి..? ఫైనల్‌గా అపూర్వ కనుగొన్న పరిష్కారం ఏంటి..? అనేది తెలియాలంటే ఉప్పు కప్పురంబు సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. 1990 కాలం నాటి ప్రజలు శ్మశానంలో ఆరు అడుగుల స్థలం కోసం ఎలాంటి ఇబ్బందులు పడేవారో ఈ చిత్రంతో దర్శకుడు ఐవీ శశి చక్కగా చూపారు. ఆ రోజులకు తగ్గట్టుగానే పాత్రలను డిజైన్ చేయడమే కాకుండా కథను కూడా కాలానికి అనుగునంగా రాసుకున్నాడు. దీంతో ఓటీటీ ప్రియులకు మంచి వినోదాన్ని ఈ చిత్రం ఇస్తుంది. పరిశ్రమలోకి వచ్చే కొత్త రచయితలు, దర్శకులు ఇలా సరికొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను మెప్పించేలా మూవీ ఉంటుంది. ఇంత చిన్న పాయింట్‌తో కూడా సినిమా తీయొచ్చా..? అని మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న సమస్యల్లో ఒకటి శ్మశానం. ఆ పాయింట్‌కు కాస్త వినోదం జోడించి తెరపై చూపించడంలో దర్శకుడు ఐవీ శశి విజయం సాధించారు.ఇప్పటి వరకు కీర్తి సురేష్ గ్లామర్, డీ గ్లామర్ పాత్రలతో మెప్పించింది. అయితే ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన పాత్రలో అదరగొట్టింది. మంచి కామెడీ స్కోప్ ఉన్న పాత్రలో దుమ్మురేపింది. అపూర్వ ఊరి పెద్ద అయిన తర్వాత శ్మశానం సమస్య తెరపైకి వస్తుంది. ఏదో తాత్కాలికంగా దానిని తీర్చాం అనుకునేలోపు నలుగురు చనిపోతారు. దీంతో ఆ సమస్య మరింత తీవ్రం అవుతుంది. అలాంటి సమయంలో సుహాస్ ఒక ప్లాన్‌తో తెరపైకి వస్తాడు. ఇలా శ్మశానం చుట్టూ సమస్యలు వాటికి పరిష్కారాలు తెరపై దర్శకుడు చూపిస్తాడు. కీర్తి సురేశ్ గ్రామ పెద్దగా నటన బాగున్నప్పటికీ ఆమె పాత్రలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి ప్రేక్షకుడికి లాజికల్‌గా అనిపించవు. ఒక సీన్లో అమాయకంగా కనిపించిన కీర్తి.. మరో సీన్లో చాలా తెలివైన అమ్మాయిగా వ్యవహరిస్తుంది. ఇలాంటి సీన్స్ కాస్త తికమకకు గురిచేస్తాయి. కొన్ని సీన్లు మరీ ఓవర్ రియాక్ట్ అయ్యేలా ఉంటాయి. కానీ, ఆమె నటన మాత్రం అదిరిపోతుంది. సుహాస్ పాత్ర చాలా స్టేబుల్‌గానే ఉంటుంది. ఎక్కడా కూడా తడబాటు లేకుండా సెట్ చేశాడు. సినిమా మొత్తం ఎక్కువగా సుహాస్, కీర్తిల మధ్యే జరుగుతుంది. కథలో అక్కడక్కడ చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆలోచింపచేస్తుంది. మిమ్మల్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్తుంది. క్లైమాక్స్‌లో ఊరి సమస్యకు పరిష్కారం కనుగొన్న తీరు కాస్త ఎమోషనల్‌గా సీన్ రాసుకోవడం బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా ఓటీటీలో చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. ఇందులో కీర్తి సురేశ్ నటన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మెప్పిస్తుంది కూడా..ఎవరెలా చేశారంటే.. ఈ మూవీలో కీర్తి సురేష్ పాత్ర చాలా బలం. అందుకు తగ్గట్లుగానే ఆమె నటించింది. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలు అన్నీ కూడా చాలా రొటీన్‌గానే ఉంటాయి. కానీ అపూర్వ పాత్ర మాత్రం చాలా ప్రత్యేకంగా ఎప్పిటికీ నిలిచిపోతుంది. ఇందులో అమాయకంగా, క్యూట్‌గా, అల్లరి పిల్లగా, బాధ్యతగల గ్రామ పెద్దగా ఇలా పలు షేడ్స్ ఆమె నటనలో కనిపిస్తాయి. ఒక మంచి పాత్రే కీర్తికి పడింది అని చెప్పవచ్చు.కాటి కాపరి పాత్రలో సుహాస్ మెప్పించాడు. ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు.'నిజం' సినిమాలో మహేశ్‌బాబుకు అమ్మగా నటించిన తాళ్లూరి రామేశ్వరికి ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర పడింది. ఈ మూవీతో ఆమెకు మరిన్ని ఛాన్సులు రావచ్చని చెప్పొచ్చు. బాబు మోహన్, శత్రు తమ పాత్రల మేరకు మెప్పించారు. సంగీతం, సినిమాటోగ్రాఫర్ ఈ మూవీకి బలాన్ని చేకూర్చాయి. మూవీ నిర్మాణ విలువలు బడ్జెట్‌కు మించే ఉన్నాయని చెప్పవచ్చు. 'ఉప్పు కప్పురంబు' ఓటీటీలో ఎవరినీ నిరుత్సాహపరచని సినిమాగా తప్పకుండా మిగిలిపోతుంది. -
