breaking news
Medak
-
ఇళ్లు నిర్మించకుంటే రద్దు చేస్తాం
హౌసింగ్ పీడీ మాణిక్యంకౌడిపల్లి(నర్సాపూర్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే రద్దు చేస్తామని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. సోమవారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించి మాట్లాడారు. జిల్లాకు 9,209 ఇళ్లు మంజూరు కాగా, 57 పూర్తయ్యాయని తెలిపారు. 2,109 ఇళ్లు బేస్మెంట్ లెవల్, 1,042 రూప్ లెవల్, 1,432 స్లాబ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 2,922 మంది పనులు ప్రారంభించలేదన్నారు. జి ల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు ఇళ్లు ప్రారంభించని వారు లిస్టు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రద్దు అయిన వాటి స్థానంలో అర్హులైన కొత్తవారికి మంజూరు చేస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో రూ. 90 కోట్లకు పైగా ఇందిరమ్మ ఇళ్లకు వివిధ దశలలో బిల్లులు చెల్లించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఈలు సుష్మ, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
ఇసుకంతైనాసంగాయిగుట్ట తండా వద్ద హల్దీ వాగులో ఇసుక తీస్తున్న ఇటాచీ (ఫైల్)భయమేదీ?హల్దీ నుంచి వందలాది టిప్పర్లతో ఇసుక తరలింపుమెదక్ అర్బన్: ‘హల్దీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను పట్టుకుంటే.. తెల్లారి తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. ఇది ఓ ప్రధాన శాఖకు చెందిన అధికారి ఆందోళన’ జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు కొలువు దీరినప్పటికీ.. ఓ ప్రధాన అధికారి రెక్కలు కట్టుకొని కలియ దిరుగుతున్నప్పటికీ.. అక్కడ ఇసుక దోపిడీ ఆగడం లేదు. కూత వేటు దూరంలో ఉన్న సంగాయిగుట్ట తండా వద్ద హల్దీ వాగు నుంచి రెండు నెలలుగా వందలాది టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పెద్దల అండతో సాగుతు న్న దోపిడీని ఆపేందుకు ఏ అధికారి సాహసించడం లేదన్న ఆరోపణలున్నాయి. అక్రమార్కులు ఇస్తున్న మామూళ్లు కూడా, వారిని నోరు మెదపకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్లతో పెరిగిన డిమాండ్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇసుక మాఫియా కన్ను హల్దీ వాగుపై పడింది. మెదక్ మండలం జానకంపల్లి సమీపంలోని సంగాయిగు ట్ట తండా వద్ద హల్దీ వాగులో రెండు నెలల క్రితం ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. మొదట మెదక్‌లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరైన అభివృద్ధి పనుల కోసం 1,000 టన్నుల ఇసుక అవసరమని, మున్సిపల్ కమిషనర్ మెదక్ ఎమ్మార్వోకు లేఖ రాశారు. అయితే ఆ టెండర్లకు అప్పటికే లీడ్ ఇచ్చినందున, ఇసుక తీయొద్దని రెవెన్యూ అధికారులు బదులిచ్చారు. అయినా ఈ అవకాశాన్ని సాకుగా మలుచుకొన్న ఇసుక మాఫియా గత రెండు నెలలుగా సంగాయిగుట్ట వద్ద నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తీయడం ప్రారంభించారు. వందల కొద్ది టిప్పర్లలో మెదక్, పాపన్నపేట, జహీరాబాద్, కొల్చారం, కౌడిపల్లి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ. 20 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది కొనుగోలు చేస్తున్న దళారులు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర జిల్లాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. వారు ఆయా ప్రాంతాల్లో ఇసుక వ్యాపారులకు రూ. 1,300లకు టన్ను చొప్పున విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు రూ. కోట్లలో వ్యాపారం జరిగిందన్న ఆరోపణలున్నాయి. కాగా ఇటీవల బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సైతం ఆందోళన నిర్వహించి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒకటి, రెండు రోజుల ఇసుక రవాణా ఆగింది. తెల్లారి మళ్లీ మొదలైంది. ఈ విషయం రాష్ట్రస్థాయి అధికారుల వరకు వెళ్లడంతో ఆదివారం మైనింగ్ విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, పలు వాహనాలు సీజ్ చేశారు. ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు హె చ్చరించారు. -
గ్రామాల్లో ఐదేళ్లు పనిచేయాలి
● ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ● అసెంబ్లీలో ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సర్వీసులో ఐదారేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా నిబంధనలు విధించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ...పిల్లల చదువుల కోసం పట్టణాలు, నగరాల్లో, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుండటం, గ్రామీణప్రాంతాల్లో పనిచేస్తున్నా డిప్యూటేషన్‌పై వెళ్తుండటంతో గ్రామీణప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడంలేదన్నారు. విశ్వవిద్యాలయాలు పట్టణ ప్రాంతానికే పరిమితమవుతున్నాయన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల శాఖలను ఏర్పాటు చేయాలని కోరారు. నిజాంసాగర్ సమీపంలోని ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్‌ను పునరుద్ధరిస్తే ఖేడ్, జుక్కల్ నియోజకవర్గాలకు మేలు చేకూరుతుందని వివరించారు. హాస్టల్ బెడ్స్ అమ్మకం సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్‌కు సరఫరా అయిన బెడ్స్, మంచాలను అమ్ముకున్నట్లు సంజీవరెడ్డి అసెంబ్లీలో సభ దృష్టికి తీసుకొవచ్చారు. ఈ హాస్టల్ వార్డెన్ 8 ఏళ్లుగా లాంగ్స్టాండింగ్గా ఉండటం, పిల్లలకు సక్రమంగా భోజనం పెట్టడంలేదని పిల్లలు చెప్పారన్నారు. -
గ్రామాభివృద్ధికి కృషి చేయండి
మెదక్‌జోన్: నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నూతన సర్పంచ్ల సమక్షంలో జిల్లా సర్పంచ్ల ఫోరం కమిటీని ఎన్నుకున్నారు. అ ధ్యక్షుడిగా ఆవుల గోపాల్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌యాదవ్ నియామకపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో నమ్మకంతో ప్రజలు పదవులు కట్టబెట్టారని, ప్రభుత్వం మంజూరు చేసే సంక్షమ పథకాలు ప్రతి గడపకు చేరేలా కృషి చేయాలన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు ప్రతి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరా వు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసినిరెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్, నాయకులు మహిపాల్‌రెడ్డి, సుప్రభాతరావు, రమేశ్‌రెడ్డి ,శ్రీనివాస్‌రెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు -
ఆర్వోబీ నిర్మాణానికి సహకరించాలి
ఆర్డీఓ జయచంద్రారెడ్డి చేగుంట(తూప్రాన్): రేల్వేగేటు వద్ద ఆర్వోబీ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు దారి మళ్లింపు కోసం ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు సహకరించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. సోమవారం వడియారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వడియారం శివారులోని అండర్ బ్రిడ్జి నుంచి మె దక్ రోడ్డు పోలీస్‌స్టేషన్ వరకు ద్విచక్ర వాహనాలు, ఆటోల రాకపోకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర భారీ వాహనాలకు నార్సింగి మీదుగా శంకరంపేటకు వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెద్ద పెద్ద కంటైనర్లు నర్సాపూర్ మీదుగా మెదక్ వైపునకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందరి సహకారం ఉంటేనే ఆర్వోబీ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం వడియారం శివారులోని అండర్ బ్రిడ్జిని అధికారులు పరిశీలించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ వేణు, రైల్వే ఇంజినీర్లు సమీర్‌కుమార్, జగదీశ్‌బాబు, సర్పంచ్‌లు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
సత్వరమే పరిష్కరించాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. డీఆర్ఓ భుజంగరావు, డీఆర్డీఓ శ్రీనివాస్, జెడ్పీసీఓ ఎల్లయ్యతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈమేరకు భూ సంబంధిత సమస్యలపై 32, పెన్షన్ 10, ఇందిరమ్మ ఇళ్లు 2, ఇతర సమస్యలు 18 కలిపి మొత్తం 64 వినతులు వచ్చాయి. కాగా గతంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్‌రాజ్ పాల్గొని అర్జీలు స్వీకరించేవారు. దీంతో జిల్లాస్థాయి అధికారులంతా పాల్గొనేవారు. సోమవారం రేగోడ్ మండల కేంద్రంలో జరిగిన ప్రజావాణికి కలెక్టర్ హాజరయ్యారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు కనిపించక పోవడం గమనార్హం. రోడ్డు నిబంధనలు తప్పనిసరి మెదక్‌జోన్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు తప్పనిసరి ధరించాలని, అలాగే కార్లు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని ఎంవీఐ విజయలక్ష్మి సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభు త్వం ప్రవేశపెట్టే నిబంధనలు వాహనదారుల రక్షణ కోసమనే విషయాలు ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖా పరమైన చర్యలు తప్పవని హె చ్చరించారు. కార్యక్రమంలో ఇతర అధికారులు శ్రీలేఖ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యాసంగికి సరిపడా యూరియా: ఏడీఏ కౌడిపల్లి(నర్సాపూర్): యాసంగికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు అందోళన చెందవద్దని ఏడీఏ పుణ్యవతి అన్నారు. సోమవారం మండలంలోని మహమ్మద్‌నగర్ గేట్ వద్ద గల పీఏసీఎస్, కౌడిపల్లిలోని డీసీఎంఎస్ ఎరువుల దుకాణంలో యూరియా స్టాక్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాసంగి పంటల అంచనా మేరకు ప్రభుత్వం యూరియా సరఫరా చేస్తుందన్నారు. రైతులు అనవసరంగా ఆందోళన చెందుతూ ముందుగానే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ–పాస్ మిషన్ ద్వారా యూరియా విక్రయించాలని డీలర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న, పీఏసీఎస్ సీఈఓ దుర్గాగౌడ్, రైతులు పాల్గొన్నారు. సమయపాలన పాటించాలి డీఎంహెచ్ఓ శ్రీరాం నర్సాపూర్: పీహెచ్సీలలో పని చేసే వైద్యులతో పాటు ఇతర సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్ఓ శ్రీరాం ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఏరియా ఆస్పత్రిలో నర్సాపూర్ వైద్యశాఖ సబ్ డివిజన్ పరిధిలోని రెడ్డిపల్లి, కౌడిపల్లి, శివ్వంపేట, రంగంపేట, కొల్చారం పీహెచ్‌సీల వైద్యులు, ఇతర సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అందరూ సమయపాలన పాటిస్తూ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. చలికాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సృజన, డీఐఓ డాక్టర్ మాధురి, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు రఘువరన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ కార్యాలయం సందర్శన రామాయంపేట(మెదక్): మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎంపీపీ కార్యాలయంలో స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. ఈమేరకు ఆయన మున్సిపల్ కమిషనర్ దేవేందర్, తహసీల్దార్ రజనితో కలిసి ఎంపీపీ కార్యాలయాన్ని సందర్శించారు. కౌంటింగ్‌కు సంబంధించి నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఆయన వెంట టౌన్ ప్లానింగ్ అధికారి దేవరాజు, మున్సిపల్ మేనేజర్ రఘువరన్ ఇతర అధికారులు ఉన్నారు. -
పుర పోరు.. కసరత్తు జోరు
ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదలరిజర్వేషన్లపై ఉత్కంఠ..! తప్పుల తడకగా జాబితామున్సిపాలిటీల్లో ఇటీవల అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా, వాటిలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని వెంటనే సరి చేసి ఫైనల్ ఓటర్ లిస్టును వార్డుల్లో ప్రదర్శించాలని బీఆర్ఎస్ నేతలు ఇటీవల మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే వార్డులో ఓటు హక్కు ఉండాల్సి ఉండగా, కొన్ని వార్డుల్లో ఒకే కుటుంబీకుల ఓట్లు రెండు, మూడు వార్డుల్లో ఉన్నాయని ఆరోపించారు. -
ప్రజావాణి మరింత బలోపేతం
కలెక్టర్ రాహుల్‌రాజ్ రేగోడ్(మెదక్): మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి నోడల్ అధికారులను నియమించి మరింత బలోపేతం చేస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన ప్రజావాణికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పలు సమస్యలపై మొత్తం 111 అర్జీలు వచ్చాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు దూరభారం, సమయాన్ని తగ్గించడం కోసమే మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దర ఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తామని, ఆయా దరఖాస్తులు ఏ అధికారి స్థాయిలో ఉన్నాయో తెలి పే సాంకేతికతను అందుబాటులోకి తెస్తామన్నారు. భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు, పోలీస్ పరిధిలో ఉన్న వాటిని సంబంధిత శాఖలకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సీతారావమ్మ, తహసీల్దార్ దత్తారెడ్డి, ఆర్ఐలు శరణప్ప, విజయలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ భవాని, ఏఓ రాంప్రసాద్, సర్పంచ్ పర్వీన్ సుల్తాన తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫొటోతో మాత్రమే ఫ్లెక్సీ ఏర్పాటుచేయడం, సీఎం, మంత్రుల ఫొటోలు లేకపోవటంతో ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. -
నేటి నుంచి పీఎంశ్రీ క్రీడలు
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలో మంగళవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు పీఎంశ్రీ క్రీడలు నిర్వహించనున్నట్లు డీఈఓ విజయ తెలిపారు. సోమవారం పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. క్రీడలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. పోటీల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, కేజీబీవీ, తెలంగాణ మోడల్ స్కూళ్ల నుంచి సుమారు 92 మంది వ్యాయామ ఉపాధ్యాయులను నియమించినట్లు చెప్పారు. జిల్లాలోని మొత్తం 29 పీఎం శ్రీ పాఠశాలల నుంచి ప్రతిరోజూ సుమారు 520 మంది బాల బాలికలు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. పోటీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. క్రీడాకారులకు భోజన వసతి కల్పించడంతో పాటు, గెలుపొందిన విజేతలకు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పీడీలు నాగరాజు, ప్రతాప్‌సింగ్, మాధవరెడ్డి, దాసరి మధు, రవి, అశోక్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.డీఈఓ విజయ -
నేరుగా సంప్రదించాలి
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎస్పీ శ్రీనివాసరావు హాజరై ఫిర్యాదులు స్వీకరించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను, వివాదాలను, పోలీస్ సంబంధిత ఇబ్బందులను ఎస్పీకి నేరుగా వివరించారు. పరిష్కరించాలని వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా సంప్రదించాలని సూచించారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రజావాణి ద్వారా పరిష్కారమైన అనేక కేసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని తెలిపారు. మైనార్టీల ఆర్థికాభివృద్ధికి కృషి మెదక్‌కలెక్టరేట్: మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం రెండు కీలక పథకాలను ప్రారంభించిందని జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజొద్దీన్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేష న్ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. అర్హులు ఈనెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. -
జూనియర్ డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ లావణ్య సూసైడ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలో లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్‌ని సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఏడాది నుంచి డాక్టర్లు లావణ్య, ప్రణయ్ తేజ్ ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు. కానీ, పెళ్లికి కులం వేరే ఉందని ప్రణయ్ సాకు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కారణంగానే మనస్తాపంతో పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని లావణ్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు.ఇదిలా ఉండగా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జూనియర్ డాక్టర్ లావణ్య.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బి.లావణ్య సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. శుక్రవారం ఉదయం లేబర్ రూంలో డ్యూటీలో ఉండగా అనారోగ్యంగా ఉండటంతో క్యాజువల్ డిపార్ట్మెంట్లో చికిత్స తీసుకొని కాలేజీ హాస్టల్‌కు వెళ్లారు.శనివారం ఉదయం ప్రభుత్వ కళాశాల హాస్టల్లో గడ్డి మందును ఇంజెక్ట్ చేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. జూనియర్ డాక్టర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
అందుబాటులో ఉల్లి నారు
నూతన కార్యవర్గం మెదక్ కలెక్టరేట్: జిల్లా జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగాయి. అధ్యక్షుడిగా ఖాజామొహినొద్దీన్, ప్రధాన కార్యదర్శిగా రమేశ్, ఉపాధ్యక్షులుగా సునీతా, రాజేశ్, కిరణ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా శ్యాంకుమార్, జాయింట్ సెక్రటరీగా భవాని, వినయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సమీయొద్దీన్, రాజు, మహిళా ప్రతినిధిగా స్వాతి ఎన్నికయ్యారు. మెదక్ కలెక్టరేట్: అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన నవయుగ వైతాళికుడు లూయిస్ బ్రెయి లీ అని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక యూనియన్ జిల్లా కార్యదర్శి యశోద అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రెయిలీ లిపి అందుబాటులోనికి వచ్చాకే అంధులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. సమాజంలో ప్రతి సంవత్సరం 30 వేల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముత్యాలు, కార్యదర్శి యశోద, గౌరవ అధ్యక్షులు మల్లేశం, ఉపాధ్యక్షులు యాదగిరి, రాష్ట్ర మహిళా సభ్యులు కవిత, సహాయ కార్యదర్శి దుర్గ, శ్రీదేవి, వినోద్, దుర్గమ్మ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్‌రావు పటాన్చెరు టౌన్: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు విజన్ లేదని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఐబీలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డితో కలసి ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా నదీ జలాల అంశంపై తె లంగాణకు ఎన్ని టీఎంసీల నీరు సరిపోతాయో అంగీకరించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పెట్టిన సంతకం తాలూకూ పత్రాలు ప్రజలముందు ఉంచామని చెప్పారు. తెలంగాణకు నష్టం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు దొందూ దొందేనని విమర్శించారు. -
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య
కలెక్టర్ రాహుల్రాజ్రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట: ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వి ద్య అందుతుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని ప్రగతి ధర్మారంలో బీసీ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నారని తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరుపేదలకు సరైన వైద్యసేవలు అందేవిధంగా కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆస్పత్రుల తనిఖీ చేపట్టామన్నారు. కలెక్టరేట్ నుంచే సీసీ కెమెరాల ద్వారా అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.అనంతరం నార్సింగి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ విద్యార్థులు 65 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు క ష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. -
కరాటేతో ఆత్మస్థైర్యం పెంపు
మనోహరాబాద్(తూప్రాన్): కరాటేతో ఆత్మస్థైర్యం పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో సన్‌షైన్ షాటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్ రాష్ట్ర కరాటే పోటీలను నిర్వహించారు. కాగా పలు జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొని బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో కరాటే నేర్చుకోవాలని సూచించారు. అనంతరం పోటీలు నిర్వహించిన గ్రాండ్ మాస్టర్ మల్లేశ్, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ను మైనంపల్లి హన్మంతరావు సన్మాని ంచారు. అనంతరం విజేలతకు సర్టిఫికెట్లతో పాటు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన గ్రాండ్ మాస్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో కుమ్ములాటలు
చిచ్చురేపిన సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడి ఎంపిక● హన్మంతరావు వర్సెస్ రాజిరెడ్డి ● పోటాపోటీగా నియామకాలు కాంగ్రెస్ పార్టీలో చాపకింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి ఎంపిక విషయం మైనంపల్లి హన్మంతరావు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి మధ్య చిచ్చురేపింది. ఇరువురు చెరో వ్యక్తికి మద్దతు పలకగా, చివరకు రాజిరెడ్డి మద్దతుదారుడు కల్యాణ్‌కు రాష్ట ఫోరం అధ్యక్షుడు ఆశాదీప్ నియామకపత్రం అందజేశారు. – మెదక్‌జోన్ జిల్లాలో గత నెలలో పంచాయతీ ఎన్నికలు జరగగా, ఆయా మండలాల పరిధిలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుల నియామకాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి అవుల రాజిరెడ్డి మధ్య విభేదాలు తలె త్తాయి. మైనంపల్లి తన అనుచరుడు చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన ఆవుల గోపాల్‌రెడ్డిని ఎంపిక చేసేందుకు సర్వం సిద్ధం చేశాడు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సమావేశం ఏర్పాటు చేసి గోపాల్‌రెడ్డి పేరును ప్రకటించాలని నిర్ణయించాడు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారని తెలిసింది. ఈ క్రమంలోనే ఆవుల రాజిరెడ్డి ఆదివారం జిల్లాలోని సుమారు 15 మందికి పైగా సర్పంచ్‌లతో మాసాయిపేట మండలం హకింపేటలోని ఓ రిసార్టులో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యాయి. జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా, 15 మండలాల ఫోరం అధ్యక్షుల మద్దతు కూడగట్టి ఫోరం రాష్ట్ర అధ్యక్షుడి చేతుల మీదుగా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి (పీటీ) సర్పంచ్ మన్నె కల్యాణ్‌కు సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా అధికారంగా నియామకపత్రం అందించారు.పంతం నెగ్గించుకున్న రాజిరెడ్డిఅక్టోబర్లో జరిగిన డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి జ్యోతిరౌతేలా, పీసీసీ నుంచి ఎన్నికల పరిశీలకులు జగదీశ్వరరావు, నాసిక్ మహ్మద్, వరలక్ష్మి మెదక్ వచ్చారు. కాగా అధ్యక్ష పీఠం కోసం ఆవుల రాజిరెడ్డి, అదే నియోజకవర్గానికి చెందిన అంజనేయులుగౌడ్, రాంచందర్‌గౌడ్ పోటీపడగా రాజిరెడ్డి, అంజనేయులుగౌడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా అంజనేయులుగౌడ్ అప్పటికే డీసీసీగా కొనసాగాడని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని రాజిరెడ్డి గట్టిగా పట్టుబట్టినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో మైనంపల్లి హన్మంతరావుకు సన్నిహితంగా ఉండే అంజనేయులుగౌడ్కే రెండోసారి డీసీసీ పీఠం దక్కింది. దీంతో రాజిరెడ్డి, హన్మంతరావుల మధ్య దూరం పెరిగింది. అప్పటి నుంచి రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలోనే జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా తన వర్గానికి చెందిన కల్యాణ్‌ను ఎంపిక చేసి రాజిరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. -
కలిసికట్టుగా ముందుకెళ్దాం
సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్‌రెడ్డి వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్రంలో సర్పంచ్‌లు ఎదుర్కొనే సమస్యలపై పార్టీలకతీతంగా పోరాటం చేసి కలిసికట్టుగా పరిష్కరించుకుందామని సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఆశాదీప్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాసాయిపేట మండలం హకింపేట శివారులోని ఓ రిసార్ట్‌లో జిల్లా కార్యవర్గాన్ని ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్నయాదవ్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రాజిరెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పీటీ సర్పంచ్ కల్యాణ్‌ను జిల్లా అధ్యక్షుడిగా, మాసాయిపేట స ర్పంచ్ కిష్టారెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంగళపర్తి సర్పంచ్ సంధ్యను ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎన్నిక పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆశాదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండున్నర ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో సర్పంచ్‌లుగా ఎన్నికై న వారిపై బరువు, బాధ్యతలు పెరిగాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన ప్రత్యేక నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులను గ్రామాల అభివృద్ధికి సక్రమంగా వినియోగించుకుంటామన్నారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ముఖ్య సలహాదారులు వీరభద్ర ఆచార్య, పాండుగౌడ్తో పాటు జిల్లాలోని పలు మండలాలకు చెందిన సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పాల్గొన్నారు. -
వారికి ఓటు అడిగే అర్హత లేదు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ నర్సాపూర్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులకు ఓటు అడిగే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన నివాసంలో నర్సాపూర్ పట్టణ పార్టీ ముఖ్య నాయకులతో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడిన బీఆర్ఎస్ను ప్రజలు ఓడించారని, కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలం చెంది ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం ఉంటుందని మురళీయాదవ్ చెప్పారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించేందుకు సమష్టిగా పని చేయాలని పార్టీ సన్నాహాక సమావేశంలో నిర్ణయించామని మురళీయాదవ్ తెలిపారు. మురళీయాదవ్‌తోపాటు పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి సురేశ్, పార్టీ నాయకులు రాజేందర్, నగేష్‌గౌడ్, ప్రేమ్‌కుమార్, ఆంజనేయులు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తొలితరం ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే
● కలెక్టర్ రాహుల్‌రాజ్ ● కలెక్టరేట్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి మెదక్ కలెక్టరేట్: సమాజంలో మహిళలకు చదువు ప్రాముఖ్యతను చాటి చెప్పిన వీర వనిత, సీ్త్రల విద్యకు కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్లో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అలాగే కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా కలెక్టర్ రాహుల్‌రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..మహిళలకు, ఆడబిడ్డల చదువు కోసం సావిత్రిబాయి పూలే చేసిన విశేష సేవలకు గాను ప్రతి యేటా జనవరి 3న వారి సేవలు స్మరించుకోవడం జరుగుతుందన్నారు. అలాగే అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. సమాజ చైతన్యంలో మహిళల భాగస్వామ్యాన్ని కలెక్టర్ వివరించారు. అనంతరం పలువురు మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ ,జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, జిల్లా సైన్స్‌అధికారి రాజిరెడ్డి, మహిళా ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. పూలే దంపతులు ఆదర్శప్రాయులు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ మెదక్‌జోన్: సావిత్రి బాయి, మహాత్మా జ్యోతి బాపూలే దంపతులే ఆదర్శ ప్రాయులని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ పేర్కొన్నారు. సావిత్రి బాయిపూలే జయంతి సందర్భంగా పట్టణంలోని టీఎన్జీవో భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, మహిళా ఉపాధ్యాయులు, అంగన్వాడీటీచర్లు, ఆశావర్కర్లను ఘనంగా సన్మానించారు. -
బకాయిలివ్వండి సారూ!
‘మన ఊరు మన బడి’పనులు చేసి రెండేళ్లుమెదక్జోన్: ప్రభుత్వం మారిన ప్రతిసారీ పథకాల పేరుమార్చి కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ వారికి అనుకూలమైన పేర్లు పెట్టుకోవటం సహజమే. అయితే గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను అర్ధాంతరంగా నిలిపివేయటంతోపాటు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులను నిలిపివేయటంతో ‘మన ఊరు మన బడి’పథకంలో పనులు చేసి రెండేళ్లుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. మెదక్ జిల్లాలో 2021–2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు పాఠశాలల అభివృద్ధికి ‘మన ఊరు మన బడి’పథకంలో భాగంగా 313 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. వీటి కోసం ఆయాశాఖల ఇంజనీర్లు వాటి మరమ్మతులకు రూ.74.99 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. వీటిలో రూ.30 లక్షలకుపైగా నిధులు మంజూరైన పాఠశాలలను టెండర్ ద్వారా పనులు చేపట్టగా అంతకు తక్కువగా మంజూరైన స్కూళ్లకు నేరుగా అదే పాఠశాలకు చెందిన చైర్మన్లకు లేదా, గ్రామస్తులకు పనులు అప్పగించారు. వీటిలో రూ.10 లక్షల లోపు నిధులు మంజూరైన పాఠశాలల పనులు చాలావరకు పూర్తి కాగా అంతకు మించి నిధులు మంజూరైన పాఠశాలల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో 2023 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాగా, ఆ ప్రభుత్వంలో ఆగిన పనులను పూర్తి చేయకుండా అర్ధాంతరంగా వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘మన ఊరు మన బడి’పథకం పేరు మార్చి ‘అమ్మ ఆదర్శ పథకం’పేరుతో 500 పైచిలుకు పాఠశాలలను అభివృద్ధి చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, గత ప్రభుత్వం చేసిన పనులు అర్ధాంతరంగా వదిలేయటంతో సదరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర మాజీ శాసనమండలి ప్రోటెమ్ చైర్మన్ వి.భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో శనివారం సాయంత్రం జరిగిన డైమండ్‌జూబ్లీ వేడుకల్లో వారు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధిస్తున్నారన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పట్టుదలతో చదివి ఉన్నతస్థాయిలో స్థిరపడాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని కోరారు. విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బి.పుష్ప, వి.సింధురెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, విజయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీ.పీ.రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ స్మైల్–12 పోస్టర్ల ఆవిష్కరణ
జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోపాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించే లక్ష్యంతో ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందులోభాగంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అవగాహన పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు లేదా సహాయం అవసరమైన పిల్లలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్‌రెడ్డి, డీసీఆర్బి ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఆర్ఎస్సై నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్పర్యవేక్షించిన అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో శనివారం పోలీస్ పరేడ్ నిర్వహించారు. కాగా, ఈ పరేడ్‌ను అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను పరిశీలించి, అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం ఎంతో అవసరమని సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి, నిర్ణీత వేగ పరిమితుల్లో వాహనాలు నడుపుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్, రంగా నాయక్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. పద్యాలను భవిష్యత్ తరాలకు అందించాలిపద్యాల పోటీలు నిర్వహిస్తున్న రిటైర్డ్ టీచర్ పాపన్నపేట(మెదక్): పద్యాలను తర్వాత తరాలకు అందించి తెలుగు భాషను కాపాడుకోవాలని రిటైర్డ్ టీచర్ సాంబశివరావు అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని ఎల్లాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పద్యాల పోటీని నిర్వహించారు. తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా మాచవరంకు చెందిన ఈయన విద్యార్థుల చేత పద్యాలు చదివించారు. పద్యానికి రూ.10 ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. కార్యక్రమంలో అత్యధికంగా 4వ తరగతి విద్యార్థిని గొల్ల అక్షిత 62 పద్యాలు, ఏడో తరగతి విద్యార్థిని ఏముడాల సహస్ర 60 పద్యాలను చెప్పారు. జిల్లాలోని పాఠశాలల్లో తిరుగుతూ పద్యాల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి కృషిఎంపీ సురేశ్ షెట్కార్ నారాయణఖేడ్: మైనార్టీల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని జహీరాబాదు ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. ఖేడ్ ఎడ్లబజార్లోని ఖాజాబందేనవాజ్ దర్గాకు ప్రహారీకోసం తనకోటా నుంచి రూ.5 లక్షలను మంజూరు చేసి శనివారం పనులకు శంకుస్థాపన చేశారు. మైనార్టీ సంక్షేమ సంఘం బాధ్యులు తాహెర్‌అలీ, మొయినుద్దీన్, మజీద్, రషీద్, అయూష్, వహీద్, మొయిజ్ తదితరులు ఎంపీని శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
వీబీజీరాంజీతో 125 రోజుల పనులు
కేవీకే సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్కౌడిపల్లి(నర్సాపూర్): వీబీజీరాంజీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ)2025తో గ్రామాలలో ఉపాధిహామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం 125రోజులు పనిదినాలు కల్పించినట్లు కేవీకే సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ తెలిపారు. మండలంలోని తునికి కేవీకేలో వీబీజీరాంజీపై కౌడిపల్లి, నర్సాపూర్ మండల పంచాయతీ కార్యదర్శులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని చట్టసవరణ చేసి 100రోజుల పనిదినాలను 125రోజులకు పెంచిందన్నారు. గ్రామసభల్లో ఎంపిక చేసిన పనులను మాత్రమే చేయాలని చెప్పారు. అనంతరం నర్సాపూర్ ఏపీఓ అంజిరెడ్డి మట్లాడుతూ.. కొత్తచట్టం ద్వారా గ్రామాలలో జలసంరక్షణ, మౌలిక సదుపాయాలు, జీవనోపాదులు, తీవ్ర వాతవరణ సంఘటనలకు సంబంధించిన పనులు చేపట్టవచ్చన్నారు. గ్రామస్థాయిలోనే సామాజిక తనిఖీలు నిర్వహించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు శ్రీకాంత్, శ్రీనివాస్, రవికుమార్, ఉదయ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా మున్సిపోల్స్ నిర్వహించాలి
● జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ ● తూప్రాన్‌లో ఎన్నికల కౌంటింగ్ హాల్ పరిశీలన తూప్రాన్: మున్సిపల్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డితో కలిసి శనివారం పట్టణ సమీపంలోని నోబుల్ కళాశాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఇప్పటికే ఓటరు జాబితా విడుదల చేశామన్నారు. రిజర్వేషన్లు కూడా ఖరారు కానున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూంలో భద్రపరచడంతోపాటు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో కౌంటింగ్ హాల్‌ను పరిశీలించారు. నోబుల్ కళాశాల అన్ని విధాలుగా అనుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ. 11.19 కోట్ల బకాయిలు...!
ఆత్మహత్య తప్ప మరో మార్గంలేదు! చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలతోపాటు ఇదే మండలం చందంపేట ఉన్నత పాఠశాలలను రూ.25 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించాం. కానీ, రూ.18.30 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.6.70 లక్షలు రావాల్సి ఉంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. –మాణిక్యం, కాంట్రాక్టరు జిల్లా వ్యాప్తంగా 2021–2022లో 313 పాఠశాలల పనులను ప్రారంభించిన పలువురు కాంట్రాక్టర్లు రూ.31.59 కోట్లు వెచ్చించి పాఠశాలలను మరమ్మతులు చేశారు. కాగా వారికి రూ.20.40 కోట్లు విడుదల కాగా ఇంకా రూ.11.19 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్లు పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా మరికొందరు ఏకంగా పాఠశాలలకు తాళాలు వేశారు. అయినప్పటికీ ఆ బకాయి నిధులు విడుదల కాలేదు. ఇటీవల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో సైతం పలువురు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు పాల్గొని అరెస్టు అయ్యారు. -
హాల్‌టికెట్ చెకిట్!
నారాయణఖేడ్: పరీక్షా సమయాల్లో విద్యార్థులు ఆందోళనలకు గురికాకుండా ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియెట్ బోర్డు ముందస్తు చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలతోపాటు ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ల ప్రివ్యూను ఇంటర్ బోర్డు విద్యార్థులకు తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు పంపించనుంది. విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్ మొబైల్ నంబర్లలో వాట్సాప్ ఉన్న నంబర్లకు వారి పిల్లలకు సంబంధించిన హాల్‌టికెట్ల ప్రివ్యూను పంపించనున్నారు. ఈ ప్రివ్యూను శనివారం నుంచే అమలులోకి తీసుకువచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిన హాల్ టికెట్స్ ప్రివ్యూలో విద్యార్థికి సంబంధించిన వివరాలను చెక్ చేసుకోవచ్చు. వివరాల్లో ఏమైనా తప్పులు దొర్లితే వెంటనే సంబంధిత ప్రిన్సిపాల్‌ను సంప్రదించి సరిచేసుకునే సదుపాయాన్ని కల్పించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల హాల్‌టికెట్స్ ప్రివ్యూ రావాలంటే ఆ విద్యార్థి ఎస్ఎస్సీ రోల్ నంబరు, పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా హాల్‌టికెట్ ప్రివ్యూను చూసుకోవచ్చు. అలాగే రెండో సంవత్సరం విద్యార్థులకు సంబంధించి ఆ విద్యార్థి మొదటి సంవత్సరం హాల్‌టికెట్, పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే రెండో సంవత్సరం హాల్‌టికెట్ ప్రివ్యూ చూసుకోవచ్చు. రెండో సంవత్సరం విద్యార్థులకు సంబంధించి ఆ విద్యార్థి మొదటి సంవత్సరంలో పాసైన సబ్జెక్టులు, ఫెయిల్ అయిన సబ్జెక్టులతోపాటు ఆయా పరీక్షల టైం టేబుల్ వివరాలు ఉండనున్నాయి. చాలామంది విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద స్మార్ట్ఫోన్లు ఉండటంతో హాల్‌టికెట్లను సకాలంలో పొందడం, లోపాలను ముందుగానే గుర్తించడం, విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలలు, జిల్లా అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగు పర్చడం కోసం ఈ వాట్సాప్ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థను ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. విద్యార్థులకు ఉపయుక్తం పరీక్షల సమయంలో హాల్‌టికెట్లు జారీ కావడంతో దొర్లిన తప్పులను సరిచేసుకోలేకపోవడం, కేంద్రం, పేరు ఇతర వివరాలు తప్పులుగా రావడంతో చాలామంది విద్యార్థులు గతంలో ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు ఈసారి తీరనున్నాయి. ఈ విధానం ద్వారా జిల్లాలో ఇంటర్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మేలు చేకూరనుంది. వచ్చేనెల 2 నుంచి ప్రాక్టికల్స్ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 20, ప్రభుత్వ సెక్టార్లో 70, ప్రైవేట్ కళాశాలలు 47 కొనసాగుతున్నాయి. వీటిల్లో మొదటి సంవత్సరంలో 18,249మంది విద్యార్థులు, సెకండ్ ఇంటర్ 17,983 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ ఫిబ్రవరిలో జరగనున్న పరీక్షలకు సంసిద్ధులవుతున్నారు. కాగా, ఈ నెల 21న ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష, 22న రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష ఉండనుంది. ఫిబ్రవరి 2 నుంచి 21వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. -
తప్పులు సరిచేయండి
ఓటరు జాబితాపై మున్సిపల్ కమిషనర్‌కు బీఆర్ఎస్ వినతి మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలోని 32 వార్డుల ఓటరు లిస్టు డ్రాప్టు జాబితాలో అనేక తప్పులున్నాయని వాటిని సవరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని శనివారం కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ న్యాయవాది జీవన్‌రావు, మాజీ కౌన్సిలర్లు అకిరెడ్డి కృష్ణారెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, గడ్డమీది కృష్ణగౌడ్, సులోచన ప్రభురెడ్డి, ఆర్కే శ్రీనివాస్, మాయ మల్లేశం, శ్రీనివాస్, ఏనుగుల రాజు, నాయకులు మెడిశెట్టి శంకర్, గోపాల్ తదితరులు ఉన్నారు. -
ఎంత పనిచేశావ్ మౌనిక..!
మెదక్ జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన ఘటనలో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్సై మధుకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుల్లెబోయిన స్వామి అరవింద పరిశ్రమలో ఫైర్ ఇంజిన్ డ్రెవర్‌గా పని చేస్తున్నాడు. గత నెల 23న గ్రామ శివారులోని నేరళ్లకుంటలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి భార్య మౌనికపై అనుమానంతో విచారించగా ఇదే గ్రామానికి చెందిన సంపత్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారిందని చెప్పింది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భర్తను హతమార్చాలని పథకం రంచించి... గత నెల 22న రాత్రి స్వామి మద్యం తాగి ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా మౌనిక ఆమె ప్రియుడు సంపత్ అతడి గొంతు నులిమి హత్యచేశారు. మృతదేహన్ని బైక్‌పై తీసుకెళ్లి గ్రామ శివారులోని నేరళ్లకుంటలో పడేశారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కరాటే కోచ్‌ల ఎంపిక ప్రక్రియ వాయిదా
● జిల్లా వ్యాప్తంగా 162 పాఠశాలలు ● 250 దరఖాస్తులు మెదక్ కలెక్టరేట్: సమీకృత కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కరాటే మాస్టర్ల ఎంపిక ఈనెల 6వ తేదికి వాయిదా పడింది. రాణి లక్ష్మిబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ స్వీయ రక్షణ పథకం కింద జిల్లాలోని 162 పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బాలికలకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం జిల్లాలోని అర్హులైన మాస్టర్లు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ నోటిఫికేషన్ ఇచ్చారు. జిల్లాలోని 133 సెకండరీస్కూల్స్, 29 ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యనభ్యసించే బాలికలకు మూడు నెలలపాటు కరాటే శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం డిసెంబర్ 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. దీనిపై స్పందించిన జిల్లాలోని కరాటే మాస్టర్లు 162 పాఠశాలలకు 250 దరఖాస్తులు సమర్పించారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో మాస్టర్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కరాటే మాస్టర్లు తరలిరావడంతో కార్యాలయం కిటకిటలాడింది. అయితే చాలావరకు ఇంకా అనుభవం లేని అభ్యర్థులు రాగా, ఒక్కొక్కరు రెండు, మూడు పాఠశాలలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇదే సమయంలో కరాటే మాస్టర్లతోపాటు తమను ఎంపిక చేయాలంటూ కుంగ్‌ఫూ మాస్టర్లు రావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. అధికారులు అభ్యర్థులతో మాట్లాడి వారి నైపుణ్యత ఆధారంగా ఎంపిక చేపట్టారు. దీంతో సాయంత్రం వరకు కేవలం 10 మండలాలకు మాత్రమే కోచ్‌ల ఎంపిక జరిగింది. మిగతా మండలాల అభ్యర్థుల ఎంపిక ఈనెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ అధికారులు జ్యోతి, రాజేశ్వరీ, శ్రీకాంత్‌లు పాల్గొన్నారు. -
రూ.11.14కోట్లతో ఎక్సలెన్స్ భవనం
● నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి ● ఎంపీ రఘునందన్ హవేళిఘణాపూర్(మెదక్): జిల్లాకు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనం మంజూరు కావడం అభినందనీయమని ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో రూ.11.14కోట్ల భవన నిర్మాణ పనులను శుక్రవారం కలెక్టర్ రాహుల్రాజ్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ భవనానికి రెండు జిల్లాలు ఎంపికవ్వగా.. మెదక్ ప్రాంతంలోని డైట్ కళాశాలలో ఈ పనులను ప్రారంభించడం హర్షణీయమన్నారు. విద్యార్థులకు కళాశాలతో పాటు వసతి గృహం, డైనింగ్ వంటి పనులు నిర్మాణం చేపట్టడంతో వసతులు మెరుగుపడుతాయన్నారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కళాశాలలో అన్ని వసతులను కల్పించేలా అధికారులు సైతం సమన్వయంతో త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, డైట్ ప్రిన్సిపాల్ రాధాకిషన్, సర్పంచ్ మేకల సాయిలు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శ్వేతాకిరణ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్, ఆయా గ్రామా ల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. డిప్లొమా ప్రైమరీ ఫ్రీ ఎడ్యూకేషన్ (డీపీఎస్ఈ) పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి ఈ కోర్సులో చేరే విధంగా చూడాలని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం హవేళిఘణాపూర్ డైట్ కళాశాలలో నూతనంగా నిర్మించనున్న భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన డైట్ ప్రిన్సిపాల్ రాధాకిషన్‌తో మాట్లాడారు. కళాశాలలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల్లో విద్యాబోధన చేస్తున్నామని, ప్రభుత్వం డీపీఎస్ఈ కోర్సు ప్రవేశపెట్టినా ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. అందుకు ఎంపీ బదులిస్తూ డీపీఎస్ఈ ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థుల్లో అవగాహన పెంచి కోర్సులో చేరే విధంగా చూడాలని సూచించారు. -
బొకేలకు బదులు బ్లాంకెట్స్
మెదక్ కలెక్టరేట్: తన పిలుపు మేరకు సేవా దృక్పథంతో స్పందించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ రాహుల్‌రాజ్ ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బొకేలు, శాలువాలకు బదులు విద్యార్థులకు చలి నుంచి రక్షణ పొందే బ్లాంకెట్స్ అందించాలని ఆయన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. గురు, శుక్రవారాల్లో ఆయా శాఖల అధికారులు కలెక్టర్‌ను కలిసి బ్లాంకేట్స్ అందజేశారు. వివిధ సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2,500 బ్లాంకెట్స్ అవసరం ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం సుమారు వెయ్యికి పైగా బ్లాంకెట్స్ వచ్చాయని, వీటిని వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. -
విద్యావంతులే సైబర్ బాధితులు
● సైబర్ నేరాలపై అవగాహన ● రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో సైబర్ మోసాలకు గురవుతుంది అధిక శాతం విద్యావంతులేనని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సైబర్ వారియర్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అవగాహన లోపం, అత్యాశ, తొందరపాటు నిర్ణయాలే ఇందుకు ప్రధాన కారణాలని తెలిపారు. విద్యావంతులు, యువత అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగిన వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అనధికారిక లోన్ యాప్స్ ద్వారా తక్కువ సమయంలో రుణం ఇస్తామని ఆకర్షించి అధిక వడ్డీలు వసూలు చేయడం, మొబైల్లోని కాంటాక్ట్‌లు, ఫొటోలు, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, రుణం చెల్లించలేని పరిస్థితుల్లో బెదిరింపులు, అశ్లీల సందేశాలు పంపడం, పరువు నష్టం కలిగించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఎస్పీ వివరించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నెంబర్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనంతరం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈనెలంతా రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సీఐలు సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్ఐ శైలేందర్, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు, ఎస్సై శివానందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
నాణ్యతా ప్రమాణాలతో విద్యాబోధన
డీఈఓ విజయనర్సాపూర్ రూరల్: కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్యతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డీఈఓ విజయ అన్నారు. శుక్రవారం మండలంలోని చిప్పల్తుర్తి కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. విద్యా బోధన, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం బడి మానేసిన ఆడ పిల్లల కోసం కస్తూర్బా గాంధీ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు దగ్గర పడుతున్న సమయం వృథా చేయకుండా కష్టపడి చదువుకొని మంచి ర్యాంకులు సాధించాలని ఆమె సూచించారు. -
మొక్క.. ఏదీ నీ లెక్క!
● మొక్కలు నాటి సంరక్షణ మరిచారు ● ఎండిపోయిన వైనం ● నెరవేరని వనమహోత్సవ లక్ష్యం నర్సాపూర్: వన మహోత్సవంలో నాటిన మొక్కల సంరక్షణను అధికారులు గాలికొదిలేశారు. దీంతో అవి కర్రలుగా మారి దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా స్థానిక అధికారులు పలు కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో వనమహోత్సవంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్‌రెడ్డి, ఇతర అధికారులతో పాటు లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు. దాదాపు ఐదు వందల మొక్కలు నాటా మని అధికారులు ప్రకటించారు. కాగా అధికారులు వాటి సంరక్షణకు సరైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో చాలా మొక్కలు ఎండిపోయి గోతులు మిగిలాయి. కాగా కొన్ని మొక్కలు ఎండిపోయి ఆకులు లేకపోవడంతో కర్రలుగా మారాయి. మరి కొన్ని మొక్కలు నాటకపోవడంతో పాలిథిన్ కవర్లలోనే ఎండిపోయాయి. ఈ విషయమై ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శేషాచారిని వివరణ కోరగా... తాము మొక్కలు నాటిన ప్రాంతంలో మట్టి బాగా లేదని చెప్పారు. మొక్కలు కర్రలుగా మారిన మాట వాస్తవమని, వాటికి నీరు పెట్టి కాపా డేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని, విద్యార్థులకు మొక్కలను దత్తతకు ఇస్తామని చెప్పారు. -
రాయితీ ఇచ్చినారు
మెదక్‌జోన్: కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. టమాటా నుంచి మొదలుకుని పచ్చి మిర్చి వరకు కిలోకు రూ.60 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కన్పిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం జిల్లాకు సరిపడా కూరగాయల పంటలు సాగు చేయక పోవటమే. ఫలితంగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున కూరగాయల దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాయగూరల పంటలపై దృష్టిపెట్టాలని జిల్లా వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇందుకనుగుణంగా ఇక నుంచి కూరగాయల ఉత్పత్తిని పెంచేందుకు పూర్తి సబ్సిడీపై ఐదు రకాల నారుమళ్లను రైతులకు అందించాలని నిర్ణయించింది. జిల్లాకు 250 ఎకరాలకు నారుమడి కూరగాయల సాగును పెంచేందుకు మూడేళ్లు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ములుగులో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ యూనివర్సిటీలో పలురకాల కూరగాయల నారుమళ్లు పెంచుతూ రైతులకు సబ్సిడీపై అందిస్తున్నప్పనటికీ జిల్లాకు ఏటా కేవలం 25 ఎకరాలకు సరిపడా నారుమళ్లను అందించేవారు. అయితే 2025–2026 నుంచి జిల్లాకు 250 ఎకరాలకు సరిపడా టమాటా, వంకాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ నారుమళ్లను పూర్తి సబ్సిడీపై రైతులకు అందిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాకు 100 ఎకరాలకు పైగా నారుమడిని తెచ్చుకున్న రైతులు వాటిని సాగు చేశారు. మరో 150 ఎకరాల్లో సాగుచేసేందుకు నారును సిద్ధంగా ఉందని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. ‘సెడ్నెట్’ నిర్మాణానికి భారీ సబ్సిడీ జిల్లాకు 20 సెడ్నెట్హౌజ్ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది ఒక్కో యూనిట్‌ను 12 గుంటల విస్తీర్ణంలో నిర్మించుకునే వీలు ఉంటుంది. దీని నిర్మాణానికి రూ.5 లక్షలు ఖర్చు అవుతుండగా అందులో రూ.3.75 లక్షల సబ్సిడీని ప్రభుత్వం సదరు రైతుకు ఇస్తుంది. రైతు వాటా కింద రూ.1.75 లక్షల వెచ్చించాల్సి ఉంటుంది. కాగా పూర్తి నిర్మాణం తర్వాతనే సదరు రైతుకు సబ్సిడీ వాటా అందుతుంది. ఈ సెట్నెట్ హౌజ్‌లో ఏడాదికి రూ.10 లక్షల కూరగాయల దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ములుగు హార్టికల్చర్ వర్సిటీ నుంచి సరఫరా జిల్లాకు 250 ఎకరాలకు అవకాశం తగ్గనున్న కూరగాయల ధరలు! మెదక్ జిల్లాలో కొన్నేళ్లుగా కూరగాయల సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇదివరకు కూరగాయల సాగు పెంచేందుకు సబ్సిడీపై కూరగాయల విత్తనాలను అందించేవారు. దీంతో విస్తృతంగా సాగు అయ్యేది. ఫలితంగా జిల్లాలో నాణ్యమైన కూరగాయలు లభించటంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరకు లభించేవి. 10 సంవత్సరాల నుంచి విత్తనాలపై సబ్సిడీ తొలగించటంతో చాలామంది రైతులు కూరగాయల పంటలను పండించటం మానేశారు. -
తక్కువ ధరకే ఇసుక
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మెదక్‌జోన్: ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే ఇసుకను అందించాలనే ఉద్దేశంతో శాండ్బజార్ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో నిల్వ ఉంచిన శాండ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ శాండ్ బజార్ ద్వారా అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు. ఇక నుంచి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక కావాల్సిన వారు 155242 నంబర్‌కు ఫోన్‌చేసి ఇసుకను బుక్ చేసుకునే వెసులు బాటును కల్పించామన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ, త్వరలో వాణిజ్య, ప్రైవేట్, ప్రభుత్వ అభివృద్ధి పనులకు సైతం ఇసుకను అందిస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం టన్నుకు రూ.1,200 చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, మైన్స్ ఏడీ సంజయ్ కుమార్, పీడీ హౌసింగ్ మాణిక్యం, తహసీల్దార్ లక్ష్మణబాబు, తదితరులు పాల్గొన్నారు. -
పల్లకీపై ఊరేగిన దుర్గమ్మ
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ఏడుపాయల్లో వన దుర్గమ్మకు పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు శంకరశర్మ, పార్ధీవశర్మ దుర్గమ్మ ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని పల్లకిపై ఉంచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు మంగళహారతులు పట్టారు. భక్తులు పల్లకిని భుజాలపై ఎత్తుకొని ఆలయం నుంచి ప్రధాన వీధి గుండా ఊరేగించారు. సర్పంచ్‌లకు డీఈఓ విజయ సూచన కౌడిపల్లి(నర్సాపూర్): పాఠశాలల అభివృద్ధికి సర్పంచ్‌లు కృషి చేయాలని డీఈఓ విజయ సూచించారు. శుక్రవారం కౌడిపల్లికి వచ్చిన సందర్భంగా మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ డీఈఓను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ...నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు విద్య, పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధిలో అక్కడక్కడా ఎదురవుతున్న సమస్యలపై సర్పంచ్‌లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. బడీడు పిల్లలందరు బడిలో ఉండేలా చూడాలన్నారు. వందశాతం విద్యార్థులు పాఠశాలకు హాజరు అయ్యేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఓంప్రకాశ్, నాయకులు దుర్గాగౌడ్, బోయిని వీరయ్య, భూమయ్య, శ్రీనివాస్‌గుప్తా, తదితరులు పాల్గొన్నారు. విద్యుత్‌శాఖ ఎస్ఈ నారాయణ నాయక్ మెదక్ కలెక్టరేట్: విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది కొత్త సంవత్సరంలో మరింత ఉత్సా హంతో వినియోగదారులకు సేవలందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ నారాయణ నాయక్ సూచించారు. శుక్రవారం విద్యుత్ శాఖకు చెందిన అధికారులు సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో పనిచేసి వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ డీఈతోపాటు ఏఈలు, కా ర్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్బీఐ మేనేజర్ హరినాథ్ నర్సాపూర్: అర్హత ఉన్న గ్రామైఖ్య సంఘాల స భ్యులకు రుణాలు అందెలా చూడాలని ఎస్బీఐ మేనేజర్ హరినాథ్ కోరారు. శుక్రవారం స్థానిక ఐకేపీ కార్యాలయంలో జరిగిన కమ్యూనిటీ బేస్డ్ రికవరీ మెకానిజం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ శాఖ పరిధిలోని గ్రామాల్లోని అర్హత ఉన్న సంఘాల సభ్యులకు రుణాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నా మని చెప్పారు. రుణాలు పొందిన సభ్యుల నుంచి రికవరీ సరిగా అయ్యే విధంగా తమకు సహకరించాలని కోరారు. ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్ మాట్లాడుతూ.. వాయిదాలు చెల్లించకుండా మొండి బకాయిలుగా మారిన సంఘాలకు వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం కల్పించాలని కోరారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలలో రాయితీలు పొందేందుకు ప్రతి రైతు తమ ఐడీని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి సూచించారు. రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి, మీసేవ కేంద్రాలలో ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ నెల 10 వరకు గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణ అఽధికారి ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. -
రెండున్నర ఎకరాల్లో సాగు
హార్టికల్చర్ వర్సిటీ ములుగు నుంచి రెండున్నర ఎకరాలకు అవసరమయ్యే నారును తెచ్చాను. అందులో ఎకరంన్నర టమాట, ఎకరం మిరప నారు తెచ్చి సాగు చేశాను. టమాట పంట చేతికందింది. ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం సంతోషంగా ఉంది. –బీంరెడ్డి, రైతు, మర్పల్లి, రేగోడు మండలం రైతులు వినియోగించుకోవాలి పూర్తి సబ్సిడీతో జిల్లాకు 250 ఎకరాలకు ఐదురకాల నారుమళ్లను ప్రభుత్వం అందిస్తోంది. దీన్ని రైతులు వినియోగించుకోవాలి. అలాగే 20 యూనిట్ల సెడ్నెట్హౌజ్ మంజూరయ్యాయి. అవసరమైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. –ప్రతాప్‌సింగ్, హార్టికల్చర్ అధికారి మెదక్ -
బాలికల అథ్లెటిక్స్‌లో చాంపియన్‌షిప్
మెదక్‌జోన్: రాష్ట్రస్థాయి 11వ క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్ అథ్లెటిక్స్ పోటీలను శుక్రవారం హైదరాబాద్‌లోని బాలయోగి స్టేడియంలో నిర్వహించారు. ఇందులోభాగంగా అండర్ 20 బాలికల విభాగంలో ఎనిమిది కిలోమీటర్ల పరుగుపందెంలో మెదక్ జిల్లాకు చెందిన బానోత్ అనిత ద్వితీయ స్థానంలో గెలుపొందింది. దీంతో రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి చేతులమీదుగా అనితకు ట్రోఫీని అందజేశారు. కాగా, ఈ నెల 24న, ఝార్ఖండ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో మెదక్ జిల్లా తరఫున అనిత పాల్గొంటారని మెదక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదన్, కోచ్ అర్జున్ వెల్లడించారు. -
మున్సిపోల్స్‌కు సమాయత్తం!
● ముసాయిదా ఓటరు జాబితా విడుదల ● అభ్యంతరాలు, ఫిర్యాదులకురెండు రోజులు అవకాశం రామాయంపేట(మెదక్): జిల్లాలోని నాలుగు ము న్సిపాలిటీల్లో గురువారం అధికారులు వార్డుల వారీ గా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశారు. ఈ మేరకు జాబితాను ఓటర్లకు అందుబాటులో ఉంచారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు కోసం రెండు రోజులు అవకాశం కల్పించారు. ఈనెల 5న మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. 6న జిల్లా కేంద్రంలో రాజకీయ పార్టీలతో కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్స్టేషన్ల పునర్వ్యవస్ధీకరణ కార్యక్రమం పూర్తయింది. స్టేషన్ల సంఖ్య పెరుగకపోయినా కొన్ని మార్పులు చేశారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులకు గాను 24 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 11, 12 పోలింగ్ స్టేషన్లు గతంలో మార్కెట్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగగా, ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలమవటంతో దానిని ఉజ్వల విద్యాలయంలోకి మార్చారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2025 ఓటరు లిస్ట్‌ను ప్రామాణికంగా తీసుకొని ముసాయిదా బాబితా రూపొందించారు. కాగా అక్టోబర్ తర్వాత కొత్తగా ఒటర్గా నమోదైన యువకులకు ఈఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. అంతకుముందు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈసారి ఫొటో ఆధారిత ఓటర్ లిస్టు ప్రవేశపెడుతున్నారు. పోలింగ్స్టేషన్లలో సదుపాయాల పరిశీలన నాలుగు మున్సిపాలిటీల పరిధిలో గుర్తించిన పో లింగ్ స్టేషన్లలో సదుపాయాలు, సమస్యలను అధికారులు పరిశీలించారు. మూత్రశాలలు, దివ్యాంగుల కోసం ర్యాంపులు లేకపోతే వెంటనే నిర్మించా ల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు ఒక వార్డులో ఉన్న ఓటర్లు మరో వార్డులోకి మార్చుకునే అవకాశం ఉంటుందే తప్ప కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఉండదని స్పష్టం చేశారు. కాగా ఓటర్ లిస్టులో మృతిచెందిన వారి పేర్లు ఉంటే వాటిని తొలగించే అవకాశాలు లేవని తెలిసింది. -
నూతనోత్సాహంతో పనిచేద్దాం
మెదక్ కలెక్టరేట్: కొత్త సంవత్సరంలో జిల్లా అధికారులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. గురువారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన గతేడాది జిల్లాలో సాధించిన అభివృద్ధి, పురోగతి, విజయాలను స్మరించుకున్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి గడప వరకు చేరేలా చూడాలన్నారు. అనంతరం తహసీల్దార్ అసోసియేషన్‌కు సంబంధించిన నూతన డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, టీజీటీఏ నాయకులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. అనంతరం సివిల్ సప్లై అధికారులు నిత్యానంద్, జగదీశ్ తన సిబ్బందితో కలెక్టర్‌ను కలిసి దుప్పట్లు అందజేశారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ శ్రీనివాసరావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారులతో కలెక్టర్‌కు రాహుల్‌రాజ్ -
ఆలయాలకు కొత్త శోభ
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో కలెక్టర్ రాహుల్‌రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కోదండ రామాలయం, సాయిబాబ ఆలయం, శివాలయాలు, పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. – మెదక్‌జోన్/పాపన్నపేట(మెదక్) -
అప్రమత్తతే శ్రీరామ రక్ష
మెదక్‌జోన్: చలికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఆరోగ్యం కాపాడుకోవచ్చని డీఎంహెచ్ఓ శ్రీరాం అన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల జాగ్రత్తలు అవసరం అన్నారు. గురువారం ‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో భాగంగా ప్రజల సందేహాలను నివృత్తి చేసి, పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలో అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రశ్న: మా ఇంట్లో రెండేళ్ల బాబు ఉన్నాడు. చలి తీవ్రతతో జలుబు అధికంగా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – కుమార్, తునికి డీఎంహెచ్ఓ: వెంటనే దగ్గరలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం చేయించండి. చలిలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకెళ్లొద్దు. ఉన్ని దుస్తులు ధరించాలి. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వారికి దగ్గు, జలుబు, జ్వరం ఉంది. మా గ్రామంలోని ఆర్ఎంపీకి చూపించినా తగ్గలేదు. ఎలాంటి చర్యలు తీసుకోమంటారు? – శ్రీనివాస్, పాపన్నపేట, జయపాల్, కొల్చారం, రంగంపేట డీఎంహెచ్ఓ: మీ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లండి. వారికి వెంటనే యాంటీబయాటిక్ సిరప్లు వాడాల్సి ఉంటుంది. గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి. ప్రశ్న: మా గ్రామ పాఠశాలలో చాలా మంది విద్యార్థులు జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులకు మందులు ఇవ్వండి? – శంకర్, పాఠశాల చైర్మన్, చిన్నఘణాపూర్, కొల్చారం డీఎంహెచ్ఓ: ఏఎన్ఎంను పంపి వెంటనే పాఠశాలలో విద్యార్థులను పరిశీలించి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తాం. ఒకటి, రెండు రోజుల్లో క్యాంపు ఏర్పాటు చేస్తాం. ఆశవర్కర్ ప్రతి వెయ్యి మందికి ఒకరు చొప్పున ఉంటారు. మీ గ్రామంలో జనాభా ఆధారంగా తగు చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: మా మండలంలో పీహెచ్సీ లేదు. దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆర్ఎంపీ, పీఎంపీల వద్దకు పరుగు పెట్టాల్సి వస్తుంది. – శ్రీనివాస్, చండూరు సర్పంచ్ డీఎంహెచ్ఓ: చిలప్‌చెడ్ మండల కేంద్రానికి అర్బన్ ఆరోగ్య కేంద్రం మంజూరైంది. ఇందుకోసం నిధులు సైతం విడుదలయ్యాయి. త్వరలోనే భవన నిర్మాణం చేపడుతాం. ప్రస్తుతం మండల ప్రజలు కౌడిపల్లి పీహెచ్‌సీకి వెళ్లి వైద్యం చేయించుకోవాలి. ఆర్ఎంపీలు, పీఎంపీలకు చూపించొద్దు. ఎందుకంటే వారు అధికంగా యాంటీబయాటిక్ ఇస్తారు. అది ఆరోగ్యంపై భవిష్యత్‌లో తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రశ్న: మా బాబు వయస్సు 19 సంవత్సరాలు. మెదక్‌లో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. వారం రోజులుగా చలికి చేతులు వంకర పోతున్నాయని అంటున్నాడు. – శ్రీనివాస్, గాజిరెడ్డిపల్లిడీఎంహెచ్ఓ: మీబాబు హాస్టల్లో చలి నీటిలో స్నా నం చేయటం, చలిలో బయటకు వెళ్లటం జరిగి ఉంటుంది. అందుకే చేతులు వంకరపోతున్నాయనిపిస్తోంది. జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి చిన్నపిల్లల వైద్యుడికి చూపించి తగు మందులు వాడండి. ప్రశ్న: నా వయస్సు 48 సంవత్సరాలు. 15 రోజులుగా తరుచూ జ్వరం, దగ్గు, జలుబు వస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? – రాజేశ్వర్, చిన్నశంకరంపేట డీఎంహెచ్ఓ: తరుచుగా జలుబు, దగ్గు, జ్వరం వస్తుందంటున్నారు కాబట్టి మీ మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వెళ్లి బీపీ, షుగర్‌తో పాటు (సీబీపీ) రక్త పరీక్షలు చేసుకోవాలి. ప్రశ్న: నాకు కుక్క కరిచింది. మా మండల కేంద్రంలోని పల్లె దవాఖానకు వెళ్తే అక్కడ పనిచేసే వారు కనీసం పట్టించుకోలేదు. దీంతో సిద్దిపేట వెళ్లి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. – శ్రీనివాస్, నిజాంపేట డీఎంహెచ్ఓ: డీఎంహెచ్ఓ: విచారణ జరిపించి చర్యలు తీసుకుంటా. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను. మీరు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయండి ప్రశ్న: ఆరేళ్ల క్రితం స్టంట్ వేశారు. చలితో దగ్గు, జలుబు అయింది. ఎలాంటి జాగ్రతలు పాటించాలి? – సాయిరాం, చేగుంట డీఎంహెచ్ఓ: చలికి స్టంట్ పడిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చలికి ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకూడదు. ఉన్ని దుస్తులు ధరించాలి. వేడి పదార్థాలు మాత్రమే తినాలి. వెంటనే మీ మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వెళ్లి సీబీపీ రక్త పరీక్షలు చేయించుకొండి. దానిని బట్టి మందులు వాడితే తగ్గుతుంది. చలితో జలుబు, జ్వరం బారిన పడే ప్రమాదం వృద్ధులు, చిన్నారుల పట్ల జాగ్రత్తలు అవసరం డీఎంహెచ్ఓ శ్రీరాం సాక్షి ఫోన్ ఇన్‌కు విశేష స్పందన -
యూరియా.. ఏదయా!
● జిల్లాలో 3.17 లక్షల ఎకరాల్లో సాగు ● 27 వేల పైచిలుకు మెట్రిక్ టన్నులు అవసరం యాసంగి సాగు ప్రారంభంలోనే అన్నదాతకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఎరువుల దుకాణాల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. పోలీస్ పహారాలో పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్లో 3.17 లక్షల ఎకరాలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 13 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. – మెదక్‌జోన్ జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 3,17,380 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో సింహభాగం వరి 2,95,200 ఎకరాలు సాగవుతుండగా, మిగితా 22,180 ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడుతో పాటు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ఇందుకోసం డీఏపీ, ఎంఓపీ, ఎస్ఎస్పీ, కాంప్లెక్స్‌తో పాటు అన్నిరకాల రసాయన ఎరువులు 56,523 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా యూరియా 27,064 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని అధికారుల అంచనా. కాగా ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలతో పాటు ఇతర ప్రైవేట్ షాపుల్లో సుమారు 13 వేల మెట్రిక్ టన్నుల మేర యూరియా ఉందని సమాచారం. యూరియా కోసం రైతులు ఇప్పటికే రోడ్ల మీదకు వచ్చి దుకాణాల ఎదుట క్యూలైన్లు కడుతున్నారు. ఎలాంటి గొడవులు జరగకుండా ముందస్తుగా పోలీసుల పహారాలో యూరియా బస్తాలను రైతులకు మితంగా అందిస్తున్నారు. బుకింగ్ యాప్‌పై అవగాహన ఇక నుంచి రైతులకు ఎరువులు కావాలంటే తప్పని సరిగా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో బుక్ చేసుకుంటేనే ఎరువులు అందుతాయని రైతులు అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు సెల్ఫోన్లో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని తమ పేరు, పట్టా పాస్‌పుస్తకం నంబర్, ఇతర వివరాలు అందిస్తే అప్పటికే యాప్ ద్వారా రైతులు తమకు కావాల్సిన యూరియాను ఏ డీలర్వద్ద ఉంటే అక్కడ కొనుగోలు చేయొచ్చు. అయితే ప్రతి రైతు వద్ద స్మార్ట్‌ఫోన్ ఉండాలి. పాస్‌బుక్ నంబర్ కొడితే రైతు పేరు, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఉన్న భూమిలో ఎంత సాగు చేస్తున్నారు, ఏరకమైనా పంట వేశారు అనే అంశాలు వస్తాయి. పంటరకం, అందుకు అవసరమైన యూరియా బస్తాలను ఎంటర్ చేస్తే ఆన్లైన్ ద్వారా యూరియా బుక్ అవుతుందని చెబుతున్నారు. కాగా జిల్లాలో సుమారు 2.60 లక్షల మంది రైతులు ఉండగా, 40 శాతం మంది రైతులు స్మార్ట్ఫోన్లు వాడటం లేదు. వరి నాటుకు ఎకరానికి కేవలం రెండున్నర బస్తాల యూరియా మాత్రమే వాడాలని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సగం బస్తా ఇవ్వడం కుదరకపోవటంతో ఎకరం ఉంటే 3 బస్తాలు ఇస్తామని, 2 ఎకరాల్లో నాటు వేసే 5 బస్తాలు ఇస్తామని చెబుతున్నారు. అంతకుమించి యూరియా ఇవ్వబోమని, అంతకంటే ఎక్కువ ఉపయోగిస్తే భూసారం తగ్గి భవిష్యత్తులో పొలాలు దెబ్బతింటాయని పేర్కొంటున్నారు. -
న్యూ ఇయర్ కిక్కు
రూ. 21.32 కోట్ల మద్యం తాగేశారు కొల్చారం(నర్సాపూర్): నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మద్యం ప్రియులు ఫుల్‌గా తాగేశారు. డిసెంబర్ చివరి రెండు రోజుల్లో మండలంలోని చిన్నఘనాపూర్ ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) డిపో ద్వారా రూ. 21.32 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు డిపో వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 30, 31 తే దీల్లో ఐఎంఎల్ కేసులు 24,004 అమ్ముడు పోగా, బీరు 14,391 కేసులు అమ్ముడు పోయాయి. 31 నాడు రూ. 8.11 కోట్ల మద్యం అమ్మకాలను జిల్లాలోని మద్యం దుకాణదారులు డిపో ద్వారా కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఐఎంఎల్ డిపోలో బీరు, విస్కీ కలిపి 461 రకాలు అందుబాటులో ఉన్నాయి. నూతన మద్యం పాలసీ ప్రారంభమైన 2025 డిసెంబర్ 1 నుంచి 31 వరకు డిపో నుంచి ఐఎంఎల్, బీరు కలిపి సుమారు రూ. 209.50 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నెల మొత్తంగా 3,96,427 కేసులు విక్రయించారు. విస్కీలో అత్యధికంగా ఆఫీసర్స్ ఛాయిస్ రిజర్వ్ విస్కీ అమ్ముడు కాగా, దీని విలువ రూ. 12,69,44,132లుగా నమోదైంది. తర్వాత స్థానంలో సిగ్నేచర్ ఇంపీరియల్ బ్లూ క్లా సిక్ గ్రీన్ విస్కీ రూ. 11,80,00,204 అమ్ముడైంది. చివరిస్థానంలో రూ. 4,259లతో హై రైస్ విస్కీ నిలిచింది. -
కష్టపడి చదివితే మంచి భవిష్యత్: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: కష్టపడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాల సదనంలో పిల్లలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా వారికి నోట్‌బుక్స్ పంపిణీ చేసి ముచ్చటించారు. క్రమశిక్షణ, కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. పిల్లల భవిష్యత్తే సమాజ భవిష్యత్తు అని, వారు మంచి పౌరులుగా ఎదగాలంటే విద్యే ప్రధాన ఆయుధమని తెలిపారు. నూతన సంవత్సరంలో పిల్లలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా చదువులో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్‌గౌడ్, రంగా నాయక్, సీఐలు మహేశ్, కృష్ణమూర్తి, శైలే ందర్, బాల సదనం అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర, ముత్తాయికోటలోని సిద్దేశ్వర ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా పో లీస్ కార్యాలయంలో వేడుకల్లో పాల్గొన్నారు. -
ఉపాధిలో అవినీతిని ఉపేక్షించం
డీఆర్డీఓ శ్రీనివాస్ రామాయంపేట(మెదక్): మండలంలోని ఓ గ్రామంలో ఉద్యోగి కుటుంబం ఉపాధి పనుల్లో పాల్గొంటున్నట్లు వస్తున్న ఆరోపణల విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఎంపీపీ కార్యాలయ ఆవరణలో జరిగిన ఉపాధి పథకం సోషల్ ఆడిట్లో పాల్గొని మాట్లాడారు. ఏడాది కాలంగా మండలంలో రూ. ఆరుకోట్ల మేర ఉపాధి పనులు నిర్వహించగా, పది రోజులుగా గ్రామాల్లో ఆడిట్ జరిగిందన్నారు. ఒకరి పేరిట మరొకరు పనుల్లో పాల్గొంటున్నట్లు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయని, పలు గ్రామాల్లో ఇలా జరిగినట్లు తమ దృష్టికి సైతం వచ్చిందన్నారు. ఇష్టం వచ్చినట్లు చేయడం తగదని, నిబంధనల మేరకే పనులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈమేరకు పలు అవకతవకలకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రూ. 11 వేలు రికవరీ చేయడంతో పాటు రూ. 18 వేలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్, పలు గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు. -
పోలీస్ అధికారులకు సేవా పతకాలు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాకు చెందిన ము గ్గురు పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించడం గర్వకారణంగా ఉందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులను ప్రోత్సహించే ఉద్దేశంతో సేవా పతకాలను ప్రకటించినట్లు చెప్పారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేసిన అధికారులను ఈ పతకాల ద్వారా గౌరవిస్తామన్నారు. పతకాలలో భాగంగా మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్సై విఠల్, మెదక్ టౌన్ ఏఎస్సై రుక్సానా బేగం పతకాలకు ఎంపికై నట్లు ఆయన తెలిపారు. -
కొంగొత్త ఆశలతో..కొత్త ఏడాదిలోకి
● 2025కి వీడ్కోలు.. 2026కు స్వాగతం ● జిల్లా వాసులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులు కొంగొత్త ఆశలు.. కొత్త ఆశయాలతో జిల్లా వాసులు 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. గతేడాది మిగిల్చిన జ్ఞాపకాలు, సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను సాక్షితో పంచుకున్నారు. వెల్లడించిన అంశాలు.. వారి మాటల్లోనే.. – మెదక్‌జోన్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి కొత్త సంవత్సరంలో అన్నిరంగాల్లో మరింతగా పురోగతి సాధించేందుకు ప్రాణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం. ప్రధానంగా విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తా. పది పాసైన ప్రతి విద్యార్థి ఇంటర్లో చేరేలా ప్రత్యేక చర్యలు చేపడతాం. జిల్లాలో పలు టూరింజం స్పాట్లు ఉండటంతో పర్యాటక రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తా. – రాహుల్‌రాజ్, కలెక్టర్ గౌరవెల్లితో సాగు నీటిని అందిస్తా.. గౌరవెల్లి రిజర్వాయర్‌కు అనుబంధంగా కాలువలు నిర్మించి సాగు నీటిని అందించి మూడు పంటలు పండేలా కృషి చేస్తా. హుస్నాబాద్‌లో ప్రారంభమైన అభివృద్ధి పనులు త్వ రగా పూర్తి చేయిస్తా. సర్వాయి పాపన్న నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాను. హుస్నాబాద్ నియోజకవర్గానికి ట్రీపుల్‌ఐటీ బ్రాంచ్‌ను, నవోదయ వచ్చేందుకు నా వంతు కృషి చేస్తా. కొత్త ఏడాదిలో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. – పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి -
నూతనోత్సాహం
అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలుమెదక్మున్సిపాలిటీ: కొత్త సంవత్సరంలోకి అడుగిడిన వేళ నూతనోత్తేజం ఉట్టిపడింది. జిల్లావ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. డిసెంబర్ 31న విందు, వినోదాలతో ఆనందంగా సందడి చేశారు. 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలికారు. హాటళ్లు, బేకరీ దుకాణాలన్నీ కిటకిటలాడాయి. కొన్ని పాఠశాలల్లో ముందస్తుగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. బుధవారం రాత్రి 12 గంటల తరువాత ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ న్యూఇయర్ విషెస్ చెప్పుకొన్నారు. గురువారం జిల్లాలోని ఆలయాలకు, చర్చికి భక్తు లు భారీగా తరలిరానున్న నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
గ్రామాలకు బస్సులు నడపండి
మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి నిజాంపేట(మెదక్): మండలంలోని పలు గ్రామాలకు బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సరిపడా బస్సులు నడపాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల శశిధర్‌రెడ్డి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంపేట మండలంలోని నస్కల్, నందగోకుల్, రాంపూర్ మీదుగా గతంలో బస్సులు నడిచేవన్నారు. రోడ్డు దుస్థితి కారణంగా డిపో మేనేజర్లు వాటిని నిలిపివేశారు. అలాగే మండలంలోని రాయిలాపూర్, బచ్చురాజ్‌పల్లి, తిప్పన్నగుల్ల, కల్వకుంట, నార్లాపూర్ మీదుగా మరో బస్సు నడిచేదని తెలిపారు. బస్సు సర్వీసులు నిలిపివేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పై చదువుల కోసం సుమారు వందకు పైగా విద్యార్థులు రా మాయంపేట, సిద్దిపేటకు తరలివెళ్తుంటారు. కావున మండలంలోని పలు గ్రామాలకు బస్సులు నడపాలని కోరారు. . -
సాగు నీరు విడుదల చేయలేం
మెదక్ కలెక్టరేట్: సింగూర్ ప్రాజెక్ట్ మరమ్మతుల కారణంగా వనదుర్గా ప్రాజెక్ట్‌కు నీటి విడుదల ఉండదని, 500 ఎకరాల ఆయకట్టు ఉన్న పొలాలకు నీరిచ్చేందుకు జిల్లావ్యాప్తంగా 9 చెరువులను గుర్తించినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో సమావేశంలో నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరు మండలాల్లో గల ఆయకట్టుకు ఈ రబీకి నీటి విడుదల చేయలేకపోతున్నామన్నారు. జిల్లాలో 500 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న నీరు అందించేందుకు 9 చెరువులను గుర్తించినట్లు చెప్పారు. ఆ చెరువుల ద్వారా వాటి పరిధిలోని ఆయకట్టు పొలాలకు నీరందిస్తామన్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసే దిశగా చర్యలు జరుగుతున్నట్లు వివరించారు. భవిష్యత్తులో జిల్లాలోని రైతులకు సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈమేరకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా సింగూరు నుంచి ఘనపూర్ అనకట్టకు 4.05 టీఎంసీలు వెంటనే విడుదల చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అడ్వైజరీ మీటింగ్‌ను బహిష్కరించి రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నీటి విడుదల చేయని పక్షంలో సాగు చేయలేక నష్టపోయే రైతులకు ఎకరాకు రూ. 25,000 చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.కలెక్టర్ రాహుల్‌రాజ్ -
పుర పోరుకు కసరత్తు
మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు మెదక్ 32 37,045 నర్సాపూర్ 15 16,531 తూప్రాన్ 16 19,222 రామాయంపేట 12 13,112 రామాయంపేట(మెదక్): పుర పోరుకు ప్రభుత్వం సమాయత్తమైంది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి గాను ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో అధికారులు సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎపుడొచ్చినా సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు మంగళవారం ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వారీగా ఒటరు జాబితా తయారీ ప్రక్రియ చేపట్టాలని ఉత్వర్వులు జారీ అయ్యాయి. జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 75 వార్డులకు గాను మొత్తం 85,910 ఓటర్లు ఉన్నారు. ఈమేరకు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 150 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దృష్టి సారించిన పార్టీలు ఫిబ్రవరిలో పుర ఎన్నికలు జరుగుతాయనే సమాచారంతో ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరఫున పోటీ చేయడానికి గాను చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అధికార కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి చాలా మంది ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల సహకారంతో ఈసారి ఎలాగైనా పోటీ చేసి గెలుపొందాలని భావిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన వారు అధిక సంఖ్యలో గెలుపొందడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. 11 నెలలుగా ప్రత్యేక పాలన మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు జనవరి 25తో ముగిసింది. దీంతో గత 11 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. 2020 జనవరి 22న మన్సిపల్ ఎన్నికలు జరగగా, 25న ఫలితాలు వెల్లడయ్యాయి. 28న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 27న ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగుతున్నాయి. డిసెంబర్ 30న పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్ధీకరణ 31న వార్డుల వారీగా విభజన జనవరి 1న వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా జాబితా తయారీ అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం నోటీస్ బోర్డులో ప్రదర్శన 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం. 6న జిల్లా స్థాయిలో సమావేశం 10న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల తుది జాబితా ప్రకటన జనవరి 10న తుది జాబితా ప్రకటన ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు! -
సాగుకు సింగూరు నీళ్లు రావు..
రైతులు పంటలు సాగు చేయవద్దు కొల్చారం(నర్సాపూర్): సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల దృష్ట్యా ప్రాజెక్ట్ దిగువన ఉన్న ఘణపురం ఆనకట్టకు ఈ యాసంగి సీజన్ పంటల సాగుకు అవసరమైన నీరు విడుదల కాదని కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి పేర్కొన్నారు. మంగళవారం రంగంపేటలో, పరిసర గ్రామాల రైతులకు యాసంగి పంట సాగుపై అవగాహన కల్పించారు. ఎగువ నుంచి నీరు విడుదల కాకపోవడంతో మండలంలో మంజీరాపై నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంటలకు నీరు అందే పరిస్థితి లేదన్నారు. ఈ యాసంగి సీజన్లో లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఆధారపడి పంటలు సాగు చేసే రైతులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ రాజశేఖర్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్): నూతన సాంకేతికతకు విద్యార్థులు పదునుపెట్టి వారిలో ఉన్న ఆలోచన శక్తిని బయటకు తీయడం అభినందనీయమని డీఈఓ విజయ అన్నారు. నేషనల్ గ్రీన్ కాంపిటీషన్ ఫర్ ఇకో క్లబ్ స్టూడెంట్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం హవేళిఘణాపూర్ జడ్పీ హైస్కూల్ పాఠశాలలో నిర్వహించగా ఆమె ప్రాజెక్టు నమూనాలను పరిశీలించారు. వినూత్న ఆలోచనలతో ఉపయోగం లేనటువంటి వస్తువులను ఉపయోగపడేలా చేసిన చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆడెపు కరుణాకర్, మండల విద్యాధికారి మధుమోహన్, జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాస్, రాజశేఖర్, సిద్ధిరాములు, రాజేశం, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి తిమ్మాపూర్ లో బంగారమ్మ జాతర మహోత్సవం కనుల పండువగా ముగిశాయి. ప్రతిఏటా మూడు రోజుల పాటు గ్రామస్తులు జాతర నిర్వహించడం ఆనవాయితీ. చివరి రోజు మంగళవారం తూప్రాన్– నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కనున్న ఎలమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. బోనాలు, ఒడిబియ్యం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. -
ముగిసిన ధాన్యం సేకరణ
● 3.78 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు ● రూ. 901. 66 కోట్ల చెల్లింపులు మెదక్‌జోన్: వానాకాలం ధాన్యం సేకరణ పూర్తయ్యింది. సెప్టెంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొదట్లో వర్షాల వల్ల కొంత ఆటంకం జరిగింది. అనంతరం జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాలు ప్రారంభించారు. ఖరీఫ్ లో 3.95 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో 1.20 లక్షల ఎకరాల్లో సన్నరకం, 2.75 లక్షల ఎకరాల్లో దొడ్డురకం సాగు చేశారు. వాటిలో ఆహార అవసరాలు, విత్తనాలకు పోను 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు పీఏసీఎస్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో 518 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేకంగా సన్నధాన్యం కోసం 100, దొడ్డు ధాన్యం సేకరణకు 418 సెంటర్లు కేటాయించారు. రెండు నెలల పాటు.. జిల్లావ్యాప్తంగా రెండునెలల పాటు 3.78 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అధికారుల అంచనా ప్రకారం కేవలం 2 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే తక్కువగా వచ్చింది. ఇందులో సన్నరకం 1.43 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2.35 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం సేకరించారు. ఇందుకు సంబంధించి క్వింటాల్ ధాన్యానికి రూ. 2,389 లెక్కన రూ. 903.14 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా, మంగళవారం వరకు రూ. 901.66 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.1.48 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఆ చెల్లింపులు సైతం పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. బోనస్ రూ. 45.85 కోట్లు సన్నాలకు ప్రభుత్వం అదనంగా క్వింటాల్‌కు రూ. 500 చెల్లిస్తుండటంతో ఈ ఏడాది 1.20 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకు సంబంధించి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం విక్రయించారు. క్వింటాల్‌కు రూ. 500 చొప్పున రూ. 71.6 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.45.85 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. ఇంకా రూ. 25.75 కోట్లు బకాయిలు ఉన్నాయి. మరో వారం రోజుల్లో పూర్తి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాదివి పెండింగ్.. ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణతో పాటు డబ్బుల చెల్లింపులు సైతం చకచకా జరిగినప్పటికీ, గత రబీ సీజన్‌కు సంబంధించిన బోనస్ రూ.31.37 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బుల కోసం రైతులకు ఎదురు చూపులు తప్పటం లేదు. అప్పటి చెల్లింపులు సక్రమంగా జరిగి ఉంటే మరింత మంది రైతులు సన్నాలు సాగు చేసే వారని పలువురు పేర్కొంటున్నారు. -
యూరియాపై ఆందోళన వద్దు
● సాగుకు సరిపడా నిల్వలు ● కలెక్టర్ రాహుల్ రాజ్ కొల్చారం(నర్సాపూర్): జిల్లాలో సాగుకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన పడవద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆగ్రో సేవా కేంద్రం, పీఏసీఎస్‌ను తనిఖీ చేశారు. సంబంధిత కేంద్రాల్లో ఎరువుల నిల్వలపై ఆరా తీయడంతో పాటు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ... అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటికే 12,673 యూరియా జిల్లాకు వచ్చిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అక్టోబర్ నెల నుంచి 28 డిసెంబర్ వరకు 7,343 మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు జరగగా, ఇంకా జిల్లాలో 5,146 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఫర్టిలైజర్ యాప్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత యాప్ ద్వారా రైతులు ఎన్ని బస్తాలు కావాలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్ చారి, కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి, ఏఈఓలు, రైతులు ఉన్నారు. పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావొద్దు మెదక్ కలెక్టరేట్: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు నా కోసం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారు పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా చలి నుంచి రక్షణ పొందేందుకు దుప్పట్లు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. వాటిని త్వరలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దుప్పట్లు అందించడం వల్ల వారి ఆరోగ్య రక్షణకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. -
గణితంపై ఆసక్తి పెంచుకోవాలి
మెదక్ కలెక్టరేట్: విద్యార్థి దశలోనే గణితం పట్ల అభిరుచిని పెంచుకోవాలని, ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. చిన్నప్పుడు టాలెంట్ టెస్ట్‌లో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతిభా వంతులైన విద్యార్థులు వెనుకబడిన విద్యార్థులకు సహకరించాలని కోరారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సమగ్ర శిక్ష అధికారులు నవీన్, రాజు, టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
న్యూ జోష్‌కు రెడీ
తుప్రాన్: 2025కి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జిల్లావ్యాప్తంగా చిన్నాపెద్ద సిద్ధమయ్యారు. ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా యువత పార్టీలు, దావత్‌లు అంటూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. కొంతమంది ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు. డ్రంకెన్ డ్రైవ్ వంటివి చేయొద్దని, హద్దు మీరితే అవస్థలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కొంగొత్త ఆశలతో.. కాలగర్భంలో మరో ఏడాది నేటితో గడిచిపోనుండగా కొంగొత్త ఆశలతో నూతన ఆంగ్ల సంవత్సరాదికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్‌కు కావాల్సిన కేకులు, స్వీట్లు, బిర్యానీలకు గిరాకీ ఉండడంతో మార్కెట్లో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అలాగే ఇళ్ల ముంగిటలో వేసే రంగవల్లులు అబ్బుర పర్చనున్నాయి. ఇప్పటికే కొంతమంది వీటికి కావాల్సిన రంగులను కొనుగోలు చేశారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువర్గంతో సంబురాలు జరుపుకొనేలా ప్లాన్ చేసుకుంటున్నారు. భలే ఆఫర్లు.. న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని ముందస్తుగానే ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేశారు. చికెన్, మటన్, ఫిష్ బిర్యానీలతో పాటు జంబో, ఫ్యామిలీ ప్యాక్‌లతో ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బుకింగ్ నడుస్తున్నాయి. కేక్‌లు, స్వీట్ల కొనుగోలుకు గిరాకీ పెరిగింది. మద్యం దుకాణాలు సైతం అదే స్థాయిలో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా యువత సంబురాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉండటం విశేషం. 2025కు వీడ్కోలుపలికేందుకు అంతా సిద్ధం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు జాగ్రత్తలు సూచిస్తున్న పోలీసులు -
సాఫ్ట్‌బాల్ పోటీల్లో మెదక్ జట్టుకు సిల్వర్ మెడల్
మనోహరాబాద్(తూప్రాన్): మూడు రోజులుగా మండల కేంద్రంలో జరుగుతున్న 10వ తెలంగాణ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ అండర్–14 పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. సోమవారం నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. మొత్తం 21 జట్లు క్రీడల్లో పాల్గొనగా నిజామాబాద్ జట్టు గోల్డ్‌మెడల్, మెదక్ జట్టు సిల్వర్ మెడల్ సాధించాయని, ఉత్తమ ఆటగాడిగా మెదక్ టీంకు చెందిన శ్రీరామ్ ఎంపికై నట్లు తెలిపారు. విజేతలకు గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అనూష, జాతీయ సాఫ్ట్‌బాల్ సంఘం సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభిషేక్‌గౌడ్, నారాయణగుప్తా, ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, మెదక్ జిల్లా యువజన, క్రీడల అధికారి రమేశ్, జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ శర్మ, కోశాధికారి గోవర్ధన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నేరాలు పెరిగాయి
● వివిధ కేసుల్లో 8 మందికి జీవిత ఖైదు ● వార్షిక నివేదికను వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావుమెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరాలు, హత్యలు, అత్యాచారాలతో గతేడాది కంటే ఈఏడాది జిల్లాలో 9.6 శాతం క్రైం రేట్ అధికంగా పెరిగింది. గత సంవత్సరం జిల్లావ్యాప్తంగా 4,871 కేసులు నమోదు కాగా, ఈసారి ఆసంఖ్య 5,388కు పెరిగింది. సోమవారం వార్షిక నివేదికను ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆర్థిక దోపిడీలు, ఆస్తి హత్యలు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్, మోసాలు, హత్యాయత్నాలు వంటి ప్రధాన నేరాలు గతేడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. అలాగే రోడ్డు ప్రమాదాలు 29 శాతం తగ్గుదల నమోదయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్ , ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలతో రోడ్డు ప్రమాద మ రణాలు గణ నీయంగా తగ్గాయని స్పష్టం చేశారు. గతేడాది డీడీ (ఈఈ) కేసులు 6,500 నమోదు కాగా, ఈ సంవత్సరంలో 11,800 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 2024లో గేమింగ్ యాక్ట్ కింద 38 కేసులు నమోదు కాగా, 265 మంది అరెస్టు చేసి రూ. 9.70 లక్షలు సీజ్ చేశారు. ఈ ఏడాది 73 కేసులు నమోదు చేసి 472 మందిని అరెస్టు చేశారు. రూ. 18 లక్షల 18 వేల నగదు సీజ్ చేశారు. మిస్సింగ్ కేసులు సైతం గతేడాది 397 నమోదు కాగా, ఈసారి ఆ సంఖ్య 454కు పెరిగింది. వివిధ కేసుల్లో 8 మందికి జీవిత ఖైదు విధించారు. సంచలనం సృష్టించిన కేసులు కొల్చారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పైతరకు చెందిన అనిల్ పాత కక్షల నేపథ్యంలో తుపాకి తూటా కు బలయ్యాడు. ఈ ఏడాది జూలైలో జరిగిన ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి శివా రు ఏడుపాయల దారిలో గిరిజన మహిళా కూలీపై జరిగిన హత్యాచారం సంచలన కేసుగా నమోదైంది. ఈ కేసును పోలీసులు వారం రోజుల్లో చేధించారు. జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలో గల ఐటీసీ కంపెనీలో రూ. 15 లక్షల విలువైన వస్తువుల చోరీ కేసు సైతం జిల్లాలో సంచలనంగా మారింది. రెండేళ్లలో జరిగిన నేర వివరాలివి.. నేరాలు 2024 2025 హత్యలు 28 30 ఆస్తి హత్యలు 13 04 కిడ్నాప్‌లు 41 44 అత్యాచారాలు 48 56 రోడ్డు ప్రమాదాలు 636 598 మృతులు 350 247 క్షతగాత్రులు 625 598 సైబర్ నేరాలు 809 762 కోల్పోయిన డబ్బులు 4,28,67,672 3,73,16,252 రికవరీ 2,95,19,044 60,04,588 కట్టడి చేశాం జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పటిష్టమైన బందోబస్తుతో నిర్వహించడంలో కీలకపాత్ర పోషించాం. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టడి చేశాం. జిల్లాలో ఐదు విడతలుగా లోక్ అదాలత్‌లు నిర్వహించి 1,827 కేసులు పరిష్కరించాం. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడంలో ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాం. ప్రజలు పోలీస్‌శాఖతో కలిసి పనిచేసినప్పుడే శాంతియుత, సురక్షిత సమాజం సాధ్యమవుతుంది. – డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ -
కలిసిరాని కాలం
రైతులకు ఈ ఏడాది కష్టాలు, కడగండ్లు ఎదురయ్యాయి. భారీ వర్షాలు ఆగమాగం చేయగా, చెరువులు, కుంటలు తెగి పంటలు నీటి పాలయ్యాయి. వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. సకాలంలో యూరియా దొరకక రైతులు పడరాని పాట్లు పడ్డారు. తీరా పంటలు చేతికొచ్చే సమయంలోనూ వర్షాలు పడటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్ అందజేస్తుండటంతో కొంత ఊరట కలిగింది. – మెదక్‌జోన్ జిల్లాలో 2025 సంవత్సరం వ్యవసాయానికి కలిసి రాలేదు. యాసంగిలో 2.96 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా మార్చి, ఏప్రిల్, మేలో కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు సుమారు 1,507 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతి న్నాయి. ఇందులో సింహభాగం వరి కాగా, రెండో స్థానంలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. వేలాది కాయలు నేలరాలాయి. నష్టాన్ని అంచనా వేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించినా పైసా పరిహారం రాలేదు. ఆగస్టులో ముంచేసింది ఇక వానాకాలంలో 3.26 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన అతిభారీ వర్షాలకు నీటి వనరులు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు తెగిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 10,769 ఎకరాల్లో వివిధ రకాల పంటలు ధ్వంసం అయినట్లు ఆశాఖ అధికారులు తేల్చి చెప్పారు. వీటిలో 2 వేల ఎకరాలకుపైగా పొలాల్లో ఇసుక మేటలు కప్పేశాయి. ప్రభుత్వం పరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ పేరిట ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. ఈ లెక్కన బాధిత రైతులకు రూ. 12.27 కోట్లకు పైగా అందాల్సి ఉండగా, ఇప్పటివరకు పైసా మంజూరు చేయలేదు. పంట పొలాల్లో ఇసుక మేటలు భారీగా వచ్చిన వరదలతో 1,200 ఎకరాలకు పైగా పంటపొలాల్లో ఇసుక మేటలు కప్పేశాయి. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బోరుబావుల్లో మోటార్లు పడిపోవటంతో మరింత నష్టం జరిగింది. ఇసుక మేటలను తొలగించేందుకు రైతులు ఎకరాకు రూ. 50 నుంచి రూ. 70 వేల వరకు ఖర్చు చేశారు. ఇది ఎక్కువగా మంజీరా, హల్దీవాగు పరివాహాక ప్రాంతంతో పాటు కామారెడ్డి–మెదక్ జిల్లాల సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు దిగువన గల పోచమ్మరాల్, జక్కన్నపేట, సర్దన, హవేళిఘణాపూర్ తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. చెరువులకు మరమ్మతులు కరువు భారీ వరదల కారణంగా తెగిన చెరువులకు మరమ్మతులు చేసేందుకు నేటికీ పైసా విడుదల కాలేదు. దీంతో రాయినిపల్లి ప్రాజెక్టు ఆయకట్టు కింద 3 వేల ఎకరాలు, మెదక్ మండల పరిధి అవుసులపల్లి చెరువు కింద 100 ఎకరాలు, హవేళిఘణాపూర్ పెద్ద చెరువు కింద 220 ఎకరాలు, ఇదే మండలం అనంతసాగర్ ఊర చెరువు వెనకాల 50 ఎకరాల చొప్పున 3,320 ఎకరాలు బీళ్లుగా మారాయి. ఘనపూర్ కింద క్రాప్ హాలిడే! సింగూరు ప్రాజెక్టు పరిధిలో గల పాపన్నపేట మండలం ఘనపూర్ ప్రాజెక్టు కింద 25 వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టు ఉంది. ఏటా రెండు పంటలు సాగవుతుండగా, ఈ ఏడాది సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి నీటిని వదిలేసి మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రాజెక్టు కింద సాగయ్యే పంటలకు క్రాప్ హాలిడేను ప్రకటించారు. దీంతో అన్నదాతల పరిస్థితి ఈ ఏడాది గోటిచుట్టపై రోకలి పోటులా మారింది. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది యూ రియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆగస్టులో వరి పంటకు యూరియా వేయాలి. ఆ సమయంలో జిల్లాకు సరిపడా యూరియా రాకపోవటంతో రైతులు రోజులు తరబడి పడిగాపులు కాశారు. యూరియాను సరైన సమయంలో చల్లకపోవడంతో వరి దిగుబడిపై ప్రభావం చూపింది. దీంతో రైతులు నష్టాలు చవిచూశారు. ఆగమైన ఎవుసం రైతులను వెంటాడినప్రకృతి వైపరీత్యాలు జిల్లాలో దెబ్బతిన్న వరి, పత్తి పంటలు ఇంకా చేతికందని పరిహారం -
యూరియా సరిపడా ఉంది
● రైతులకు అవసరానికి అందిస్తాం ● కలెక్టర్ రాహుల్‌రాజ్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ముందస్తు చర్యల్లో భాగంగా ఈనెల 28 నాటికి 12,673 మెట్రిక్ టన్నుల జిల్లాకు చేరుకున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే 7,343 మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు జరగగా, ఇంకా జిల్లాలో 5,330 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో కలెక్టర్ గన్‌మెన్ ప్రభాకర్‌గౌడ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రజిత పతకం సాధించగా, కలెక్టర్ అభినందించారు.ఇదే స్ఫూర్తి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజావాణి కి 64 అర్జీలు అంతకు ముందు జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల తరలివచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 64 అర్జీలు సమర్పించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక కొనుగోలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వ నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను సాండ్ బజార్లో నిల్వ చేస్తామని తెలిపారు. త్వరలోనే మెదక్‌లో సైతం సాండ్ బజార్ ప్రారంభిస్తామన్నారు. ఎక్కడ ఇసుక అక్రమ రవాణా జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సింగూరు ఖాళీ చేయొద్దు
అసెంబ్లీలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేయకుండానే మరమ్మతులకు అవకాశం ఉ న్నందున, మొత్తం ఖాళీ చేయకుండా మరమ్మతుల విషయాన్ని పరిశీలించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అసెంబ్లీలో కోరారు. ప్రాజెక్టు ద్వారా జంట నగరాలతో పాటు ఖేడ్, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లాకు తాగునీరు అందుతోందన్నారు. వర్షాకాలంలో పుష్కలంగా నీళ్లు చేరినా దిగువకు వదిలారని పేర్కొన్నారు. మరమ్మతుల కోసం పూర్తిగా ఖాళీ చేస్తే సాగు, తాగు నీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయన్నారు. 1.60 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఖేడ్ నియోజకవర్గంలో రోడ్లకు నిధులు మంజూరైనా, అటవీశాఖ అనుమతులు రాని కారణంగా చేపట్టని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదు పంచాయతీలతో కొత్త మండలాలు ఏర్పాటు చేయగా, 14 పంచాయతీలు ఉన్న తడ్కల్‌ను మండల కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. -
నీటి విడుదలపై స్పష్టత ఇవ్వండి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మెదక్ కలెక్టరేట్: సింగూరు నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలని, లేదా క్రాప్ హాలిడే ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు నీటి విడుదలపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారని తెలిపారు. ప్రతి పంటకు సాగు నీరందించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. వానాకాలం నష్ట పరిహారం ఇప్పటివరకు రైతులకు చెల్లించలేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. అనంతరం సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొండల్‌రెడ్డిని పరామర్శించారు. ఆమె వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లతో పాటు నాయకులు ఉన్నారు. సాగు నీరు విడుదల చేయలేం జిల్లాలో యాసంగికి సింగూరు నీరు విడుదల చేయలేమని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగూరు పాజెక్టు మరమ్మత్తుల దృష్ట్యా ఘనపూర్ ఆనకట్టకు సాగునీరు విడుదల చేయ లే మని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పరిధిలోని కొల్చారం, పాపన్నపేట, మెదక్, హవేళిఘణాపూర్ మండలాల్లోని ఆయకట్టు రైతులు గమనించి సహకరించాలని కోరారు. మరింత సమాచారం కోసం 7093604017, 8977750785 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ముక్కోటికి నాచగిరి ముస్తాబు
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం, వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలోని వేంకటేశ్వరాలయాలు ‘ముక్కోటి’ ఏకాదశి పర్వదిన వేడుకలకు ముస్తాబయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటలకు వైకుంఠ ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. ముక్కోటి మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామని నాచగిరి చైర్మన్ పల్లెర్ల రవీందర్‌గుప్తా, ఈఓ విజయరామారావు పేర్కొన్నారు. వర్గల్ కోవెలలో.. వర్గల్ వేంకటేశ్వరాలయంలో తెల్లవారుజాము 3.00 గంటలకు అభిషేకం, 5.30 గంటల వరకు అలంకార సేవ, 5.45 గంటల వరకు ఉత్తర ద్వార పూజ, 6.00 గంటల నుంచి ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి తులసి అర్చన, పంచసూక్త పారాయణాలు జరుగుతాయని ఆలయ మేనేజర్ రఘుపవన్రావు తెలిపారు.వర్గల్‌లోని వేంకటేశ్వరాలయం -
పల్లెల్లో జీవనోపాధి కేంద్రాలు
● ఉపాధి నిధులతో వర్క్షెడ్ల నిర్మాణం ● భవనానికి రూ. 10 లక్షల కేటాయింపు ● ఉత్తర్వులు, మార్గదర్శకాలుజారీ చేసిన ప్రభుత్వంపెద్దశంకరంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. గ్రామీణ మహిళల కోసం ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాతీయ ఉపాధి హామీ పథకం (వీజీ– జీరాంజీ) ద్వారా ప్రతీ గ్రామంలో రూ.10 లక్షలతో వర్క్షెడ్ల నిర్మాణానికి అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 13,256 ఎస్‌హెచ్‌జీ గ్రూపులు ఉండగా, 1,37,256 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికి జిల్లాలోని 902 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తులు కుట్టే పనితో పాటు పలు పథకాల కింద మహిళలకు స్వయం ఉపాధిని ప్రభుత్వం కల్పిస్తోంది. మహిళా సంఘాలు టెస్కో ద్వారా వచ్చిన వస్త్రాలను సంఘం సభ్యుల ద్వారా కుట్టి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ విధానంలో పలు సమస్యలు రావడంతో మహిళా సమాఖ్యలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో పాటు పలు అంశాలపై ప్రభుత్వం కసరత్తు నిర్వహించి దుస్తులు కుట్టడంతో పాటు ఆహార శుద్ధి, ఇతర జీవనోపాధి అవకాశాలను అందించేందుకు వర్క్షెడ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ప్రతీ గ్రామంలో ఏర్పాటు జిల్లావ్యాప్తంగా ప్రతీ గ్రామంలో మహిళా సమాఖ్య సభ్యులకు వర్క్షెడ్లు నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. 200 చదరపు గజాల స్థలంలో భవనం నిర్మించనున్నారు. ఇందులో విశాలమైన హాల్‌తో పాటు టాయిలెట్లు, రెండు తలపులు, 6 కిటికీలు, ఆరు సీలి ంగ్ ఫ్యాన్లు, 8 ట్యూబ్‌లైట్లు, 7 ఫ్లోర్‌సెంట్ లైట్లు ఉండాలని సూచించింది. ఈ భవన నిర్మాణం కోసం ఉపాధి హామీ నిధులను వినియోగించనున్నారు. గ్రామసభల తీర్మానం తప్పనిసరి ప్రతీ గ్రామంలో వర్క్షెడ్ల నిర్మాణానికి గ్రామసభల తీర్మానం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్క్షెడ్ల నిర్మాణం కోరుతూ మహిళా సమాఖ్యలు పంచాయతీకి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఈ తీర్మానాలను ఎంపీడీఓకు అందజేయాలి. వారు స్థల పరిశీలన అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల ద్వారా కలెక్టర్‌కు సమర్పిస్తారు. కలెక్టర్ ఆదేశానుసారం ఉపాధి హామీ సామగ్రి వాటా నిధులతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వర్క్షెడ్లు నిర్మించాల్సి ఉంటుంది. ఈ భవనాలు నిర్మితమైతే మహిళా సమాఖ్య సభ్యులకు గ్రామాల్లోనే ఉపాధి దొరుకుతుంది. -
వృథాగా జలం..
పట్టించుకోరేం.. మండలంలోని నారాయణపూర్‌లో తాగునీరు వృథాగా పోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. గ్రామ ప్రధాన రహదారి వద్ద ఉన్న బోరు మోటార్ నుంచి సమీప ప్రజలు తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. మిగితా సమయంలో బోరు మోటార్‌ను ఆఫ్ చేసేవారు లేకపోవడంతో రోజంతా తాగునీరు మురికి కాలువ పాలవుతోంది. అధికారులు, పంచాయతీ పాలకవర్గం సైతం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్టార్టర్ బోర్డు ఏర్పాటు చేసి నీరు వృథా అవ్వకుండా అరికట్టాలని కోరుతున్నారు. – నర్సాపూర్ రూరల్ -
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
పెద్దశంకరంపేట(మెదక్): నూతన సర్పంచ్‌లు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దశంకరంపేట మండలంలో ఇటీవల నూతనంగా గెలిచిన పలువురు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అధ్వర్యంలో హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈసందర్భంగా ఆయన నూతన ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, నాయకులు సురేశ్‌గౌడ్, సత్యనారాయణ, అంజయ్య, రవీందర్, కృష్ణ, నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా మారుతిరెడ్డి నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కోర్టు అదనపు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన న్యాయవాది మారుతిరెడ్డిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖతో పాటు తన నియామకానికి కృషి చేసిన వారికి మారుతిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి సంగారెడ్డి: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొ ని మాట్లాడారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. న్యాయబద్ధమైన ఉద్యమానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికై న జిల్లా అవుట్ సో ర్సింగ్ జేఏసీ అధ్యక్షుడు ప్రకాశ్‌నాయక్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయా ల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ఐక్యంగా పోరాటం చేద్దామన్నా రు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం జిల్లా జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మనోహరాబాద్(తూప్రాన్): వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని లింగారెడ్డిపేటకు చెందిన పలు పార్టీల నాయకులు సుమారు 50 మంది బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, నాయకులు వెంకటేశ్‌గౌడ్, పాలాట సర్పంచ్ సా యిగౌడ్, సీనియర్ నాయకులు పురం మహేశ్, అర్జున్, భిక్షపతి, కుమార్‌గౌడ్, నాగభూషణం, పర్శరాంగౌడ్, కృష్ణగౌడ్, సాయి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు
మెదక్‌జోన్: పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాందాస్ చౌరస్తాలో జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ తల్లి లాంటిదన్నారు. స్వాతంత్య్ర పోరాటం, దేశ నిర్మాణంలో ఎనలేని పాత్ర ఉందని కొనియాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, టీపీసీసీ పరిశీలకులు శ్రవణ్‌కుమార్, వ రప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కాగా జిల్లా కమిటీ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చంద్రపాల్, సుప్రభాత్ రావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు అధికార దాహం ఎక్కువ నర్సాపూర్: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డికి పదవి ఆకాంక్ష, అధికార దాహం ఎక్కువని డీసీసీ అద్యక్షుడు ఆంజనేయులుగౌడ్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ భిక్ష పెట్టిన తల్లిలాంటి కాంగ్రెస్‌కు మోసం చేసి బీఆర్ఎస్లో చేరారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ఆ పార్టీ నాయకులు ఇసుకను అమ్ముకున్నారని మండిపడ్డారు. తమ పార్టీలోని కొందరు నాయకులు ఇతర పార్టీ నాయకులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని పార్టీకి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
‘హక్కుల కోసం పోరాటం’
పటాన్చెరు టౌన్: ఐక్య పోరాటాల సారధి సీఐటీయూ అని సంఘం జిల్లా కోశాధికారి రాజయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రామిక భవన్లో జరిగిన సీఐటీయూ కార్య కర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 31వ తేదీ నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభలను కార్మిక వర్గం జయప్రదం చేయాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో నాయకులు శేషగిరి, త్రిమూర్తులు, జయకుమార్, చంద్రకిరణ్ సింగ్, శ్రీనివాస్, నారాయణ, రాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న సాఫ్ట్‌బాల్ పోటీలు మనోహరాబాద్(తూప్రాన్): మండల కేంద్రంలో రాష్ట్రస్థాయి అండర్–14 సాఫ్ట్‌బాల్ పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం మెదక్, నిజామాబాద్, సిద్దిపేట, జగిత్యాల, హన్మకొండ, హైదరాబాద్, మంచిర్యాల, ని ర్మల్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయని నిర్వాహకులు తెలిపారు. -
వరినాట్లపై చలి పంజా
మెదక్‌జోన్: అన్నదాతలకు యాసంగి ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. గత 15 రోజు లుగా జిల్లాలో ఉష్ణోగత్రలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాయి. దీంతో వరి నాటు వేసిన పొలాలు చలికి దెబ్బతింటున్నాయి. జిల్లావ్యాప్తంగా రబీలో 3,17,380 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 2,95,200 ఎకరాల్లో వరి, 22,180 ఎకరాల్లో కూరగాయలతో పా టు ఆరుతడి పంటలు సాగు కానున్నట్లు పేర్కొన్నారు. కాగా జిల్లాలో చెప్పుకోదగిన సాగునీటి ప్రాజెక్టులు లేకపోవటంతో బోరుబావుల ఆధారంగానే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కాగా ముందుగా నాట్లు వేస్తే బోరుబావుల్లో నీటి ఊటలు తగ్గక ముందే మార్చిలో పంటలు చేతికందుతాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే 40 వేల ఎకరాల్లో వరిసాగు చేసినట్లు సమాచారం. అయితే వేసిన నాట్లు ఏ మాత్రం ఎదగకపోగా, చలి తీవ్రతకు నాటంతా చనిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి హైబ్రిడ్ విత్తనాలు కొనుగోలు చేసి నాట్లు వేస్తే చనిపోతున్నాయని వాపోయారు. మళ్లీ దున్ని నాట్లు వేద్దామంటే నారు లేదని, మళ్లీ తుకాలు పోద్దామంటే పుణ్యకాలం గడిచిపోతుందని ఆవేదన చెందుతున్నారు. ఎదుగుదల లేక దెబ్బతింటున్నపంటలు యాజమాన్య పద్ధతులుపాటించాలంటున్న అధికారులు -
ఎమర్జెన్సీ తర్వాత కష్టకాలంలో ఇందిరాగాంధీని అక్కున చేర్చుకొని అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించి.. దేశానికి ప్రధానిని అందించిన ఘనత మెతుకుసీమది. చల్లబడ్డ తెలంగాణ వాదాన్ని రగిలించి.. రాష్ట్ర సిద్ధి కోసం సోపానాలు పరిచిన పోరాట పటిమ ఇక్కడి ప్రజల సొంతం. అందుకే
● కాంగ్రెస్‌కు కలిసొచ్చినపంచాయతీ ఎన్నికలు ● సమరోత్సాహంలో బీఆర్ఎస్ ● ఉనికి చాటుకున్న బీజేపీ పల్లెల్లో కాంగి‘రేసు’ 2025 ఆరంభంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న కాంగ్రెస్‌కు పంచాయతీ ఎన్నికలు కలిసొచ్చాయి. 25 డిసెంబర్ 2024న సీఎం రేవంత్‌రెడ్డి మెదక్ పర్యటనలో భాగంగా చర్చి, ఏడుపాయలను సందర్శించి సుమారు రూ. 58 కోట్ల నిధులను మంజూరు చేయడంతో కేడర్‌లో ఉత్సాహం పెరిగింది. అయితే ఫిబ్రవరిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాజయం ఎదురైంది. పార్టీ బలపరిచిన నరేందర్‌రెడ్డి పరాజయం పాలయ్యారు. రామాయంపేట ఏఎంసీ చైర్మన్ గంగా నరేందర్, జీవన్‌రావు, ఎమ్మెల్యే సొంత గ్రామానికి చెందిన రంగారావు తదితరులు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. మెదక్ కోదండ రామాలయాన్ని ఎండోమెంట్లో కలపడంతో వీహెచ్‌పీ, బీజేపీ, బీఆర్ ఎస్‌లు ఆందోళనకు దిగాయి. జిల్లాలో యూరియా కోసం రైతులు చేపట్టిన ఆందోళనలతో కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది. గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ ఎన్నిక సమయాన, కాంగ్రెస్‌లో లుకలుకలు బయటపడ్డాయి. మెదక్ మండలం జానకంపల్లి శివారులోని హల్దీ వాగు నుంచి కాంగ్రెస్ నాయకుల అండతో పెద్దఎత్తున ఇసుక తరలిస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. అక్రమ వ్యాపారులు ఇటాచీలు, టిప్పర్లు సర్దుకొని తోక ముడిచారు. ఖరీఫ్‌లో బోనస్ చెల్లింపు, పార్టీ ప్రతిష్టను పెంచింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం 2025 ఇచ్చిన గిఫ్ట్‌గా భావించవచ్చు. మొత్తం 492 పంచాయతీల్లో 248 సర్పంచ్‌లు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలవటంతో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ నాయకులు కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్నారు. కారులో వర్గపోరు బీఆర్ఎస్కు కంచుకోటగా విరాజిల్లిన మెదక్ ఖిల్లాలో హస్తం హవా వీస్తుంది. 2025 పార్టీకి మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. పార్టీలో ఇరువురు నాయకుల మధ్య ఉన్న వర్గపోరు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తుంది. ఆ ఇద్దరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి వెళ్లినా విడివిడిగానే ఉంటున్నారు. ఒక వేళ కలిసినా, ఎడముఖం, పెడముఖంగానే వ్వవహరిస్తున్నారు. బహిరంగా సమావేశాల్లో రాబోయే ఎన్నికల్లో నేనే ఎమ్మెల్యేనంటూ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి స్వరం పెంచడం అయోమయానికి దారి తీస్తుంది. యూరియా ఆందోళనలో బీఆర్ఎస్ చురుగ్గా పాల్గొంది. రుణమాఫీ, బోనస్ చెల్లింపుపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, పద్మారెడ్డి, శశిధర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో జరిపిన ఆందోళన ప్రజల్లో చైతన్యం రగిలించింది. గత నెలలో జాగృతి అధ్యక్షురాలు కవిత జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించి పార్టీని ఇరకాటంలో పెట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్‌రావుపై చేసిన విమర్శలు గందరగోళం సృష్టించాయి. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 172 పంచాయతీలు గెలుచుకొని కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చింది. మూడో విడత ఎన్నికల్లో 84 స్థానాలతో మొదటి స్థానంలో నిలిచింది. హల్దీ నుంచి ఇసుక అక్రమ రవాణాను ఆందోళన ద్వారా అడ్డుకోగలిగింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ఆందోళన నిర్వహించింది. కాగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి స్వగ్రామం కోనాపూర్‌లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఓడిపోవడం కొసమెరుపు. మెతుకుసీమలో కమలం వాడింది. 2025లో పార్టీ ఉనికి చాటుకోవడానికి నానాపాట్లు పడాల్సి వచ్చింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మల్క కొమురయ్య, అంజిరెడ్డి విజయం సాధించడం పార్టీకి పెద్ద ఊరటగా భావించవచ్చు. ఫిబ్రవరిలో వాల్దాస్ మల్లేశ్‌గౌడ్‌ను జిల్లా పార్టీ అధ్య క్షుడిగా నియమించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందనే ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ వివరించలేకపోతున్నారు. కొంతమేర ఆందోళనలు నిర్వహించినప్పటికీ ఆశించిన ఫలితాలు పొందలేకపోయిందనే ప్రచారం ఉంది. కాగా పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల కనీసం పోటీకి దిగే సాహసం చేయక పోవడం, పార్టీ కేడర్ బ లహీనతను తెలియజేసింది. జిల్లాలో కేవలం 17 చోట్ల మాత్రమే విజయం సాధించింది. రెండు, మూడో విడత ఎన్నికల్లో మాత్రమే ఉనికి చాటుకుంది. కమలం.. కకావికలం -
జీవాలకు టీకాలు తప్పనిసరి
మనోహరాబాద్(తూప్రాన్): జీవాలకు సీజనల్ వ్యాధులు రాకుండా రైతులు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య సంచాలకుడు వెంకటయ్య అన్నారు. శనివారం మ ండలంలోని కాళ్లకల్‌లో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జీవాలకు మందుల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. అంతకుముందు సర్పంచ్ నవ్య నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తూప్రాన్ ఉమ్మడి మండల పశు వైద్యాధికారి లక్ష్మి, ఉప సర్పంచ్ ప్రవీణ్, సిబ్బంది రవి, మల్లేశ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంట్‌కు చీకోడ్ విద్యార్థి
పాపన్నపేట(మెదక్): ‘మన నాయకుడిని తెలుసుకోండి ’కార్యక్రమం పేరిట ఎంపికై న చీకోడ్– లింగాయపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి శివ చైతన్య శనివారం ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలలో పదో తరగతి చదవుతున్న శివ చైతన్య ఎన్సీఈఆర్టీ ద్వారా ఈ కార్యక్రమానికి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా, జిల్లా నుంచి ఒకే విద్యార్థి ఎంపిక కావడం విశేషం. ఈ మేరకు పార్లమెంట్ ప్రతినిధి శివచైతన్యకు బహుమతి అందజేశారు. గైడ్ టీచర్‌గా కిషన్ ప్రసాద్ వ్యవహరించారు. -
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
అభివృద్ధిలో వెనకబడిన మెతుకుసీమ వడివడిగా పురోగతి దిశగా సాగుతోంది. ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లాకు సుమారు రూ. 1,400 కోట్ల పైచిలుకు నిధులు విడుదల అయ్యాయి. వీటితో పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. – మెదక్జోన్కొనసాగుతున్న మెదక్ – సిద్దిపేట రహదారి పనులు మెదక్ నుంచి సిద్దిపేట వరకు 67 కిలోమీటర్ల 765 (డీజీ) రెండు లేన్ల రోడ్డు నిర్మాణం కోసం రూ. 800 కోట్లు మంజూరు కాగా, పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెదక్, పాతూర్, అక్కన్నపేటలో పనులు చేయాల్సి ఉంది. అలాగే రామాయంపేట అటవీ ప్రాంతంలో కొంతమేర పనులు నిలిచిపోయాయి. అలాగే రామాయంపేటలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి రూ. 205 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మెదక్ చర్చి అభివృద్ధికి రూ. 30 కోట్లు మంజూరు కాగా, పనులు కొనసాగుతున్నాయి. ఏడుపాయల కమాన్ నుంచి ఆలయం వరకు 7 కిలో మీటర్ల మేర డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 35 కోట్లు మంజూరయ్యాయి. అలాగే మెడికల్ కాలేజీ భవనం, వసతి గృహ నిర్మాణాలకు రూ. 180 కోట్లు, నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరు కాగా, ఇటీవల టెండర్ ప్రక్రి య సైతం పూర్తి అయింది. మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు పనులు ప్రారంభించారు.రూ. 1,400 కోట్లు మంజూరు మెడికల్, నర్సింగ్ కాలేజీలనిర్మాణ పనులు ప్రారంభం నాలుగు లేన్ల రోడ్లతోతీరనున్న ఇబ్బందులుఆర్వోబీకి అడుగులు చేగుంట రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి రూ. 47 కోట్లు మంజూరు కాగా, ఇటీవల విద్యుత్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, అటవీ, పీఆర్, పోలీస్‌శాఖల అధికారులతో కలిసి ఎంపీ రఘునందన్‌రావు ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనాల రూటు మళ్లించి పనులకు ఎలాంటి ఆటంకం కాకుండా చర్యలు చేపడుతున్నారు. చేగుంట వద్ద రైల్వేగేట్ పడిన ప్రతీసారి వాహ నాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అనేక సమస్యలకు పరిష్కారం లభించనుంది. అలాగే నేషనల్ హైవే (44) వడియారం బైపాస్ రోడ్డు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 30 కోట్లు మంజూరయ్యా యి. కాగా టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఏడాదిలో మెతుకుసీమకు నిధుల వరద -
విద్యార్థులు ఇష్టంగా చదవాలి
చిలప్‌చెడ్(నర్సాపూర్): విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని డీఈఓ వి జయ అన్నారు. శనివారం మండల పరిధిలోని చిట్కుల్ శివారులో గల కేజీబీవీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా అన్నిరంగాల్లో ముందుకు సాగాలన్నారు. ఎంఈఓ విఠల్ మాట్లాడుతూ.. కేజీబీవీలో విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉన్నారన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదివితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములు, ఉపసర్పంచ్ అఖిల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.పనుల్లో వేగం పెంచండి చిలప్‌చెడ్(నర్సాపూర్): సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని విద్యుత్‌శాఖ ఈఈ (సివిల్) సుకుమార్ అన్నారు. శనివారం మండల పరిధిలోని చండూర్ శివారులో నిర్మి స్తున్న సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.1.60 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వచ్చేనెల 15 వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. నాణ్యతలో ఎలాంటి లోపం జరగకూడదని ఆదేశించారు. ఆయన వెంట చిలప్‌చెడ్ విద్యుత్‌శాఖ ఏఈ రాకేశ్, కాంట్రాక్టర్ విష్ణు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏడుపాయల టెండర్ల ఆదాయం రూ. 2.01 కోట్లు పాపన్నపేట(మెదక్): ఏడుపాయలలో శనివారం సీల్డ్, బహిరంగ టెండర్లు నిర్వహించగా రూ. 2.01 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దేవస్థానం వద్ద కొబ్బరికాయలు విక్రయించేందుకు రూ. 1,10,30,000 కోట్ల పాట పాడి ధరంకర్ లింగాజి, అమ్మవారి ఒడి బియ్యం రూ. 91 లక్షలకు జనార్దన్‌రెడ్డి టెండర్ కై వసం చేసుకున్నా రు. కాగా దేవస్థానం వద్ద పూజా సామగ్రి, జాతరలో ఎగ్జిబిషన్ నిర్వహణకు వేలంలో ఎవ రూ పాల్గొనకపోవటంతో వాయిదా వేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుధాకర్‌రెడ్డి, ప్రధాన అర్చకులు శంకరశర్మ, సిబ్బంది పాల్గొన్నారు. కోతుల బెడదకు.. చింపాంజీ వేషం కౌడిపల్లి(నర్సాపూర్): మండల పరిధిలోని తిమ్మాపూర్‌లో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సర్పంచ్ వెంకటమ్మ వినూత్నంగా ఆలోచించింది. శనివారం ఓ వ్యక్తికి చింపాంజీ వేషం వేయించి గ్రామంలో కోతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిప్పింది. దీంతో కోతులు భయంతో పారిపోయాయి. కోతులు గ్రామంలోకి తిరిగి వస్తే ఇదే ప్రణాళికను అమలు చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మెదక్ మున్సిపాలిటీ: నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలన్నారు. ప్రజలంతా పోలీసుశాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఈనెల 31 రాత్రి 8 గంటల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేసి పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
ఎస్పీ శ్రీనివాసరావురామాయంపేట(మెదక్): అసాంఘిక కార్యకలాపా లు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం సాయంత్రం రామాయంపేట పోలీస్‌స్టేషన్ ను సందర్శించి మాట్లాడారు. ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తూ సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాలు, మహిళల భద్రత, షీటీం సేవలు, మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విలేజ్ పోలీస్ అధికారి వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామాల నుంచి పూర్తిస్థాయి సమాచారం సేకరించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, కేసుల విచారణ వేగవంతం చేయాలన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఆయన వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ వెంకట్‌రాజాగౌడ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్‌రెడ్డి, ఎస్ఐ బాల్‌రాజ్ ఉన్నారు. -
అర్హులకు డబుల్ ఇళ్లు పంపిణీ చేయాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్ రూరల్: నెల రోజుల్లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో నిర్మాణం పూర్తయిన ఇళ్ల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం నర్సాపూర్ చౌరస్తా వద్ద రాస్తారోకోకు దిగారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం పట్టణానికి 500 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 252 ఇళ్లు పూర్తి కాగా, మరో 248 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను అర్హులకు పంపిణీ చేయాలని పలుమార్లు కలెక్టర్, మంత్రులకు విన్నవించినట్లు తెలిపారు. ఫలితం లేకపోవడంతో ధర్నా చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. నెలరోజుల్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూంలను అర్హులైన పేదలకు పంపిణీ చేయకుంటే తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమోద్దీన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, నాయకులు సత్యంగౌడ్, ప్రసాద్, ఆంజనేయులుగౌడ్, ఆనంద్, రాంచందర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
‘కొండ’ంత సమస్యలు
కొండపోచమ్మ జాతర సమీస్తున్నా ఏర్పాట్లు ఏవీ?గజ్వేల్: తెలంగాణలోనే ప్రసిద్ది చెందిన కొండపోచమ్మ ఆలయం వద్ధ భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. జనవరి 15నుంచి మార్చి 19వ తేదీ వరకు ఆలయంలో జాతర జరగనుండగా లక్షలమందికి అమ్మవారికి చెంతకు వస్తారు. ఇంతటి ప్రాఽ దాన్యత కలిగిన ఆలయానికి ఇప్పటివరకు కమిటీ వేయకపోగా, ఏర్పాట్లపై సన్నాహాలు మొదలుకాలేదు. వాహనాల పార్కింగ్‌కు మొదలుకొని అన్నీ సమస్యలే. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని చెప్పిన పాలకుల హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. కొమురవెల్లి మల్లన్న, జగదేవ్‌పూర్ మండలం తీగుల్–నర్సాపూర్‌లో కొలువుదీరిన కొండపోచమ్మలు అన్నాచెల్లెళ్లని పూర్వకాలం నుంచి చరిత్ర చెబుతోంది. అన్నపై అలిగి... కొండపోచమ్మ తీగుల్‌నర్సాపూర్ గుట్టల్లో దాక్కోగా.. వెతుక్కొని వచ్చి సోదరిని బుజ్జగించిన మల్లన్న.. ఆమె కోరిక మేరకు వరమిస్తాడు. తనను దర్శించుకునే ప్రతి భక్తుడు నీ వద్దకు కూడా వస్తాడని అభయమిస్తాడు. అదే తరహాలో నేడు కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ ఆలయా లు వెలుగొందుతున్నాయి. కొమురవెల్లిని దర్శించే ప్రతి భక్తుడు కొండపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కమిటీ ఏదీ..? ఈ ఆలయానికి ఇటీవల కాలం వరకు ఉన్న రెనోవేషన్ కమిటీ గడువు అక్టోబర్ 19నాటికి ముగిసింది. తర్వాత కొత్త కమిటీ ఏర్పాటు ఊసే లేదు. జాతర సమీపిస్తున్న వేళ ఏర్పాట్లపై కనీసం సన్నాహాలు కూ డా మొదలుకాకపోవడం ఆలయంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఆలయానికి దాతలు సమకూర్చిన కొన్ని గదుల్లో తప్పా మిగితా చోట్ల ఎక్కడా తాత్కాలికంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఖాళీ స్థలాల్లో ఉండే భక్తులకు మల విసర్జనకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రైవేట్‌గా కూడా సౌకర్యం లేకపోవడంతో భక్తులు వాహనాలు తీసుకుని కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. -
అదనపు డబ్బులు చెల్లించాల్సిందే
మెదక్ కలెక్టరేట్: లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆశవర్కర్లతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ అధికారులు ఆశవర్కర్లతో అదనపు పనులు చేయించుకుంటున్నారని, డబ్బులు విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. అదనపు పనికి, అదనపు డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం ఆశవర్కర్లను మోసం చేయాలని చూస్తుందన్నారు. నేటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి కనీస వేతనం చెల్లించడం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న పల్స్‌పోలియో, స్థానిక ఎన్నికల డ్యూటీ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. ప్రతి ఆదివారం, పండగలకు సెలవులు ఇవ్వాలన్నారు. ఫిక్స్డ్ వేతనం రూ.18,000తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సంతోశ్, ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి సావిత్రి, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
మనోహరాబాద్(తూప్రాన్): క్రీడలతో మానసికోల్లాసంతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో 10వ అంతర్జిల్లా అండర్ 14 సాఫ్ట్‌బాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. యువత క్రీడల్లో పాల్గొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో జాతీయ సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ శోభన్‌బాబు, రాష్ట్ర సెక్రటరీ నవీన్‌కుమార్, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్‌రెడ్డి, ఒలింపిక్ అబ్జర్వర్ కరణం గణేశ్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, శ్యాంసుందర్‌శర్మ, వెంకటేశం, రేణుక, వాసు, అభిషేక్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలను నియంత్రించాలి
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: విద్యార్థులు, యువత భవిష్యత్తుపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి మానసిక వైద్య నిపుణులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాలను నిరోధించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గంజాయి, మత్తుపదార్థాలు వినియోగించడం వల్ల కలిగే నష్టాలపై ర్యాలీలు, వ్యాసరచన, చిత్రలేఖనం, క్లబ్ ఏర్పాట్లు ఇతర వివిధ రకాల పద్ధతుల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డ్రగ్స్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పా టు చేశామన్నారు. ఇన్‌పేషెంట్ సేవలకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గురుకులాలు, వసతిగృహాలు, అన్ని విద్యాసంస్థల్లో ప్రహరీ, కారిడార్లు, పరిసరాలు స్పష్టంగా కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. బెల్ట్ షాపులు, గుడుంబా స్థావరాలపై పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. -
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిదుబ్బాక: కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం రాయపోల్ మండలం గొల్లపల్లి–ఉదయపూర్ ఉపసర్పంచ్ భూపాల్, బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు కనకయ్య, వార్డు మెంబర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేక విధానాలతో బీజేపీ గ్రామస్థాయిలో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్నది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అ ధ్వానంగా తయారయ్యాయని వాపోయారు. బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు సైనికుల్లా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజిరెడ్డి పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ కంచుకోట బద్దలు కొట్టాం
● హరీశ్‌ను ఓడించేందుకు తానే బరిలోకి దిగుతా.. ● మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నిజాంపేట(మెదక్): పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టామని, త్వరలో హరీశ్‌రావును ఓడించేందుకు తానే స్వయంగా బరిలోకి దిగుతానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో కాంగ్రెస్‌ను పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు. హరీశ్‌రావు సీఎం కావాలని ఆశలు పెట్టుకున్నాడన్నారు. గత ప్రభుత్వంలో 90 శాతం సర్పంచ్‌లను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. కులాలతో రాజకీయం చేయొద్దన్నారు. నిజాంపేట మండలంలో మంచి మెజార్టీ సాధించినట్లు పేర్కొన్నారు. నూ తన ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజు జన జాతరే
భక్తులతో కిటకిటలాడుతున్న చర్చి ప్రాంగణం మెదక్ కలెక్టరేట్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలు రెండో రోజు ఘనంగా జరిగాయి. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మందితో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తులను ఆశీర్వదించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. యువతీ, యువకులు సెల్ఫీలతో సందడి చేశారు. మెదక్ చర్చికి పోటెత్తిన భక్తులు -
రైతులు ఇబ్బంది పడొద్దు
● వచ్చే యాసంగి నాటికిపంట కాల్వల నిర్మాణం చేపట్టాలి ● అధికారులతో మాజీమంత్రి హరీశ్రావుసిద్దిపేటజోన్/చిన్నకోడూరు: వచ్చే యాసంగి నాటికి శాశ్వత పంట కాల్వల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారితో సమీక్ష నిర్వహించారు. గత యాసంగిలో ప్రభుత్వం సరైన ప్రణాళికలను చేపట్టకపోవడంతో రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. తన సొంత డబ్బులతో తాత్కాలిక కాల్వలు తీసి సాగు నీరు అందించే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వచ్చే యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పంట పొలాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. కలెక్టర్ హైమావతికి ఫోన్ చేసి అవసరమైన భూసేకరణ చేపట్టాలని కోరారు. భూసేకరణ, కాల్వల నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇవ్వాలన్నారు. ఇర్కోడ్, చందలాపూర్‌లో నిర్మించే లిఫ్ట్ పనులు వేగవంతం కావాలన్నారు. నియోజకవర్గ పరి ధిలోని పెండింగ్ చెక్ డ్యాం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈలు గోపాల్‌కృష్ణ, శంకర్, డీఈ చంద్రశేఖర్, అధికారులు శిరీష, వినయ్, ఆంజనేయులు, విద్యాసాగర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నకోడూరు రైల్వేస్టేషన్ నిర్మాణంతో పాటు విఠలాపూర్ వరకు రైల్వేలైన్ పనులు పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. -
కాంగ్రెస్‌ది ప్రజా వ్యతిరేక పాలన
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర(సంగారెడ్డి): కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, ప్రజావ్యతిరేక పాలనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో మంజూరైన సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్థాయి మరిచి ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు చేయడం తప్ప, సంక్షేమ పథకాలపై ధ్యాస లేదన్నారు. పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలై ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. నాలుగు నెలలుగా జీపీ కార్మికులకు వేతనాలు ఇవ్వలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తి చేసి 37 వేల ఎకరాలకు కేసీఆర్ నీరందిస్తే, ఈ ప్రభుత్వం రెండేళ్లలో కనీసం 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. గ్రామస్థాయిలో కొత్త సర్పంచ్‌లు రాజకీయాలకతీతంగా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. సింగూరు మరమ్మతుల పేరుతో 30 నుంచి 40 వేల ఎకరాలకు సాగు నీరు వదులుతారో..? లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. కొత్తగా యూరియా యాప్ తెచ్చి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే వారి పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర మాజీ అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌రావు, నాయకులు రవి, రమేశ్, వీరేందర్, అర్జున్‌తో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. -
కేవల్ కిషన్ ఆశయ సాధనకు ఉద్యమిద్దాం
చేగుంట(తూప్రాన్): కేవల్ కిషన్ ఆశయ సాధనకు ఉద్యమిద్దామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య పిలుపునిచ్చారు. శుక్రవా రం మండలంలోని పొలంపల్లిలో కేవల్ కిషన్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. కేవల్ కిషన్ పేద ప్రజల కోసం తన సొంత భూములను సైతం విరాళంగా అందించి చెరువులను తవ్వించాడని పేర్కొన్నారు. భూస్వాముల కుట్రలకు బలైన డిసెంబర్ 26న ఏటా ప్రజలు జాతర నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం సీపీఎం ఆధ్వర్యంలో చేగుంట వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ, సభ్యులు మల్లేశం, బాలమణి, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్‌రావు జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజీపల్లి, జీఎంఆర్ కాలనీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం పర్యటించారు. కాలుష్య ప్రాంతమైన కాజీపల్లి జీఎంఆర్ కాలనీలలో మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని ఎంపీని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కాలుష్యానికి గురైన కాల్వలు చెరువులను పరిశీలించిన ఎంపీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవ సరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రమాకాంత్, మండల బీజేపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్(సంగారెడ్డి): శ్రమ చేసి సంపదను సృష్టిస్తున్న కార్మికులపై కేంద్ర ప్రభుత్వం పగబట్టి, కార్పొరేట్లకు వ్యాపారాలు అప్పజెప్పుతున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. శుక్రవారం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ నుంచి ఐబీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ నాడు యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలను ఆదుకోవాలని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం మతంపైన శ్రద్ధ పెడుతూ ప్రజలు, కార్మికులకు అన్యా యం చేస్తుందని మండిపడ్డారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, వీబీ రాంజీ పేరు చేర్చి చట్టాన్ని బలహీనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్, అధ్యక్షుడు రాజయ్య, సీఐటీయూ నాయకులు రాజయ్య, మాణిక్ పాండురంగారెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి, పాత చట్టాలనే పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం దేశవ్యాప్త నిరసనలో భాగంగా పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, రైతు సంఘం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంపదను దోచి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
వైద్యులు అందుబాటులో ఉండాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్ టేక్మాల్(మెదక్)/పాపన్నపేట: ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. శుక్రవారం టేక్మాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యా ధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్యలపై ఆరా తీశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పా పన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఎన్ని ప్రసవాలు అయ్యాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలు ఎక్కువ అయ్యేలా చూడాలన్నారు. అత్యవసరమైతే తప్ప సిజేరియన్లు చేయవద్దన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా మెరుగైన వైద్య సే వలు అందించాలన్నారు. ఆయన వెంట సీహెచ్ఓ చందర్, వైద్య సిబ్బంది ఉన్నారు. -
బీటీకి మట్టితో మరమ్మతులు
● నిధులు లేవంటున్న అధికారులు ● వరదలతో 234 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం ఈఏడాది కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో వందలాది కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి. పెద్ద పెద్ద గుంతలతో అధ్వానంగా మారాయి. అయితే వాటికి కంకర, డాంబర్ (బీటీ)తో తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి ఉండగా, అధికారులు మట్టితో చేస్తున్నారు. – మెదక్‌జోన్ భారీ వర్షలకు ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్‌శాఖల రోడ్లు సుమారు 234 కిలోమీటర్ల మేర ధ్వంసం అయినట్లు సంబంధిత అధికారులు గతంలో అంచనా వేశారు. వీటికి అత్యవసర మరమ్మతుల కోసం తాత్కాలికంగా రూ. 92 కోట్లు అవసరమవుతాయని రెండుశాఖలు ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. అయితే కేవలం రూ. 3.54 కోట్లు మాత్రమే విడుదల కావటంతో అధికారులకు ఏమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. బీటీ రోడ్లపై పడిన గుంతలను ఆర్అండ్బీ అధికారులు మట్టితో పూడుస్తున్నారు. నిబంధనల ప్రకా రం బీటీ రోడ్డుపై గుంతలు పడితే వాటిని కంకర, బీటీ (డాంబర్)తో తాత్కాలిక మరమ్మతులు చేయాలి. కానీ మట్టితో పూడుస్తుండటంతో ఇదేం చోద్యం అంటూ ప్రజలు వాపోతున్నారు. మట్టితో పూడ్చటంతో వాహనాల రాకపోకలకు దుమ్ము లేవటంతో పాటు వర్షం పడితే బీటీ రోడ్లన్నీ బురదమయంగా మారే అవకాశం ఉంది. రోడ్లు సైతం పూర్తిస్థాయిలో దెబ్బతినే ప్రమాదం ఉంటుందని సంబంధిత అధికారులే చెబుతున్నారు. కేవలం రూ.10 కోట్లు మంజూరు ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, చెరువులు, కుంటలు, వందలాది ఎకరాల పంటలకు నష్టం జరిగింది. వరద నష్టాలను అంచనా వేసిన అధికారులు, అత్యవసరంగా రూ. 265 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేందించారు. నిధులు మంజూరైతే తాత్కాలిక పనులతో చక్కబెట్టవచ్చని భావించారు. కానీ ప్రభుత్వం జిల్లాకు కేవలం రూ. 10 కోట్లు మాత్రమే మంజూరు చేయటంతో చేసేది లేక వారికి తోచిన విధంగా అధికారులు పనులు చేయిస్తున్నారు. నిధుల లేమితోనే.. భారీ వర్షాలకు రోడ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బీకి కేవలం రూ. 1.20 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. దీంతో గుంతలు పడిన తారు రోడ్డుపై తా త్కాలికంగా మట్టితో పూడుస్తున్నాం. – వేణు, ఆర్అండ్బీ ఈఈ -
బాధితులకు అండగా నిలవాలి
మెదక్ మున్సిపాలిటీ: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్యాప్తులో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలన్నారు. వివిధ కుల, మతాలకు చెందిన పవిత్ర స్థలాలు, పరిశ్రమలు, దాబాలు, పెట్రోల్ బంక్‌లు తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం అవగాహన కల్పించాలని ఎస్హెచ్ఓలకు సూచించారు. అనంతరం తూప్రాన్ పట్టణంలో ఆత్మహత్యకు యత్నించిన తల్లీకూతురిని సకాలంలో స్పందించి రక్షించిన తూప్రాన్ పోలీస్ కానిస్టేబుళ్లు రవి, శ్రీకాంత్‌ను అభినందించారు. క్యాష్ రివార్డుతో పాటు ప్రశంసాపత్రాలతో సత్కరించారు. ఇదిలాఉండగా ఎస్పీ శ్రీనివాసరావుకు సీనియర్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చికి భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్‌శాఖ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 496 మంది అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బందోబస్తును కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని వివరించారు. జాతరకు వ చ్చే భక్తులు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా, పార్కింగ్‌కు కేటాయించిన స్థలాల్లోనే నిలపాలని సూచించారు. ఆకతాయిల నియంత్రణ కోసం షీ టీమ్‌లు, మఫ్టీ పార్టీలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట అద నపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్‌గౌడ్, రంగా నాయక్, సీఐలు, ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు.ఎస్పీ శ్రీనివాసరావును సన్మానిస్తున్న పోలీస్ అధికారులు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
యేసయ్య కోవెల ముస్తాబు
విద్యుత్ దీపాల కాంతుల్లో చర్చిమెదక్జోన్: పరలోక ప్రభువు యేసయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబవుతోంది. ఇప్పటికే పర్యాటకులు, భక్తుల తాకిడి మొదలైంది. దీంతో మెతుకుసీమలో సందడి నెలకొంది. అపురూపం.. కట్టడం మెదక్ సీఎస్ఐ చర్చి నిర్మించి 101 సంవత్సరాలు అవుతోంది. గతేడాది జరిగిన శత జయంతి వేడుకలకు గవర్నర్, సీఎంతో పాటు పలువురు మంత్రులు సైతం హాజరయ్యారు. చర్చి అభివృద్ధికి రూ. 29.50 కోట్లు మంజూరు చేయటంతో, ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా గురువారం ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించనుండటంతో అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా చర్చి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక దుకాణాలు, రంగుల రాట్నాలతో చర్చి ఆవరణ జాతరను తలపిస్తోంది. సుందర కట్టడంగా పేరొందిన మెదక్ కెథడ్రల్ చర్చి ఎందరో మహానుభావుల అర్కెటిక్ పనితనంతో ఇంకా సుభాగా విరాజిల్లుతోంది. ప్రత్యేకంగా క్రిస్మస్ సందర్భంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. 590 మందితో బందోబస్తు క్రిస్మస్ నేపథ్యంలో 590 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ మహేశ్ తెలిపారు. ఇందులో మెదక్‌తో పాటు సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. 4 గురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 45 మంది ఎస్సైలతో పాటు 5 సెక్టార్లకు సంబంధించిన సిబ్బంది విధుల్లో ఉంటారు. ఐడీపార్టీలు, క్యూఆర్టీంలు, షీటీంలతో పాటు 100 సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. చర్చి ఎదుట పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు -
నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
మెదక్ కలెక్టరేట్: ప్రతి హోటల్ యజమాని తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజలకు కల్తీ లేని ఆహార పదార్థాలు అందించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో లైసెన్స్ మేళా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రచారం లేకపోయినప్పటికీ మేళాకు మంచి స్పందన లభించిందన్నారు. 15 మంది యజమానులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా అందించామన్నారు. జిల్లాలోని ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, స్వీట్ షాపుల యజమానులు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని, లేకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుంటారని, వారికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని సూచించారు. ఆయన వెంట అధికారులు గణేశ్వర్, అరవింద్, నజీర్ తదితరులు ఉన్నారు. -
మరింత సహకారం
రామాయంపేట(మెదక్): గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) బలోపేతానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రైతులకు రుణ సదుపాయం, విత్తనాలు, ఎరువుల పంపిణీని మరింత చేరువ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈక్రమంలో జిల్లాలో అదనంగా మ రో పది కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రస్తుతం ఉన్న 37 సంఘాలకు తోడు కొత్తవి మంజూరైతే మొత్తం సంఘాల సంఖ్య 47కు చేరనుంది. జిల్లాలోని 21 మండలాలకు గాను నాలుగు మండలాల్లో సహకార సంఘాలు లేవు. దీంతో సదరు మండలాల పరిధిలో రైతులకు సొసైటీల నుంచి విత్తనాలు, ఎరువులు, రుణాలు సక్రమంగా అందక వారు ఇబ్బందులపాలవుతున్నారు. అయితే జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న ఏ, బీ గ్రేడ్ సంఘాల నుంచి ఆరు కొత్త సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. గతంలో 29 కొత్త సంఘాల ఏర్పాటు కోసం దరఖాస్తులు రాగా, అధికారులు పది సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. కొత్త మండలాలైన చిలప్‌చెడ్, మాసాయిపేట, మనోహరాబాద్, హవేళిఘణాపూర్‌లో నూతన సహకార సంఘాలు ఏర్పాటు కానున్నాయి. కాగా జిల్లాలో అతిపెద్ద మెదక్ సొసైటీ పరిధిలో 58 గ్రామాలకు చెందిన ఆరు వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. నాగాపూర్, ఫరీద్పూర్ సొసైటీలు ఒక్కో గ్రామంలోనే కొనసాగుతున్నా, వీటి సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. కొత్త సొసైటీల వివరాలు.. బూర్గుపల్లి, సోమక్కపేట, మాసాయిపేట, మనోహరాబాద్, వెంకట్రావుపల్లి, రెడ్డిపల్లి, కొడపాక, నార్లాపూర్, ఎనగండ్ల, గోమారం గ్రామా ల్లో త్వరలో నూతన సొసైటీలు ఏర్పాటు కానున్నాయి. పెద్ద సొసైటీలైన మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్, వెల్దుర్తి, కౌడిపల్లి, కొత్తపల్లి, శివ్వంపేట, రంగంపేట, సోమక్కపేట సహకార సంఘాల నుంచే కొత్త సంఘాలు ఏర్పాటు కానున్నాయి. కాగా కొత్త సంఘాలు ఏర్పాటు అనంతరమే సహకార ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతిపాదనలు పంపాం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 37 సొసైటీలకు అదనంగా మరో పది కొత్త సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. త్వరలో మంజూరయ్యే అవకాశం ఉంది. కొత్త సొసైటీలు మంజూరైతే పరిపాలనా సౌలభ్యంగా ఉంటుంది. రైతులకు మంచి సేవలు అందుతాయి. – కరుణాకర్, జిల్లా సహకార అధికారి జిల్లాకు కొత్తగా మరో 10 సహకార సంఘాలు నాలుగు కొత్త మండలాలతో పాటు ఇతర గ్రామాల్లో ఏర్పాటుకు కసరత్తు -
లెక్కలు.. తేలని చిక్కులు
‘జిల్లాలోని ఓ మేజర్ పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది, బీఎల్ఓలు, ఎన్సీసీ విద్యార్థులకు రెండు రోజులకు గాను 150 టిఫిన్లు, భోజనాలు, తాగునీరు, తదితర వాటి కోసం సుమారు రూ. 35 వేలు ఖర్చయయ్యాయి. అయితే పంచాయతీ కార్యదర్శికి ఇచ్చింది మాత్రం రూ. 9 వేలు మాత్రమే. మిగతావి అప్పు చేశాడు.’ – మెదక్ అర్బన్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4220 వార్డు మెంబర్ల ఎన్నికల నిర్వహణ కోసం రూ. 4,82,94,890 నిధులు మంజూరయ్యాయి. ఇందులో కొన్ని ఏకగ్రీవం కాగా, మిగితా వాటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. అయితే మొదట ఒక్కో ఎంపీడీఓకు జిల్లా పంచాయతీ అధికారి రూ. 50 వేల చొప్పున నిధులు విడుదల చేశారు. అనంతరం పోలింగ్ స్టేషన్‌కు రెండు వేల చొప్పున అందజేశారు. ఇక పంచాయతీ కార్యదర్శులకు పోలింగ్ స్టేషన్‌కు రూ. 500 చొప్పున, పంచాయతీకి రూ. 2 వేల చొప్పున విడుదల చేశారు. ఇవి ఏ మూలకు సరిపోలేదని, అప్పులు చేసి ఎన్నికలు నిర్వహించామని అంటున్నారు. ఒక్కో పంచాయతీ కార్యదర్శి రూ. 10 నుంచి రూ. 20 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇక ఎంపీడీఓలు సైతం తమకు ఇచ్చిన నిధులు ఖర్చులకు సరిపోలేవని, ఇంకా కొన్ని వాహనలకు డీజిల్, టెంట్లు, ఫర్నిచర్, టీఏలు, డీఏల కోసం చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. పెద్ద మండలాల్లో సు మారు రూ.15 లక్షల వరకు అవసరమవుతాయని తెలుస్తోంది. ఈ మేరకు ఈ విషయాన్ని ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా సిద్దిపేట జిల్లాలో పోలింగ్‌స్టేషన్‌కు రూ. 2,0400 చొప్పున ఇస్తున్నట్లు స్థానిక పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి తిప్పలు పడుతున్నామంటున్న అధికారులు అదనపు డబ్బుల కోసం ఎదురుచూపులు జిల్లాకు రూ. 4.83 కోట్లు మంజూరు మరో రూ. 1.25 కోట్లు అవసరం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి లెక్కలు చేస్తున్నాం. మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుంది. మరో రూ.1.25 కోట్లు అవసరమవుతాయని భావిస్తున్నాం. ఎన్నికల అధికారులకు టీఏ, డీఏలు, ఎంపీడీఓలకు, పంచాయతీ కార్యదర్శులకు డ బ్బులు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో నిధులు మంజూర య్యే అవకాశం ఉంది. – యాదయ్య, డీపీఓ -
పరిశీలించి.. సూచనలు చేసి
రామాయంపేట(మెదక్): దక్షిణ మధ్య రైల్వే భద్రతా కమిషనర్ మాధవి, డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోశ్‌కుమార్ వర్మ, చీఫ్ సేఫ్టీ అధికారి రమణారెడ్డి మంగళవారం జిల్లాలోని అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఈసందర్భంగా వారు స్టేషన్లో భద్రతాపరమై న చర్యలను పర్యవేక్షించారు. స్టేషన్ విస్తరణకు సంబంధించి మ్యాపును పరిశీలించి పలు సూచ నలు చేశారు. అక్కన్నపేట స్టేషన్ జంక్షన్‌గా రూపుదిద్దుకున్న సందర్భంగా సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించారు. కాగా స్టేషన్లో అజంతా, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లకు స్టాప్ ఇవ్వా లని కోరుతూ గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. వారివెంట ఆశాఖ పీఆర్వో శైలేంద్రకుమార్, స్టేషన్ మాస్టర్లు, ఇతర అధికారులు ఉన్నారు. -
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోండి
హవేళిఘణాపూర్(మెదక్)/మెదక్‌కలెక్టరేట్: రైతుల పొట్టగొట్టే విధంగా ఇసుక అక్రమ తరలిస్తుంటే అధికారులు పట్టనట్లుగా వ్యవహరించడం సరికాదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ మండలం సంగాయిగూడ తండాలోని హల్దీవాగును పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇసుక తరలించడం వల్ల ఈ ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తు న్న ముఠాకు అధికారుల అండదండలు ఉండటం విడ్డూరంగా ఉందని వాపోయారు. ఇప్పటికై నా వా రిపైన చర్యలు తీసుకొని రైతుల పంట పొలాలకు సాగు నీరందించే విధంగా చూడాలని కోరా రు. అనంతరం పద్మారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను కలిశారు. అధికార పార్టీ నాయకులు 45 రోజులుగా ఇసుకను అక్రమంగా జహీరాబాద్, బీ దర్, హైదరాబాద్ తరలిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని యెడల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి -
మెరుగైన ఫలితాలు సాధించాలి
కొల్చారం(నర్సాపూర్): పదో తరగతి వార్షిక పరీక్షలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే లా నాణ్యమైన బోధన అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యాబోధన, ఉపాధ్యాయులు, విద్యార్థుల స ంఖ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. విద్యార్థులకు గుణాత్మకమైన విద్యాబోధన అందించడంతో పాటు సమయానికి నాణ్యమైన ఆ హార పదార్థాలను అందించాలన్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తరగతి గదులు, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఆయన వెంట హెచ్ఎం రేవతిదేవి, ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాహుల్‌రాజ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ -
పల్లెకు పట్టాభిషేకం
నేడు కొలువు దీరనున్న కొత్త పాలకవర్గాలు మెదక్ అర్బన్: కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు పంచాయతీలు ముస్తాబయ్యాయి. సోమ వారం జిల్లాలోని 492 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ శాఖల అధికారులు పాలకవర్గాలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నా రు. కాగా నేటితో ప్రత్యేక అధికారుల పాలన ముగియనుంది. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయింది. ముగిసిన ప్రత్యేకాధికారుల పాలన 2024 జనవరి 31న సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో అదే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అయితే ప్రతి పంచాయతీకి కేంద్రం నుంచి జనాభా ప్రాతిపదికన 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. అయితే సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. ఒక్కో వ్యక్తికి సుమారు రూ. 826 చొప్పున జిల్లాకు సుమారు రూ. 50 కోట్లకుపైగా నిధులు రావాల్సి ఉంది. మార్చి 2026 లోగా ఎన్నికలు జరపకపోతే నిధులు మురిగిపోయే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవాంతరాలను అధిగమించి ఎన్నికలు జరిపింది. దీంతో నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వనరులు రాకపోవడంతో పల్లె పాలన కుంటుపడింది. కనీసం చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పో యలేని పరిస్థితి ఏర్పడింది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక అధికారులు అంటీ ముట్టనట్లు వ్యవహరించడంతో పంచాయతీ కార్యదర్శులు పడరాని పాట్లు పడ్డారు. ఇప్పుడు కొత్త పాలకవర్గాలు కొలువు దీరుతుండటంతో పల్లె పాలన పరుగులు తీసే అవకాశం ఉంది. ముస్తాబైన పంచాయతీలు జిల్లాలో 492 సర్పంచ్‌లు.. 4,220 వార్డులు కార్యదర్శులకు తప్పిన తిప్పలు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం -
పేదల కడుపు కొడుతున్న బీజేపీ
నర్సాపూర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టి ధనికుల కొమ్ము కాస్తుందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి ఆరోపించారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం మార్పు చేసినందుకు గాను కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఆదివారం పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే ఉద్యమాల్లో ఇది ఆరంభమేనని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తొలగించే కుట్రలో భాగంగా ప్రస్తుతం పనిదినాలు తగ్గించిందని ఆరోపించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రిజ్వాన్, మల్లేష్, చిన్న అంజిగౌడ్, అశోక్‌గౌడ్, లలిత, హబీబ్‌ఖాన్, సుధీర్‌గౌడ్, తరుణ్, సుదర్శన్‌గౌడ్, నగేశ్, సురేశ్, రషీద్, మల్లేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ -
కోహీర్.. గజగజ
రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల కేంద్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 5.0 డిగ్రీలు నమోదైంది. జహీరాబాద్ మండలం అల్గోల్‌లో 5.8, ఝరాసంగంలో 6.8 డిగ్రీలు నమోదయ్యాయి. ఏటా చలికాలంలో కోహీర్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తోంది. ఆదివారం జహీరాబాద్ మండలం సత్వార్‌లో 7.5, మొగుడంపల్లిలో 7.5, కోహీర్ మండలం దిగ్వాల్ 8.1, కంగ్టిలో 8.1 డిగ్రీలు, న్యాల్కల్లో 8.4, నిజాంపేట్‌లో 8.4, సదాశివపేట 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. – జహీరాబాద్ -
రైతు భరోసా ఏది?
● నారుమళ్లు సిద్ధం చేసిన రైతులు ● పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు వర్షాకాలంలో ఎప్పుడు లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు నీటి వనరులు నిండుకుండలా మారాయి. భూగర్భజలాలు సైతం పెరిగి బోరుబావుల్లో పుష్కలమైన నీరు ఉంది. ఈ యాసంగిలో మాత్రం 3.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో సింహభాగం 2.95 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని చెప్పారు. మిగితా 22,186 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయనున్నట్లు తెలిపారు. గతేడాది యాసంగిలో 2,96,531 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 19,711 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. మెదక్‌జోన్: యాసంగి సీజన్ ప్రారంభం అయింది. ఇప్పటికే రైతులు నారుమళ్లు (తూకం) పోసి పంటల సాగుకు సిద్ధమయ్యారు. అయితే రైతు భరోసా ఎప్పుడిస్తామనే విషయం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటంతో అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. జిల్లాలో 5 లక్షల పైచిలుకు వ్యవసాయ సాగు భూములు ఉండగా, వాటిలో ఏటా సుమారు నాలుగు లక్షల వరకు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. కాగా గడిచిన వర్షాకాలంలో అతివృష్టి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. నష్టపోయిన పంటలకు నేటికీ పరిహారం సైతం అందలేదు. కాగా ఈ యాసంగి సీజన్లో అయినా సకాలంలో పంటలు సాగు చేసుకుందామంటే సాగుకు పెట్టుబడి కోసం ఎదురు చూపులు తప్పటం లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పెరుగుతున్న ఖర్చులు ఏటా పంట పెట్టుబడి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అధిక దిగుబడులు ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు సాగు చేయాలనే తపనతో వివిధ కంపెనీలు చెప్పే మాయ మాటలు నమ్మి రైతులు అధికంగా విత్తనాలకే డబ్బులు వెచ్చిస్తున్నారు. ఒక్క ఎకరాకు విత్తనాల కోసమే రూ. 5 వేల నుంచి మొదలుకొని రూ. 6 వేల వరకు చెల్లిస్తున్నారు. ఇక దుక్కులు దున్నటం, రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగు నివారణ మందులు, నాటుకు ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఖర్చు వస్తోంది. కాగా పెట్టుబడి సాయం సకాలంలో చేతికందితే వాటికి కొంత కలిపి పంటసాగుకు ఉపయోగించుకుందామని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ రబీ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. కాగా గతేడాది యాసంగి సీజన్లో మాత్రం డిసెంబర్ మొదటి వారంలోనే 2.65 లక్షల మంది రైతులకు రూ. 213.65 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల అయ్యాయి. కాగా అర్హుల జాబితాను ప్రభుత్వం సీసీఎల్ నుంచి తీసుకొని రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తుంది. – దేవ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
దుర్గమ్మా.. దీవించమ్మా
పాపన్నపేట(మెదక్): దుర్గమ్మా.. మమ్ము దీవించమ్మా అంటూ వేలాది భక్తులు ఆదివారం ఏడుపాయల వన దుర్గమ్మను వేడుకున్నారు. ఉదయం అర్చకులు అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారికి బోనాలు తీసి, ఒడి బియ్యం పోసి భక్తులు మొక్కులు తీర్చుకున్నా రు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి టౌన్: రాజీమార్గంతో కేసులు పరిష్కారం చేసుకోవచ్చని సంగారెడ్డి జిల్లా కోర్టు ఇన్చార్జి జయంతి అన్నారు. ఆదివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో వివిధ రకాల కేసులను పరిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకున్నారని, కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీమార్గంలో వెళ్లే కేసులను కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 4,248 కేసులు పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జీలు, న్యాయవాదులు, పోలీసులు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెదక్‌జోన్: ఏళ్ల తరబడి కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, డబ్బు, విలువైన సమయాన్ని వృథా చేసుకోవటం కంటే రాజీమార్గమే ఇరువర్గాలకు ఎంతో మంచిదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు. లోక్ అదాలత్‌లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా 3,398 కేసులు రాజీ పడటం సంతోషకరమైన విషయం అన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని లోక్ అదాలత్ ద్వారా చిన్నపాటి కేసులను రాజీ చేస్తున్నామని, దీనిని ప్రజలు ఉప యోగించుకోవటం సంతోషంగా ఉందన్నారు. కొల్చారం(నర్సాపూర్): మండలంలోని కొంగోడ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సర్పంచ్ దుబ్బగళ్ల స్వామి ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశంగౌడ్, కొల్చారం సర్పంచ్ శేఖర్, పార్టీ సీనియర్ నాయకులు సామెల్, కుమార్ గౌడ్, దుర్గాగౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు: తెలంగాణలో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని ముత్తంగి పంచాయతీ పరిధిలో ఆదివారం నిర్వహించిన మల్లన్నస్వామి జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ:సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, దేవానందం, మాజీ వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఉపేందర్, సందీప్, రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మల్లన్నకు పట్నాలు.. మొక్కులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాతాల నుంచి భక్తులు వచ్చి స్వామి వా రిని దర్శించుకున్నారు. గంగరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది పట్నాలు వేశారు. ఆలయ ముఖ మండపంలో నిత్యకల్యాణం, అభిషేకం, ఒడిబియ్యాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్లమ్మ తల్లికి బోనం పెట్టి వేడుకున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
బిల్లు రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం
మెదక్ కలెక్టరేట్: ‘వీబీ–జీరామ్‌జీ’ బిల్లుతో దివ్యాంగుల జీవనోపాధికి తీవ్ర అన్యాయం జరుగనుందని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య ఆరోపించారు. ఆదివారం దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ప్రతులను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీసుకువచ్చిన బిల్లు రద్దు అయ్యే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగం, భూమిలేని, పేదరికంలో ఉన్న దివ్యాంగులకు, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు మల్లేశం, జిల్లా కార్యదర్శి యశోద, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి, కవిత, గుమ్మడిదల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు కిష్ట య్య, శ్రీనివాస్, మెదక్ పట్టణ అధ్యక్షుడు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
కళకళలాడుతున్న పల్లెలు
కొత్త పాలకవర్గాలు కొలువుదీరబోతు న్న వేళ.. గ్రామ పంచాయతీ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. పలు గ్రామాల్లో కా ర్యాలయాలకు రంగులు వేశారు. కొబ్బరిమట్టలు, మామిడి తోరణాలు, లైట్ల తో అలంకరించి గ్రామస్తులను పట్టాభిషేకానికి ఆహ్వానించారు. కొన్ని గ్రామాల్లో స్వీట్లు, భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరికొందరు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కొత్త సర్ప ంచ్‌లు తమ అభిరుచికి అనుగుణంగా, కొత్త ఫర్నిచర్ తెచ్చుకుంటున్నారు. శివ్వంపేట మండలంలోని తిమ్మాపూర్‌లో పంచాయతీ భవనానికి పింక్ కలర్ వేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. చేగుంట, పాపన్నపేటలో ప్రమాణ స్వీకారానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
కొండెక్కిన కోడి ధర
వారంలో రూ. 50 పెరుగుదలసదాశివపేట(సంగారెడ్డి): కోడి కొండెక్కింది. చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం కిలోపై రూ. 50 పెరిగింది. దీంతో సామాన్యులు సతమతం అవుతున్నారు. కార్తీక మాసం ముగిసినప్పటి నుంచి ధరలు పెరగడం ప్రారంభం అయింది. వారం వారం రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచుతున్నారు. గత వారం క్రితం లైవ్ రూ. 130, డ్రెస్డ్ చికెన్ రూ. 200 నుంచి రూ. 240 పలకగా, ప్రస్తుతం లైవ్ రూ. 160, డ్రెస్డ్ రూ. 270, స్కిన్లెస్ రూ. 300 పలుకుతోంది. కిలోపై రూ. 50 మేర పెరిగింది. అయితే దీనికి కారణం కోళ్ల రేటు పెరగటమేనని వ్యాపారులు చెబుతున్నా రు. గతంలో కోళ్లు జిల్లాలోనే అందుబా టులో ఉండేవని, దీంతో ధరలు తక్కువగా ఉండేవంటున్నారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందంటున్నారు. రవాణా చార్జీలు తడిసి మోపడవుతుండటంతో చికెన్ రేటు పెరిగిందని చెబుతున్నారు. -
ఓవరాల్ ఛాంపియన్ అల్గోల్
ముగిసిన జిల్లా స్పోర్ట్స్ మీట్ జహీరాబాద్ టౌన్: మండలంలోని అల్గోల్ తెలంగాణ మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన మైనార్టీ గురుకులాల జిల్లా స్పోర్ట్స్ మీట్ ఆదివారం ముగిసింది. ఉమ్మడి మెదక్ జిల్లా లోని 8 టిమ్రేస్ పాఠశాలలకు చెందిన 800 మంది విద్యార్థులు ఆటల పోటీల్లో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు అండర్ 14, 17, 19 విభాగాల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్ క్రీడా పోటీలను నిర్వహించారు. అండర్ 14 ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా సిద్దిపేట, అండర్ 17 ఓవరాల్ ఛాంపియన్ షిప్‌గా సంగారెడ్డి, అండర్ 19 ఓవరాల్ ఛాంపియన్ షిప్‌గా అలో ల్ టీంలు నిలిచాయి. క్రీడా పోటీల ఓవరాల్ ఛాంపియన్‌గా అల్గోల్ నిలిచింది. వీరికి జహీరాబాద్ డీఎస్పీ సైదానాయక్, టౌన్ ఎస్ఐ వినయ్‌కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ షహనాజ్ బేగం, కళాశాల ప్రిన్సిపాల్ జమీల్, జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ప్రశాంత్‌గౌడ్, పీఈటీ అనిల్‌కుమార్‌తో పాటు జిల్లాలోని పలు గురుకులాల ప్రిన్సిపాల్స్, పీఈటీలు పాల్గొన్నారు. -
దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని..
హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండటంతో భరించలేని ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తిరిగి కాపురానికి రావ డం లేదనే అక్కసుతో అతను తన కుమారుడిని హత్య చేశాడు. మెదక్ జిలాల్లోని మెదక్ మండలంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద బాయి తండాకు చెందిన భాస్కర్ తన భార్య అమీనాపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈనెల 19న సాయంత్రం భాస్కర్ తన భార్యను కొట్టడంతో ఆమె పిల్లలను వదిలివేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తిరిగి కాపురం చేసేందుకు రావడంలేదనే కోపంతో అతను శనివారం రాత్రి నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు లక్కీ(3)ని గొంతు నొలిమి చంపాడు. ఈ ఘటనపై తల్లి అమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ రూరల్ ఎస్ఐ లింగం తెలిపారు. ప్రస్తుతం చిన్నారి లక్కీ మృతదేహాన్ని మెదక్‌జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
భార్య కాపురానికి రావడం లేదని..
హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండటంతో భరించలేని ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తిరిగి కాపురానికి రావ డం లేదనే అక్కసుతో అతను తన కుమారుడిని హత్య చేశాడు. మెదక్ జిలాల్లోని మెదక్ మండలంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద బాయి తండాకు చెందిన భాస్కర్ తన భార్య అమీనాపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు.ఈనెల 19న సాయంత్రం భాస్కర్ తన భార్యను కొట్టడంతో ఆమె పిల్లలను వదిలివేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తిరిగి కాపురం చేసేందుకు రావడంలేదనే కోపంతో అతను శనివారం రాత్రి నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు లక్కీ(3)ని గొంతు నొలిమి చంపాడు. ఈ ఘటనపై తల్లి అమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ రూరల్ ఎస్ఐ లింగం తెలిపారు. ప్రస్తుతం చిన్నారి లక్కీ మృతదేహాన్ని మెదక్‌జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
చల్మెడలో పెద్దపులి సంచారం
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని చల్మెడలో పులి ఆనవాళ్లు కనిపించాయి. శుక్రవారం ఫారెస్ట్ ఆఫీసర్ విద్యాసాగర్‌రావు గ్రామంలో పర్యటించా రు. వారం రోజులుగా కామారెడ్డి, మెదక్ జిల్లాలోని పెద్దమల్లారెడ్డి, కంచర్ల, చల్మెడ గ్రామాల్లో పెద్దపులి తిరుగుతున్నట్లుగా గుర్తించారు. చల్మెడ శివారులో గల మల్లన్న గుట్ట వద్ద పొ లంలో రైతు బర్రె పాలు పిండుకొని వస్తున్న క్రమంలో వెనుక నుంచి పులి పరిగెత్తుకొని వస్తున్నట్లు గమనించి కేకలు వేశారు. దీంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రైతు వెంటనే పోలీస్, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు హుటాహుటిన సంఘ టనా స్థలానికి చేరుకొని అనవాళ్లను సేకరించారు. గ్రామస్తులు మల్లన్న గుట్ట ప్రాంతంలో తిరగవద్దని.. ఎవరికై నా పెద్దపులి కనిపిస్తే సమాచారం అంది ంచాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఆయన వెంట ఎస్ఐ రాజేష్, ఫారెస్ట్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
తెగిన చెరువు, కట్టు కాల్వలకు మరమ్మతులు కరువు
అన్నదాతలకు కష్టకాలం వచ్చింది. గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు చెరువు, కుంటలు, కట్టు కాల్వలు దెబ్బతిన్నాయి. మరమ్మతులకు రూ. 5.25 కోట్లు అవసరం అవుతాయని సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రం బృందం సైతం పరిశీలించింది. అయినా నేటికీ పైసా విడుదల కాలేదు. దీంతో సుమారు 3,500 పైచిలుకు ఎకరాలు బీళ్లుగా మారాయి. – మెదక్జోన్రాయినిపల్లి ప్రాజెక్టు కింద దెబ్బతిన్న కాల్వ జిల్లాలో భారీ వర్షాలకు అనేక చెరువులు, కుంటలు, సాగునీటి కాల్వలు తెగిపోయాయి. దీంతో నీరంతా వృథాగా పోయింది. కొన్నింటికి తాత్కాలిక మరమ్మతులు చేసి కొంతమేర నీటి వృథాను అరికట్టగలిగారు. ఫలితంగా కొన్ని చెరువుల్లో నీరు పుష్కలంగా ఉన్నా.. కాల్వలు ధ్వంసం కావటంతో ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఏర్పడింది. మరికొన్నింటికి శాశ్వత మరమ్మతులు చేస్తే తప్ప, వచ్చే వర్షాకాలంలో నీటి నిల్వ ఉండని దుస్థితి. అంతే కాకుండా అవి తెగిపోయే ప్రమాదం ఉందని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ● మెదక్ మండలం రాయినిపల్లి ప్రాజెక్టు కింద సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీని పరిధిలో రాయినిపల్లి, పాతూర్, తిమ్మనగర్, మక్తభూపతిపూర్, మల్కాపూర్, శివ్వాపల్లి గ్రా మాల పంటలకు ఈ ప్రాజెక్టు నుంచే సాగునీరు అందుతోంది. కాగా గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కట్టు కాలువ పలుచోట్ల ధ్వంసం అయింది. ప్రస్తుతం దానికి మరమ్మతులు చేస్తే తప్ప ఆయకట్టుకు సాగు నీరందే అవకాశం లేదు. దీంతో రైతులు ఇటీవల తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రాజెక్టు పరిధిలోని 3 వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. ● మెదక్ పట్టణ పరిధిలోని అవుసులపల్లికి చెందిన ఖజానా చెరువు భారీ వరద ఉధృతికి తెగిపోయింది. దాని ఆయకట్టు 100 ఎకరాలకు పైగా ఉంది. ప్రస్తుతం అందులో చుక్క నీరు లేదు. యాసంగి సాగుకు అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం మరమ్మతులు చేస్తేనే వచ్చే వర్షాకాలంలో పంటలు పండించుకునే వీలు ఉంటుంది. ● హవేళిఘణాపూర్ పెద్ద చెరువు వెనకాల 220 ఎకరాల ఆయకట్టు ఉంది. భారీ వర్షాలకు ఈ చెరువు కట్ట కొంతమేర తెగిపోవటంతో అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేసి కొంతమేర నీటి వృథాను అరికట్టగలిగారు. ప్రస్తుత యాసంగిలో ఆయకట్టులో సగం మేర పంటలు పండే అవకాశం ఉంది. కానీ దానికి శాశ్వత మరమ్మతులు అవసరమని అధికారులు చెబుతున్నారు. ● అనంతసాగర్ ఊరచెరువు ఆయకట్టు 50 ఎకరాలకు పైగా ఉంది. అదిసైతం వర్షాకాలం తెగిపోయి నీరంతా వృథాగా పోయింది. ప్రస్తుతం పశువులకు తాగు నీరు సైతం కరువైంది. దానికి వెంటనే మరమ్మతులు చేస్తేనే వర్షాకాలంలో నీటి నిల్వ ఉంటుంది. ఖరీఫ్ పంటలు పండే అవకాశం దక్కుతుంది. నిధులు మంజూరు కాగానే పనులు సాగు నీరందించే కట్టు కాల్వలు, చెరువు కట్టల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్ర తిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతులు చేస్తాం. – శివనాగరాజు, డీఈ ఇరిగేషన్, మెదక్ -
అందరినీ కలుపుకొని పోతా
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలిచారని, రాష్ట్రంలోనే నారాయణఖేడ్ నియోజకవర్గం రెండో స్థానంలో ఉందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మద్దతు దారులు 167మంది గెలుపొందగా.. బీఆర్ఎస్ 52 మంది, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచినట్లు చెప్పారు. చాలాచోట్ల కాంగ్రెస్ నుంచి రెబల్‌గా పోటీ చేయడం కారణంగా బీఆర్ఎస్కు అన్ని సీట్లయినా వచ్చాయని తెలిపారు. రానున్న ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరఫున గెలుపొందిన సర్పంచ్‌లు అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా అందరనీ కలుపుకొని పోతామని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. నూతన సర్పంచ్‌లు గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని సూచించారు. త్వరలో నల్లవాగు నీటి విడుదల కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి త్వరలో నల్లవాగు ప్రాజెక్టు నీటిని వదలనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తైబందీ ప్రకారం ఆరుతడి పంటలకు రెండు, మూడు రోజుల్లో నీటిని వదిలేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సమావేశంలో సీడీసీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంకర్, నాయకులు తాహెర్, పండరిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజుసేట్ పాల్గొన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
నిబంధనలకు ‘బంక్’
పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలేవి? ● కానరాని ఫస్ట్ ఎయిడ్.. టాయిలెట్లు అంతంతే ● ఉచిత ఎయిర్ ఉత్తిదే.. జాడలేని తాగునీరుమెదక్ కలెక్టరేట్: పెట్రోల్ బంకుల్లో టైర్లకు గాలి కొట్టిద్దామంటే అవకాశం ఉండదు.. దాహం వేస్తే తాగునీరు దొరకదు.. మరుగుదొడ్లు ఏ ర్పాటు చేయడం లేదు. ఇలా జిల్లాలో పెట్రోల్ బంకుల నిర్వహణ అధ్వానంగా ఉంది. నిబంధనలను వారు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు.తనిఖీలో బయటపడ్డ లోపాలు జిల్లా కేంద్రం ఏర్పాటు అనంతరం జనాభాతో పాటు వాహనాల సంఖ్య పెరిగింది. పెరుగుతున్న వాహనాల సంఖ్యకనుగుణంగా పెట్రోల్ బంక్‌లు సైతం వెలిశాయి. జిల్లాలో సుమారు 100 వంద వరకు పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉన్నాయి. నిత్యం వాహనదారుల నుంచి ఆదాయం పొందుతున్న పెట్రోల్ బంక్‌ల యజమానులు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పెట్రోల్ బంక్‌లో ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వాహనదారులకు అందుబాటులో తాగునీరు, టాయిలెట్లు, ఉచిత గాలి, ఇంధన కొలతలు, ధరల ప్రదర్శన, భద్రతా ప్రమాణాలు, సివిల్, ఫైర్, పోలీస్ అధికారుల ఫోన్ నంబర్లు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. అలాగే ప్రతి బంక్‌లో తప్పనిసరిగా ఆన్లైన్ పేమెంట్ చేసే విధంగా అవకాశం కల్పించాలి. ఇటీవల జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానందం జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్‌లో అకస్మిక తనిఖీలు చేపట్టగా, అనేక లోపాటు వెలుగుచూశాయి. ఇంధన కొలతల్లో తేడాలు, ఫిల్టర్ పేపర్ టెస్ట్‌లో అనుమానాస్పద ఫలితాలు, తాగునీరు, టాయిలెట్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, టైర్లకు ఉచిత గాలి వంటి లోపాలు బయటపడ్డాయి. జిల్లా కేంద్రంలోని ఒక బంక్‌లో తనిఖీలు చేస్తే ఇవన్నీ బయట పడితే, జిల్లాకు దూరంగా ఉన్న బంకులలో ఎన్ని సమస్యలున్నాయోనని వాహనదారులు వాపోతున్నారు. -
ఆపదలో అప్రమత్తతే ఆయుధం
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: విపత్తుల సమయంలో ప్రాణనష్టాల నివారణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు ప్రకృతి విపత్తులు, వైపరీత్యాల నివారణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఈనెల 22న విపత్తు నిర్వహణపై మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలకు విపత్తుల సమయంలో రక్షణ పొందేలా అవగాహన కార్యక్రమాలు కల్పించామని వివరించారు. గత వర్షాకాలం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసి, వరదలు సంభవించాయని తెలిపారు. ముందస్తు అప్రమత్తత, స్పష్టమైన ప్రణాళికలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సమన్వయ చర్యలతో వరదలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. మున్ముందు కూడా ఎలాంటి నష్టాలు కలుగకుండా సిద్ధంగా ఉన్నామని వివరించారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే వస్తువులతో కూడిన కిట్‌ను ఇటీవల జిల్లాలోని ప్రతి మండలానికి ఒకటి చొప్పున అందించామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీఆర్ఓ భుజంగరావు, ఆర్డీఓ రమాదేవి, అదనపు ఎస్పీ మహేందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
పాపన్నపేట(మెదక్): మండల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ నర్సింలు తెలిపారు. మిన్పూర్ 132 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతు లు చేయనున్నట్లు చెప్పారు. దీంతో ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జనవరిలో సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు మెదక్ కలెక్టరేట్: వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ విజయ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కో ర్సుల్లో భాగంగా డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలన్నీ జిల్లా కేంద్రంలో గుర్తించబడిన పరీక్ష కేంద్రంలో ఉంటాయని చెప్పారు. వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని పలు కేజీబీవీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అభ్యర్థుల మెరిట్ లి స్ట్ విద్యాశాఖ సైట్లో పొందుపర్చినట్లు డీఈఓ విజయ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. ఖాళీగా ఉన్న అకౌంటెంట్ (4), ఏఎన్ఎం (5) ఉద్యోగాల భర్తీ కోసం మహిళా అభ్యర్థుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబితాను ఆన్లైన్లో ఉంచినట్లు చెప్పారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం సవరణ మెరిట్ లిస్ట్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్ httpr:// medakdeo.comలో ఉంచినట్లు ఆమె వివరించారు. ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు చిన్నశంకరంపేట(మెదక్): ఆయిల్‌పామ్ సాగు తో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్‌సింగ్ అన్నారు. శుక్రవారం మండలంలోని సూరారంలో సత్యనారాయణ అనే రైతు సాగు చేసిన ఆయిల్‌పామ్ మొక్కలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 2 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ సాగు చేశారని తెలిపారు. అవసరమైన రక్షణ, పంట పెరుగుదలకు అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించే రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అయిల్‌పామ్ డైరెక్టర్ రంగనాయకులు, మేనేజర్ కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పంచాయతీ ముస్తాబు అల్లాదుర్గం(మెదక్): ఈనెల 22న నూతన సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయాలు ము స్తాబు చేస్తున్నారు. మండల పరిధిలోని అప్పాజీపల్లి పంచాయతీకి కొత్తగా రంగులు వేసి కార్యాలయానికి మరమ్మతులు చేస్తున్నారు. వణికిస్తున్న చలి పులి చేగుంట(తూప్రాన్): చలి పులి ప్రజలను వణి కిస్తోంది. జిల్లాలో వారం రోజులుగా తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలి తీవ్రతను త ట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఏడు గంటల వరకూ చలి తగ్గకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పొగ మంచు ఉండడంతో వాహనదారులు ఇబ్బందు లు పడుతున్నారు. -
పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి
ఆర్డీఓ జయచంద్రారెడ్డి తూప్రాన్: భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు 60 రోజుల కంటే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే సాదాబైనామా, ఎన్ఎఫ్బీఎస్, ప్రజావాణి, మీసేవ దరఖాస్తులు తదితర రెవెన్యూ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. -
ఇంటి నుంచే యూరియా బుకింగ్
రామాయంపేట(మెదక్): రైతులు శనివారం నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఏడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం రైతులకు బుకింగ్ యాప్‌పై అవగాహన కల్పించారు. మొబైల్‌తో రైతులు తమ ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చని వివరించారు. ఈ యాప్ ద్వారా జిల్లా పరిధిలో యూరియా స్టాక్‌ను స్వయంగా రైతులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. బుకింగ్ చేసుకోవడానికి గాను భూమి పట్టాదారులు, కౌలు రైతులు, నాన్ పట్టాదారులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఈమేరకు యూరియా బుక్ చేసుకున్న రైతులకు ఒక ప్రత్యేకమైన బుకింగ్ ఐడీ రూపొందించినట్లు పేర్కొన్నారు. సాగు విస్తీర్ణం ఆధారంగా రైతులు బుక్ చేసుకున్నా, అందుబాటులో ఉన్న స్టాక్‌ను బట్టి వారికి పంపిణీ చేస్తామన్నారు. ఆయన వెంట వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ, ఇతర అధికారులు, రైతులు ఉన్నారు. -
యూరియా కోసం బారులు
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలో యూ రియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. గురువారం నిజాంపేట సొసైటీతో పాటు మరో రెండు ఫర్టిలైజర్ దుకాణాలకు 3 లారీల యూరియా వచ్చింది. రైతులు భారీగా తరలివచ్చా రు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. యాసంగి సీజన్లో రైతులకు అందుబాటులో యూరియా ఉంచాలని కోరారు. భూమి లేని వారు సైతం వచ్చి యూరియా తీసుకొని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు వాపోయారు. పట్టాపాస్ పుస్తకం ఆధారంగా అవసరం మేరకు అధికారులు పంపిణీ చేయాలన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
పల్లె ప్రగతిపై కోటి ఆశలు
● పాలకవర్గాలు లేక నిలిచిన నిధులు ● 22న కొత్త సర్పంచ్ల ప్రమాణస్వీకారం రామాయంపేట(మెదక్): పంచాయతీలకు సుమారు రెండేళ్ల పాటు పాలకవర్గాలు లేక పాలన గాడి తప్పింది. ప్రత్యేకాధికారుల పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అర్థిక సంఘం నిధులు రాక కార్యదర్శులు కొట్టుమిట్టాడారు. చెత్త సేకరణ ట్రాక్టర్లలో డీజిల్ పోయించడానికి సైతం డబ్బులు లేక చేతులెత్తేశారు. ఇక ఇలాంటి సమస్యలకు తెరపడనుంది. మరో నాలుగు రోజుల్లో పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. పల్లెల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోనున్నాయి. గ్రామాల్లో ప్రధాన సమస్యలు ● జిల్లాలో 90కి పైగా జీపీలకు పక్కా భవనాలు లేవు. అద్దె ప్రాతిపదికన కొన్ని, పంచాయతీ కార్యాలయాల్లో మరికొన్ని కొనసాగుతున్నాయి. ● గ్రామాల్లో 350కి పైగా అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు లేకపోవడంతో అద్దె, పాఠశాల భవనాల్లో కొనసాగుతున్నాయి. ● కొన్ని పంచాయతీల్లో రేషన్ దుకాణాలు ప్రజలకు అందుబాటులో లేవు. దీంతో ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. ● గ్రామాల్లో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా మారింది. చెత్త పేరుకపోయి దుర్వాసన వెదజల్లుతుంది. ● చిన్న పంచాయతీలు, గిరిజన తండాల్లో రహదారులు, మురుగు కాలువలు పాక్షికంగా శిథిలమై ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు. ● పశువులు నీరు తాగడానికి వీలుగా పశువుల తొట్లు నిర్మించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ● గ్రామాలను ఆనుకొని ఉన్న చెరువులు ప్రమాదకరంగా మారాయి. జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ● ముఖ్యంగా తండాల్లో మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో గిరిజనులు ఇబ్బందుల పాలవుతున్నారు. ● కొన్ని పంచాయతీల్లో బురుజులు పాక్షికంగా శిథిలమై ప్రమాదకరంగా మారాయి. ప్రజల ఆశలు వమ్ము చేయను ఎన్నో ఆశలతో గ్రామస్తులు గెలిపించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి కృషి చేస్తా. ముందుగా వార్డు సభ్యులతో కలిసి గ్రామంలో పర్యటించి సమస్యలను పరిశీలించి ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తా. – తార్యానాయక్, సర్పంచ్, పర్వతాపూర్ మంచి పేరు తెచ్చుకోవాలి కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు నిస్వార్థంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. ఇందుకు ప్రజలు కూడా వారికి సహకరించాలి. ఎల్లవేళలా గ్రామస్తులకు అందుబాటులో ఉండాలి. ప్రధానంగా తాగు నీటి సరఫరా, పారిశుద్ధ్యం విషయమై దృష్టి సారించాలి. – యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి -
నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి
నర్సాపూర్ రూరల్: మండలంలోని కాగజ్మద్దూర్లో బుధవారం సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని నిమిషాల్లోనే పై సల లొల్లి మొదలైంది. పంచాయతీ ఈసారి మహిళకు రిజర్వు కావడంతో మూడు పార్టీలకు చెందిన ముగ్గురు నాయకులు వారి భార్యలను బరిలో నిలిపారు. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఓ మండల స్థాయి నాయకుడు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంచినట్లు తెలిసింది. ఇంతటితో ఆగకుండా రెండు కుల సంఘాలకు 1.50 లక్షల చొప్పున ముట్ట జెప్పినట్లు తెలిసింది. మరికొన్ని కుల సంఘాలకు వ్యక్తిగతంగా వారి వారి కుటుంబంలో ఉన్న ఓట్ల సంఖ్యను బట్టి రూ. 500 నుంచి రూ. 10 వేల వరకు ఇచ్చారు. దీనికి తోడు మద్యం, బిర్యానీ పొట్లాలు సైతం పంపిణీ చేశారు. ఇంత చేసినా ఓటమి చెందటంతో ఆ నాయకుడు, అతడి వర్గీయులు కలిసి కుల సంఘాలను దుర్భాషలాడుతూ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో రెండు కుల సంఘాలకు చెందిన వారు తిరిగి డబ్బులు వాపస్ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ఓట్ల కోసం డబ్బులు తీసుకున్న మరికొంత మంది సైతం తిరిగి డబ్బులు వాపస్ ఇచ్చినట్లు సమాచారం. అప్పుడు తల్లి, తండ్రి.. ప్రస్తుతం కొడుకు నర్సాపూర్ రూరల్: మండలంలోని జక్కపల్లికి చెందిన దుప్తల భ రత్ బీటెక్ పూర్తి చేసి సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందాడు. అయితే గత సర్పంచ్‌గా అతడి తల్లి వెంకటలక్ష్మి గెలుపొందింది. అంతకు ముందు తండ్రి శ్రీనివాస్ గ్రామ సర్పంచ్‌గా పని చేశాడు. వరుసగా మూడుసార్లు ఒ కే కుటుంబానికి సర్పంచ్ గిరి వరించింది. అన్నపై.. తమ్ముడి గెలుపు కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని కూకుట్లపల్లిలో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు పోటీపడ్డారు. కాంగ్రెస్ మద్దతుదారుగా అన్న నీరుడి అశోక్, బీఆర్ఎస్ తరపున తమ్ముడు కుమార్ పోటీ చేశారు. గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేశారు. చివరికి అన్నపై తమ్ముడు కుమార్ 197 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందాడు. చిన్న కోడలును వరించిన పదవి కౌడిపల్లి(నర్సాపూర్): సర్పంచ్ పదవికి తోటికోడళ్లు పోటీపడగా, చివరికి చిన్న కోడలును గెలుపు వరించింది. మండలంలోని పంచాయతీలో గత ఎన్నికల్లో ఏకగ్రీవ సర్పంచ్ జీవుల ఈసారి తన భార్య జమ్కి బీఆర్ఎస్ మద్దతుదారు గా పోటీ చేసింది. అతడి తమ్ముడు చెన్న భార్య లక్ష్మి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. దీంతో తండాలో తోటి కోడళ్ల పోరులో చివరికి చిన్న కోడలు లక్ష్మి గెలుపొందింది. ఓటమి ఎరుగని కుటుంబం నర్సాపూర్ రూరల్: మండలంలోని లింగాపూర్‌కు చెందిన బోర్లపు శ్రీనివాస్‌గుప్తా కుటుంబం 1988 నుంచి రిజర్వేషన్ కలిసి వచ్చిన ప్రతీసారి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో శ్రీనివాస్‌గుప్తా భార్య రాజకళ సర్పంచ్‌గా గెలుపొందారు. గతంలో సైతం రాజకళ సర్పంచ్‌గా పనిచేశారు. శ్రీనివాస్‌గుప్తా రెండు పర్యాయాలు లింగాపూర్ సర్పంచ్‌గా, రెండుసార్లు లింగాపూర్ ఎంపీటీసీగా, 2006లో నర్సాపూర్ జెడ్పీటీసీగా గెలుపొందారు. అతని తండ్రి సైతం లింగాపూర్ సర్పంచ్‌గా పనిచేశారు. తండ్రి ఆశయ సాధనలో భాగంగా మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే బోర్లపు కుటుంబం కొనసాగుతూ వస్తోంది. మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలి మెదక్ కలెక్టరేట్/చిలప్‌చెడ్(నర్సాపూర్): కౌడిపల్లి మండలం తునికి సర్పంచ్ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలని సర్పంచ్ అభ్యర్థి స్వాతి డిమాండ్ చేశా రు. ఈ మేరకు గురువారం డీపీఓ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు బీఆర్ఎస్కు వత్తా సు పలికారని ఆరోపించారు. ఓట్లను లెక్కించే సమయంలో ఫిజికల్‌గా తమకు చూపించలేదని ఆరోపించారు. ఫలితాల లెక్కింపులో అవకతవకలు జరిగాయని బండపోతుగల్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్ధి రామయ్యగారి రజిత తన మద్దతుదారులతో కలిసి ఎంపీడీఓ ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. మొత్తం 786 ఓట్లు పోల్ కాగా, తనకు 386 ఓట్లు, ప్రత్యర్థికి 389 ఓట్లు వచ్చాయని తెలిపారు. మిగితా 11 బ్యాలెట్ పేపర్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ విషయమై అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. ఫలితాలపై విచారణ చేయాలని కోరారు. సర్పంచ్ పీఠంపై పట్టభద్రుడు కొల్చారం(నర్సాపూర్): పోతంశెట్టిపల్లి సర్పంచ్‌గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి పాతూరి దయాకర్‌గౌడ్ విజయం సాధించాడు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన దయాకర్ పార్లమె ంట్ ఎన్నికలకు ముందు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. సమీప స్వతంత్ర అభ్యర్థిపై 256 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. -
సాగు నీటిపై స్పష్టత ఇవ్వాలి
మాజీ మంత్రి హరీశ్రావుమెదక్మున్సిపాలిటీ: యాసంగి సాగుపై జిల్లా రైతాంగం తీవ్ర అయోమయంలో ఉందని, సాగునీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వా లని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గురువారం మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బ లపరిచిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగూరు మరమ్మతులు వేసవిలో చేయాల్సి ఉండగా, నీటిని ఖాళీ చేయటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. సాగునీరు ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్ర కటించి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు ఉంది, పంటను కాపాడుతూనే మరమ్మతులు చేసే అవకాశం ఉన్నా, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతుల హక్కును కాపాడాలన్నారు. ఓట్ల కోసం పోలింగ్ బూత్‌ల దగ్గర కుర్చీలు వేసుకుని వంగి వంగి దండాలు పెట్టే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. యూరియా కష్టాలపై, గురుకులాల్లో పురుగుల అన్నంపై ఎందుకు కుర్చీ వేసుకుని నిలదీయలేదని ప్రశ్నించారు. పెన్షన్లు, రుణమాఫీకి పైసలు లేవు కానీ.. మెస్సీ కోసం, అందాల పోటీల కోసం రేవంత్‌రెడ్డి రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పద్మారెడ్డి, శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. నీళ్లు, విద్యుత్, ఎరువులు కావాలి అన్నదాతలకు కావాల్సింది యాప్‌లు, మ్యాపులు కాదు.. నీళ్లు, విద్యుత్, ఎరువులని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కొత్త చట్టాల పేరుతో కౌలు రైతులు, యజమానుల మధ్య పంచాయతీలు పెడు తున్నారన్నారు. అక్షరాస్యత లేని రైతులు, స్మార్ట్ఫోన్లు లేని మహిళా రైతులు యాప్‌లు, మ్యా పులు ఎలా వాడతారని ప్రశ్నించారు. -
కర్షకులకు కరెంట్ కష్టాలు
● నిధులు మంజూరైనా ముందుకు సాగని పనులు ● ఆందోళనలో అన్నదాతలు మెదక్‌జోన్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది అన్నదాతల పరిస్థితి. ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. విద్యుత్ స్తంభాలు, వందలాది ట్రాన్స్ఫార్మర్లు, బోరు బావు లు ధ్వంసం అయ్యాయి. స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి బాధితులను వెంటనే ఆదుకోవాలని నిధులు విడుదల చేశారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు. ఫలితంగా బోరు బావులకు నేటికీ విద్యుత్ పునరుద్ధరించలేదు. యాసంగి నారుమల్లు పోసే పుణ్య కాలం దాటిపోతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రూ. 6.5 కోట్లు మంజూరు జిల్లాలో ఈఏడాది ఆగస్టులో పెద్ద ఎత్తున వరదలు వ చ్చాయి. అత్యధికంగా హవేళిఘణాపూర్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, మెదక్ తదితర మండలాల్లో తీవ్ర నష్టం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 10,671 ఎకరాల్లో పంటలు ధ్వంసం కాగా 1,344 విద్యుత్ స్తంభాలు, 460 ట్రాన్స్ఫార్మర్లు, మెదక్ పట్టణంలో ఓ సబ్‌స్టేషన్ నీట మునగింది. కిలోమీటర్ల మేర తీగలు కొట్టుకుపోయాయి. పోచమ్మరాల్ గ్రామ శివారులో గల పో చారం ప్రాజెక్టు దిగువన వరద ఉధృతికి వందలాది బోరు బావులు ధ్వంసం అయ్యాయి. బోరుపైపులు విరిగిపోయాయి. స్తంభాలు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా విద్యుత్‌శాఖకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం ఆశాఖకు రూ. 6.5 కోట్లు మంజూరు చేసింది. వీటితో నూతనంగా స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, కొత్త తీగలు ఏర్పాటు చేయడం, నీటి మునిగిన సబ్‌స్టేషన్‌ను మరోచోట నిర్మించాలని నిర్ణయించారు. కాగా పనులను పలువురు కాంట్రాక్టర్లకు అప్పగించి అధికారులు చేతులు దులుపుకున్నారు. పనులు దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్లు అక్కడక్కడ కొన్ని విద్యుత్ స్తంభాలను నాటి వదిలేశారు. నష్టం జరిగి మూడు మాసాలు గడిచి పోతున్నా, పనులు పూర్తిస్థాయిలో చేయలేదు. ఫలితంగా బోరుబావులు మూలన పడ్డాయి. యాసంగి నారు ఎలా పోయాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యుత్‌ను త్వరగా పునరుద్ధరించాలని వారు వేడుకుంటున్నారు. పట్టించుకోవడం లేదు వరదలతో సర్వం కోల్పోయాం. నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పటివరకు రాలేదు. కనీసం విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసినా బోరుబావుల కింద తుకాలు పోసుకుంటాం. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కనికరించటం లేదు. – శ్రీనివాస్, రైతు, పోచమ్మరాళ్ త్వరలో పనులు పూర్తి చేస్తాం వరద నష్టంతో విద్యుత్‌శాఖకు సుమారు రూ. 7 కోట్ల మేర నష్టం జరిగింది. పనుల పునరుద్ధరణ కోసం రూ. 6.5 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 80 శాతం పనులు చేశాం. మిగితా పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. – నారాయణ నాయక్, ఎస్ఈ, విద్యుత్‌శాఖ -
కారు.. టాప్ గేరు
● 80 సర్పంచ్ స్థానాలు కై వసం ● 70 స్థానాలకే పరిమితమైన హస్తం ● 26 చోట్ల స్వతంత్రుల విజయబావుటా ● 7 స్థానాలతో సరిపెట్టుకున్న కమలం తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ఆ పార్టీ మద్దతుదారులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. తొలి, రెండో విడతలో హస్తం హవా కొనసాగింది. మూడో విడతలో మాత్రం వెనుకబడింది. బీఆర్ఎస్కు గట్టి పోటీనిచ్చింది. కేవలం 7 సర్పంచ్ స్థానాలతో బీజేపీ తన ఉనికిని చాటుకుంది. పలు గ్రామాల్లో స్వతంత్రులు విజయబావుటా ఎగురవేశారు. –నర్సాపూర్/మెదక్‌జోన్ తుది విడత ఎన్నికలు నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట 7 మండలాల్లో నిర్వహించారు. మొత్తం 183 పంచాయతీలు ఉండగా, ఇందులో 22 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయిన విషయం విదితమే. మిగిలిన 161 సర్పంచ్ స్థానాలకు బుధవారం పో లింగ్ జరిగింది. ఏకగ్రీవాలతో కలిపి 80 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా, అధికార కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలకు పరిమితం అయింది. 26 స్థానాల్లో స్వతంత్రులు సత్తా చాటారు. కేవలం 7 చోట్ల బీజేపీ మద్దతుదారులు గెలిచారు. సొంత ఇలాఖాలో హవా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీ పట్టు నిలుపుకొంది. పలు మండలాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికలు జరిగాయి. పలుచోట్ల కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించగా, కొన్ని మండలాల్లో బీఆర్ఎస్ పట్టు నిలుపుకొ ంది. బీజేపీ నామమాత్రపు స్థానాలకు పరిమితమైంది. నర్సాపూర్ మండలంలో నువ్వా నేనా.. అన్నట్లు పోరు సాగింది. పలుచోట్ల రెండు పార్టీల నుంచి రెబల్స్ పోటీ చేశారు. 35 పంచాయతీల్లో రెండు ఏ కగ్రీవం అయ్యాయి. అందులో ఒకటి కాంగ్రెస్‌కు ద క్కగా, మరోచోట స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. మిగిలిన 33 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లు చెరో 16 స్థానాలను సమానంగా దక్కించుకున్నారు. ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కాగా ఏకగ్రీవమైన పంచాయతీ కాంగ్రెస్ ఖాతాలోకి రావడంతో సంఖ్య 17కు చేరుకుంది. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ స్వగ్రామం రెడ్డిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి పరువు కాపాడుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ సొంత గ్రామమైన గొల్లపల్లిలో తన సమీప బంధువు మాధవి బీజేపీ మద్దతుతో పోటీ చేయగా ఆమైపె కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. ● ఎమ్మెల్యే సునీతారెడ్డి సొంత మండలం శివ్వంపేటలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్‌లు గెలుపొందినప్పటికీ, ఆమె సొంత గ్రా మం గోమారంలో మాత్రం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. మండలంలోని 37 పంచాయతీలకు గాను మూడు ఏకగ్రీవమయ్యాయి. వాటిలో బీఆర్ఎస్ రెండింటిని దక్కించుకోగా, ఒక స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది. కాగా చాలా గ్రామాల్లో పోరు ర సవత్తరంగా సాగింది. బీఆర్ఎస్ 19 పంచాయతీలను దక్కించుకొని ఆధిక్యంలో నిలువగా, కాంగ్రెస్ 16 స్థానాల్లో గెలుపొందింది. కాగా అల్లీపూర్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించగా, గుండ్లపల్లిలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ● ఇక చిలప్‌చెడ్ మండలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చేరో 9 స్థానాలు స్థానాలు దక్కించుకోగా, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కౌడిపల్లి మండలంలో 35 పంచాయతీల్లో ఏడు ఏకగ్రీవం కావడంతో 28 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి సొంత గ్రామమైన మండల కేంద్రంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కృష్ణాగౌడ్ గెలుపొంద డం గమనార్హం. ఏకగ్రీవాలను కలుపుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ చేరో 14 14 స్థానాలను దక్కించుకోగా, బూరుగడ్డ పంచాయతీ బీజేపీ, 2 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. ● కొల్చారంలో బీఆర్ఎస్ సత్తాచాటింది. మండలంలో 21 పంచాయతీలకు గాను మూడు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 18 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. రెండు ఏకగ్రీవ పంచాయతీలను కలిపి మండలంలో బీఆర్ఎస్ 11 పంచాయతీలు కై వసం చేసుకోగా, కాంగ్రెస్ ఒక ఏకగ్రీవ పంచాయతీతో కలిపి 5 స్థానాలకు పరిమితమైంది. రెండు చోట్ల బీజేపీ గెలువగా, 3 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ● మాసాయిపేట మండలంలో 13 పంచాయతీల్లో ఒకటి ఏకగ్రీవం కావడంతో 12 జీపీలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో నాల్గు స్థానాల్లో గెలుపొందాయి. కా గా బీజేపీ ఒక స్థానం దక్కించుకోగా, మూడు పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవమైన పంచాయతీ సైతం స్వతంత్ర అభ్యర్థి ఖాతాలో చేరింది. ● వెల్దుర్తి మండలంలో బీఆర్ఎస్ సత్తా చాటింది. 23 పంచాయతీలు ఉండగా 4 ఏకగ్రీవం అయ్యాయి. వాటిలో ఒకటి కాంగ్రెస్‌కు దక్కగా, మూడు స్థానాల్లో స్వతంత్రులు ఎన్నికయ్యారు. మిగిలిన 19 పంచాయతీలకు ఎన్నికలు జ రుగగా, ఏడు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ 4 చోట్ల గెలుపొందింది. కాగా బీజేపీ 2 స్థానాల్లో, 6 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. -
ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దు
రామాయంపేట(మెదక్): పట్టణంలోని అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్లో బూజు పట్టిన పాపడ్లు.. గడువు మీరిన సాస్ బాటిళ్లను జిల్లా అహార భద్రత అధికారి స్వదీప్కుమార్ స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఆయన బుధవారం హోటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో పట్టుబడిన నాసిరకం పదార్థాలను ధ్వంసం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని సూపర్ మార్కెట్లు, హో టళ్లు, బార్లతో పాటు ఐస్‌క్రీం పార్లర్లలో తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొ న్నారు. ఈమేరకు అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట ఫుడ్ శాంపిల్స్ సహాయ అధికారి నజీర్, సిబ్బంది ఉన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన పల్లె పోరు
ఎస్పీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వా తావరణంలో ముగిశాయని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజలు, పోలీస్ అధికారులు, ఇతర శాఖల సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు మొత్తం 750 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల తేదీలు ఖరారైన నాటి నుంచే జిల్లావ్యాప్తంగా నిబంధనలు కఠినంగా అమలు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టామన్నారు. బు ధవారం వరకు రూ. 47. 48 లక్షలు నగదు, 268 కేసుల్లో సుమారు రూ. 26.46 లక్షల విలువ గల 3,688 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి ముందస్తుగా 1,122 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు సిబ్బంది చలిని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. -
కాంగ్రెస్ పాలనలో ప్రగతి శూన్యం
తూప్రాన్: రెండున్నర ఏళ్లలో గ్రామాల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం మండలంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బుధవారం హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులను వారు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. తమ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను పోలీసుల సహకారంతో కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. వారికి అండగా నిలిచి కాపాడుకుంటామని భరోసా కల్పించారు. పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మండల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నా రు. బుధవారం పెద్దశంకరంపేటలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఉపసర్పంచ్ రాజుగౌడ్‌తో పాటు వార్డు సభ్యులను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూ చించారు. కార్యక్రమంలో నా యకులు మురళిపంతులు, నారాగౌడ్, సంగమేశ్వర్, బాసాడ రాజు, సుభాశ్‌గౌడ్, సర్పంచ్‌లు పెరుమాండ్లుగౌడ్, కుమా ర్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: ప్రమాదంలో మృతిచెందిన కార్మికుడి కుటుంబానికి పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఎంఎస్ అగర్వాల్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికై నా చనిపోయి న కార్మికుడి కుటుంబానికి రూ. లక్ష ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల కిందట ఇదే పరిశ్రమలో ఒక కార్మికుడు చనిపోయాడని తెలిపారు. కానీ యజమాన్యం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్ట డం లేదని వాపోయారు. ఆయన వెంట జిల్లా సహాయ కార్యదర్శి సంతోశ్ ఉన్నారు. తూప్రాన్: జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని పట్ట ణ కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించా రు. ఈసందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ.. 1982 డిసెంబర్ 17న జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పుతో పెన్షనర్లకు భద్రత కలిగిందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయ కులు కిష్టయ్య, రామకిష్ణయ్య, ముత్యా లు, జగతయ్య రాములు, అండాలమ్మ, నాగభూషణం, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్: ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి మండిపడ్డారు. బుధవారం గజ్వే ల్లో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజివిక మిషన్ పేరుతో బిల్లును తీసుకువస్తున్నారని చెప్పారు. -
ఓటెత్తిన పల్లె జనం
● మూడో విడతలో 90.67 శాతం పోలింగ్ ● ముగిసిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఎల్లాపూర్‌లో ఓటు వేసిన మహిళలుమెదక్జోన్: తుది విడత పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటరు స్ఫూర్తి చాటారు. బుధవారం పో లింగ్ కేంద్రాలకు పెద్దఎత్తున తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉద యం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఏడు మండలాల పరిధిలో మొత్తం 1,62,348 ఓట్లు ఉండగా, 1,42,207 ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్కన 90.67 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట ఏడు మండలాల పరిధిలో జరిగాయి. 183 జీపీలు, 1,528 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే 22 జీపీలు 307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 161 పంచాయతీలతో పాటు 1,221 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ జంట నగరాలకు వలస వెళ్లిన వారు పెద్ద ఎత్తున స్వగ్రామాలకు తరలివచ్చి ఓటు వేశారు. కాగా పోలింగ్ సమయం ముగిసినా క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కౌడిపల్లి, కొల్చారంలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ శ్రీనివాస్ పరిశీలించారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలన మెదక్ కలెక్టరేట్: మూడో విడతలో 7 మండలా ల పరిధిలో 161 గ్రామాల్లో పోలింగ్ జరగగా, 43 గ్రామాలను సమస్యాత్మక జీపీలుగా గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించి అధికారులకు తగు సలహాలు, సూచనలు చేశారు. -
ఇంటి నుంచే యూరియా బుకింగ్
● ఈనెల 20 నుంచి అందుబాటులోకి యాప్ ● యాసంగికి 25,329 మెట్రిక్ టన్నులు ● 3.20 లక్షల ఎకరాల్లో పంటలు మెదక్ అర్బన్: ఇక యూరియా కోసం రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పని లేదు. రైతు ఇంటి నుంచి మైబెల్లో యూరియా బుక్ చేసుకునేలా వ్యవసాయశాఖ ప్రత్యేక యాప్‌ను ఈనెల 20 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. యూరియా అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలు.. వరి పంట అవశేషాలను కాల్చడం కలిగే పర్యావరణ సమస్యలను వివరించనున్నారు. ప్రత్యేక యాప్‌తో సరఫరా వ్యవసాయ శాఖ తయారు చేసిన ప్రత్యేక యాప్ ద్వారా రైతు డీలర్ల వద్ద యూరియా ఉన్న స్టాక్ వివరాలు తెలసుకోవచ్చు. తనకు ఇష్టమైన డీలర్ నుంచి బుక్ చేయాలి. వెంటనే ఐడీ వస్తుంది. ఇందుకనుగుణంగా డీలర్ వద్ద నుంచి యూరియా కొనుగోలు చేయవచ్చు. రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. భూవిస్తీర్ణం, వేసిన పంటకనుగుణంగా యూ రియా తీసుకునే అవకాశం ఉంది. తద్వారా పరిమితికి మించి యూరియా వాడకుండా, పక్క దారి పట్టకుండా చూడొచ్చు. ఎలా బుక్ చేయాలి ● మొబైల్లో ఎరువుల యాప్ ఓపెన్ చేయగానే, రైతులు, వ్యవసాయశాఖ, డీలర్ల కోసం లాగిన్లు కనిపిస్తాయి. ● లాగిన్‌లో మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే డీలర్లు, యూరియా స్టాక్ వివరాలు కనిపిస్తాయి. ● పాస్‌బుక్ నంబర్, పంట విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి. ● సాగు చేసే పంట విస్తీర్ణం ఆధారంగా అవసరమైన మోతాదులో యూరియా బ్యాగుల సంఖ్య కనిపిస్తుంది. ● యూరియా బుక్ చేసిన తర్వాత, 15 రోజుల్లో 4 దశల్లో యూరియా అందుతుంది. ● పాస్‌బుక్ లేని రైతులు పట్టాపాస్ బుక్ ఆప్షన్లో ఆధార్ నంబర్ ఎంట్రీ చేసి, ఓటీపీ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వివరాలు నమోదు చేయాలి. కౌలు రైతులు సైతం యూరియా తీసుకోవచ్చు. కృత్రిమ కొరతను నివారించవచ్చు వ్యయసాయ శాఖ రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా రైతు నేరుగా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చు. ఏయే డీలర్ల వద్ద ఎంత స్టాక్ ఉందో తెలుస్తుంది. ఇందుకనుగుణంగా యూరియాను బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల పంట విస్తీర్ణానికి కనుగుణంగా యూరియా తీసుకునే అవకాశం ఉంటుంది. పరిమితికి మించి యూరియా తీసుకునే అవకాశం లేదు. కృత్రిమ కొరతకు ఆస్కారం ఉండదు. – దేవ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి -
కొనసాగిన అరిగె వారి హవా
కొల్చారం(నర్సాపూర్): రంగంపేట రాజకీయం ఎప్పుడు రసవత్తరంగా ఉంటుంది. మండల వ్యవస్థ ఏర్పాటు సమయంలో అప్పుడు తెలుగుదేశంలో ఉన్న గ్రామానికి చెందిన ధర్మగౌడ్ వరుసగా మూడుసార్లు సర్పంచ్‌గా తిరుగులేని నాయకుడుగా కొనసాగుతూ వచ్చారు. అతని తర్వాత ఎల్ఎల్బీ చేసి యువ నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అరిగె రమేశ్‌కుమార్ (ప్రస్తుతం డీసీఎంఎస్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు) కాంగ్రెస్‌తో రాజకీయ ప్రవేశం చేసి తొలిసారి ధర్మగౌడ్పై పోటీ చేసి గెలిచారు. అక్కడి నుంచి వెనక్కి తిరగి చూడలేదు. సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా, టెస్కో డైరెక్టర్‌గా, భార్య రజని సర్పంచ్‌గా, ఎంపీపీగా ఒక మారు, సోదరుడు విజయ్ కుమార్ సర్పంచ్ (ఏకగ్రీవం)గా కొనసాగుతూ వచ్చారు. 2019లో స్థానిక సర్పంచ్ ఎన్నికలకు ఆ కుటుంబం దూరంగా ఉంది. ప్రస్తుతం రంగంపేట సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వేషన్ కావడంతో విజయ్ కుమార్ భార్య స్వర్ణలత బీఆర్ఎస్ మద్దతుదారుగా పోటీలో నిలిచారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి అనితపై 73 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. -
పైసా పాయె.. పరువు పోయె..
జహీరాబాద్: ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో గట్టెక్కుతామనే అతి విశ్వాసంతో మొదటి, రెండో విడతలో పోటీకి దిగిన పలువురు ఓటమితో డీలా పడ్డారు. ప్రజల్లో తమకు మంచి గుర్తింపు ఉందని, ఇది ఓట్లు తెచ్చిపెడుతుందని, పార్టీల మద్ధతు ఉంటే ఇక విజయం నల్లేరుపై నడకే అని భావించిన పలువురు ఓటమితో భంగపడ్డారు. ఆయా పార్టీల్లోని సర్పంచ్ అభ్యర్థులు తమ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. మంచి ఫాలోయింగ్ ఉందని భావించి ఎన్నికల గోదాలోకి దిగి పలువురు చిత్తుగా ఓడిపోయారు. తాము చేసిన పనులను చూసి తిరిగి ప్రజలు పట్టం కడతారని భావించి పలువురు తాజా మాజీ సర్పంచ్, తాజామాజీ ఎంపీటీసీలు ఎన్నికల్లో పోటీకి దిగినా వారిని ప్రజలు ఆదరించలేదు. దీంతో వారు నిరాశకు గురికాక తప్పలేదు. ఓటమిపాలైన వారు తీవ్ర మనోవేదకు గురయ్యారు. ఎన్నికల్లో అప్పులు చేసి ఖర్చు పెట్టిన పైసా పాయే, ఓటమి పాలవడంతో పరువు కూడా పాయే అని పలువురు వాపోతున్నారు. అప్పులు చేసి మరీ పోటీ చేసినా.. పలువురు సర్పంచ్ పదవిపై ఆశతో ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయినా ప్రజలు ఆదరించలేదు. దీంతో ఇటు పదవి రాకుండా పోగా, అటు అప్పుల పాలయ్యారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో దారిలేక అయోమయంలో ఉన్నారు. డబ్బు ఖర్చుపెట్టకున్నా వరించిన విజయం పలువురు అభ్యర్థులు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకున్నా ప్రజలు ఆదరించడంతో విజయం సాధించారు. పదవి దక్కాలన్నా డబ్బే ముఖ్యం అనేది నిజం కాదని పలువురు అభ్యర్థుల విజయం తేల్చేసింది. నమ్మకంగా ఉన్నవారినే ఓటర్లు ఆదరిస్తారనేది వీరు సాధించిన విజయమే నిదర్శనం. రిజర్వుడు స్థానాల్లో అయితే ఎక్కువ సంఖ్యలో పేదలే ఎన్నికల్లో పోటీ చేశారు.ఓడినవారు ఎంపీటీసీ పదవిపై గురి సర్పంచ్ పదవులకు ఓటమిపాలైన వారు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగాలని యోచిస్తున్నారు. ప్రజలు తమపై సానుభూతి చూపుతారనే నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే ప్రజల వైపు నుంచి తమకు హామీలు వస్తున్నట్లు ఓటమి పాలైన వారు పేర్కొంటున్నారు. ఓటమితో నేర్చుకున్న గుణపాఠం ఒక అనుభవమంటున్నారు. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థులను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే. మనో వేదనలో ఓటమి పాలైన అభ్యర్థులు లక్షలు ఖర్చు పెట్టినా తప్పని ఓటమి ప్రజలు ఎందుకు ఆదరించలేదని ఆరా -
‘నోట్ల’ పండగ!
● పంచాయతీ ఎన్నికల్లో మద్యం.. మనీదే ప్రభావం ● రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్న అభ్యర్థులు ● రూ.150 కోట్ల మద్యం అమ్మకాలు ● వలస ఓటర్లకు ఎన్నికల పండగమెదక్ అర్బన్: మెదక్ సమీపంలో ఉన్న ఒక గ్రామంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి, ఇక్కడ సుమారు రూ.కోటి వరకు ఓ అభ్యర్థి ఖర్చు చేశారన్న ప్రచారం ఉంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం ఓటరును ఎంత ప్రభావితం చేస్తుందో ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో డబ్బు, మద్యం బాగా పనిచేశాయి. చిన్న పంచాయతీల్లో సైతం కనీసం రూ.5 లక్షలలు, మండల కేంద్రాలు , కాస్త పెద్ద పంచాయతీల్లో సుమారు రూ.30 నుండి 50 లక్షల వరకు అభ్యర్థులు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఎన్నికల వేల సుమారు రూ.150 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు బంగారు నగలు, ఆస్తులు అమ్ముకుంటున్నారని సమాచారం మద్యంతో మచ్చిక.. నోటుతో ఓటు కోసం యత్నాలు పంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండేళ్లుగా ఎన్నికలపై గురి పెట్టిన ఆశావహులు, ఆరు నెలల నుంచే ఎన్నికలకు సంసిద్ధమవుతూ వచ్చారు. సర్పంచ్‌పై ఆశలు పెట్టుకున్న వ్యక్తులు, అప్పటి నుండే వార్డు మెంబర్ల ప్యానెల్లు తయారు చేసుకున్నారు. వీరికి కొన్ని డబ్బులు ఇచ్చి, వారి వార్డుల్లో తరచుగా మందు, విందులతో పార్టీలు ఇస్తూ వారిని చేజారి పోనీయకుండా చూసుకున్నారు. వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసించే వారిలో, ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని, తరచుగా వారికి పార్టీలు ఇస్తూ వచ్చారు. ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు పంపిణీ చేశారన్న ప్రచారం ఉంది. ఇందు కోసం తమకు నమ్మకస్తులైన వారి నుంచి ఆన్లైన్ పే మెంట్లు జరిపారు. ఏ ఊరిలో..ఏ వీధిలో చూసినా మద్యం విచ్చల విడిగా పారింది. కొత్త ఎకై ్సజ్ సంవత్సరంలో 17 రోజుల వ్యవధిలో సుమారు రూ.150 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తుంది. అడిగిందే తడవుగా అలవి కాని హామీలను గుప్పిస్తున్నారు. చిన్నశంకరంపేట, రామాయంపేట మండలంలో ఎన్ఆర్ఐలు ఎన్నికల సమరంలోకి దిగి విజయం సాఽధించారు.‘ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు డబ్బులు లేవని, నమ్ముకున్న వారే నట్టేట ముంచుతున్నారన్న ఆవేదనతో సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిపడ్‌పల్లిలో ఈ నెల 8న ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సానుభూతి ఓట్లు మరణానంతరం అతన్ని గెలిపించాయి’ఆస్తులు అమ్ముకుంటున్న అభ్యర్థులు ఎన్నికల కోసం అప్పులు తెచ్చి ఖర్చు చేసిన అభ్యర్థులు ఓడిపోవడంతో బాకీలు తీర్చేందుకు ఆస్తులు అమ్ముకునే పనిలో పడ్డారు. పాపన్నపేట మండలంలో ఓ గ్రామానికి చెందిన అభ్యర్థి భార్య మెడలోని పుస్తెల తాడు విక్రయించినట్లు తెలుస్తుంది. అలాగే మరో వ్యక్తి తనకున్న ఒక ప్లాట్‌ను అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు వ్యవసాయ భూములను అమ్ముకునే యత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పార్టీ పరంగా, అధినాయకుల పరంగా కూడా అభ్యర్థులకు కొంత మేర ఆర్థిక సహాయం అందినట్లు సమాచారం. -
ప్రజలంతా బీఆర్ఎస్ వైపే..
జిన్నారం (పటాన్చెరు): పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన గుమ్మడిదల మండల సర్పంచులను మాజీమంత్రి హరీశ్‌రావు అభినందించారు. పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడిదల మండల పరిధిలోని నాలుగు గ్రామపంచాయతీలో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచులు, వార్డు సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా హరీశ్ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. మండలంలో ఎనిమిది సర్పంచ్ స్థానాల్లో నాలుగు పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో బీఆర్ఎస్ బలోపేతంగా ఉందన్నారు. గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని నూతన సర్పంచులకు సూచించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నూతన సర్పంచులకు అభినందనలు -
పదేళ్లు కాంగ్రెస్‌కు ధోకా లేదు
వట్పల్లి(అందోల్): అందోల్, వట్పల్లి మండలాల్లోని కన్సాన్పల్లి, రాంసాన్పల్లి, ఉసిరికపల్లి తదితర గ్రామాలలో గెలుపొందిన నూతన సర్పంచ్‌లు మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. పంచాయితీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధోకా లేదన్నారు. నూతన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శేరి వెంకట్‌రెడ్డి, అందోల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ బాలయ్య, నాయకులు మహిపాల్, కృష్ణ, సురేష్‌రావు, రమేశ్‌గౌడ్, వీరేశం, జాను, నర్సింలు, నాగార్జున్‌రెడ్డి, బాల్‌రాజ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఎంటీసీసీ, జెడ్పీటీలను మీరే గెలిపించాలి ప్రజాకాంక్ష మేరకు పనిచేయాలి ప్రభుత్వానికి ప్రజా మద్దతు: దామోదర నూతన సర్పంచ్‌లకు అభినందన -
కాంగ్రెస్‌లో కోవర్టులు: మైనంపల్లి
రామాయంపేట/నిజాంపేట(మెదక్): కొందరు కోవర్టుల వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే, మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. మంగళవారం నిజాంపేట మండలం కల్వకుంటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బుల పంపిణీ ఆనవాయితీగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు డబ్బులమయం అయ్యాయని, ప్రచార సరళిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా ఆ పార్టీ నేత హరీశ్‌రావుకు పోలీసులు, అధికారులపై పూర్తిస్ధాయి కమాండ్ ఉందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రత్యర్థి పార్టీ వారికి సమాచారం అందజేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కోవర్టు సిస్టం పోతే తాము వందశాతం గెలుస్తామని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గంలో 75 శాతం మేర పార్టీ బలపర్చిన సర్పంచులు గెలిచారని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాలను కలుషితం చేశారని, నేడు డబ్బులు లేనిదే రాజకీయాల్లో ముందుకు వెళ్లడం కష్టతరమని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు కొందరు నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికీ హరీశ్ కమాండ్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఆరోపణ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ ఆనవాయితీగా మారిందని ఆందోళన -
ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
కొల్చారం(నర్సాపూర్): మూడో విడత ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంట డీఈఓ విజయ, రాజిరెడ్డి, ఎంపీడీఓ రఫీకున్నిసా, తహసీల్దార్ శ్రీనివాస్ చారి ఉన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: జెడ్పీ సీఈఓవెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో మూడో విడత జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ఎన్నికల సిబ్బందికి సూచించారు. పోలింగ్ సామగ్రి, ఎన్నికల సిబ్బంది కేటాయింపు, తరలింపు ప్రక్రియను మాసాయిపేట మండల కేంద్రంలో సీఈఓ ఎల్లయ్య, వెల్దుర్తి మండల కేంద్రంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి పరిశీలించారు. సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందజేశారు. విధుల పట్ల అలక్ష్యం చేయవద్దని సూచించారు. -
పెద్దపులి సంచారం
అప్రమత్తంగా ఉండండి: అటవీ అధికారి నిజాంపేట(మెదక్): మెదక్, కామారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తుందని మంగళవారం అటవీ శాఖ అధికారి విద్యాసాగర్ తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట, చల్మెడ, నస్కల్, నందగోకుల్, నగరం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం అటవీ అధికారులు గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. రాత్రిపూట ఎవరూ పొలాల వద్దకు వెళ్లకూడదన్నారు. కేతకిలో ఎన్నికల పరిశీలకుల పూజలుఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో పంచాయతీ ఎన్నికల పరిశీలకులు భారతి లక్పతి నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఆలయ మర్యాదలు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి పూలమాల శాలువాతో సన్మానించారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలుజిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి గోవిందర్‌రాం న్యాల్కల్(జహీరాబాద్): వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున ప్రణాళిక బద్ధంగా చదువుకొని అధిక మార్కులు తెచ్చుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి గోవిందర్‌రాం విద్యార్థులకు సూచించారు. మండల పరిధిలోని హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడారు. ఇంటర్ సిలబస్ దాదాపు పూర్తయిందని, ప్రస్తుతం పునశ్చరణ తరగతులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కోరారు. సమష్టిగా కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. 40 వేల ఓటర్లకు ఒక డివిజన్ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి డిమాండ్ రామచంద్రాపురం(పటాన్చెరు): జీహెచ్ఎంసీ పరిధిలో 40వేల ఓటర్లకు ఒక డివిజన్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ కార్పొరేటర్లతో కలసి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన డివిజన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ల మీద ఉన్న పలు అభ్యంతరాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. డివిజన్లను ఏప్రాతిపదికన చేశారో, ఎవరి అభిప్రాయాలను తీసుకుని ముసాయిదా విడుదల చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కనీసం క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా డివిజన్లను ఏవిధంగా చేశారని ప్రశ్నించారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి కల్హేర్(నారాయణఖేడ్): విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం సిర్గాపూర్‌లో కేజీబీవీ పాఠశాల, సుల్తానాబాద్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులు సాధించాలన్నారు. ఎఫ్ఎల్ఎన్, లీప్ కార్యక్రమం అమలుపై చర్చించారు. -
సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలు: ఎస్పీ
శివ్వంపేట(నర్సాపూర్)/నర్సాపూర్: ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 750 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం శివ్వంపేటలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు చెప్పారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించేందుకు రూట్ మొబైల్ పార్టీలు, ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, డీఎస్పీల ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విజయోత్సవ ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ఆయన వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగా కృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి ఉన్నారు. కాగా, ఏఎస్పీ మహేందర్ నర్సాపూర్‌లో మాట్లాడుతూ.. జిల్లాలో 503 మంది పాత నేరస్తులను బైండోవర్ చేశామన్నారు. -
నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్
ఉదయం 7గంటల నుంచి ప్రారంభం ● కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది 161 సర్పంచ్, 1,221 వార్డులకు ఎన్నికలు ● గట్టి బందోబస్తు: ఎస్పీమెదక్జోన్: ఆఖరి విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. మూడో విడతలో నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్, చిలిప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దూర్తి, మాసాయిపేట మండలాల పరిధిలో 183 గ్రామ పంచాయతీలు, 1,,528 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే 22 సర్పంచ్, 307 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 161 పంచాయతీలతో పాటు 1,221 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా 41 సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. సామగ్రితో తరలిన సిబ్బంది -
రంగంపేటలో ఉద్రిక్తత
కొల్చారం(నర్సాపూర్): మండలంలో రంగంపేటలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అరిగి స్వర్ణలతకు మద్దతుగా ఎమ్మెల్యే సునీతారెడ్డి సోమవారం ప్రచారం చేశారు. అయితే ఆమె మాట్లాడి వెళుతున్న క్రమంలో కాంగ్రెస్‌కు చెందిన కొందరు కార్యకర్తలు రెచ్చగొట్టే నినాదాలు చేయడం, ఎమ్మెల్యేకు అడ్డుగా రావడంతో భద్రతా సిబ్బంది కాంగ్రెస్ కార్యకర్తలను దూరంగా నెట్టివేసే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్గుప్తాను సైతం తోసి వేయడంతో ఇరు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి స్వర్ణలతకు కాలుకు చిన్నపాటి గాయం కాగా, మరో మహిళ కింద పడటంతో చేతికి గాయాలయ్యాయి. ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఇరువర్గాలను శాంతింపజేశారు. -
వలస ఓటరే కీలకం
కలిసొచ్చిన అభ్యర్థులు వలస ఓటర్లకు పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీల గ్రామ స్థాయి నాయకులు నామినేషన్ల విత్‌డ్రాల అనంతరం గుర్తుల కేటాయింపు జరగగానే వలస ఓటర్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. రెండు, మూడు రోజులు వలస ప్రాంత ఓటర్లకు కలిసి మద్దతు కూడగట్టారు. తమకు ఓటేసి గెలిపించాలని, ఓటేసేందుకు గ్రామాలకు రావాలని వేడుకున్నారు. కొందరు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉండటంతో వారి వద్దకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకొని వెళ్లి వచ్చేందుకే రెండు రోజులు పట్టింది.నారాయణఖేడ్: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తుండగా.. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు తమ చివరి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వలస ఓటర్ల ప్రభావం బాగా చూపనుంది. జిల్లాలో అత్యధికంగా వలసలకు పెట్టింది పేరుగా నారాయణఖేడ్ నియోజకవర్గం నిలిచింది. ఈ ప్రాంతం నుంచి మెజార్టీ జనాలు వలస జీవనం సాగిస్తుంటారు. దాదాపు ప్రతీ గ్రామం నుంచి వలస వెళ్లిన జనాల సంఖ్య వందల్లో ఉంటుంది. చిన్న గ్రామంలో 500 ఓటర్లు ఉంటే అందులో 100 నుంచి ఆపైగా.. పెద్ద పంచాయతీల్లో 250 నుంచి 400మంది వరకు వలస వెళ్లిన వారు ఉంటారు. 230 గ్రామాలు, మరో 220 వరకు గిరిజన తండాలు నియోజకవర్గంలో ఉంటాయి. హైదరాబాద్ ప్రాంతంలోని ఫ్యాక్టరీ, భవన నిర్మాణ రంగారాల్లో అత్యధిక స్థాయిలో గ్రామాల జనాలు ఉండగా.. జిల్లాతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలతోపాటు కర్ణాటక ప్రాంతంలోని చెరకు కర్మాగారాలకు గిరిజనులు వలస వెళ్తారు. సిరిసిల్లతోపాటు ఇతర ప్రాంతాలకు నేత కార్మికులు వలస వెళ్తారు. దీంతో ప్రతీ గ్రామంలో వలస వెళ్లిన ఓటర్లను ఓటు వేయించేందుకు రప్పించేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు పూర్తి చేశారు. ఓటర్లకు వాహనాలు ఇప్పటికే వలస ఓటర్లను కలిసిన అభ్యర్థులు, నాయకులు వారు గ్రామాలకు వచ్చేందుకు కార్లు, ట్రావెల్స్, ఇతర వాహనాలను ఏర్పాటు చేయించారు. పోలింగ్ నాడు వారు గ్రామాలకు వాహనాల్లో రానున్నారు. కొందరు బస్సుల్లో వచ్చేలా ఏర్పాట్లు చేశారు. వారు వచ్చి వెళ్లే వరకు అన్ని ఏర్పాట్లు చేయించారు. వలస ఓటర్లు చాలామంది కూడా పోటీలో ఉన్న అభ్యర్థులు అందరికీ ఫోన్లు చేసి తాము గ్రామానికి వస్తామని సమాచారం ఇస్తూ ‘మద్దతు’ కోరారు. ఒక్కరికి ఇంత చొప్పున అని లెక్క కట్టి ముట్టచెప్పారు. రూ.వేయి నుంచి రూ. 2వేల వరకు అందజేశారు. వలస ఓటర్లకే ఇన్నేసి లక్షలు అయ్యాయంటూ కొందరు నా యకులు, అభ్యర్థులు ప్రైవేట్ సంభాషణల్లో వాపోతున్నారు. జీవనోపాధికోసం గ్రామాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లిన వారు ఓటేసేందుకు గ్రామానికి వచ్చి వెళ్లేందుకు రెండో రోజులు అవ్వడంతో ఆ సమయంలో కూలీ పనులు పోగొట్టుకుంటున్నందున అందుకు తగ్గట్లుగా అభ్యర్థులు, నాయకులు చెల్లింపులు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటు కీలకం కావడంతో వలస ఓట్లను కోల్పోకుండా రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు వాట్సప్ ద్వారా సందేశాలు పంపిస్తూ టచ్‌లో ఉంటున్నారు. గ్రామంలో ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్లిన వారికి ఓటేసేందుకు వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు కూడా చేయిస్తున్నారు. వారిపై ప్రత్యేక దృష్టి సారించిన అభ్యర్థులు ప్రత్యేక వాహనాలూ ఏర్పాటు పోలింగ్ నాడు ఉదయం గ్రామానికి చేరుకోనున్న ఓటర్లు ప్రతీ ఓటు కీలకం కావడంతో విశ్వ ప్రయత్నాలు ఖేడ్‌లో మెజార్టీ జనాల వలస జీవనం -
మద్యం, నగదు పంపిణీకి రంగం సిద్ధం
కాగా మూడవదశ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో గడువు ముగియడంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తమకు నమ్మకం ఉన్న ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేసేందుకు ఆయా సర్పంచ్ అభ్యర్థులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా నగదు, మద్యం పంపిణీ చేసేందుకు రాత్రివేళలను ఎంచుకుంటున్నారు. అయితే పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఇదే ఎత్తుగడ వేస్తుండడంతో గ్రామాలన్నీ మద్యం మత్తులో ఊగిపోతున్నాయి. నగదు విషయంలో కూడా నైతిక విలువలు దిగజారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎత్తుకు పైఎత్తు..!
వెల్దుర్తి(తూప్రాన్): పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించారు. సర్పంచ్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్యానెల్ నుంచి వార్డు సభ్యులను కూడా రంగంలోకి దించడంతో గ్రామాల్లో పోటీ వాతావరణం నెలకొంది. మూడో దశ ఎన్నికలకు కేవలం మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థుల ఊహకు అందని రీతిలో ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రచారానికి గడువు ముగియడంతో కొత్త తరహా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఓటర్లకు నగదును కూడా పంపిణీ చేసే ప్రయత్నాలు కూడా మొదలైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడుగా ఆయా సర్పంచ్ అభ్యర్థులు రహస్య ప్రాంతాల్లో మద్యం దాచి ఉంచినట్లు సమాచారం. ఈ మద్యాన్ని చివరి రోజున ఓటర్లకు పంపిణీ చేసే దిశగా వారి వారి అనుచరులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒక ఓటు సర్పంచ్‌కు, మరో ఓటు వార్డు సభ్యుడికి వేయాలి. అయితే ఇక్కడ క్రాస్ ఓటింగ్ కాకుండా చూసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. తమ సానుభూతిపరులు, అనుచరులతో పాటు తమ మద్దతుదారులంతా రెండు ఓట్లు ఒకే ప్యానల్ అభ్యర్థులకు వేసే విధంగా చర్యలు చేపట్టారు. దీనికోసం డమ్మీ బ్యాలెట్ పత్రాలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ ఓటరు వేరు వేరు ప్యానళ్లకు సంబంధించి చెరో ఓటు వేసినట్లయితే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం లేకపోలేదు. ఒక ప్యానెల్‌కు చెందిన వార్డుసభ్యులు ఎక్కువగా గెలిచి అదే ప్యానెల్‌ను బలపరిచిన అభ్యర్థికి తక్కువ ఓట్లు వస్తే ఓటమి తప్పదని సర్పంచ్ అభ్యర్థులు ఆంధోళన చెందుతున్నారు. ఆయా వార్డుల వారీగా స్థానికంగా ప్రభావం చూపే వార్డు సభ్యులు తమతో పాటు మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థికి కూడా ఓటు వేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. -
నాడు సర్పంచ్‌లు..నేడు వార్డు సభ్యులు
చిన్నశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని కా మారంలో గతంలో సర్పంచ్‌లుగా పనిచేసిన భార్యాభర్తలు తాజాగా జరిగిన ఎన్నికల్లో వార్డు సభ్యులుగా గెలుపొందారు. కామారం సర్పంచ్‌గా పనిచేసిన గడీల సుధాకర్, హేమలత తాజా ఎన్నికల్లో 3, 8వ వార్డులలో పోటీ చేసి గెలిచారు. సర్పంచ్ ఎస్సీకి రిజర్వు కావడంతో వీరు వార్డు సభ్యులుగా పోటీ చేసి గెలిచారు. కాగా వార్డు సభ్యుడిగా గెలిచిన సుధాకర్ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దంపతుల ధమాకా మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని కాళ్లకల్, దండుపల్లి గ్రామాల్లో భార్యాభర్తలు వార్డు సభ్యులుగా బరిలో నిలిచి విజయం సాధించారు. కాళ్లకల్ 6వ వార్డులో భర్త వీరబోయిన ప్రవీణ్ డ్రాలో గెలిచారు. 7వ వార్డులో ఆయన భార్య మమత 129 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. దండుపల్లి 1వ వార్డులో భర్త కోనేరు సురేశ్‌కుమార్, 7వ వార్డులో భార్య మనీషా విజయం సాధించారు.సురేశ్‌కుమార్, మనీషాప్రవీణ్, మమత -
ఎన్నికల నిబంధనలు తప్పనిసరి: కలెక్టర్
శివ్వంపేట(నర్సాపూర్): ఎన్నికల నిబంధనలను సిబ్బంది కచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం మండల పరిధి చెండీలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ సెంటర్‌ను సాయంత్రం పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మూడో విడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. సిబ్బందికి తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజనం, ఇతర అన్ని వసతులు కల్పించాలన్నారు. చెక్‌లిస్టు ఆధారంగా ఎన్ని కల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీఓ తిరుపతిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ నరేందర్‌రెడ్డి, ఎంఈఓ బుచ్చనాయక్, తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్కు పట్టం కట్టాలి శివ్వంపేట(నర్సాపూర్): గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే బీఆర్ఎస్ బలపరిచిన ఆభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోమ వారం మండలంలోని గోమారం, పిల్లుట్ల తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో ప్రత్యేక పంచాయతీల ఏర్పాటుతో పాటు వాటి అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, నాయకులు హన్మంత్తరెడ్డి, మహిపాల్‌రెడ్డి, చింత స్వామి, రాజశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘ప్రాదేశికంలో సత్తా చాటుదాం’ పాపన్నపేట(మెదక్): సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో ఎంపీని కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 15 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానాన్ని కై వసం చేసుకుంటామని తెలిపారు. ఈసందర్భంగా గాజులగూడెం సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయిన పుట్టల మల్లేశంను బీజేపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు సంతోష్‌చారి, నాయకులు తదితరులు పాల్గొన్నారు పథకాలే గెలిపిస్తాయి నర్సాపూర్ రూరల్: సంక్షేమ పథకాలే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. మండలంలోని నాగులపల్లి, మూసాపేట, రుస్తుంపేట గ్రామాల్లో సోమవారం సాయంత్రం ప్రచారం నిర్వహించారు. నాగులపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కొర్పోల్ సుమతి శివ కుమార్‌తో పాటు మూసాపేటలో డప్పు లక్ష్మి, రుస్తుంపేటలో గొర్రెల అశోక్‌కు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, ఉచిత బస్సు, ఉచిత కరెంట్ తదితర పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అక్కా.. నీ ఓటు నాకేనర్సాపూర్ రూరల్: నాగులపల్లి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొర్పోల్ సుమతి శివకుమార్ సోమవారం మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టు ఓట్లు అడిగారు. సర్పంచ్‌గా గెలిపిస్తే నా సొంత నిధులతో పాటు ప్రభుత్వం సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని వివరించారు. -
కంచుకోటలో కారుమబ్బులు
● గ్రూపు తగాదాలతో బీఆర్ఎస్ చతికిల ● పంచాయతీ ఎన్నికల్లో రెండో స్థానానికే పరిమితంమెదక్జోన్: ఉద్యమ కాలం నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు కంచుకోటగా నిలిచింది. కేసీఆర్, హరీశ్‌రావు సొంత జిల్లా కావటంతో ప్రతీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ప్రస్తుతం గ్రూపు తగాదాలతో చతికిలపడింది. రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడింది. 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 85 శాతానికి పైగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. జెడ్పీపీఠం సైతం గులాబీ ఖాతాలోనే చేరింది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారారు. గ్రూపులు ఏర్పాటు చేసుకోవటంతో పార్టీ బలహీనపడింది. అభ్యర్థుల తరఫున ప్రచారం సైతం అంతంత మాత్రంగానే నిర్వహించారు. ఇది అధికార పార్టీకి కలిసొచ్చింది. బీఆర్ఎస్ రెండు విడతల్లో 88 స్థానాలకే పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. సత్తా చాటిన హస్తం రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కా ంగ్రెస్ సత్తా చాటింది. 309 సర్పంచ్ అభ్యర్థులకు గానూ ఏకగ్రీవాలతో కలుపుకొని 174 స్థానాలను ఖాతాలో వేసుకుని పైచేయి సాధించింది. రెబల్స్‌తో పార్టీకి నష్టం జరిగిందని, లేకుంటే మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేవారమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మూడవ విడతపై ప్రత్యేక దృష్టి సారించి మరిన్ని సీట్లు సాధించే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. పార్టీ అధికారంలో ఉండటం, ముఖ్య నేతలు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయడం హస్తం పార్టీకి కలిసొచ్చింది. వికసించని కమలం ఢిల్లీలో సత్తా చాటుతున్న బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో తన ప్రభావం చూపటం లేదు. ముఖ్యంగా జిల్లా ఓటర్లు అన్నిపార్టీలను అక్కున చేర్చుకున్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో రెండు నియోజకవర్గాలకు గా నూ మెదక్ కాంగ్రెస్ వశం కాగా, నర్సాపూర్ బీఆర్ఎస్ గెలుచుకున్న విషయం విదితమే. అనంతరం జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పటివరకు రెండు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు 35 చోట్ల గెలుపొందగా, బీజేపీ మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితం అయింది.సొంతూర్లో ‘పట్టు’ కోల్పోయారు రామాయంపేట(మెదక్): సర్పంచ్ ఎన్నికల ఫలితాలు నేతలకు మిశ్రమ ఫలితాలు అందించాయి. వారు తమ స్వగ్రామాల్లో పట్టు కోల్పోకు ండా విశ్వ ప్రయత్నాలు చేశారు. మెదక్ ఎమ్మెల్యే తన స్వగ్రామంలో పట్టు నిలుపుకోగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి స్వగ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తన స్వగ్రామం చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి పుల్లారావును భారీ మెజార్టీతో గెల్పించుకొని పట్టు నిలుపుకున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి తన స్వ గ్రామం కోనాపూర్‌లో పట్టు నిలుపుకోలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధి వెంకట్రాంరెడ్డి 120 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్ధి దివాకర్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శేరి సుభాశ్‌రెడ్డి స్వగ్రామమైన హవేళిఘణాపూర్ మండలం కూచన్‌పల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు లింగాల భూదేవి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి రెండో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి స్వగ్రామంలో మాత్రం సొంత పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ ఓ పత్రిక విలేకరిని పోటీలో నిలిపింది. దీంతో కంఠారెడ్డి పట్టుదలతో రెండు, మూడు రోజుల పాటు అక్కడే మకాం వేసి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అందె కొండల్‌రెడ్డిని 233 ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నారు. బీఆర్ఎస్ నేతలకు చుక్కెదురు! సత్తా చాటిన ఎమ్మెల్యే రోహిత్‌రావు -
గ్రామాలు ప్రగతి బాట పట్టాలి
మెదక్‌జోన్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచే యాలని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులను సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించే బాధ్యత మీపై ఉందన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మధుసూదన్‌రావు, ముత్యంగౌడ్, శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం
కౌడిపల్లి(నర్సాపూర్): ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మరోసారి కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దన్నారు. గ్రామాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిందేమిలేదన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సార రామాగౌడ్, దుర్గారెడ్డి, పోలనవీన్, శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, నవీన్‌గుప్తా శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. మల్లన్న కల్యాణం
భారీగా హాజరైన భక్తజనం పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సురేఖ కొమురవెల్లి(సిద్దిపేట): మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి కోరమీసాల మల్లన్న కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం క్షేత్రంలోని తోట బావి వద్ద సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక మండపంలో మల్లన్న స్వామి.. మేడలాదేవి, కేతమ్మలను సరిగ్గా మధ్యాహ్నం 12.01గంటలకు వివాహమాడారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో వీరశైవ ఆగమ పండితులు కల్యాణ క్రతువును కనుల పండువగా నిర్వహించారు. కల్యాణ వేడుకను వీక్షించేందుకు రాష్ట్రం నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ గర్భగుడిలో ఉదయం 9 గంటలకు మూల విరాట్‌కు కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామి. అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకీలో ఊరేగింపుగా మేళాతాళలతో తోటబావి వద్ద గల మల్లన్న కళ్యాణవేదికకు చేర్చి కల్యాణ క్రతువు చేపట్టారు. ప్రభుత్వం తరపున మల్లికార్జున స్వామికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించారు. మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తదితరులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పీఠాధిపతుల పర్యవేక్షణలో .. మల్లికార్జున స్వామి కల్యాణాన్ని పీఠాధిపతి మహమండలేశ్వర్ మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ పర్యవేక్షణలో కొనసాగగా.. కల్యాణ వ్యాఖ్యతలుగా డాక్టర్ మహంతయ్య, సాంబశివశర్మ, శశిభూషణ సిద్దాంతిలు వ్యవహరించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన స్వామి వారి కల్యాణ వేడుకను భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు.మల్లన్న కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు -
ప్రజల మన్ననలు పొందాలి
గజ్వేల్: సర్పంచ్‌లుగా ఎన్నికైనవారు ప్రజల మన్ననలు పొందాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆదివారం గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తొ లివిడత ఎన్నికల్లో గజ్వేల్ మండలం ఆహ్మదీపూర్ సర్పంచ్‌గా ఎన్నికై న ప్రభాకర్, ఉప సర్పంచ్ గోపాల్‌రెడ్డి, వార్డుసభ్యులు హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వారిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ నాయకులు మద్ది రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెయ్యెత్తి.. జైకొట్టి
మలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార కాంగ్రెస్ హవా కొనసాగింది. తొలి విడత మాదిరిగానే రెండో విడతలోనూ ఆ పార్టీ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈసారి గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ ఉనికిని చాటుకుంది. స్వతంత్రులు మాత్రం సత్తా చాటారు. సీపీఎం ఒక స్థానంతో సరిపెట్టుకుంది. – మెదక్‌జోన్ రెండో విడతలో ఆదివారం జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ ఎనిమిది మండలాల పరిధిలో 142 సర్పంచ్, 1,036 వార్డు మెంబర్లకు పోలింగ్ జరిగింది. ఇందులో అత్యధికంగా 64 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. ప్రధా న ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈసారి కూడా గట్టి పోటీ ఇచ్చింది. 46 సర్పంచ్ స్థానాల్లో గులాబీ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఢిల్లీలో అ ధికారంలో ఉన్న బీజేపీ గల్లీలో ఏమాత్రం ప్రభావం చూ పలేకపోయింది. కేవలం 11 సర్పంచ్ పదవులను మాత్రమే దక్కించుకుంది. నిజాంపేట లో 4, చేగుంట 3, రామాయంపేట 2, చిన్నశంకరంపేట మండలంలో ఒకటి చొప్పున అభ్యర్థులు గెలుపొందారు. స్వతంత్రులు మరోసారి సత్తా చాటారు. 20 స్థానాల్లో పాగా వేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులను ఓడించి ఆయా గ్రామాల్లో తమకు వ్యక్తిగతంగా పట్టుందని నిరూపించుకున్నారు. సీపీఎం బలపరిచిన అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. కాగా రెండో విడతలో ఇప్పటికే 7 సర్పంచ్ స్థానా లు ఏకగ్రీవం అయ్యాయి.మలి విడతలోనూ సత్తా చాటిన కాంగ్రెస్ 64 సర్పంచ్ స్థానాలు కై వసం గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ మద్దతుదారులు 46 స్థానాల్లో కారు పార్టీ విజయం 20 చోట్ల సత్తా చాటిన స్వతంత్రులు 11 స్థానాలతో సరిపెట్టుకున్న కమలం


