నర్సాపూర్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాజ్మకత, సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకు అవగాహన సదస్సులు తోడ్పాటునిస్తాయని బీవీఆర్‌ఐటీ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ జేఎన్‌టీయూల సహకారంతో స్థానిక బీవీఆర్‌ఐటీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఏఐ, డిజిటల్ లెర్నింగ్ వర్క్‌షాప్ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాక్టికల్ డెమోస్, ఇంటరాక్టివ్ సెషన్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు హెచ్‌ఓడీ దశరథరామయ్య చెప్పారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ సాయికిరణ్, చంద్రకళ, ల్యాబ్ అసిస్టెంట్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందచేశారు.