ఓటీటీలో పోటాపోటీగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని తెరకెక్కిన 'ది హంట్' వెబ్ సిరీస్ జులై 4న ఓటీటీలో విడుదల కానుంది. 'సోనీలివ్' (SonyLiv) వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ వర్షన్లో స్ట్రీమింగ్ కానుంది. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమిత్ సియాల్తో పాటు సాహిల్ వైద్, భగవతీ పెరుమాళ్ తదితరులు నటించారు. 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో నాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్ గాంధీ హతమయ్యారు. అయితే, ఈ హత్యకు వారి ఉద్దేశ్యం ఏంటి..? హత్య, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి అనే కోణాల్లో ఈ మూవీ ఉండనుంది.హీరోయిన్ కీర్తి సురేశ్(Keerthy Suresh)- హీరో సుహాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ 'ఉప్పు కప్పురంబు' (Uppu Kappurambu). ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. ఐవి శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎల్లనార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధికా లావు నిర్మించారు. సినిమా బండి ఫేమ్ వసంత్ కథ అందించారు. జులై 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.మణిరత్నం దర్శకత్వం వహించిన 'థగ్ లైఫ్' (Thug life) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా, శింబు, త్రిష, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జులై 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం,హిందీ మలయాళం, కన్నడలో ఉంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.నటి, దర్శకురాలు రేవతి తెరకెక్కించిన ‘గుడ్వైఫ్’ (Good Wife) వెబ్‌సిరీస్ జులై 4న విడుదల కానుంది. ఇందులో ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించారు. ఆమెకు భర్తగా సంపత్ రాజ్ నటించారు. 'జియో హాట్‌స్టార్' (Jio Hotstar) వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీలో స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ సిరీస్ 'ది గుడ్వైఫ్' ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను ఇండియాలో తెరకెక్కించారు. -
ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే?
కొన్ని సినిమాలు థియేటర్లలో మ్యాజిక్ చేద్దామనుకుంటాయి. తీరా కనీస ఆదరణ కూడా దక్కక బొక్కబోర్లా పడతాయి. థగ్ లైఫ్ సినిమా అలాంటి కోవకు చెందినదే! మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా, శింబు, త్రిష, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఓటీటీలో థగ్లైఫ్ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో రూ.90 కోట్లే ఇస్తామని పేచీ పెట్టింది. చివరకు చర్చల అనంతరం రూ.110 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు భోగట్టా. అంతేకాదు సినిమా రిలీజయ్యాక 8 వారాల తర్వాతే ఓటీటీలో ప్రసారం చేస్తామన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నారు. దాంతో నాలుగు వారాల్లోనే థగ్ లైఫ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా నేడ (జూలై 3) సడన్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో దర్శనమిచ్చింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.వివాదాలుథగ్ లైఫ్ రిలీజ్‌కు ముందు భారీ అంచనాలున్నాయి. ఎప్పుడైతే కర్ణాటకలో సినిమా ప్రమోషన్స్‌లో కమల్ హాసన్ నోరు జారారో అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో థగ్‌లైఫ్ కన్నడలో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ వ్యవహారం కోర్టుదాకా వెళ్లగా.. కర్ణాటకలో సినిమా రిలీజ్ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు.కానీ అప్పటికే థగ్‌లైఫ్ మిగతా చోట్ల రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. థగ్ లైఫ్ సినిమా రిలీజైన 8 వారాల తర్వాతే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఓటీటీతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ దాన్ని రద్దు చేయడం వల్ల మల్టీప్లెక్స్ థియేటర్లు.. థగ్‌లైఫ్ నిర్మాత కమల్ హాసన్‌పై రూ.25 లక్షల జరిమానా వేసినట్లు తెలుస్తోంది. Streaming now on NETFLIX #ThugLife pic.twitter.com/u3BxaX2Dfm— Christopher Kanagaraj (@Chrissuccess) July 2, 2025 చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు